Latest News
banner News

రామ్ చరణ్ గురించి యండమూరి ఏమన్నాడో ? వీడియో చూడండి

1st Image

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్   యువ హీరో  రామచరణ్ తేజ , సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లగురించి  
ఏమన్నారు ? ఏం  చెప్పారు ?   
ఆ మాటలకే  నటుడు నాగబాబు  యండమూరి పై విరుచుక పడిన విషయం  తెలిసిందే.  
యండమూరి  వీరేంద్ర నాథ్ వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమం లో  అసలు ఏమి అన్నారో ?
వీడియో చూడండి. 
vedeo courtesy .. hashtag telugu
Site Logo
  • శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం షార్  మరో అద్భుత ప్రయోగానికి  వేదిక కాబోతుంది .  ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి ప్రపంచానికే సవాల్ విసరబోతోంది.ఈ మహత్తర ఘట్టం తో ఇండియా  సరి కొత్త  రికార్డు  సృష్టించబోతోంది.  భారాతీయులు గర్వ పడదగిన  ఆ రోజు ఫిబ్రవరిలో రానుంది . యావత్తు ప్రపంచం మొత్తం  ఇండియా కేసి  చూసే ఈ అపూర్వ  ఘట్టం మరి కొన్ని రోజుల్లో జరగబోతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ఇస్రో ) కొత్త ప్రయోగానికి తెర తీయనుంది . మంగళయాన్, చంద్రయాన్1 వంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలను విజయవంతం చేసిన ఆత్మ విశ్వాసంతో  ఇస్రో  శాస్త్రవేత్తలు ఈ భారీ ప్రయోగానికి శ్రీకారం  చుట్టనున్నారు . వచ్చే నెల 15వ తేదీన 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడతారు . ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఘనత ఏ దేశానికి లేదు.  తొలి సారిగా ఆ ఖ్యాతి మనకే దక్క బోతోంది.  60వ రాకెట్ ప్రయోగం ద్వారా 104 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ వాహన నౌక ద్వారా నింగిలోకి చేర్చేందుకు రంగం సిద్ధమవుతోంది . సీ 37 వాహన నౌక ద్వారా 3స్వదేశీ, 101 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. 2016లో పీఎస్ఎల్వీ-34 రాకెట్ ద్వారా 20 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టి షార్ విజయం సాధించింది. ఈ రికార్డును అధిగమించేందుకు ఏకంగా 83 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు షార్ ప్రణాళిక రూపొందించింది
  • చెన్నై మెరీనా తీరం వేదికగా సాగుతున్న జల్లికట్టు ఉద్యమం ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది.  నిన్నటివరకు ఈ ఉద్యమం ఎంతో క్రమశిక్షణతో నడిచింది. అందరూ ఉద్యమం  జరిగిన తీరును ప్రశంసించారు .   కానీ ఇంతలోనే ఉద్యమం దారి తప్పింది. మెరీనా బీచ్ లో  ఉన్న ఉద్యమకారులను ఖాళీ చేయమనడం తో అనూహ్యంగా ఉద్రిక్తత నెలకొంది. అయితే అక్కడి నుంచి కదిలేందుకు ఆందోళనకారులు ససేమిరా అన్నారు . ఈ క్రమం లో లాఠీ ఛార్జ్ జరగడం . బీచ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న పోలీస్ స్టేషన్ ను  దుండగులు తగులబెట్టడం   జరిగి పోయాయి .  కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్టేషన్ పై  పెట్రోల్ బాంబులతో దాడులు చేసినట్టు  చెబుతున్నారు దీంతో స్టేషన్ ముందు పార్కింగ్ చేసిన   పోలీసు వాహనాలు  తగలబడి పోయాయి.  కాగా  ఉద్యమకారుల ముసుగులో సంఘ విద్రోహశక్తులు ప్రవేశించాయని ప్రభుత్వం ఆరోపించిన కొద్దిసేపటికే పోలీస్;స్టేషన్ ను  తగులబెట్టారు. అంతకు ముందు  జల్లికట్టు కోసం  ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చినందున ఆందోళన విరమించాలని, గణతంత్ర దినోత్సవ వేడుకలు మెరీనా బీచ్లో నిర్వహించాలి  కాబట్టి  అక్కడి నుంచి ఖాళీ చేయాలని పోలీసులు ఉద్యమకారులకు  విజ్ఞప్తి చేశారు. అయితే పోలీసుల విజ్ఞప్తిని తిరస్కరించిన నిరసనకారులు తమను బలవంతంగా ఖాళీ చేయిస్తే ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరించారు. అదేసమయంలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కంటికి కనిపించిన వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో సుమారు 50 వాహనాలు మంటల్లో దగ్ధమయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెరీనా బీచ్ ఉద్యమం  హింసాత్మకంగా మారడంతో అక్కడికి వచ్చే అన్ని మార్గాలను పోలీసులు మూసివేశారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ఆందోళనకారులను వెనక్కి పంపించివేస్తున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.  మొత్తం మీద  ఉద్యమం  లో సంఘ విద్రోహ శక్తులు  ప్రవేశించాయో లేక ... ప్రభుత్వమే వ్యూహాత్మకంగా ఉద్యమాన్ని దెబ్బ తీసిందో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఒక సారి పోలీసులు ఎంటరైతే ఇక ఆగరు.  ఈ పరిణామాలు ఏమలుపు  తిరుగుతాయో ? 
  •  ( Rajeshwar Rao Ravichettu )  ........................................... నేతాజీ' సుభాష్ చంద్రబోస్  దేశం  గర్వించదగ్గ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ నాయకత్వం‌ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని పోరాటం సాగిస్తుంటే నేతాజీ సాయుధ పోరాటంద్వారా మాత్రమే ఆంగ్లేయులను దేశం నుంచి పారదోలడం సాధ్యమని ఆచరణలో చూపిన మహనీయుడు. భారత జాతీయ కాంగ్రేసుకు బోసు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ గాంధీతో  గల  సైధ్ధాంతిక విభేదాలతో ఆ పదవికి రాజీనామా చేశాడు. అహింసావాదం స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాటయే పరిష్కారమని బోసు విశ్వసించాడు. ఈ లక్ష్యంతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. జీవితకాలం‌లో 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. శత్రువు శత్రువు మనకు మిత్రుడనే అనే సూత్రంతో రెండవ ప్రపంచ యుద్ధం (1939) ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి సువర్ణవకాశంగా భావించిన నేతాజీ యుద్ధం ప్రారంభం కాగానే ఆంగ్లేయుల కూటమిపై పొరాటానికి రష్యా కూటమిలోని మిత్రదేశాలైన జర్మనీ, జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఇతర  ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం  ను (ఆజాద్ హింద్ ఫౌజ్) ఏర్పాటు చేశాడు. జపాను తోడ్పాటుతో సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచాడు. బ్రిటిష్‌కూటమిపై పోరాటానికి సేకరించిన నిధులతో రూ 50లక్షల మూలధనంతో‌ రంగూన్‌లో ఆజాద్ హింద్ బ్యాంక్‌ను ఏర్పాటుచేశాడు. ప్రామిసరీనోట్ల రూపం‌లొ ఆజాద్ హింద్ కరెన్సీని ముద్రించాడు. నేతాజీ మరణానంతరం ఆడబ్బు ఏమైందీ తెలియరాలేదు. వియన్నాలో డా. మాధుర్ ద్వారా పరిచయమైన కాధలిక్ విశ్వాసి, ఆస్ట్రియాదేశస్తురాలైన ఎమిలీ షెంకీ ని బోసు 1937లో వివాహమాడారు. వారికి 1942లో అనితా బోస్ ఫాఫ్ అనే కుమార్తె జన్మించింది.  మనదేశం‌లో భాగమైన అండమాన్, నికోబార్ దీవులనుండి బ్రిటిష్‌వారిని పారదోలిన జపాన్ నేతాజీతో ఒప్పందం ప్రకారం ఆజాద్ హింద్ ఫౌజ్‌కు స్వాధీనం చేశారు. నేతాజీ ఆ ద్వీపాలకు షాహీద్, ఆజాద్‌లుగా నామకరణంచేసి డిసెంబర్ 30 1943 న భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. నేతాజీ అదృశ్యం (1945) తదుపరి ఆప్రాంతాలు తిరిగి బ్రిటిష్ ఆధీనం‌లోకి వెళ్ళాయి. బోసు రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ,  జపానులతో స్నేహంపై చరిత్రకారులు కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. అతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు 18 ఆగస్టు, 1945న మరణించాడని ప్రకటించినప్పటికీ అందులొంచి బయట పడి అజ్ఞాతం వెళ్ళాడని పలువురు నమ్ముతారు. నేతాజీ మరణానికి  చెందిన పత్రాలను నాటి కాంగ్రేస్ ప్రభుత్వంకానీ, ఈనాటి  యన్ డి ఏ  ప్రభుత్వం కానీ  పూర్తిస్థాయిలో ప్రకటించలేదు. అంతర్జాతీయ  సంబంధాలు వికటిస్తాయనే మిషతో సమాచార హక్కు ద్వారా చేసిన విజ్ఞప్తులనుకానీ, కోర్టు ఆదేశాలనుగానీ అమలుచేయడం‌ లేదు .  నేతాజీ బతికే ఉన్నారా ?  ఇదే విషయమై.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు భారత ప్రభుత్వం మూడు  కమిషన్‌లను వేసింది. కానీ ఏ ఒక్క కమిటీ సుస్ప‌ష్టంగా నివేదిక ఇవ్వ‌లేదు.1945 ఆగస్టులో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ చనిపోయినట్లు  షోనావాజ్ కమిషన్ నిర్థారించింది. 1970లో ఏర్పాటైన జీడీ కోస్లా కమిషన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.నేతాజీ కుటుంబ సభ్యులు మాత్రం ఈ అభిప్రాయాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ రెండు కమిషన్‌లు వాస్తవాలను వెల్లడించడంలేదని నేతాజీ కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. అంతేకాక ఎన్డీయే ప్రభుత్వం నెహ్రూకు సంబంధించి ఇటీవ‌ల బయటపెట్టిన నివేదిక కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.నేతాజీ చనిపోయారని ప్రకటించిన తర్వాత కూడా నెహ్రూ నేతాజీ కుటుంబంపై నిఘా పెట్టారన్నది సంబంధిత నివేదిక సారాంశం. ఏదేమైనా. నేతాజీకి సంబంధించిన నిజాలు వెలుగు చూస్తే జాతికి ఎంతో మేలు. లేకుంటే స్వాతంత్ర్య సంగ్రామంలో కీల‌క పాత్ర పోషించిన నెహ్రూ లాంటి నాయ‌కుల‌పై అనుమానాలు త‌ప్ప‌వు. ఈవేళ  ఆ  మహనీయుని  జన్మదినం   (23 జనవరి 1897- 18 ఆగస్టు 1945 ?) దేశాన్ని త్రికరణ శుధ్దిగా ప్రేమించిన నేతాజీ జయంతిని ‘దేశ్ ప్రేమీ’ దివస్‌గా జరుపుకుంటూ ఆయన త్యాగాలను స్మరించుకుందాం. దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మనంకూడా త్రికరణశుధ్ధిగ కృషిచేద్దాం. 
  •  (ఇలపావులూరి మురళీ మోహన రావు)...............   "కంచిగరుడసేవ" అన్న మాటను తరచుగా వింటుంటాం .  కానీ దాని అర్ధం ఏమిటో  చాలా మందికి తెలియదు. వారి కోసం ఈ వ్యాసం.  చదవండి.    కాంచీపురానికి దేవాలయాల నగరం గా ఖ్యాతి ఉన్నది. ఒకప్పుడు కంచిలో వెయ్యి దేవాలయాలు ఉండేవి. వాటిలో ప్రముఖమైనవి శివకంచి, విష్ణుకంచి. విష్ణు కంచి లో స్వామివారికి బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఆయన వాహనం గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి విగ్రహం ఇరవై అడుగుల ఎత్తున భారీగా ఉండేది. ఆ విగ్రహం మీదికి ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉన్న స్వామివారిని ఎక్కించడానికి చాలా అవస్థలు పడాల్సివచ్చేది. విష్ణు మూర్తికి హారతులు ఇవ్వాలంటే ముందుగా గరుడిని దాటుకుంటూ వెళ్ళాలి. గరుత్మంతుడు కూడా మనకు దేవుడే. పైగా విష్ణు వాహనం కావడం తో ఆయనకు కూడా విలువ ఎక్కువే. గరుడుని దాటుకుంటూ వెళ్ళేటపుడు ఆయనకు కూడా ఒక నమస్కారం పెట్టాల్సిందే. తన వాహనానికి నమస్కారం పెట్టకపోతే విష్ణుమూర్తి కి ఆగ్రహం వస్తుంది. గరుడుని స్వయంగా వరాలు ఇచ్చే శక్తి లేదు కాబట్టి ఆయనకు నమస్కారం పెట్టినా వృదాయే. అయినా స్వామివారికి కోపం రాకుండా ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ గరుత్మంతుడి కి కూడా ఒక నమస్కారం పారేసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లేవారు. దీనినే కంచిగరుడసేవ అంటారు. అనగా ప్రయోజనం లేకపోయినా ఒక పని చెయ్యాల్సి వచ్చిన సందర్భం లో ఈ "కంచిగరుడసేవ" అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఇంకా వివరంగా చెప్పాలంటే మనం కలెక్టర్ ఆఫీసు కు వెళ్తాము. కలెక్టర్ ను కలవాలంటే ముందు బంట్రోతు ను ప్రసన్నం చేసుకోవాలి. అతను అనుమతి ఇస్తేనే మనం కలెక్టర్ ను కలవగలం. అతనికి నమస్కారం పెట్టినా ప్రయోజనం లేదు. అతను మనకు ఏమీ చెయ్యలేడు. అది తెలిసినా కలెక్టర్ ను కలవడం కోసం బంట్రోతుకు కూడా నమస్కారం చేస్తాము. అదన్న మాట. ఒక వ్యక్తి ముప్ఫయి ఏళ్ళు ఉద్యోగం చేసినా, ఏవిధమైన ఎదుగూబొదురు ఉండదు. పదవీవిరమణ చేసేటపుడు "హు.. కంచిగరుడసేవ చేసాను" అనుకుంటూ ఇంటికి వెళ్తాడు. ఒక్కముక్కలో చెప్పాలంటే మనం చేసిన పని సఫలం కాకపోగా, వికటిస్తే, అది వృధాప్రయాస అనబడే కంచిగరుడసేవ అన్న మాట..
  •  జల్లికట్టు , కోడిపందాలు వంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలు,జంతు హింసపై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పులపై వ్యాఖ్యానించడం అంటే మన సెలబ్రెటీలు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు కోర్ట్ లను ధిక్కరించడమే అంటున్నారు న్యాయ నిపుణులు . సమాజాన్ని ప్రభావితం చేసే ఇలాంటి వారు కీలక అంశాలపై మాట్లాడేటపుడు  ఆచితూచి స్పందించాలని లేనిపక్షంలో వారికి చిక్కులు  ఎదురవుతాయని  చెబుతున్నారు . అలాగే యువత పెడత్రోవ పట్టే  ప్రమాదం ఉందని అంటున్నారు.  చూడండి వీడియో 
  • పోలవరం ప్రాజెక్టు పక్కనే ఉన్న మాగాణి భూమిని రైతుల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డ్‌గా మార్చడం  ఎంతవరకు న్యాయమో ఎంపీ  రాయపాటి చెప్పాలని జనసేన  అధిపతి పవన్  డిమాండ్  చేశారు. పవన్ కల్యాణ్  ట్వీట్ల  ద్వారా ఈ డిమాండ్  చేశారు. రాయపాటి కి చెందిన  ‘ట్రాన్‌స్ట్రాయ్’ అడ్డగోలుగా రైతుల భూమిని డంపింగ్ యార్డ్‌గా మార్చేస్తే ప్రజలు ఏవిధంగా ఆలోచిస్తారో అన్న వివేకం కూడా చూపకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు.  పోలవరం నిర్మాణ ప్రగతిపై నెలకోమారు సమీక్ష జరుపుతున్న సర్కార్ ఈ సమస్యపై ఎందుకు దృష్టిపెట్టడం లేదో అర్థం కావడం లేదని పవన్ అన్నారు. ‘ఈ భూముల రైతులు తమవారు కాదనా?.. లేదా కాంట్రాక్టర్‌కు ఇబ్బందనా?’ అంటూ ఆయన ప్రశ్నించారు.  ఇక అమరావతి రైతుల గురించి ప్రస్తావిస్తూ   గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం నదీపరివాహకంలో ఉన్న భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని, అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తీసుకున్నదో లేదో స్పష్టత లేదని పవన్  అన్నారు. ఈ భూములను తీసుకుని ఏం చేస్తారో కనీసం వాటిని ఇచ్చిన రైతులకైనా తెలియజేయాలని పవన్ కోరారు. భూముల సేకరణకు ముందు ఎంతమేరకు నష్ట పరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందో అంత మొత్తం ఇవ్వాలని, పట్టా రైతులకు ఒకలా, లంక భూముల రైతులకు మరోలా ఇచ్చి వివక్షత పాటించడం మంచిది కాదని పవన్ హితవు పలికారు. రైతుల కన్నీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  కాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 
  • వేంక‌టేశ్వ‌రుని భ‌క్తుడు బాబా హాథీరాం జీ జీవిత చరిత్ర ఆధారంగా  సినిమా తీసి, దానికి ఓం న‌మో వెంక‌టేశాయ అని పేరుపెట్ట‌డ‌మేమిట‌ని బంజారా సామాజిక‌వ‌ర్గం చిత్ర నిర్మాత‌ల‌ను నిల‌దీస్తోంది. హాథీరాం పేరుతోనే చిత్ర‌ముండాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. శ్రీ‌వారి మెట్ల మార్గంలో అలిపిరి వ‌ద్ద వారు ఇందుకు సంబంధించిన బ్యాన‌ర్ల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ నిర‌స‌న‌కు దిగారు. చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 10న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు శ‌నివారం ఉద‌యం తిరుమ‌ల‌లో ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు, హీరో నాగార్జున ప్ర‌క‌టించిన కొద్ది గంట‌ల‌కే ఈ నిర‌స‌న గ‌ళం వినిపించింది. హాథీరాం బంజారా సామాజిక వ‌ర్గానికి చెందిన వాడ‌ని చెబుతూ, అన్న‌మయ్య సినిమాకు అదే పేరు పెట్టిన‌ప్పుడు ఈ చిత్రానికి హాధీరాం పేరెందుకు పెట్ట‌ర‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభంలోనే అభ్యంత‌రక‌ర స‌న్నివేశాలుంటే స‌హించేది లేద‌ని హాధీరాం ట్ర‌స్టు హెచ్చ‌రించింది. తాజాగా ఏర్ప‌డిన వివాదాన్ని ఎలా దాటుకొస్తోందో చూడాల్సిందే.   చూడండి వీడియో .. vedeo courtesy .... nyusu digital media
  • మహారాష్ట్ర నుంచి డాక్టర్ సయ్యద్ ఫ్యామిలీ తో సహా  హైదరాబాద్‌‌లోని పర్యాటక ప్రదేశాలను చూసేందుకు నగరానికొచ్చారు. చార్మినార్‌కు దగ్గర్లో ఉన్న ఒక లాడ్జీ లో దిగారు . మొత్తం  నాలుగు రూమ్‌లు  తీసుకున్నారు. మూడు రూమ్‌లలో కుటుంబ సభ్యులు పడుకోగా నాలుగో రూమ్‌లో కుమారుడితో పాటు డాక్టర్ సయ్యద్ పడుకున్నారు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అందరు గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా గదిలో నుంచి అరుపులు, కేకలు వినిపించడంతో పక్క గదుల్లో ఉన్న వాళ్లు భయపడి బయటకు పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. లాడ్జిలో ఏం జరిగిందని డాక్టర్ సయ్యద్‌ని పోలీసులు ప్రశ్నించారు. తామందరం నిద్రపోతుండగా తల లేని మెండెం తమ పై కర్రతో దాడి చేసిందని, ప్రతిఘటించేలోపే తమను గోడకేసి కొట్టిందని సయ్యద్ పోలీసులకు చెప్పాడు. ఈ మాటలకు పోలీసులతో సహా అక్కడ ఉన్నవారంత కంగుతిన్నారు. లాడ్జి యజమాని అయితే ఆ మాటలకు షాక్ తిన్నాడు .   గతంలో ఎప్పడూ తమ హోటల్ లో అలా జరగలేదన్నాడు. హోటల్ గదిలో నుంచి తండ్రి కొడుకులు తీవ్రమైన గాయాలతో బయటకు రావడం పలు సందేహాలకు తావిస్తుంది. అసలు ఆ గదిలో ఏం జరిగింది...? సయ్యద్ చెబుతున్న మాటల్లో నిజమెంత..?  నిజంగా దెయ్యమేనా ? ఎవరైనా  సొమ్ముల కోసం  కిటికీ లో నుంచి దూరి  దాడి చేశారా ? అనే కోణంలో హుస్సేనీ ఆలం పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీడియో చూడండి.  vedeo courtesy.... abn andhrajyothi
  • వాళ్లిద్దరూ  భార్యాభర్తలు ... ప్రతిరోజు పోట్లాడుకునే వారు  చిన్న సంపాదపరుడైన తన భర్త తో మాట్లాడుతూ  పక్కనోళ్లు అది కొన్నారు, ఎదిరింటోళ్లు ఇది కొన్నారు, వెనకింటోళ్లు ఇది కొన్నారు అని భార్య ప్రతిరోజు ఏదో ఒక కోరిక  కోరుతుండేది.   భార్య ఏది అడిగిన భర్త ఎన్నోసార్లు సర్ది చెప్పాడు,"నేను ఒక సాదా  సీదా వాడిని, నువ్వు అడిగే అంతపెద్ద ఏ కోరికలు తీర్చలేను మనకున్నంతలో సర్దుకుపోదాం" అని అన్నప్పుడల్లాతనకి మాత్రమే. ఇలాంటి భర్త దొరికడు అనుకునేది భార్య. ఇలా చాలా రోజులు గడిచాక ఒకరోజు ఇద్దరు కలిసి  చుట్టాల పెళ్ళికి వెళ్లారు,  అక్కడ పెళ్ళిలో ఒక సరదాగా ఒక ఆట పెట్టారు . గెలిచినా దంపతులకి 20 వేల రూపాయలు బహుమతి ఇస్తామన్నారు. వీళ్ళను కూడా అందులో పాల్గొనమని  చుట్టాలు బతిమాలడంతో సరే అన్నారు, అప్పటికే భార్య పెళ్ళికి వచ్చేముందు పట్టుచీర కట్టుకొని పోకపోతే పరువుపోతుందని భర్తని తిట్లు తిట్టి చేసేదేమిలేక  ఇష్టం లేకపోయినా పెళ్లికొచ్చింది. ఆట మొదలయింది....ఒక కుర్చీ వేశారు ఆ తర్వాత ఒక దానిమీదొకటి వేస్తారు.. అలా ప్రతి కుర్చీమీద భార్యని ఎత్తుకొని అందులో భర్త కూర్చోపెట్టాలి మళ్ళీ కుర్చీలోంచి ఎత్తుకొని దింపాలి అదే ఆట. రెండో కుర్చీ మొదటి కుర్చీ మీద వేశారు భార్యని కూర్చోపెట్టాడు, మూడోది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,  నాలుగోది  వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,  ఐదవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు, ఆరవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,  ఏడువది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు, ఎనిమిదవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,  తొమ్మిదవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,పదవది వేశారు బాగా ఎత్తుగా ఉంది అయినా సరే కొంచెం కష్టంగా ఉన్న ఎత్తుకొని కూర్చోపెట్టాడు దింపాడు,పదకొండు, పన్నెండు, పదమూడు  ఇలా కుర్చీలు పెరుగుతున్నాయి ... అయినా భర్త ఆపట్లేదు ఒక్కసారి భర్త వైపు భార్య చూసింది,  భర్త కళ్ళల్లో నీళ్లు  చూసింది, ఎంత నొప్పిని భరిస్తున్నాడో అనిపించింది ఆమెకు.  ఆ నొప్పిని భరించేది ఆయన గెలవాలని కాదు .. కనీసం ఇలా అయినా భార్య అడిగిన కోరిక  తీర్చాలని భర్త పడే కష్టం  .. ఆ భార్యకు తెలిసింది. "భర్తను అర్ధం చేసుకునే భార్యలు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళల్లో తను  లేనని.   భార్యని అర్ధం చేసుకునేవాళ్ళు అతి కొద్ది మందే ఉంటారు, అందులో నా భర్త ఉన్నాడని ఆయన కళ్ళల్లోకి చూసాకే తెలిసింది"... ఆ కళ్ళను చూసి తన కళ్ళు కూడా చెమర్చాయి . ఆట ముగిసింది..... 20వేల రూపాయలు వీళ్లకందిస్తూ,ఈ ఆటలో గెలుపు ఓటములు అంటూ ఉండవు, భార్య వుంటే ప్రతి భర్త గెలుస్తాడు,భర్త ఉంటే ప్రతి భార్య గెలుస్తుంది, ఇద్దరు గెలిస్తే వాళ్ళ మధ్యన ప్రేమ కూడా గెలుస్తుంది, అలాంటి ప్రేమను గుండెలో దాచుకొని  పైకి చూపించలేని, పైకి కనిపించకుండా దాచుకొని  ఎంతో మంది భార్యాభర్తలు తమ ప్రేమకి  అన్యాయం చేసుకుంటున్నారు, కనీసం ఇలాంటి ఆటల వల్ల అయినా  ఆ ప్రేమను  బైటికి తెప్పించే వేదిక అయినందుకు  చాలా సంతోషంగా ఉంది అని నిర్వాహకులు ప్రకటించారు. కానీ ఆ భార్య ఆ డబ్బులు తీసుకోలేదు, "ఏ డబ్బుల కోసం నా భర్తని బాధపెట్టానో, ఇప్పుడదే డబ్బు వల్ల నా భర్త విలువ తెల్సింది, ఈరోజే తెలిసింది అలాంటి భర్తను పొందడం  ఎన్ని జన్మలో వరమో అని" ఆరోజు నుండి వాళ్ళిద్దరిమధ్య చిన్న చిన్న గొడవలు తప్ప,నాకిది కావాలి, నాకు అది కావాలని భార్య అడగలేదు... అక్కడ ఒక సంసారం నిలబడింది, కుటుంబంలో ప్రేమ నిలబడింది. కుటుంబ విలువలు బతికేఉంటాయి అని చెప్పడానికే ఈ చిన్న కథ. ------  Venkata Ramana Kumar Kaza
  • చాగంటి వారు  ప్రవచనాలు కొనసాగించాలి .  ఈ వివాదం పెద్దది చేస్తున్న వారు కృష్ణుడు వ్యభిచారి అన్న కంచె ఐలయ్య ను ఎందుకు విస్మరించారు . ఆయన ఒక్కరే కాదు ఎందరో శ్రీ కృష్ణుడిని విమర్శించారు.   మరి వారందరిపై కేసులు పెట్టలేదే ?  రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఎమ్మార్పీ కి జరక్కపోతే సంవత్సరానికి 10 వేల కోట్లు నల్లధనం మాఫియా కి చేరుతుంది .  రైతులు అందక వినియోగదారులకు చెందక పప్పులు , బియ్యం ధరలు దళారులు దోచుకుంటున్నారు .  ఈ వ్యవస్థలో అధికారులు , రాజకీయ నేతలు భాగస్వాములు అవుతున్నారు . నక్సల్స్ కి అడవిలోనే అవినీతి కనిపిస్తుందా రాజమండ్రి వచ్చి అవినీతికి పాల్పడే ఇద్దరు ముగ్గురు ఎమ్యెల్యేలను కాల్చేయమనండి . మోడీ నోట్ల రద్దు మంచి ఫలితాలే ఇస్తుంది .బహిరంగ మార్కెట్లో 27 రూపాయల కేజీ బియ్యం 50 రూపాయలు ఎలా అమ్ముతున్నారు .  ప్రతి దాంట్లో అధికారుల వైఫల్యం నడుస్తుంది .కోడి గుడ్ల ధరల్లో ఇదే కనిపిస్తుంది . ఐసిడిఎస్ లో దోపిడీ నడుస్తుంది ....  అనేక అంశాలపై హాట్ కామెంట్స్ చేసిన బిజెపి జాతీయ కార్య వర్గ సభ్యుడు , ఎమ్యెల్సీ సోము వీర్రాజు .. చూడండి వీడియో ...