విజయవాడ సెంట్రల్: మల్లాది vs ఉమా.. గెలుపెవరిది?

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 2008లో ఏర్పడ్డింది. 2009 లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున నిలబడ్డ మల్లాది  విష్ణు  ఘనవిజయం సాధించారు.  ఆ తర్వాత 2014 ఎన్నికల్లో  ఇదే సెంట్రల్ నియోజకవర్గం నుంచి బోండా ఉమా 30వేలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఉమా వైసీపీ నుంచి బరిలోకి దిగి  గౌతంరెడ్డిపై గెలిచారు.

* బొండా ఉమా వర్సెస్ మల్లాది విష్ణు
2019 సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలకు కేంద్రమైన విజయవాడ పాలిటిక్స్ హీటెక్కాయి. ఈసారి టీడీపీ నుంచి మరోసారి బోండా ఉమా నిలబడగా.. వైసీపీ నుంచి ఈసారి బలమైన మల్లాది విష్ణు రంగంలోకి దిగారు. వీరిద్దరూ నువ్వా నేనా అనట్టుగా తలపడుతున్నారు. అధికారంలో ఉన్న ఉమా అక్రమాలను మల్లాది గడిచిన కొన్నేళ్లుగా వెలికి తీస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. వరుస ఆరోపణలు చేస్తూ ఉమాకు కొరకరాని కొయ్యగా మారాడు. దీంతో వీరిద్దరి ఫైట్ ఇప్పుడు సెంట్రల్ లోనే కాదు ఏపీ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.

*బోండా ఉమా అవినీతి ఆధిపత్యమే మైనస్
ప్రతికూలం:  2014లో ఈజీగా గెలిచిన బోండా ఉమాకు ఈసారి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. మరో నెలరోజుల్లోనే జరగబోయే ఎన్నికల్లో టీడీపీ నుంచి నిలబడ్డ బోండా ఉమాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని టాక్. గత అయిదేళ్లుగా ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ప్రజలను చులకనగా చూసి ఆ వీడియోలు మీడియాలో రావడంతో అభాసుపాలయ్యాడు. ఇక భూ కబ్జాలు దందాలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ సంక్షేమపథకాలు కాంట్రాక్టుల్లో ఉమా అవినీతిపై నియోజకవర్గంలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోందని చెబుతున్నారు. అందుకే ఈసారి మరోసారి బరిలోకి దిగిన ఉమాకు అనుకూల గాలి లేదన్న టాక్ వినిపిస్తోంది.