సొంత వాళ్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్న బాబు?!

తెలుగుదేశం పార్టీ తొలి జాబితాలోని నేతలు తప్పుకుని.. బాబుకు ఝలక్ ఇచ్చారు. అయితే ఈ కథ ఇంతటితో ఆగుతుందా? అనేది సందేహమే. ఎప్పుడు ఎవరు ఎలాంటి ఝలక్ ఇస్తారో.. అనే భయం మొదలైందట చంద్రబాబునాయుడులో. అందుకే ఇప్పుడు తన సొంత  పార్టీ నేతల మీద బాబు నిఘా పెట్టారట. దీని కోసం ఏపీ పోలిస్ విభాగంలోని ఇంటెలిజెన్స్ సేవలను అందుకుంటున్నట్టుగా సమాచారం.

వారిని నియమించి… అనుమానాస్పద నేతలు ఎవరితో మాట్లాడుతున్నారు – ఎవరిని కలుస్తున్నారు… అనే అంశాల గురించి బాబు వాకబు చేస్తున్నారట. అంతే కాదు.. కొంతమంది తెలుగుదేశం నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసేశారట. ఎవరితో మాట్లాడుతున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. బాబు జాగ్రత్తపడుతూ ఉన్నారట. మొత్తానికి అధికారం చేతిలో ఉన్నా తెలుగుదేశం పార్టీ రాజకీయం చిందరవందరగా మారిన వైనం మాత్రం స్పష్టం అవుతోంది.