Latest News
banner News

నాగబాబు వ్యాఖ్యలపై యండమూరి ఏవిధంగా స్పందించాడో తెలుసా ?

1st Image

ప్రముఖ నటుడు చిరంజీవి  సోదరుడు నాగ బాబు  రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ ,దర్శకుడు  రాంగోపాల్ వర్మల  గురించి  చేసిన కామెంట్స్  సంచలనం సృష్టించిన  విషయం  తెలిసిందే. 
ఆ కామెంట్స్ కి  రాంగోపాల్ వర్మ  ట్విట్టర్ ద్వారా స్పందించారు.  
ఇక రచయిత  యండమూరి ఏవిధంగా స్పందించాడో చూడండి.
 
vedeo courtesy ...tv 9  
Site Logo
  • ఏపీ అసెంబ్లీ లో అగ్రిగోల్డ్ అంశంపై చర్చ జరుగుతుండగా అనూహ్యంగా మహిళా పార్లమెంట్‌ సదస్సు సందర్భంగా స్పీకర్‌ ప్రెస్‌మీట్‌ లో చెప్పిన మాటలను సాక్షి ఛానల్ వక్రీకరించి చూపిందనే అంశం తెరపైకి వచ్చింది.. తాను మహిళలను కించపరిచేలా మాట్లాడినట్లు టీవీ చానెళ్లలో వచ్చిన వార్తల పట్ల  స్పీకర్ కోడెల స్పందించారు.  అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. మహిళలపై నా వ్యాఖ్యలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను అనని మాటలు అన్నట్టు చూపించడం బాధ కలిగించిందన్నారు’. ‘నా కుమారుడు, కోడలి గురించి సోషల్‌ మీడియాలోపోస్టులు  పెట్టడం అన్యాయం, అక్రమం, అనైతికమని’ స్పీకర్ కోడెల సభాముఖంగా తెలిపారు.  సభాపతి చేసిన వ్యాఖ్యలను తప్పుగా చూపిన సాక్షి పై చర్యలు తీసుకోవాలని మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత జగన్ సభలో ఉన్నపుడు  ఈ దృశ్యాలు మరొక్కసారి చూపించాలని ఆయన అన్నారు. స్పీకర్‌ను అగౌరవపరిచినవారిని సభకు పిలిపించాలని, చర్యలు తీసుకోవాలని  తెలుగు దేశం,బీజేపీ సభ్యులు  యనమల మాటలను సమర్ధించారు.  ఇదే అంశంపై సభ వెలుపల  ప్రతిపక్ష నేత  జగన్ మాట్లాడుతూ  అగ్రిగోల్డ్‌ బాధితుల అంశాన్ని అధికార పక్షం సభలో పక్కదోవ పట్టించిందని ఆరోపించారు. ‘దానితో సంబంధం లేని మహిళా పార్లమెంటు సదస్సు అంశాన్ని  చర్చకు తీసుకొచ్చారు. ఆ సదస్సు సందర్భంగా మీడియా సమావేశంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలను తెలుగు చానళ్లతో పాటు.. జాతీయ మీడియా కూడా ప్రసారం చేసింది. చంద్రబాబు డైరెక్షన్‌, కాల్వ శ్రీనివాసులు యాక్షన్‌, స్పీకర్‌ రియాక్షన్‌.. అన్నీ కలిసొచ్చి అగ్రిగోల్డ్‌ అంశం పక్కకు పోయి.. 45 రోజుల కింద మహిళా పార్లమెంటు సదస్సు సందర్భంగా స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చకు వచ్చాయి. వాటిని తెలుగు, జాతీయ చానళ్లూ ప్రసారం చేసినా.. ఒక్క మా చానల్‌, పత్రిక మాత్రమే ప్రసారం చేసినట్లు, ప్రచురించినట్లుగా.. చివరకు దాన్ని ప్లే చేయడానికి సభను వాయిదా వేశారు. ఆనాడు స్పీకర్‌ మీడియా సమావేశం సభకు సంబంధంలేని అంశం. సభలో జరగని అంశం. దానినెలా చర్చకు తీసుకొస్తారు’ అని జగన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  అనంతరం ప్రెస్ మీట్ లో  ‘మా పార్టీకి చెందిన 21 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరినా.. వారిని అనర్హులుగా ప్రకటించకుండా కాపాడుతున్నందుకు నిరసనగా స్పీకర్ పై  అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. అగ్రిగోల్డ్‌ బాధితుల అంశాన్ని సభలో ప్రస్తావిస్తే.. దానిని పక్కదోవ పట్టించి మా మీడియాపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి విధానాలను నిరసిస్తూ.. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతున్నాం’ అని చెప్పారు.  మొత్తం మీద అసలు విషయం  పక్కకు పోయి కొత్త అంశం  తెరపై  కొచ్చింది. ఇక్కడ ఒక విషయం  చెప్పుకోవాలి ...  ఆ రోజు స్పీకర్ మాట్లాడిన అంశాలను చాలా టీవీలు  చూపాయి . మరి వాటి విషయం లో ఏ చర్యలు తీసుకుంటారు ? అసలు సభ వెలుపల జరిగిన అంశాన్ని, సభకు సంబంధం లేని అంశాన్ని సభలో చర్చించ వచ్చా ? నిజంగా సాక్షి  తప్పు చేసి ఉంటె  చర్యలు ఎవరు తీసుకోవాలి ? ఇవన్నీ సీఎం ,యనమల, స్పీకర్ కు తెలియని అంశాలా ?   చూద్దాం శుక్రవారం ఏమి జరుగుతుందో ? 
  • ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్.  గురువారం ఎయిర్ ఇండియా ఉద్యోగి సుకుమార్ ను చెప్పుతో కొట్టి వార్తల్లో కెక్కారు.    ఈయన మహారాష్ట్ర లోని ఉస్మానాబాద్ కి  ఎంపీ గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.  అంతకుముందు రెండు మార్లు ఒమేర్గా  స్థానం నుంచి ఎమ్మెల్యే గా కూడా ఎన్నికైనారు.   పూణే నుంచి ఆయన ఢిల్లీకి పయనమయ్యారు.  తనది  బిజినెస్ క్లాస్ టికెట్ కాగా ఎకానమీ  క్లాస్ లో సీటు ఇచ్చారని  సహనం కోల్పోయి.. ప్రజాప్రతినిధిని అన్న జ్ఞానం కూడా లేకుండా వీరంగం  వేసాడు.  విమానం ఉదయం 11 గంటలకు ల్యాండ్  కాగానే  ఎయిరిండియా ఉద్యోగిపై  రవీంద్ర గైక్వాడ్ దాడి చేశారు.  పైగా  తన చర్యను సమర్థించుకున్నాడు. ‘అవును ఒకసారి కాదు 25సార్లు అతడిని చెప్పుతో కొట్టాను’ అని చెప్పుకొచ్చారు కూడా. ఎయిరిండియా సిబ్బందికి చాలా సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే సహనాన్ని కోల్పోయానని గైక్వాడ్ చెప్పాడు. కాగా  రవీంద్ర గైక్వాడ్ తన పట్ల దారుణంగా ప్రవర్తించడంతో పాటు చెప్పుతో కొట్టినట్లు ఎయిర్ ఇండియా ఉద్యోగి సుకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను అవమానించడంతో పాటు చేయి చేసుకున్నారని, తన కళ్ళద్దాలు పగులగొట్టారని సుకుమార్  ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఎయిర్ ఇండియా కూడా ఈ ఘటనపై విడిగా ఫిర్యాదు చేసింది. ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విమానాన్ని బలవంతంగా 40 నిమిషాలపాటు నిలుపుదల చేసినట్లు ఆరోపించడంతో ఆమేరకు మరో కేసు కూడా నమోదైంది. కాగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఈ ఘటనను ఖండించారు. ఎయిర్ ఇండియా సిబ్బందిపై భౌతిక దాడులను ఏ పార్టీ సమర్థించకూడదని అన్నారు. తమ ఎంపీ రవీంద్ర గైక్వాడ్ అలా ప్రవర్తించి ఉండకూడదని  శివసేన అభిప్రాయపడింది. ఆయన అంతగా ఆగ్రహం చెందడానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు  ప్రకటించింది. 
  • అన్నాడీఎంకే  ‘రెండు ఆకుల’ ఎన్నికల గుర్తును ఈసీ ( ఎన్నికల సంఘం ) స్థంభింప జేసింది.  అందుకు బదులుగా శశికళ వర్గానికి టోపీ  గుర్తు , పన్నీర్ సెల్వం వర్గానికి ఎలక్ట్రిక్ పోల్‌ గుర్తును కేటాయిస్తూ ఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ పరిణామంతో  రెండు వర్గాలు షాక్ తిన్నాయి . ఈ గుర్తులను జనంలోకి తీసుకెళ్లే విషయంపై ఇరు వర్గాలు దృష్టి పెట్టాయి. జయలలిత అకాల మరణంతో ఆమె పట్ల  ఉన్న సానుభూతిని సొమ్ము చేసుకోవాలని భావించిన ఇరువర్గాలకు ఈ సి నిర్ణయం మింగుడు పడలేదు.  కొత్త గుర్తులు కేటాయించడంతో కొత్త చిక్కులు ఎదురై  విజయావకాశాలు దెబ్బతింటాయేమో అని  మల్లగుల్లాలు పడుతున్నాయి.  దీంతో 37 ఏళ్ళ తరువాత అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం లేకుండానే  ఆర్కేనగర్ ఎన్నికల బరిలోకి దిగనుంది.  అభ్యర్థి ఎవరైనా రెండాకుల గుర్తును చూడగానే ఓటేసే వారు ఎంతోమంది వున్నారు. అందుకే ఈ చిహ్నం కోసం రెండు వర్గాలు పోటీ పడ్డాయి . బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరువర్గాల వారు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్  ముందు వాదనలు వినిపించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది .  ఇదిలా ఉంటే  ఆర్కేనగర్ లో బహుముఖ పోటీ జరగనుంది.  శశి వర్గం తరపున  దినకరన్  పన్నీర్  వర్గం తరపున  మధుసూదన్ , జయ మేనకోడలు దీపా జయకుమార్ ,  డీఎంకే అభ్యర్ధీ , బీజేపీ తరఫున గంగై అమరన్ మరికొందరు బరిలోకి దిగనున్నారు. ఏప్రిల్ 12 న ఉప ఎన్నిక జరగనుంది. 
  • ( Sheik Sadiq Ali )    .................           భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో,ప్రభుత్వంలో సాధువులు,యోగుల ప్రమేయం పెరిగిపోతోందని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తునారు. అయితే  భారత రాజకీయాల్లో యోగుల ప్రమేయం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. 1960 వ దశకం నుంచే, ఇందిరాగాంధీ హయాం నుంచే ఈ ట్రెండ్ మొదలైంది. నిజం చెప్పాలంటే , ఇప్పటికన్నా అప్పుడే చాలా ఎక్కువగా ఉంది . దాని గురించి ఈతరం వారికి తెలియజెప్పటమే ఈ కథనం ముఖ్యోద్దేశ్యం. ఇది ఒక యోగి జీవిత కథ. రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని, దేశ రాజకీయాలను కంటి సైగతో శాసించిన ఒక బ్రహ్మచారి కథ. తారాజువ్వలా నింగికి ఎగసి నేలరాలిన ధీరేంద్ర బ్రహ్మచారి కథ. ఇందిరా గాంధీని, సంజయ్ గాంధీ ని, మొత్తం గాంధీ పరివారాన్ని నడిపించిన ఒక రాజగురువు కథ. ఆద్యంతం మలుపులతో, సినీ ఫక్కీలో నడిచిన ఈ యోగి జీవిత కథ ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. ఎవరీ బ్రహ్మచారి? మా తరం, మాకన్నా ముందు తరం వారికి తెలిసిన కథే. కానీ, భారత భవిష్యత్తును నిర్దేశించే నవతరానికి ఈ కథ తెలియాల్సిందే. 13 వ ఏటే ఇల్లు వదిలి సన్యాసుల్లో కలిసిన ఒక కుర్రాడు దేశ భవిష్యత్తును శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? కట్టుబట్టలతో బయటికి వచ్చిన వాడు వేలకోట్ల సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడు? ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరా గాంధీకి రాజగురువు ఎలా అయ్యాడు? ఎవరి మాటా వినడని ప్రఖ్యాతి చెందిన సంజయ్ గాంధీని ఎలా మచ్చిక చేసుకున్నాడు? ఇప్పటికీ మిస్టరీ వీడని విమాన ప్రమాదంలో ఎలా మరణించాడు? ఇవన్నీ ఆద్యంతం ఆసక్తికరం. బీహార్ రాష్ట్రం మధుబన్ జిల్లా సాయిత్ చాన్పూర్ గ్రామంలో 1924 ఫిబ్రవరి 24 వ తేదీన పుట్టాడని కొందరు,1925 లో పుట్టాడని కొందరు  చెబుతారు . అలాగే అతని అసలు పేరు ధీరేంద్ర  చౌదరి అనీ,తండ్రి పేరు భంభోల్ చౌదరి అని కొందరు...   కాదు..కాదు అతని పేరు ధీరేంద్ర  శర్మ అని కొందరు అంటారు .  నిజమేమిటో ఇప్పటికీ తెలియదు. ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది మాత్రం 1954 లో మాత్రమే. కలకత్తాలో ప్రజలను పరిచయం చేసుకున్నపుడు ఆయన చెప్పిన వివరాలు చదివితే కొంచెం ఆశ్చర్యంగా అన్పిస్తుంది. "సన్యాసులకు సొంత ఊరూ ,పేరూ ఉండవు. కాబట్టి ఊరేదని అడగొద్దు. 13 వ ఏట భగవద్గీత ఇచ్చిన స్పూర్తితో ఇల్లు వదిలి వారణాసి వెళ్లి సన్యాసిగా మారాను. లక్నో కు సమీపంలో ఉన్న గోపాల్ ఖేరా ఆశ్రమంలో కార్తికేయ మహర్షి ఆశ్రమంలో చేరాను. ఆ మహర్షి 325 ఏళ్ళు జీవించి 1953 లో మరణించారు. వారు జీవించి ఉండగా అతిప్రాచీన భారతీయ యోగవిద్యను సాధన చేశారు. ఆ విద్య భారత్ లో అంతరించి పోయింది. కేవలం టిబెట్ లో మాత్రమే మిగిలి ఉంది దాన్ని మళ్ళీ బతికించి భారత ప్రజలకు అందించాలనేది వారి కోరిక. వారి వద్ద నేను నేర్చుకున్న విద్యను కలకత్తా ప్రజలకు నేర్పించెందుకే వచ్చాను. నా వయసు నిజానికి చాలా పెద్దది. కానీ చూడ్డానికి యువకుడిలా కన్పిస్తాను. దానికి నేను సాధన చేస్తున్న యోగ,సూక్ష్మ వ్యాయమాలే కారణం." ఇలా తొలిసారిగా ప్రజల మధ్యకు వచ్చిన ధీరేంద్ర  తనను తాను నిర్వచించుకున్నాడు. నిలువెత్తు విగ్రహం, ఆజానుబాహు,కాంతులీనే మేనిఛాయ,అయస్కాంతంలా ఆకర్షించే కళ్ళు. ఎలా తిప్పితే అలా తిరిగే దేహం ,వాటికి తోడూ అద్భుతమైన యోగ విన్యాసాలు. ప్రకృతి వైద్యం అదనపు ఆకర్షణలు. ఇవన్నీ చూసిన స్థానికులు ఆయనను ఆదరించారు. చిన్న అద్దె ఇంటిలో మొదలైన జీవితం అతికొద్ది కాలంలోనే ఖరీదైన భోగవంతమైన ఆశ్రమానికి మారింది. నగరంలోని ప్రముఖులు,ముఖ్యంగా సంపన్న కుటుంబాల మహిళలు అతని శిష్యులయ్యారు.పాపులారిటీ, సంపాదనా పెరిగాయి. అక్కడి నుంచే అతని మహర్దశ మొదలైంది. యోగాసనాలు వేయటంలో ఇప్పటి రాందేవ్ బాబాను మించిన వాడు. తాను యోగా చేస్తుండగా తీసిన ఫోటోలు, వాటి వివరాలతో 'సూక్ష్మ వ్యాయామం  అండ్ యోగాసన' అనే పుస్తకాన్ని రూపొందించాడు. అప్పుడే జయప్రకాశ్ నారాయణ కలకత్తా వచ్చారు. మిత్రుల సహకారంతో ఆయనను కలిసి తన పుస్తకానికి ముందు మాట రాయించుకున్నాడు. ఆ పుస్తకం బాగా ఆదరణ పొందింది. ఆ తర్వాత అక్కడి సైనికులకు,సైనికాధికారులకు యోగా శిక్షణ ఇచ్చాడు. క్రమంగా అతని కీర్తి  పెరగ సాగింది. దాంతో దేశ రాజధాని ఢిల్లీ మీద కన్ను పడింది. అక్కడ ఒక చిన్నపాటి బ్రాంచ్ మొదలు పెట్టాడు. ఢిల్లీ చేరిన తర్వాత అతని దశ తిరిగిపోయింది. అది 1960 వ సంవత్సరం. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రు కూతురు ఇందిరాగాంధీ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేవారు.ఆమెకు యోగా నేర్పించి స్వస్థత చేకూర్చాలని ధీరేంద్ర ను కోరారు. రోజూ ఇంటికి వచ్చి ఇందిరకు యోగా, సూక్ష్మ వ్యాయామం నేర్పించాలి. అలా నెహ్రూ ఇంట్లోకి ధీరేంద్ర ప్రవేశించాడు.అతి తక్కువ కాలంలోనే ఇందిరా.నెహ్రూలకు సన్నిహితుడయ్యాడు. నెహ్రు మరణాంతరం ఇందిరకు మరింత చేరువ అయ్యాడు.గురువు,సచివుడు ,హితుడు,సన్నిహితుడు అన్నీ తానే అయ్యాడు. అక్కడినుంచి అతని ప్రభ వెలిగిపోయింది. అత్యంత ఖరీదైన ఆశ్రమాలు, యోగా రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశాడు. కేంద్రమంత్రులు,బడా పారిశ్రామిక వేత్తలు,ఉన్నతాధికారులు అతని శిష్యులుగా మారిపోయారు. అతని ట్రస్ట్ కు కేంద్ర ప్రభుత్వ నిధులు భారీగా మంజూరు అయ్యేవి.మరో వైపు ఆయుధ కర్మాగారంలో భాగస్వామి అయ్యాడు. ఆయుధాల వ్యాపారిగా, రక్షణ పరికరాల సరఫరా దారుగా ఎదిగాడు.ఇందిరా ప్రధానిగా ఉన్న కాలంలో కేంద్ర మంత్రివర్గ కూర్పులో అతని ముద్ర స్పష్టంగా కన్పించేది. ఇక ఇందిరా తనయుడు సంజయ్ గాంధీకి ధీరేంద్ర ఎంతచెప్తే అంతేగా ఉండేది. ఎమర్జెన్సీ రోజుల్లో సంజయ్ చేపట్టిన కుటుంబ నియంత్రణ, గుడిసెల నిర్మూలనా కార్యక్రమాలకు ధీరేంద్ర  బహిరంగ మద్దతు ప్రకటించాడు. ఇక్కడ ఇలా ఉండగా, రష్యా ఆహ్వానం మేరకు అక్కడి వ్యోమగాములకు యోగా శిక్షణ కూడా ఇచ్చి వచ్చాడు. ధీరేంద్ర కు విదేశీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉండేవారు. విదేశాల నుంచి ఖరీదైన కార్లు,విమానాలు, ఎలెక్ట్రానిక్ పరికరాలు కానుకలుగా అందేవి. జమ్మూలో అతిపెద్ద ఆశ్రమం,సొంత విమానాశ్రయం,సొంత విమానం ,హెలికాప్టర్లు ఉండేవి. నిరంతరం దేశంలోని వివిధ ప్రాంతాలకు సొంత విమానాల్లో తిరిగేవాడు. దాంతో ఫ్లయింగ్ స్వామి గా సుప్రసిద్దుడయ్యాడు. సంజయ్ గాంధి మరణానికి కారణమైన విమానం కూడా ధీరేంద్ర దే కావటం విశేషం. సంజయ్ మరణం తర్వాత ఇందిరాగాంధీ పరిపూర్ణంగా ధీరేంద్ర  పైనే ఆధార పడ్డారు. ఆయన సూచనలతోనే ఇందిర అనేక పుణ్యక్షేత్రాలు దర్శించారు. ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఒక వైపు పార్టీ, మరోవైపు ప్రభుత్వ కార్యకలాపాల్లో ధీరేంద్ర  ప్రమేయం చాలా ఎక్కువగా ఉండేది . అప్పట్లో దూరదర్శన్ లో ప్రతీరోజు ధీరేంద్ర  యోగా కార్యక్రమాలు వచ్చేవి. భారతదేశపు ఆధ్యాత్మిక గురువుగా విరాజిల్లాడు. అదే సమయంలో ఆయనపై అనేక లైంగిక ఆరోపణలు వచ్చాయి. కలకత్తా నుంచి ఢిల్లీ వరకు అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉండేవని వార్తలు గుప్పుమనేవి.అలాగే, ఎమర్జెన్సీ కాలంలో వేలకోట్ల అక్రమ ఆస్థులు కూడబెట్టాడని ఆరోపణలు రావటం, జనతా ప్రభుత్వం నియమించిన షా కమీషన్ వాటిని నిర్ధారించటం, వాటిలో కొన్ని ఆస్థులను జప్తు చేయటం కూడా జరిగింది. ఇందిరా గాంధీ ,రాజీవ్ ల మరణం తర్వాత ధీరేంద్ర పతనం మొదలయ్యింది. అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు . 1994 జూన్ 9 జమ్మూ పరిసరాల్లో ఆయన ప్రయాణిస్తున్న సొంత విమానం కూలిపోవటంతో ధీరేంద్ర  మరణించాడు. ఆ విమానం ఎలా కూలింది అనే విషయంలో మీడియా కానీ, అప్పటి ప్రభుత్వం కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఆయన మరణం తర్వాత వారసులెవరూ లేకపోవటంతో ఆయన ఆశ్రమాలు,ఆస్థులు దోపిడీకి గురయ్యాయి.ఇప్పుడు ఆయనను గుర్తు పెట్టుకునే వారే కరువయ్యారు. యోగాసాధకుడిగా నిస్సందేహంగా ధీరేంద్ర  గొప్పవాడు. కానీ,రాజకీయ ప్రమేయాలు, ఆయుధాల వ్యాపారాలు,అక్రమాలు, మహిళలతో సంబంధాలు ఆయన లోని విద్వత్తును పూర్తిగా కనుమరుగు చేసేశాయి. యోగి భోగిగా మారితే పర్యవసానం ఎలా ఉంటుందో ధీరేంద్ర జీవితమే ఒక ఉదాహరణ. అలాగే బీజేపీ  హయాంలోనే యోగులు, సాధువుల రాజకీయ ప్రమేయం పెరిగిందని చెప్పటం కూడా అసత్యం. దశాబ్దాల తరబడి దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఒక యోగి కనుసన్నల్లో ఎలా నడిచిందో చెప్పటానికి ధీరేంద్ర బ్రహ్మచారి జీవితం ఒక చారిత్రక తార్కాణం.
  • ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఘనవిజయం నేపథ్యంలో గుజరాత్‌లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని బిజెపి యోచిస్తున్నట్టు  తెలుస్తోంది.  అయితే గుజరాత్ బిజెపి వర్గాలు అధికారికంగా ముందస్తు ఎన్నికల అంశాన్ని కొట్టి పారేస్తున్నాయి. కానీ అధికార పార్టీ, ప్రతిపక్షం లోనూ  ఈ విషయమై  అంతర్గతం గా చర్చలు జరుగుతున్నాయి.   నిర్ణీత వ్యవధి ప్రకారం చూస్తే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌లో జరగాల్సి ఉంది. ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌ అన్నసంగతి  తెలిసిందే . మోడీ గాలి వీస్తున్న తరుణంలోనే ఎన్నికలు నిర్వహించడం ప్రయోజనకరమనే ఆలోచన  అమిత్ షా మదిలో ఉందని అంటున్నారు .జులైలో కానీ సెప్టెంబర్‌లో కానీ ముందస్తుకు  వెళ్లే అవకాశం ఉందని  బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై  ముఖ్యమంత్రి విజయ్ రూపాని స్పంది స్తూ తమ ప్రభుత్వానికి ఐదేళ్ల ప్రజాతీర్పు ఉందని , ప్రభుత్వం పూర్తి కాలం వరకూ ఉంటుందని తెలిపారు. ముందు అనుకున్నట్లే డిసెంబర్‌లోనే ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే రెండు ఘన విజయాల ప్రభావం ఉన్న తరుణం లోనే గుజరాత్  ఎన్నిక లు జరిగితే సత్ఫలితాలు ఉంటాయని  అమిత్ యోచన గా ఉందని అంటున్నారు.  మోడీ స్వస్థ లంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కావడం, 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీకి ప్రతిష్టాత్మకం కావడంతో వీటిలో సునాయాస విజయానికి వీలు కల్పించుకోవాలని బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. . ఇప్పటికే బిజెపి తమ ఎన్నికల నినాదం గా యుపిలో 325, గుజరాత్‌లో 150 నినాదాన్ని ప్రచారంలోకి తెచ్చింది. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీలో 182 స్థానాలు ఉన్నాయి. పలు నగరాలలో మోడీ, అమిత్ షా ఫోటోలతో పోస్టర్లు వెలిశాయి. కరపత్రాల పంపిణీ జరుగుతోంది .  కాగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్‌లో బిజెపికి పలు సవాళ్లు  ఎదురు కానున్నాయి.  పటేల్ వర్గం ఒబిసి కోటా ఉద్యమంతో మోడీ ప్రభుత్వంపై  ఆగ్రహంతో ఉన్నారు. ఇక గోవధ అంశంలో దళితులపై హింసాకాండ వంటి పరిణామాలు , మోడీ జాతీయ స్థాయిలోకి వెళ్లిన తరువాత బిజెపికి ఆ స్థాయిలో తగు రీతిలో రాష్ట్రంలో నాయకత్వం వహించే వ్యక్తి లేకపోవడం, అన్నింటికీ మించి అధికార పార్టీ పై వ్యతిరేకత వంటి అంశాలు కీలకంగా మారుతున్నాయి. ఈ దశలో ప్రతికూలత ప్రబలక ముందే  ఎన్నికలు జరిపి  మెరుగైన ఫలితాలు అందుకోవాలని  మోడీ  మనసులో కూడా ఉందని అంటున్నారు .  ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ముందస్తు ఎన్నికలు ఉంటాయనే భావిస్తోంది . ఇందుకు అనుగుణంగా సన్నాహాలు  చేసుకుంటోంది . రాష్ట్రంలో పాగా వేసేందుకు  ఆమ్ ఆద్మీపార్టీ  ప్రయత్నాలు చేస్తోంది. కాగా 2002 ,2007,2012 ఎన్నికల్లో గెలిచి నరేంద్ర మోడీ సీఎంగా  చేశారు . 2014 లో ప్రధాని అయ్యారు . కాగా అంతకుముందు1995,1998 లలో కూడా బీజేపీ నేత కేశూభాయి పటేల్ అధికార పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్1980, 1985 ఎన్నికలలో గెలిచి అధికారం లో కొచ్చింది. మాధవ్ సింగ్ సోలంకీ  సీఎం గా చేసారు.
  • స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ  కంచుకోటను బద్దలు కొట్టామని  సంబరపడిన తెలుగు తమ్ముళ్లు  24 గంటలు గడవక  ముందే  డీలా పడ్డారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారుణ పరాజయం  టీడీపీ అధినేత  చంద్రబాబు కు మింగుడు పడలేదు .  చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో పోటీ జరిగిన అయిదు స్థానాలకు గాను నాలుగింటిలో ఓడిపోవడంతో అధికార పార్టీ నివ్వెర పోయింది.  పరోక్ష ఎన్నికల్లో సత్తా చూపిన  పార్టీ  ప్రత్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురు కావడంతో ఎన్నికలు జరగని, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా ఎన్నికలు వాయిదా వేయడానికి ప్రయత్నాలు  చేస్తున్నట్టు తెలుస్తోంది.   స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ గెలుపు గ్యారంటీ అని నమ్మిన అదికార పార్టీకి ఊహించని పలితాలు శరాఘాతంలా తగిలాయి. 2 ఉపాధ్యాయ, 3 పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగింటిలో అధికార పార్టీని ప్రజలు తిరస్కరించారంటే టీడీపీ  పట్ల  వ్యతిరేకత  ఏ స్థాయిలో  ఉందొ ఇట్టే తెలిసి పోతోంది. అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం పై చర్చలు జరుగుతున్నాయి  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగోలా మేనేజ్ చేసి గెలిచినప్పటికీ, విద్యావంతులైన పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ప్రజల్లో పార్టీ పట్ల వెల్లువెత్తుతున్న వ్యతిరేకతకు నిదర్శనమని స్వయంగా మంత్రులే అంగీకరిస్తున్నారు. కడప ఎమ్మెల్సీ గెలుచుకోగానే  జగన్ కి సవాళ్లు విసిరిన  మంత్రులు , టీడీపీ నేతలు ఇపుడు సైలెంట్ అయి పోయారు . ఫలితాలపై మాట్లాడేందుకు ముందుకు రావడం  లేదు. ఏతా వాతా తేలిందేమంటే ఈ ఎన్నికల  ఫలితాలు  అధికార పార్టీ కి  ఒక హెచ్చరిక చేశాయి అని చెప్పుకోవచ్చు.  ఇప్పటికైనా  అధికారపార్టీ ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేయాలి. పాలనా శైలిని మార్చుకోవాలి . లేకుంటే  భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక  తప్పదని  రాజకీయ పరిశీలకులు స్ఫష్టం చేస్తున్నారు.
  • వైసీపీ అధినేత జగన్ జాతకాన్ని పూర్తి స్థాయిలో పరాంకుశం  వేణు స్వామి విశ్లేషించారు.    జగన్ ది   మిధున రాశి ...తులా లగ్నం ...   ఆరుద్ర  నక్షత్రం 2 వ పాదం.  2009 నుంచి జగన్ కి బాడ్ టైం నడుస్తోంది . సమస్యలు పేస్ చేస్తున్నారు.  తండ్రి వైస్ రాజశేఖర రెడ్డి మరణం తో సమస్యలు మొదలైనాయి.  అష్టమశని కష్టాల పాల్జేస్తాడు. అందుకే జైలుకి వెళ్లి వచ్చాడు.   జగన్ ది ఎవరి మాట వినని మనస్తత్వం ..  అయన ఏం చేసినా మరొకరికి తెలియదు.  వ్యాపారంలో ఆయనకు బాగా అనుకూల అవకాశాలు ఉన్నాయి. ఆయన జీవితంలో రాజసం ఉంటుంది.  ఇక రాజకీయంగా  జగన్ కి ......   వేణు స్వామి ఇంకా ఏమి  చెప్పారో   ఇతర వివరాలకు  చూడండి వీడియో.. vedeo courtesy... astroguru
  • ఇంటి నుంచి  నుంచి షాపింగ్ మాల్ కి  బయలుదేరిన ఓ  బాలికను  కిడ్నాప్ చేసి  కొంతమంది యువకులు గ్యాంగ్ రేప్ కు  పాల్పడ్డారు. 15ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ చేయడమే కాకుండా ఫేస్ బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. 40 మంది వరకు ఈ లైవ్ వీడియోను చూసారు కానీ ఒక్కరు కూడా పోలీసులకు  ఫోన్ చేయలేదు.   బాలికపై లైంగిక వేధింపులను చూస్తూ కూడా ఒక్కరూ పట్టించుకోలేదు. కనీస బాధ్యతగా  కూడా ఎవరూ ఫీల్ అవలేదు . ఈ  సంఘటన  చికాగో లో జరిగింది . ఫేస్ బుక్ పేజీ ఆధారంగా నేరస్తులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  ఆ వీడియోను పోలీసులు ఫేస్ బుక్ యాజమాన్యం సహకారంతో ఆ పేజీనుంచి తొలగించారు. ఐదు నుంచి ఆరుగురు సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆదివారం సాయంత్రం షాపుకు వెళ్లిన తన కూతురు ఇంటికి తిరిగి రాలేదని బాలిక తల్లి స్టేసీ ఎల్కిన్స్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తమ బంధువులు లైవ్ వీడియో చూసి తనకు సమాచారం ఇచ్చినట్టు ఎల్కిన్స్ పోలీసులకు  తెలిపింది .  ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు బాలికను గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుల కోసం   పోలీసులు గాలిస్తున్నారు. వీడియోను పోస్ట్ చేసిన ఫేస్ బుక్ పేజీ వివరాల సేకరణ కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు బాలిక నుంచి కూడా సమాచారం రాబడుతున్నారు. కాగా  జనవరిలో ఒక మానసిక వికలాంగునిపై దాడి చేస్తూ  యువతీ యవకులు  ఫేస్బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చారు . ఆ ఘటనలో వారిని అరెస్ట్ చేశారు. 
  • మేటి నటుడు ఎన్టీఆర్ తన కుటుంబానికి  ఎన్నడూ ఏ లోటూ చేయలేదు . చివరి రోజుల్లో  కుటుంబ సభ్యులే ఆయనను సరిగ్గా పట్టించుకోలేదు. అది వేరే విషయం అనుకోండి. అసలు కథ లోకొస్తే .... అది 1978 నాటి సంగతి. అప్పటికి  ఎన్టీఆర్  కుమారుల్లో నలుగురికి పెళ్ళయింది. ఆ నలుగురు కోడళ్ళకు (పద్మజాదేవీ జయకృష్ణ, మాధవీమణీ సాయికృష్ణ, లక్ష్మీ హరికృష్ణ, శాంతీ మోహన్ కృష్ణ) ఆర్థిక స్వాతంత్య్రం, భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఒక సినిమా చేశారు. ఆ నలుగురు కోడళ్ళనే భాగస్వాములుగా పెట్టి, ‘శ్రీతారకరామా ఫిలిమ్‌ యూనిట్‌’ను  స్థాపించి  నిర్మించిన సినిమాయే  ‘డ్రైౖవర్‌ రాముడు’. అప్పట్లో అదొక సంచలనం.  కె. రాఘవేంద్రరావు  దర్శకత్వంలో ఎన్టీఆర్, జయసుధ నటించిన  ఆ చిత్ర నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతల్ని కుమారుడు హరికృష్ణకు అప్పగించారు. అలా కోడళ్ళ కోసం ప్రత్యేకంగా సినిమా చేసిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కింది. " ఏమని వర్ణించనూ..." అంటూ కళ్ళు లేని చెల్లెలితో అన్న అనుబంధాన్ని తెలిపే సెంటిమెంట్‌ పాట, సీన్లు ఎన్నో ఉన్న ఆ సినిమా 1979 ఫిబ్రవరి 2న రిలీజై  సూపర్ హిట్ అయింది .  కాసుల వర్షం కురిపించింది. ఆ సినిమా మీద వచ్చిన లాభాలతోనే అప్పట్లో ఎన్టీఆర్‌ హైదరాబాద్‌లోని మసాబ్‌ ట్యాంక్‌ వద్ద చిన్న కొండ పై భాగం కొని, నలుగురు కొడుకులకీ ఇళ్ళు కట్టించి, కోడళ్ళ పేరు మీదే వాటిని పెట్టారు. ఇప్పటికీ హీరో కల్యాణ్‌ రామ్‌ (తన తండ్రి హరికృష్ణతో పాటు) సహా ఎన్టీఆర్‌ వారసులు ఆ ఇళ్ళలోనే నివసిస్తున్నారు. గమ్మత్తేమిటంటే, ముందు చూపుతో కోడళ్ళ ఆర్థిక స్వేచ్ఛ కోసం ఎన్టీఆర్‌ చేసిన ఆ పని ఇవాళ వందల కోట్ల విలువైంది. మార్కెట్  అంచనా ప్రకారం ఇప్పుడు ఆ ఇళ్ళ మార్కెట్‌ విలువ రూ. 150 కోట్ల పై మాటే. ఇంకా చెప్పాలంటే... ఆనాటి ‘డ్రైౖవర్‌ రాముడు’ (1979) సినిమా లాభం... తెలుగులో ఇప్పటి ‘బాహుబలి’ (2015) మొత్తం నికర వసూళ్ళతో (షేర్‌ కలెక్షన్లతో) సమానం కావడం విశేషం.
  • నరసింహస్వామి దేవాలయము ఖమ్మం జిల్లా ప్రధానకేంద్రం ఖమ్మం పట్టణం నడిబొడ్డున ఒక ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయం . ఇది తెలంగాణ లోని ప్రముఖ ఆలయాలలో ఒకటి. శ్రీమహావిష్ణువు నరసింహావతారంలో హిరణ్యకశిపుడనే రాక్షసుడిని సంహరించి ఆయన కుమారుడు ప్రహ్లాదుడిని కాపాడిన కథ అందరికి తెల్సిందే. ఆనాడు  స్థంభం  నుండి ఉద్భవించిన స్వామియే ఈ కొండపై ఉన్న గుహలో వెలిసాడని అందుచేతనే కొండకు స్థంభాద్రి  అనే పేరు వచ్చిందని చెబుతారు. అటువంటి స్థంభాన్నికలిగివున్న ప్రాంతం కాబట్టి స్థంభాద్రి, స్థంభశిఖరి, కంభంమెట్టు అనే పేర్లనుంచి కాలక్రమంలో ఖమ్మం అనే పేరు ఏర్పడింది అంటారు. సాధారణంగా దేవాలయాలు తూర్పులేదా ఉత్తరదిశలకు తిరిగి వుంటాయి కానీ ఇక్కడి నరసింహస్వామి మాత్రం దక్షిణాభిముఖుడుగా వుంటాడు. ఎత్తైన కొండలపై వెలసిన స్వయంభువుగా వెలసిన నారసింహ స్వామి శిల్పం సహజంగానే వెలసిందని, శతాబ్ధాల కాలం నుంచి అది అక్కడే వున్నట్లు భావిస్తారు. ఈ ఆలయ స్థంభాలపై కనిపించే  శిల్పనిర్మాణ శైలి కాకతీయుల స్థంభాలను పోలి వున్నప్పటికి అంతటి పూర్తి స్థాయి నగిషీలు లేక చాలా ప్రాదమిక దశలోనే వున్నట్లు కనిపిస్తుంది. అంతేకాక గర్భగుడికి ముందున్న నిర్మాణంలో ముందస్తుగా ఏర్పరచిన స్థంభాలకూ ఆ తర్వాత విస్తరణలో అభివృద్ధి పరచిన స్థంభాలకూ మధ్య బేధాన్ని గమనించ వచ్చు. ఇక్కడి ధ్వజ స్థంభం  పూర్తిగా శిలతో నిర్మించినదే, మరి అత్యంత ఎత్తుగా కాక గుడికంటే కొంత ఎత్తుగా మాత్రం వుంటుంది. అంతే కాకుండా ధ్వజస్తంభం గుండ్రని నిర్మాణంతో స్తూపం ఆకారంలో కాక ఇది నలుపలుకలుగా దీర్ఘఘనం ఆకారంలో వుంటుంది. సాధారణంగా దేవాలయాలలో గర్భగుడిలోని మూలవిరాట్టుకు ఖచ్చితంగా ఎదురుగా వుండేలా ధ్వజస్తంభ నిర్మాణం చేస్తారు.కానీ ఇక్కడ మూల విగ్రహానికి ఎడమ వైపు మూలగా కొంత కోణంలో ధ్వజస్థంభం వుంటుంది. ఇలా వుండటానికి కారణం మూలవిరాట్టు పక్కకు చూస్తున్నట్లుగా వుండటమే అని వంశపారంపర్యంగా ఇక్కడి పూజాదికాలు నిర్వహిస్తున్న అర్చకులు వివరించారు. రాతి ధ్వజస్తంభంపై అత్యంత ప్రాదమిక రూపంలో గీసిన ఒక పక్షివంటి రూపం వుంది. అంటే దానిని నరసింహావతారం ప్రాధమిక రూపమైన విష్ణుమూర్తికి వాహనం అయిన గరుత్మంతునిగా భావించి గీచి వుండవచ్చు. అలాగే మరోపక్క ధ్వజస్తంభంపై చేపవంటి ఆకారం కనిపిస్తోంది. బహుశా స్థంభం తొడుగు లోపల పరిశీలిస్తే దశావతారాలు పూర్తిగా వుంటాయేమో. ఈ చేప మత్స్యావతారానికి  ప్రతీకగా గీచి వుండవచ్చు. ఇంత ఎత్తుగా వున్న కొండపై సంవత్సరం పొడవునా నీటినిల్వలు వుంటాయి. కొండను రెండుగా చీల్చినట్లున్న ప్రాంతంలో అంతమైన కొలను కనిపిస్తుంది. ఉగ్రరూపుడైన నరసింహుని శాంతిపజేయటానికా అన్నట్లు కొలను నిండుగా వున్నప్పుడు అక్కడినుండి వున్న నాభివంటి అంతర్గత మార్గాల ద్వారా స్వామివారిని చల్లబరిచే అభిషేకం జరుగుతుందట. కొన్నిసార్లు కేవలం చెమ్మవంటి తడిమాత్రమే కాక ఏకంగా ప్రవాహంలాగా నీరు కొండమీది కొలనునుంచి గర్భగుడిలోని స్వామివారి విగ్రహాన్ని తడుపుతూ నీళ్ళు చేరటాన్ని ఈ అర్చకులు చాలా సార్లు గమనించారట. దీనిని దేవాలయ మహత్మ్యానికి విశేష ఉదాహరణగా పేర్కొంటారు. మూలవిరాట్టుకు కొంత కోణంలో రాతి ధ్వజ స్థంభం  నిర్మిస్తే సరాసరి ఎదురుగా ఒక నిలువెత్తు రాతి స్థంభం భూమిలో పాతి నిలబెట్టి వుంటుంది.దానికి మధ్యలో ఒక గంటుకూడా వుంది. దీనిని మొక్కుబడులు తీర్చుకునే కోడె స్తంభంగా ఆలయ అర్చకులు పేర్కొన్నారు. మొక్కుబడులను అనుసరించి ఈ స్థంభానికి వారు దారంతో కొంత సమయం మేర కట్టేసుకోవడం ద్వారా మొక్కుబడిని చెల్లించుకుంటారని తెలియజేసారు. బహుశా జంతుబలులకు కట్టుస్థంభంగా కానీ వధ్యశిలగా కానీ ఇది వాడుకుని వుండొచ్చని కూడా అంటారు. ఈ నారసింహ క్షేత్రానికి క్షేత్రపాలకుడు హనుమంతుడు, దక్షిణదిశగా తిరిగి వున్న ఈ ఆలయంలో ఆగ్నేయ దిశలో క్షేత్రపాలకుని మందిరం వుంటుంది. చాలా నరసింహ క్షేత్రాలలో స్వామివారికి నైవేద్యపానీయంగా పానకాన్ని సమర్పిస్తారు. మంగళగిరి నరసింహస్వామి కి ఎన్నిబిందెలు పానకం పోసినా స్వీకరిస్తాడని అయినప్పటికి భక్తులకు ప్రసాదంగా కొంత మిగుల్చుతాడని కథనంగా చెప్పుకుంటారు. ఆవిధంగా మిగిల్చే పద్దతిలో శిల్పాన్ని నిర్మిస్తూ శిల్పులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇక్కడి ఖమ్మం నరసింహస్వామికి పానకంతో అభిషేకం చేయడం ప్రత్యేకత. అత్యంత ఉగ్రరూపుడైన స్వామివారిని శాంతింపజేసేందుకు పానకంతో అభిషేకం చేయడం అనే పద్దతి పూర్వకాలం నుంచి వస్తోంది.  సర్పదోష మొక్కుబడులకూ దోష నివారణకూ సర్పశిల లేదా ఇప్పటి రోజుల్లోలాగా లోహసర్పాలనూ పూజలో వుంచి దేవాలయాల వద్ద వదిలేసే ఆనవాయితీ వుంది. దానిని సూచిస్తున్నట్లు ఇక్కడ అనేక రకాలైన అనేక సర్పశిలలు కనిపిస్తాయి. వివిధ ప్రాంతాలనుంచి ఖమ్మం పట్టణానికి రైలు లేదా బస్సుద్వారా సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాదు నుంచి కేవలం 195 కిలోమీటర్ల దూరంలోనూ, ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడనుంచి కేవలం 125 కిలోమీటర్ల దూరం లోనూ వుంది.