ఈ ప్రశ్నకు పవన్ సమాధానం చెప్పగలరా?

అధికార పార్టీ వైఫల్యాలు చెప్పకుండా.. దాని మీద రియాక్ట్ కాని పవన్.. ప్రతిపక్ష పార్టీని విమర్శించటం ఏమిటంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదా వైఫల్యాన్ని పవన్ ఎందుకు ప్రశ్నించటం లేదో చెప్పాలన్నారు. చంద్రబాబు.. పవన్ ల మధ్య చీకటి ఒప్పందాన్ని ఏపీ ప్రజలు అర్థం చేసుకున్నారన్న రామచంద్రయ్య.. వీరిద్దరి మధ్య మధ్యవర్తిగా లింగమనేని రమేశ్ పని చేస్తున్నట్లు చెప్పారు.

2014లో జరిగిన ఎన్నికల్లో పవన్ పోటీ చేయటంపైనా రామచంద్రయ్య సరికొత్త ఆరోపణ చేశారు. తన వరకు మాట్లాడుకొని పవన్ పోటీ చేయలేదన్నారు. ఈసారి రహస్య ఒప్పందం చేసుకొని పోటీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణంగా ఏపీకి నష్టం జరుగుతుందని చెప్పే పవన్.. కేసీఆర్ ఇంటికి ఎందుకు వెళ్లారని క్వశ్చన్ చేశారు.

చంద్రబాబు కుట్రలు పవన్ కు తెలుసన్న ఆయన.. అన్ని తెలిసినా ఇప్పటికి ప్రశ్నించలేదన్నారు. చంద్రబాబు.. పవన్ లు ఇద్దరు కలిసి ఏపీ ప్రజల్ని మరోసారి మోసం చేసే కుట్ర పన్నారన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. మిగిలిన అంశాలు ఎలా ఉన్నా.. చంద్రబాబు.. పవన్ ల మధ్య డీల్ చేసేది లింగమనేని రమేష్ అంటూ రామచంద్రయ్య చేసిన సరికొత్త ఆరోపణ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పక తప్పదు.