Latest News
banner News

ఎవరీ నక్షత్రకుడు ? ఏమా కథ ?

1st Image

ఇలపావులూరి మురళీ మోహన రావు...................... నక్షత్రకుడిలా నా వెంటబడి చావగొట్టకు’
‘అబ్బో… అతని గురించి చెప్పాలంటే నక్షత్రకుడిని మించి ఇబ్బందులు పెడతాడు’ అంటుంటారు.
ఇంతకూ ఎవరీ నక్షత్రకుడు ? ఏమా కథ....అతడి నుంచి మనం ఏమి తెలుసుకోవాలి ....   ఇదిగో చదవండి.   
మార్కండేయ పురాణం లోని ఒక ఆసక్తిదాయకమైన పాత్ర నక్షత్రకుడు.
ఇతను విశ్వామిత్ర మహర్షి శిష్యుడు. హరిశ్చంద్రుడు తాను వాగ్దానం చేసిన డబ్బు ను రాబట్టడానికి హరిశ్చంద్రునికి తోడుగా నక్షత్రకుడిని పంపిస్తాడు. అయితే.. హరిశ్చంద్రుడి చేత ఒక చిన్న అబద్దం ఆడించి వ్రతభంగం చేయించడం విశ్వామిత్రుడి లక్ష్యం. విశ్వామిత్రుడికి తాను ఇస్తానన్న సొమ్ము చాలకపోవడం తో రాజ్యం మొత్తం విశ్వామిత్రుడికి ధారపోసి భార్యాబిడ్డల తో కలిసి అరణ్యానికి వెళ్తాడు. నక్షత్రకుడు హరిశ్చంద్రుడిని క్షణక్షణం వేధిస్తూ ఉంటాడు. వారు నడుస్తున్న సమయం లో నేను నడవలేను అని కూలబడతాడు. కొడుకుని భుజాల మీద నుంచి దించి తనను ఎత్తుకోమంటాడు. హరిశ్చంద్రుడు అలసిపోయి ఒక క్షణం కూర్చుంటే తన సమయాన్ని వృధా చేస్తున్నావు అని నిందిస్తాడు. ఎక్కడా నీరు దొరకని చోట తనకు అర్జెంట్ గా మంచినీళ్లు కావాలంటాడు. మధ్య మధ్యన "ఆ డబ్బు నేను ఇవ్వలేను అని ఒక్క మాట చెప్తే వెనక్కు వెళ్ళిపోతా" అంటాడు. కానీ హరిశ్చంద్రుడు అంగీకరించడు. అప్పు తీర్చడం కోసం భార్యను అమ్మేస్తాడు హరిశ్చంద్రుడు. ఆ డబ్బుకు వడ్డీ కూడా కావాలని నక్షత్రకుడు పీడిస్తాడు. ఇక నా దగ్గర ఏమీ లేదు అని హరిశ్చంద్రుడు అనగానే "నిన్ను అమ్మి వడ్డీ కింద జమ వేసుకుంటా" అని అతనిని ఒక కాటికాపరికి అమ్మేసి ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు.
***
ఇక్కడ నక్షత్రకుని ఒక వ్యక్తిగా చూడకూడదు. తీర్చలేని అప్పు చెయ్యడం, వడ్డీలు కట్టడం, పెద్దగా పరిచయం లేని వారికే కాక, ఉన్నవారికి, బంధువులకు కూడా హామీగా ఉండి రుణ పత్రాల మీద హామీ సంతకాలు చెయ్యడం, ఆ తరువాత అప్పులు తీర్చలేక, ఇంట్లో ఉన్న బంగారం, ఇల్లు కూడా అమ్మేసే వారు మనకు సమాజం లో ఎందరో కనిపిస్తారు. అప్పు చేస్తే ఎలాంటి బాధలు చుట్టుముడతాయో, రుణదాతల నుంచి ఎలాంటి భయంకరమైన వేధింపులు ఉంటాయో, చివరకు భార్యాపిల్లలను కూడా పోగొట్టుకోవడమే కాక, తానూ ఆత్మహత్యకు పాల్పడవలసి వస్తుందో చెప్పడానికి నక్షత్రక పాత్ర ఒక ప్రతీక గా భావించాలి.

అప్పులు చెయ్యవచ్చు. ఎలాంటివి? ఇల్లు, స్థలం, బంగారం కొనుక్కోవడానికి అప్పులు చెయ్యవచ్చు. రేపు కథ అడ్డం తిరిగినప్పుడు వాటిని అమ్మి అయినా అప్పులు తీర్చి బయటపడవచ్చు. కానీ, తాహతు లేకపోయినా, దర్జా కోసం, విలాసాల కోసం, నలుగురి తో ఘనంగా చేసాడు అనిపించుకోవడానికి అప్పులు చేసి శుభకార్యాలు చెయ్యడం లాంటివి మనిషిని పాతాళం లోకి తోసేస్తాయి. "అప్పుల బాధ భరించలేక కుటుంబం ఆత్మహత్య" అనే వార్తలు పత్రికల్లో చూస్తుంటాము. వాటి వెనుక అనవసరమైన అప్పులు చెయ్యడం కూడా ఒకటి. అప్పులు చేసేవాడు ఎప్పుడూ తప్పించుకుని తిరుగుతుంటాడు.
మన శక్తి, తాహతు గ్రహించుకుని వీలైనంతవరకూ అప్పులు చెయ్యకుండా, ఇతరులతో మాట పడకుండా, గౌరవంగా జీవించేవాడే జీవితంలో సుఖపడతాడు. "అప్పులు చేయకురా నరుడా, తిప్పలు తప్పవురా" అని అప్పలాచార్య ఒక పాట కూడా రాశారు. కనుక పనికిమాలిన అప్పులు చేసేవారు ఎప్పుడూ నక్షత్రకుడి పాత్రను స్మరించుకోవాలి.
అలాగే షూరిటీ సంతకాలు చేసి ఇరుక్కుపోయేవారు కూడా అనేకమంది కనిపిస్తారు. మిత్రుడు అని నమ్మి షూరిటీ సంతకం చేసిన పాపానికి తమ సంపాదన మొత్తం వేరేవారు చేసిన అప్పులు తీర్చడానికే ఖర్చు చేసిన వారు నాకు ఎంతోమంది తెలుసు. కనుక అందరూ జాగరూకతతో మెలగాలి అని నక్షత్రకుడి కథ మనకు బోధిస్తున్నది.
Site Logo
  • పై ఫొటోలో కనబడే పెద్దాయన  5 వ  తరగతి  చదువుతూ మధ్యలో ఆపేశారు .  అయితేనేమి ఇపుడు  దేశంలో అత్యంత ఎక్కువ వేతనం పొందుతున్న సి.ఇ.ఓ. ఆయనే !!  నెలకు ఆయన వేతనం 21 కోట్ల రూపాయలు. అవును నిజమే .  ఆయన తీసుకునే  21 కోట్ల రూపాయలలో   90 శాతాన్ని ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. ఆయన వయస్సు సుమారు ‘  తొంభై ఐదేళ్లు ’. అయినప్పటికీ ఎందులో తగ్గరు.   ఆయన నవ యువకుడి మాదిరిగా హుషారుగా పనిచేస్తారు. ఆయన పేరే  ధరమ్‌పాల్ .  తమ కంపెనీ ఉత్పత్తులలో నాణ్యతా ప్రమాణాలు ఏ మాత్రం తగ్గకుండా చూడటంతోపాటు, నిరంతరం మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేస్తూ ధరమ్‌ పాల్  డీలర్లను  కలుసుకొంటారు.  ఆయనకు ఆదివారం, సోమవారం అనే భేదం లేదు. సెలవులతో సంబంధం లేదు.  తొమ్మిది పదులు వయస్సు దాటినప్పటికీ, పనిచేయడంలో ఆయన ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపిస్తారు.. ప్రముఖ మసాల పొడుల తయారీ కంపెనీ మహాషియాన్ డి హట్టి (ఎం.డి.హెచ్) వారిదే .   అందరూ ఆయనను గౌరవంగా ‘దాదాజీ’, ‘మహాశయజీ’ అని పిలుస్తారు.  దేశంలో అత్యంత ఎక్కువ వేతనం పొందుతున్న సి.ఇ.ఓ.కూడా ఆయనే కావడం విశేషం.  ఐటీసీ , హిందుస్థాన్ యూనీలీవర్   మేనేజింగ్ డైరెక్టర్ల కంటే  ఎక్కువే.  నెలకు ఆయన వేతనం 21 కోట్ల రూపాయలు. ఆయన తన వేతనంలో 90 శాతాన్ని ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. చేస్తున్న పని పట్ల నిబద్ధత, అకుంఠిత దీక్ష ఉంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చనడానికి దాదాజీని ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎంతో కష్ట పడి  ధరమ్‌పాల్  ఈ స్థాయికి  ఎదిగారు.   ‘మహాషియాన్ డి హట్టి’ని ధరమ్‌పాల్ తండ్రి చునిలాల్ 1919లో పాకిస్థాన్‌లోని సియోల్ కోఠ్‌లో ప్రారంభించారు.  దేశ విభజన అనంతరం ధరమ్‌పాల్ కుటుంబం భారతదేశానికి తరలి వచ్చింది. ధరమ్‌పాల్ దిల్లీలోని కరోల్‌బాగ్‌లో వ్యాపారం ప్రారంభించారు. పట్టుదలతో కృషిచేసి ఎం.డి.హెచ్. మసాలాలకు ప్రజాదరణ లభించింది . అప్పటినుంచి ఆయన వెనుతిరిగి చూడలేదు .  ప్రస్తుతం ఎం.డి.హెచ్. కంపెనీ 60 రకాల మసాలా పౌడర్లను తయారుచేసి విస్తృతంగా మార్కెటింగ్ చేస్తున్నది. ఈ కంపెనీకి చెందిన 15 ఫ్యాక్టరీలలో ఇవి తయారవుతున్నాయి.  ఈ కంపెనీకి  దేశ వ్యాప్తంగా వెయ్యి మంది డీలర్లు ఉన్నారు. ఇప్పటికీ ప్రతిరోజూ ధరమ్‌పాల్ ఫ్యాక్టరీలను  స్వయంగా వెళ్లి  పరిశీలిస్తుంటారు . ప్రతి రోజు డీలర్లను కలుస్తుంటారు.  ప్రస్తుతం కంపెనీ వార్షిక టర్నోవర్ 15వేల కోట్ల రూపాయలు. దుబాయ్, లండన్‌లలో కంపెనీ కార్యాలయాలు ఉన్నాయి. ఎం.డి.హెచ్. ఉత్పత్తులు వంద దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. నాణ్యమైన సరుకును అందరికి అందుబాటులో ఉండే ధరకు అందించడమే తమ కంపెనీ విజయ రహస్యం అని చెబుతారు ధరమ్‌పాల్. కార్మికుల కోసం ఒక వైద్యశాల, 20 పాఠశాలలను తన కంపెనీ తరఫున ధరమ్‌పాల్  నిర్వహిస్తున్నారు.  ఈ తరం యువకులు , వ్యాపార వేత్తలు ఆయనను చూసి నేర్చుకోవాల్సింది  ఎంతో ఉంది. 
  • ధృవ బేరం ...ఈ పదం చాలామందికి తెలియని పదం . కొందరైతే అసలు విని ఉండరు . అసలు ఆ పదమే చిత్రం గా ఉంది కదా. అంతగా వాడుకలో లేని పదం అది . మామూలుగా మనం మూల విరాట్టు అంటుంటాం .అదే ధృవ బేరం .  ధృవ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్థంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. ఇపుడు మనము తెలుసుకోబోయేది. తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టు గురించి . ఇక్కడి వేంకటేశ్వరుని విగ్రహం స్వయంభూమూర్తి (అనగా స్వయంగా వెలసినది, ఎవరూ చెక్కి ప్రతిష్ఠించలేదు) అని భక్తుల విశ్వాసం. మూలవిరాట్టు అయిన ధృవ బేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. వీరస్థానక పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు. ధృవబేరం చక్కని ముఖకవళికలతో ఉంటుంది. ముక్కు మరీ ఎత్తూ కాదు, చప్పిడీ కాదు. కన్నులు స్పష్టంగా అమరి ఉంటాయి. నుదుటిపై రేఖారూపంగా ఏర్పడిన నామం ఉంది. నిత్యం పచ్చకర్పూరంతో పెట్టిన నామం కన్నులను కొంతభాగం కప్పివేస్తుంది. నామం రూపం, సైజూ వంటి వివరాలు వైఖానస ఆగమంలో చెప్పినవిధంగా కచ్చితంగా పాటిస్తారు. స్వామివారి శిరస్సుపై (నుదుటిపైభాగం వరకు) కిరీటం ఉంది. ఆయన జటాజూటము భుజాలపై పడుతూ ఉంటుంది. కచ్చితమైన కొలతలు తీసికొనబడనప్పటికీ స్వామివారి ఛాతీ వెడల్పు సుమారు 36-40 అంగుళాల మధ్య సైజులోనూ, నడుము భాగం వెడల్పు 24-27 అంగుళాలు సైజులోనూ ఉంటుంది. స్వామివారి నడుము పైభాగం ఆచ్ఛాదనారహితంగా ఉంటుంది. ఆయన వక్షస్థలం కుడిభాగాన శ్రీలక్ష్మీదేవి రూపం ఉంది. స్వామివారు చతుర్భుజములను కలిగియున్నారు. పై కెత్తిన కుడిచేతిలోనున్న సుదర్శన చక్రము, ఎడమచేతిలోనున్న పాంచజన్య శంఖము విగ్రహంలో భాగాలు కావు. అదనంగా స్వామివారి చేతులలో ఉంచిన అలంకారాయుధాలు. దిగువనున్న రెండుచేతులలోను కుడిచేయి వరదహస్తము (అరచేయి భక్తులకు కనిపిస్తూ, వరములను ప్రసాదిస్తున్నట్లుగా ఉంటుంది). ఎడమచేయి కట్యావలంబిత ముద్రలో (నడుమువద్ద మడచినచేయి. అరచేయి స్వామివారివైపు ఉంటుంది) ఉంది. నడుము క్రిందభాగంలో స్వామివారు ధోవతి ధరించి ఉంటారు. రెండు మోకాళ్ళూ కొంచెంగా వంగినట్లు కనిపిస్తాయి. ఇక ఈ విగ్రహానికి రక రకాల అలంకరణలు చేస్తుంటారు.  శ్రీవేంకటేశ్వరుని ఏయే ఆభరణాలు అలంకరిస్తారో.. ఇప్పడు చూద్దాం... 1. శ్రీవారి పాదాల క్రింది పద్మపీఠం - బంగారు రేకుల పద్మపీఠం 2. బంగారు పాద కవచాలు రెండు 1.కుడిపాదం, 2.ఎడమ పాదం  3. స్వర్ణపీతాంబరం (బంగారు రేకు) 4. బంగారు ఖడ్గం అనబడే సూర్యకఠారి 5. వైకుంఠ హస్తమునకు అలంకరింపబడే బంగారు కవచం రేకు 6. వైకుంఠ హస్తమునకు అలంకరింపబడే పొడవైన బంగారు సాదారేకు 7. వైకుంఠ హస్తమునకు సాతుబడి అయ్యే బంగారు కుడి నాగాభరణం 8. వైకుంఠ హస్తనాగాభరణం క్రింద ఉండే కడియం 9. కటి హస్తమునకు అలంకరించే బంగారు సాదారేకు 10. కటి హస్తమునకు అలంకరింపబడే బంగారు కడియం 11. కటి హస్తమునకు అలంకరింపబడే పొడవైన బంగారు కవచం రేకు 12. బంగారు కటిహస్త కవచం బంగారు రేకు 13. కటి హస్తమునకు అలంకరింపబడే రత్నాలదస్తుబందు 14. ఎడమచేయి నాగాభరణం 15. బంగారు నాగాభరణం అనే వడ్డాణం 16. వక్షస్థలం అమ్మవార్ల బంగారు కంటె, రత్నాలతో 17. బంగారు సహస్రనామ సాలిగ్రామాలు 18. బంగారు తులసీహారం 19. కమ్మరపట్టె అనే బంగారు వడ్డాణం 20. ఆరుపోర్వల బంగారు యజ్ఞోపవీతం 21. బంగారు కాసుల దండ 22. నాలుగు పేటల బంగారు మొహరీల గొలుసు 23. భుజకీర్తులు రెండు 24. రత్నాలు పొదిగిన బంగారు శంఖం రేకు 25. రత్నాలు చెక్కిన బంగారు చక్రం రేకు 26. రత్నాలు చెక్కిన బంగారు ఎడమ కర్ణపత్రం 27. రత్నాలు చెక్కిన బంగారు కుడికర్ణపత్రం 28. రత్నాలు చెక్కిన బంగారు బావలీలు, కుడి, ఎడమ, 29. చంద్రవంక తరహా బంగారు కంటె 30. బంగారు గళహారం 31. బంగారు గంటల మొలతాడు 32. బంగారు రేకు కర్ణ పత్రముల జంట 33. బంగారు రెండు పేటల గొలుసు 34. బంగారు సాదాకంటెలు 35. బంగారు కిరీటం 36. కొత్తగా చేయించిన బంగారు శంఖ చక్రముల కవచరేకులు 37. బంగారు ఐదుపేటల గొలుసు 38. శ్రీ స్వామివారి మకరతోరణం 39. వక్షస్థలంలో తగిలించి ఉన్న భూదేవి ప్రతిమ ఈ ఆభరణాలన్నీ అర్చకుల ఆధీనంలో ఉంటాయి. వీటి విలువ కోట్ల రూపాయలన్న విషయం తెలిసిందే. వీటిలో కొన్ని స్వామివారికి అలంకరింపబడగా, మిగిలినవి శ్రీవారి ఆలయం లోనే భద్రపరచడం జరుగుతుంది.   కాగా  ధృవ బేరం  వేంకటేశ్వరుని ది  కాదనే  వాదనలు  ఉన్నాయి.   మరోసారి దాని గురించి తెలుసుకుందాం .  ....   సత్య అయ్యదేవర 
  • కొన్ని విషయాలను అంత త్వరగా నమ్మలేము .  అలా అని పూర్తిగా కొట్టి పారేయలేము . మనదేశంలో ఉన్న  గుళ్ళు గోపురాలు  ఎన్నో అద్భుతాలకు  నెలవులు .  అలాగే  కొన్ని  గుళ్ళలో తెలియని  మిస్టరీలు ఎన్నో ఉన్నాయి . అలాంటి వింతే ఈ   కిరాడు  దేవాలయనిది కూడా. ఆ గుడిలో దాగున్న ఒక మిస్టరీ గురించి వింటే మాత్రం ఆశ్చరం  కలుగుతుంది .  చీకటి పడిన తరువాత ఆ గుడిలోనికి గనక వెళితే మరిక తిరిగి రారట...! శిలలు గా మారిపోతారట.ఇంతకీ ఎక్కడుందా గుడి? రాజస్థాన్ బర్మార్ జిల్లా కేంద్రానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో, జైసల్మేర్ కి 157 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాత్మ గ్రామంలో ఉంది కిరాడు గుడి.నిజానికి ఇది ఒక గుడి కాదు అయిదు ఆలయాల సమూహమైన సోమేశ్వరగుడి. ఈ ఐదింటిలో ప్రస్తుతం విష్ణుమూర్తికి అంకితమిచ్చిన గుడిని మాత్రం చూడడానికి వీలవుతుంది. మిగిలినవి శివదేవునికి అంకితం చేయబడినవి. వేల సంవత్సరాల పురాతన ఆలయం. నిజానికి ఒక మరుగునపడిన దేవాలయం ఇది. కాని దీనికున్న అసాధారణమైన మిస్టరీ కారణంగ ప్రస్తుతం ఒక పర్యాటకస్థలంగా ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయంలో సూర్యాస్తమయం  అయిన తరువాత ఉంటే మనుషులు రాళ్లుగా మారిపోతారట.   ఆ విషయాలు తెలుకోవడానికి  వీడియో  చూడండి. vedeo courtesy... vijaya mavuru 
  • ఇది చాలా పెద్ద చర్చే....  ఈ విషయంపై టీవీల్లో గంటలు గంటల పాటూ చర్చలు జరుగుతాయి. కెమెరాల ముందు దాదాపు మీదపడి రక్కుకున్నంత పని చేస్తారు మన మేథావులు. నాస్తికులకు ఈ విషయం చూయింగ్ గమ్ లాంటి నిత్య నాష్టా .  ఎంత నమిలితే అంత సాగుతుంది.  ఎంత వాగితే అంత కొనసాగుతుంది. ఇంతకీ భారత ప్రభుత్వం ఏమంటుంది? ప్రభుత్వం లెక్కల ప్రకారం అధికారికంగా దయ్యాలూ, భూతాలూ, శాపాలూ ఉన్నాయా? ఉన్నాయి!!! భారత ప్రభుత్వం దయ్యాలున్నాయని డిక్లేర్ చేసిందా?  చేసింది!!! ఎప్పుడు? ఎక్కడ? ఆ సంగతి తెలుసుకోవాలంటే మీరు ‘భాన్ గఢ్’ కి వెళ్లాలి. ఢిల్లీ నుంచి జైపూర్ కి వెళ్లే మార్గంలో (300 km from Delhi) సరిస్కా టైగర్ రిజర్వ్ ప్రారంభం కావడానికి ముందు వచ్చే ఒక చిన్న గ్రామమే భాన్ గఢ్.  ఆ గ్రామంలో ఒక బోర్డు ఉంటుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ బోర్డును పెట్టింది.  ఆ బోర్డులో  "ఈ భాన్ గఢ్ గ్రామంలోని భగ్నావశేషాల దగ్గర రాత్రి ఉండటానికి వీల్లేదు. ఎవరైనా రాత్రి ఈ ప్రదేశంలో ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.." భాన్ గఢ్ లో ఒక కోట ఉంది. కోటలో వీధులు, బజార్లు, నర్తన శాలలు, విశ్రాంతి గృహాలు ఉన్నాయి.. అద్భుత శిల్పకళ ఉన్న గోపీనాథ మందిరం, సోమేశ్వరాలయం, మంగళాదేవి గుడి, కేశవరాయ్ కోవెల ఉన్నాయి. ఇళ్లూ, వాకిళ్లు ఉన్నాయి.  కానీ చీకటి కమ్ముకొచ్చే సరికి కోట మొత్తం ఖాళీ అయిపోతుంది.  నరప్రాణి ఉండదు. రాత్రిపూట భగ్నావశేషాల దగ్గర ఎవరూ ఉండరు.  మొత్తానికి మొత్తం ఖాళీ అయిపోతుంది. రాత్రి వేళ కోటలో గజ్జెల సవ్వడి వినిపిస్తుంది.  కోట లోపలి నుంచి అస్పష్ట సంగీత రాగాలు అలలు అలలుగా దొర్లుకొస్తూంటాయి.  సందర్శకులు తీసిన గ్రూప్ ఫోటోల్లో టూరిస్టులతో పాటూ ఏవేవో వింత నీడలు కూడా అప్పుడప్పుడూ పడుతూంటాయిట.  అంతే కాదు.... కోటలోని ఇళ్లకి పై కప్పులుండవు. ఎవరైనా పొరబాటున కప్పు వేయడానికి ప్రయత్నిస్తే అవి తెల్లారేసరికి కూలిపోతాయి. భాన్ గఢ్ 1573 లో మహారాజా భగనాన్ దాస్ నిర్మించాడు. ఆయన దాన్ని తన కొడుకు మాధవ్ సింగ్ కోసం కట్టించాడు. మాధవసింగ్ అక్బర్ సేనాని మాన్ సింగ్ కి తమ్ముడు. మాధవసింగ్ తరువాత ఆయన కొడుకు ఛత్రసింగ్ రాజయ్యాడు. ఛత్రసింగ్ 1630 లో చనిపోయాడు. ఆ తరువాత నుంచే భాన్ గఢ్ కళ తప్పింది. 1720 లో రాజా జయసింగ్ ఈ గ్రామాన్ని గెలుచుకున్నాడు. ఆ తరువాత 1783 భయంకరమైన కరువు వచ్చింది. అప్పట్నుంచీ ఊరు నిర్మానుష్యం అయిపోయింది. మరి భాన్ గఢ్ లోకి భూతాలు ఎప్పుడు వచ్చాయి? ఖచ్చితంగా తెలియదు కానీ స్థానికుల కథనాల ప్రకారం బాబా భోలేనాథ్ అనే బాబాజీ ఆ ప్రాంతంలో తపస్సు చేసుకునేవాడు.  ఆయన దగ్గరకి వచ్చి అప్పటి రాజుగారు కోట నిర్మించుకునేందుకు అనుమతి కోరాడట. "రాజా నాకు డబ్బూ దర్పం అంటే అసహ్యం.. నువ్వు కోట కట్టుకో. రాజసౌధం కట్టుకో... కానీ దాని నీడ నా పై పడటానికి వీల్లేదు. పడ్డ మరుక్షణం ఊరు పాడుబడిపోతుంది. ఇది దయ్యాల కోట గా మారిపోతుంది. " అంటూ కండిషనల్ పర్మిషన్ ఇచ్చాడు బాబాజీ. రాజుగార్లు కోటలు కట్టుకున్నారు. రాజసౌధాలను కట్టుకున్నారు. క్రమేపీ భోలేనాథ్ మాట మరిచిపోయారు. అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు "బాబా కంటే ఘనుడు భాన్ గఢ్ బాలయ్యలు" వచ్చేశారు. భవనాల ఎత్తు పెంచేశారు. ఒక రోజు భాన్ గఢ్ రాజసౌధం నీడ బాబాజీ సమాధిని తాకింది. ఆయన బాబా గారు. తృణమో పణమో పుచ్చుకుని అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించే మునిసిపల్ అధికారి కాడు మరి. అంతే.... శాపం తన పనిని తాను చేసుకుపోయింది. ఊరు పాడుబడిపోయింది. ఇంకో కథ ప్రకారం భాన్ గఢ్ రాకుమారి రత్నావతి 'మంత్ర' విద్యలో మహాదిట్ట. ఆమెని ' సింఘియా' అనే ఇంకో మాత్రికుడు మోహించాడు.  రత్నావతికి మంత్రించిన నూనె పంపించాడు. ఆమె దాన్ని తాకగానే అతని వశమౌతుంది. కానీ రత్నావతి ఆ నూనెను పారబోయించి, తన మంత్రశక్తితో బండరాయిగా మార్చింది.  ఆ బండరాయి దొర్లి దొర్లి వెళ్లి 'సింఘియా'ని పచ్చడి పచ్చడి చేసేసింది.  చనిపోతూ చనిపోతూ "ఒసేయ్ అరుంధతీ... నన్నీ బండ కింద కుళ్లబెట్టావా? వదల బొమ్మాళీ వదల " స్టయిల్లో తెల్లారే సరికి ఊరు పాడుబడిపోతుందని, అక్కడ రాత్రి ఉండేవాళ్లు చనిపోతారని శపించాడు.  ఆ రాత్రికి రాత్రి ఊరు నాశనమైపోయిందట. అప్పట్నుంచీ అది దయ్యాల కోట అయిపోయింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ విభాగం. ఆ విభాగం భాన్ గఢ్ లో "దయ్యాలున్నాయి జాగ్రత్త" అని అధికారికంగా బోర్డు పెట్టించింది.  కాబట్టి భారతప్రభుత్వం దయ్యాలు, భూతాలు ఉన్నాయని అంగీకరించినట్టే కదా? ఇట్స్ అఫీషియల్ నౌ..... దయ్యాలు,.... భూతాలు ఉన్నాయి.... ఇప్పుడు భాన్ గఢ్ టూరిస్టు స్పాట్. (పగటి పూట మాత్రమే సుమా! ) ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దయ్యాలున్నాయని నమ్ముతుందా? ఏమో తెలియదు కానీ.... ప్రాచీన కట్టడాలు ఉన్న ప్రతి చోటా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయం ఉంటుంది. కానీ భాన్ గఢ్ లో మాత్రం వాళ్ల ఆఫీసు లేదు.  దయ్యాలు ఆత్మలు ఉన్నాయి కాని భాన్ గఢ్  కొటలొ లేవని అక్కడ పరిశోధన  చేసిన  ఫారనార్మల్ సొసైటి ఆఫ్ ఇండియ స్థాపకుడు, పరిశోధకుడు  గౌరవ్ తివారి  చెప్పారు . ఆయన  ఈమధ్యనే  విచిత్ర పరిస్థితుల్లో మరణించారు.   ...........  susri
  • లగడపాటి రాజగోపాల్  పొలిటికల్  రీ ఎంట్రీ  దాదాపుగా ఖరారు  అయింది . అటు టీడీపీ ఇటు బీజేపీలలో చేరడానికి ఇష్ట పడని  లగడపాటి  వైసీపీ వైపు మొగ్గు చూపారని  తెలుస్తోంది.  కొద్దీ రోజుల క్రితం బెంగళూరులో వైసీపీ అధినేత జగన్ ను  కలసి  మాట్లాడినట్టు సమాచారం.  జగన్  కూడా  రాజగోపాల్ పార్టీలో చేరిక పట్ల  సుముఖత  చూపారట .  తెలుగు రాష్ట్రాల్లో లగడపాటి  పేరు తెలియని వారు దాదాపుగా ఉండరు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా లగడపాటి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. రాష్ట్ర పునర్విభజన బిల్లు సందర్భంగా పార్లమెంట్ హాలులోనికి పెప్పర్ స్ర్పేను తీసుకెళ్లి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అలాంటి సంచలనాలు ఆయన ఖాతాలో ఎన్నో ఉన్నాయి. అటు పారిశ్రామికరంగంలోను ఇటు రాజకీయాల్లోనూ రాజగోపాల్ తనదైన ముద్ర వేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచే వైదొలగారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయలేదు. గత కొన్నాళ్ళుగా కుటుంబానికే ఎక్కువ టైం కేటాయించారు.. నాడు పార్ల‌మెంట్ సాక్షిగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని హామీ ఇచ్చిన నేత‌లు దాన్ని విస్మరించడం, తెస్తామ‌ని చెప్పిన వ్యక్తులు మాటలు మార్చడం వంటి పరిణామాల క్రమంలో రాజ‌గోపాల్ ప్రజల తరపున పోరాడాల‌ని యోచనలో పడ్డట్టు చెబుతున్నారు. లగడపాటి తో పాటు ఎంపీలు గా చేసిన వారిలో కావూరి సాంబశివరావు, పురందేశ్వరి బీజేపీ లో చేరగా రాయపాటి, దివాకరరెడ్డి టీడీపీలో చేరారు. మరికొందరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలీదు. కాంగ్రెస్ కి రాజీనామా చేసిన ఉండవల్లి అరుణ కుమార్ ఇటీవలే తెర ముందుకు వచ్చారు. ఉండవల్లి ఏపార్టీ లో చేరేది తేలకపోయినప్పటికీ రోజు మీడియా ముందుకు రావడం పలు అంశాలపై మాట్లాడటం జరుగుతోంది. అదే రీతిలో త్వరలో లగడపాటి కూడా తెర పైకి రావచ్చు అంటున్నారు. లగడపాటి రాజకీయాల్లోకి వస్తే మళ్ళీ సందడి సందడే. 
  • "ఎన్టీఆర్ ను నేను వెన్నుపోటు పొడిచాననడం తప్పు. ఎన్టీఆరే నన్ను వెన్నుపోటు పొడిచాడు. ఎన్టీఆర్ కు నేను వెన్నుపోటు పొడిచాననేది.. పత్రికల కల్పన" అని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఒక ఛానల్ ఇంటర్వ్యూ లో అన్నారు.  "పొలిటికల్ గా నాకు ఉన్న స్కిల్స్, ఎన్టీఆర్ చరిష్మా కారణంగానే కాంగ్రెస్ పార్టీని పడగొట్టాం.  నా మూలంగానే తెలుగుదేశం పార్టీ పుట్టింది. సినిమాల్లో హీరోగా ఆయన కనపడ్డా, నిజ జీవితంలో పెద్ద విలన్ ఆయన. టిక్కెట్ల ఎంపికలో మా ఇద్దరిలో ఎవరిదీ పైచేయి కాదు.  రెండో సారి ఎన్టీఆర్ ను వెన్నుపొడిచింది ఎవరు ? స్వయంగా ఎన్టీఆరే తన అల్లుడు చంద్రబాబును తిట్టి పోసాడు . తార్పుడు గాడు అని, రెండు వందల కోట్లు తినేశాడని ఎన్ఠీఆర్ విమర్శించారని నాదెండ్ల భాస్కరరావు చెప్పారు. ఎన్టీఆర్ బయో పిక్ లో మిమ్మల్ని విలన్ గా చూపించనున్నారటగా?' అనే ప్రశ్నకు నాదెండ్ల సమాధానమిస్తూ.. ప్రతి సినిమాలో విలన్ ఉండాలనే రూల్ ఏదీ లేదని, ఆ విధంగా చేస్తే కోర్టుకు వెళతానని, అప్పుడు ఆ సినిమా రిలీజ్ ఏ విధంగా అవుతుందని అన్నారు. ఇక తనకు, బాలకృష్ణకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు.  బాలకృష్ణ తీయబోయే చిత్రంలో తన తండ్రి సినిమా జీవితాన్ని మాత్రమే తీసుకుంటే ఫర్వాలేదు గానీ, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించడం గురించి తీస్తే బాలకృష్ణ చాలా చిక్కుల్లో పడతాడని అన్నారు. సినిమా తీసే ముందు బాలకృష్ణ తనను సంప్రదిస్తే, వాస్తవాలు చెబుతానని నాదెండ్ల అన్నారు.  చూడండి  వీడియో.  vedeo courtesy... tv 9 
  • శశికళను పరప్పన అగ్రహార జైలు నుంచి చెన్నై లేదా వేలూరు జైలుకు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారం చేతికి చిక్కడంతో శశికళ వర్గం తొలుత ఆపనిలో పడింది . ఈమేరకు కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయబోతున్నారు. అక్రమాస్తుల కేసులో శిక్ష పడడంతో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధానకార్యదర్శి శశికళ, బంధువులు ఇలవరసి, సుధాకరన్‌ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కర్ణాటక న్యాయవాదులతో చర్చించిన శశి భర్త నటరాజన్ ఆ దిశగా పావులు కదుపుతున్నారు. వయోభారం, మధుమేహం, మోకాలినొప్పి, ప్రత్యేక వసతుల లేమి కారణాలుగా చూపి జైలును మార్చాలని హైకోర్ట్ ను అభ్యర్ధించనున్నారు.  కాగా బల నిరూపణలో విజయం సాధించిన సీఎం పళని స్వామి శశికళ ఆశీస్సులు కోసం మద్దతు దారులతో చెన్నై నుంచి అగ్రహార జైలుకు నేడో రేపో బయలు దేర నున్నారు.  చెన్నై జైలుకి శశికళ వస్తే సొంత ఇంట్లో ఉన్నట్టే లెక్క. జైలు నుంచే ఆమె రిమోట్ పాలన సాగుతుంది. పళని స్వామి అందుబాటులో ఉంటాడు. సొంత ప్రభుత్వం కాబట్టి జైలులో సకల సౌకర్యాలు అనుభవించవచ్చు. ఇదంతా పకడ్బందీగా ప్లాన్ చేసి హైకోర్టు ను ఆశ్రయిస్తున్నారు. అయితే హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.  డీఎంకే వర్గాలు కూడా ఈ విషయాన్నీ పసి గట్టి శశి జైలు మార్పిడిని ఎలా ఆపాలా అని యోచిస్తున్నట్టు సమాచారం.
  • కంప్యూటర్లు రాని కాలంలో .... కమ్యూనికేషన్లు లేని రోజుల్లో .... ఉల్లాల్ అన్నా, చౌతా అన్నా గుర్తొచ్చేది ఒకే ఒక్కరు... ఆమె పేరు అబ్బక్క...... అవును ... ఆ కాలంలో పేర్లకు ఇంకా ఫ్యాషన్ బురద అంటలేదు. అబ్బక్క... మనసు గూగుల్ మ్యాప్ లో కర్నాటక తీరంలోని రేవు పట్టణం ఉల్లాల్ కి జూమ్ అవండి. ఉల్లాల్ వెళ్లాక టెమ్ మెషీన్ లో నాలుగొందల ఎనభై ఎనిమిదేళ్లు వెనక్కి వెళ్లండి. అప్పటి తీరాలను, అప్పటి ఊళ్లను, అప్పటి రాచరికాలను, అప్పటి యుద్ధాలను కళ్లముందు బొమ్మకట్టించుకొండి... అప్పుడు సాక్షాత్కరిస్తుంది అబ్బక్క. .... తుళునాడు కి రారాజ్ఞిగా పోర్చుగీసు దోపిడీదారులను పదేపదే మట్టికరిపించిన పోరాటయోధురాలు అబ్బక్క మహాదేవి..... కత్తియుద్ధం, గుర్రపుస్వారీలతో పాటు రాజకీయ వ్యవహారాలు, దౌత్యనీతిలో దిట్టగా వెలుగొందిన ధీర అబ్బక్క మహాదేవి..... అటు కేరళ జామొరిన్ పాలకుడు, ఇటు మంగుళూరు మహరాజులు, మరోవైపు అహ్మద్ నగర్ నవాబులను కలుపుకుని ఒక స్వదేశ రక్షణ త్రికోణశక్తిని తయారుచేసి, ఆ త్రికోణానికి బిందువుగా నిలిచిన భారత భద్రతా శ్రీచక్రం.... అబ్బక్క మహాదేవి...... 1525 లో మూడబిద్రి లో పుట్టిన అబ్బక్క 'చౌతా' కుటుంబానికి చెందిన జైన మతస్తురాలు. వంశాచారం ప్రకారం మామ తిరుమల రాయని రాజ్యానికి రాణి అయింది ఆమె. జైన మతానుయాయురాలైనా రంగులు మారే రుద్ర శిలతో తీర ప్రాంతాన ఒక అద్భుత శివలింగాన్ని ఏర్పాటు చేసి, గుడి కట్టించింది ఆమె. జనరంజక పరిపాలన, దూరదృష్టి, సమర్థ నేతృత్వాలతో ఆమె రాజ్యం అలరారుతూండేది. ఉల్లాల్ మసాలాదినుసుల ఎగుమతికి పేరెన్నిక కన్న ఊరు. ఆమె భర్త లక్ష్మణప్ప మంగుళూరుకి రాజు. కానీ రుద్రమదేవిలాగానే అబ్బక్కకీ, ఆమె భర్తకీ పడిరాలేదు. ఆమె జైనమతస్తురాలు. భర్త శైవ మతావలంబి. (రుద్రమదేవి విషయంలో ఇది తిరగబడింది. ఆమెది శైవం. భర్తది జైనం) అవి భారత్ పై తెల్లయూరోప్ నల్లమేఘమై ముసురుకుంటున్న రోజులు... పోర్చుగీసు వాళ్లు పడమటి తీరాన భారత సూర్యుడిని దిగముంచేందుకు యత్నిస్తున్నారు. అప్పటికే 1510 నాటికి గోమాంతక్ భూమి వారి వశమైంది. (గోమాంతక్ అన్నది పలకలేక గోవా అన్నారు. పోర్చుగీసులు పోయినా మనం మాత్రం గోవా అనే అంటున్నాం. ). ఇక రత్నాగిరి, కొంకణ తీరాలపై పట్టు దొరికింది. ఆ తరువాత వారి కన్ను కేరళ సాగర తీర రాజు జామొరిన్ పై బడింది. జామొరిన్ ను వశపరచుకునేందుకు వెళ్తూ వెళ్తూ మంగుళూరును మట్టికరిపించారు. అది 1525. ఆ తరువాత ముందుకువెళ్లబోతే అబ్బక్క రాజ్యం తుళునాడు అడ్డం ఉంది. "ఇదెంత పని... ఆడదేం చేస్తుంది" అనుకున్నారు పోర్చుగీసువాళ్లు...ఉల్లాల్ మసాలా దినుసుల ఘాటు నసాళానికంటుతుందన్నది వారికి తెలియలేదు. అబ్బక్క దెబ్బకు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. 1555 లో అడ్మిరల్ డాం వారో డా సిల్వానియా నాయకత్వంలో మళ్లీ దాడి చేశారు. మళ్లీ మట్టికరిచారు. 1568 లో మూడో సారి పో పీక్సోరో అనే సేనాని నాయకత్వంలో మళ్లీ దాడి చేశారు. ఈ దాడిలో ఉల్లాల్ రాజభవనం వారి చేజిక్కింది. అబ్బక్క మహాదేవి ఒక మసీదులో తలదాచుకోవాల్సి వచ్చింది. కానీ అదే రాత్రి రెండు వందల మంది సైనికులతో ఆమె బుడతకీచుల (పోర్చుగీసులకు తెలుగోడు పెట్టుకున్న పేరు) పై విరుచుకుపడింది. ఈ దాడిలో జనరల్ పీక్సోటోను కత్తికో కండగా చేసింది. ఆ తరువాత మంగుళూరు కోటపై దాడి చేసి అడ్మిరల్ మాస్కరెన్హస్ ను పైలోకాలకి పంపించింది. ఏడాది పాటు ఆమె మంగుళూరు కేంద్రంగా పరిపాలించింది. కానీ భర్త లక్ష్మణప్ప పోర్చుగీసులతో కలిసి పోయాడు. పోర్చుగీసులు మళ్లీ ఆమెపై యుద్ధం జరిపారు. వారిని ఎదుర్కొనేందుకు ఆమె జామొరిన్, అహ్మద్ నగర్ రాజులతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి పోరాటం చేసింది. 1570లో చివరికి పోర్చుగీసులదే పైచేయి అయింది. అబ్బక్క రాణి పోర్చుగీసు చెరసాల పాలైంది. జైల్లో ఉంటూ కూడా ఆమె తలవంచలేదు. అలాగే పోరాడుతూ పోరాడుతూ ప్రాణాలు వదిలింది. అబ్బక్క కథ కన్నడిగులకు యక్షగాన గాథ అయింది. పౌరుషపు పాట అయింది. పోరాటపు బాట అయింది. తుళునాడులో గళం గళం ఆమె పాట పాడింది. అబ్బక్క ఉల్లాల్ కోట, కట్టించిన రుద్రశివ మందిరం, పూజించిన జైన బాసాడి, తలదాచుకున్న మసీదు తీర్థస్థలాలయ్యాయి. తరతరాలుగా తీరనగరిని అబ్బక్క ఆవేశించింది. ఉల్లాల్ నగరం వెళ్తే ఫిరంగి పక్కన నిలుచుని సేనలను ప్రోత్సహిస్తూనో, గుర్రం పై కత్తి చేబూని సింహిణీనాదం చేస్తూనో అబ్బక్క రణభూమిలో తిరుగాడుతున్నట్టు అనిపిస్తుంది. ఆమె కాంస్యవిగ్రహం నాలుగు వందల తొంబై మూడు ఏండ్ల కాలం నాటి పోరాటగాథ చెప్పేందుకా అన్నట్టు నగరం నడిబొడ్డున నిలుచుని ఉంటుంది. కేంద్రంలో వాజ్ పేయీ ప్రభుత్వం వచ్చాక 'అబ్బక్క' పేరిట తపాలా స్టాంపు విడుదలైంది. ఈ మధ్యే తీరంలో విదేశీ తిమిరంపై సమరం చేసిన అబ్బక్క పేరిట మన తీరరక్షణ దళం (కోస్టుగార్డు) ఒక నౌకను కూడా జలప్రవేశం చేయించింది. ఈ కథ చదివాక ఉల్లాల్ అంటే స్నేహా ఉల్లాల్, చౌతా అంటే సందీప్ చౌతాలు మాత్రమే కాక, అబ్బక్క రాణి కూడా గుర్తుకు వస్తే ఈ ఆర్టికల్ ఆశయం ఫలించినట్టే. ....  susri 
  • తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సొంత పార్టీ పెట్టే ఆలోచనలో పడ్డారు. బలనిరూపణలో పళనీ స్వామి ది పైచేయి కావడం ... పన్నీర్ వ్యూహం అట్టర్ ప్లాప్ అయిన విషయం తెల్సిందే . ఈ క్రమంలో కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే అంశంపై తన మద్దతు దారులతో పన్నీరు చర్చిస్తున్నట్లు సమాచారం . అందరూ కూడా పార్టీ ఏర్పాటు పై మొగ్గు చూపు తున్నట్టు తెలుస్తోంది . అమ్మడీఎంకే పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు కావచ్చు  అంటున్నారు. జయ మేనకోడలు దీప కూడా ఈ పార్టీ లో చేరతారు . త్వరలో జరగ బోయే ఆర్కే నగర్ నియోజక వర్గం నుంచి దీప ను బరిలోకి దింపాలని సెల్వం ప్లాన్ చేస్తున్నారు. ఇక దీప కూడా తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ఇదివరకే ప్రకటించారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పన్నీర్ కు మద్దతు ప్రకటించిన దీపను  తమ పార్టీ తురుపు ముక్కగా ప్రయోగించాలని పన్నీర్ భావిస్తున్నట్టు  తెలుస్తోంది.   కేవలం ఆరుగురి ఎమ్మెల్యేల మెజారిటీ తో  పళనీ  స్వామి సర్కార్  ఎక్కువ రోజులు మనలేదని , రిమోట్ జైల్లో ఉన్న శశి చేతిలో ఉన్నంత కాలం  పళనికి దినదిన గండమే అంటున్నారు.  ఇక విప్ ధిక్కరించి పన్నీర్ వైపు నిలిచిన 11 మంది ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశాలున్నాయి.
  • అద్భుత క్షేత్రం  సలేశ్వరం !! అది నల్లమల  అటవీ   ప్రాంతం ..  ఎటు  చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు...వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో  అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి  కొలువైనాడు .  లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని  చేరుకోవడానికి కాలినడకన ఆరు కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే!  ఆ ఆద్భుత స్థలమే సలేశ్వరం!! సామాన్యులు సలేశ్వరమని పిలుచుకునే  ఈ శివ  క్షేత్రం మహాబూబ్‌నగర్ జిల్లా నల్లమల అడవిలో ఉంది. మన్ననూరుకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో... దట్టమైన అడవిలోని ఒక లోతైన లోయలో ఉంది. ప్రతీ సంవత్సరం చైత్ర పున్నమినాడు ఈ క్షేత్రానికి భక్తులు వేలసంఖ్యలో తరలివస్తారు. పున్నమి నాటి రాత్రి అడవిలో వేలాది భక్తులు లోయలోకి దిగి స్వామిని దర్శించుకుంటారు. ఈ శివాలయం ఎదురుగా దాదాపు మూడువందల అడుగుల ఎత్తు రాతికొండ పై నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతూ దూకుతుంది .  ఈ దృశ్యం భక్తులను  విశేషంగా ఆకట్టు కుంటుంది.  అచ్చంపేట, కల్వకుర్తి ఆర్టీసీ డిపోలు ఈ యాత్ర సందర్భంగా స్పెషల్ బస్సులు నడుపుతాయి. మన్ననూరు నుంచి శ్రీశైలం ప్రధాన రహదారిలో సుమారు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడి వరకు వాహనాలు వెళతాయి. వాహనాలు ఆగిన స్థలం నుంచి క్షేత్రం సుమారు ఆరుకిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందులో నాలుగు కిలోమీటర్లు లోయలోకి దిగాలి. ఒకే ఒక మనిషి నడిచేంత బాటతో కూడిన లోయ అడుగుభాగానికి చేరుకోవడం నిజంగా సాహసమే! చిన్నా పెద్దా అనే  తేడా  లేకుండా ప్రతీఒక్కరూ జంగమయ్య సేవలో తరించిపోతారు. కర్రనే ఊతంగా చేసుకుని పండు ముదుసలివారు జంగమయ్య దర్శనం కోసం బారులు తీరడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.  ఈ యాత్రలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. దీన్ని స్వామి మహిమగా కొందరు  చెబుతుంటారు . చుట్టుపక్కల జిల్లాల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ర్టాల నుంచి కూడా ఈ క్షేత్రానికి భక్తులు వస్తుంటారు.  ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి మూడుదారులున్నాయి. మన్ననూరు నుంచి, కొండనాగుల నుంచి, లింగాల నుంచి ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. అయితే కొండనాగుల, లింగాల గ్రామాల నుంచి అటవీ మార్గం ద్వారా సుమారు 40 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. అయినా ఈ దారి గుండా వందలాది భక్తులు ఈ క్షేత్రానికి వస్తూంటారు. నల్లమల అడవిలో మొత్తం  పంచ లింగాలున్నాయి అంటారు .  శ్రీశైల మల్లికార్జునస్వామి (జ్యోతిర్లింగం), సలేశ్వరంలింగమయ్యస్వామి, లొద్దిమల్లన్న, ఉమామహేశ్వరం ఈ నాలుగు లింగాలే అందరికీ తెలిసినవి. తెలియని ఐదో లింగాన్ని దర్శించుకుంటే  పునర్జన్మ ఉండదని కొందరు భక్తులు అంటారు. ఆ ఐదో లింగం నల్లమల అడవిలో ఎక్కడుందో ఇప్పటికీ రహస్యమే!  vedeo courtesy... mirror