ఓలాలో కియా,హ్యుందాయి పెట్టుబడులు!

దేశీయ క్యాబ్‌ సర్వీస్‌ల దిగ్గజం ఓలాలో హ్యుందాయి‌, కియా కంపెనీలు దాదాపు 300 మిలియన్‌ డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ విషయాన్ని ఓలా కూడా ధ్రువీకరించింది. కియా, హ్యుందాయ్‌లు సంయుక్తంగా ఈ పెట్టుబడి పెడుతున్నాయని వెల్లడించింది. భారత్‌లో అవసరాలకు తగినట్లు  విద్యుత్తు కార్ల తయారీ, ఓలా వ్యాపార భాగస్వాములైన డ్రైవర్లకు అవసరమైన విధంగా వాహనాలను అందజేయడం, వాహనాల తరలింపు వంటి అంశాల్లో సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయించాయి. ఓలాలో 4శాతం వాటా కొనుగోలు చేసే ఆలోచనలో హ్యుందాయ్‌ ఉందని వార్తలు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ ప్రకటన వెలువడింది. ‌
‘హ్యుందాయ్‌ వ్యాపార వ్యూహంలో భారత్‌ అంత్యంత కీలకం. మా లక్ష్యాలను చేరుకోవడానికి ఓలాతో భాగస్వామ్యం  ఉపకరిస్తుంది.  దీని ద్వారా స్మార్ట్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌ విభాగంలో అడుగుపెట్టే ప్రక్రియ వేగవంతమవుతుంది.’’ అని హ్యుందాయ్‌ ఎగ్జిక్యూటీవ్‌ వైస్‌ ఛైర్మన్‌ యూసున్‌ చుంగ్‌ వెల్లడించారు.