అదనపు భద్రతతో సరికొత్త ఈకో

‘ఈకో’లో అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను లాంచ్‌ చేసినట్లు మారుతి సుజుకీ ప్రకటించింది. రివర్స్‌ పార్కింగ్‌ అసిస్ట్‌, స్టాండర్డ్‌ ఫిట్‌మెంట్‌గా కో-డ్రైవర్‌ సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌తోపాటు అదనంగా పలు భద్రత ఫీచర్లను జోడించినట్లు కంపెనీ తెలిపింది. కొన్ని వేరియంట్లలో స్పీడ్‌ అలెర్ట్‌ సిస్టమ్‌, ఏబీఎస్‌, ఎయిర్‌ బ్యాగ్‌ ఫీచర్లను సైతం అందిస్తున్నట్లు మంగళవారం పేర్కొంది. కొత్త ఈకో ధర వేరియంట్‌ను బట్టి రూ.400- 23,000 పెరగనుంది. ప్రస్తు తం ఈకో ధర (ఢిల్లీ షోరూం) రూ.3.37-6.33 లక్షల మధ్యలో ఉంది.