ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌కు మూడు ఐఎస్‌ఓ సర్టిఫికెట్లు

ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ గ్రూప్‌లోని ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ రిటైల్‌ ఇం డియా లిమిటెడ్‌, ఆర్‌ ఎస్‌ బ్రదర్స్‌ జువెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలకు మూడు ఐఎస్‌ఓ సర్టిఫికెట్లు లభించాయి. నాణ్యత, పర్యావరణ పరిరక్షణ, ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత విషయాల్లో ఈ రెండు సంస్థల కృషికి గుర్తింపుగా ఈ సర్టిఫికెట్లు లభించా యి. ఐఎస్‌ఓ 9001 (నాణ్యత), ఐఎస్‌ఓ 14001 (పర్యావరణ పరిరక్షణ), ఐఎస్‌ఓ 45001 (ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత) సర్టిఫికెట్లు లభించాయి. మంగళవారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో, ఓడీసీ స్టాండర్డ్స్‌ సర్టిఫికేషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఎండీ పడి గాల శేషాద్రి ఈ సర్టిఫికెట్లను ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ గ్రూప్‌లోని రెండు కంపెనీల డైరెక్టర్లు పీవీఎస్‌ అభినయ్‌, రాకేశ్‌, కల్పేష్‌ వి జైన్‌లకు అందజేశారు.