Latest News
banner News

చిరుతో రోజా ఇంటర్వ్యూ వ్యూహాత్మకమేనా ?

1st Image

మెగా స్టార్  చిరంజీవితో రోజా ఇంటర్వ్యూ వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా ? 
ఉంటే ఉండొచ్చు ... కానీ అవేవి ఇంకా మెటీరియలైజ్ కానీ స్థితిలో ఉన్నాయి. 
ఈ నేపథ్యంలో  జగన్ చెందిన సాక్షి టీవీ కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే  రోజా చిరంజీవిని ఇంటర్వ్యూ చేయడం ఓ హాట్ టాపిక్‌గా మారింది.
రోజా ఇంటర్వ్యూలో కొన్ని రాజకీయపరమైన ప్రశ్నలు ఉన్నప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై గానీ, తెలుగుదేశం పార్టీపై గానీ ఏ విధమైన ప్రశ్నలు లేవు.  
ఇది సినిమా వరకే పరిమితమవుతుందా, భవిష్యత్తులో కాంగ్రెసు, వైఎస్సార్ కాంగ్రెసు కలిసి పనిచేయడానికి దారి తీస్తుందా?  లేక మరేదైనా మలుపు తిరుగుతుందా అనే చర్చ సాగుతోంది.
ఏ పరిస్థితుల్లో మళ్ళీ సినిమా రంగంలోకి రావాల్సి వచ్చిందో ... కారణాలేమిటో చిరు వివరించారు. వివిధ అంశాలపై చిరు ఎలా స్పందించారో   వీడియో చూడండి. 
vedeo courtesy... sakshi tv
  • సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజనీ కాంత్ ఫ్రాడ్ మాస్టర్ అని  బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి విమర్శించారు.  రాజకీయాల్లోకి రజనీ ప్రవేశం ఖాయమని వార్తలు వస్తోన్న నేపథ్యంలో  ఆయనపై సుబ్రహ్మణ్య స్వామి మాటల దాడి పెంచారు. ఒక వైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని, రాజకీయాల్లోకి రజనీలాంటి మంచి వ్యక్తులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని  ఇటీవల స్వాగతించిన క్రమంలో  స్వామి  అలాంటి వ్యాఖ్యలు  చేశారు.   అధ్యక్షుడు ఒక రకం గా ...  నేత ఒకరకం మాట్లాడితే కార్యకర్తలు కన్ఫ్యూషన్ లో పడతారు. కానీ స్వామి సంగతి తెలుసు కాబట్టి ఎవరూ ఆయన మాటలకూ విలువ ఇవ్వరు.   రజనీకాంత్ ఓ నిరక్షరాస్యుడని, తమిళులు బాగా చదువుకున్న వారని, అందువల్ల రజనీ రాజకీయాలకు అస్సలు పనికి రారని ఇప్పటికే విమర్శలు చేసిన స్వామి తాజాగా ఆయనపై కొత్త విమర్శలు సంధించారు. రజినీకాంత్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రావద్దని సూచించారు. ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వామి మాట్లాడుతూ, రాజకీయాల్లోకి రావాలన్న రజనీ ఆకాంక్షలకు ఆయన పాల్పడిన ఆర్థిక అవకతవకలు అడ్డుపడతాయన్నారు. ఆ వివరాలు బయటకు వస్తే రజనీ రాజకీయాల్లోకి కొనసాగలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు . వివరాలు బయట పెడితే  ఆయన ఇమేజ్ పూర్తిగా కుప్పకూలిపోతుందని చెప్పారు. 'మీరు రాజకీయాల్లోకి రాకండి' అని రజనీకాంత్‌కు స్వామి హితవు పలికారు. మరి  ఈ హితవును రజనీ కేర్ చేస్తారో లేదో వేచి చూడాలి. ఒకటైతే నిజం .....  చాలామంది ప్రముఖులను కోర్టు కీడ్చిన ఖ్యాతి స్వామిది. 
  • చైనాలో ఏకంగా 300 అడుగుల బోరుబావిలో అడుగున ఉన్న మూడేళ్ల బాలుడిని అక్కడి అధికారులు కేవలం రెండు గంటల్లోనే కాపాడి శభాష్  అనిపించుకున్నారు. ఈ ఘటన గత ఏడాది జరిగింది.  తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్, వీఫాంగ్ లో మూడేళ్ల బాలుడు స్నేహితులతో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అరగంటలో ఘటనాస్థలానికి రెండు ఫైరింజన్లు, 12 మంది సిబ్బంది చేరుకున్నారు. 11 ఇంచుల వెడల్పున్న బోరు బావిలో పడ్డ చిన్నారి 300 అడుగుల లోతులో ఉన్నాడని సెన్సార్ల ద్వారా గుర్తించారు. సెన్సార్లతో పాటు ఆక్సిజన్ పైపును, చిన్నారికి కట్టేందుకు ఇతరత్రా పైపులను సిబ‍్బంది బోరులోకి పంపారు. సెన్సార్ల సాయంతో వారి వద్ద ఉన్న మానిటర్లో బాలుడి కదలికలను గుర్తించారు. ఆపై బాబు ముక్కుకు ఆక్సిజన్ పైపు సెట్ చేశారు. అత్యాధునిక సెన్సార్ల సాయంతో బాబుకు ఓ పైపు చుట్టుకునేలా చేశారు. తమ వద్ద ఉన్న స్క్రీన్లో చూస్తూ చిన్నారికి కట్టిన పైపుతో పాటుగా ఆక్సిజన్, సెన్సార్ పైపులను పైకి లాగడం ప్రారంభించారు. ఇలా జాగ్రత్తగా రెండు గంటలపాటు ఎంతో శ్రమించిన సిబ్బంది బాలుడికి ఎలాంటి గాయాలు అవకుండానే బోరుబావి నుంచి రక్షించారు. బాలుడి తల్లిదండ్రులతో పాటు ఘటనా స్థలంలో ఉన్న అందరూ ఈ అద్బుతాన్ని వీక్షించారు.  మీరూ  వీడియో చూడండి.  అలాంటి అద్భుతమైన టెక్నాలజీని మనం కూడా అంది పుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 
  • ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహించే పూరి జగన్నాధ రధయాత్రకు సర్వం సిద్ధమైంది.  ఈయాత్రకై పూరినగరం సర్వంగాసుందరంగా ముస్తాబయింది. బలబద్ర, సుబధ్ర సమేతుడైన జగన్నాధుడు పూరి పురవీదుల్లో దర్శనమిచ్చే అద్భుత క్షణాలకు సమయం ఆసన్నమయింది. జీవితంలో ఒక్కసారైనా సరే పూరీలో జరిగే ఈ రథయాత్రలో పాల్గొని తరించాలని భక్తకోటి తహతహ లాడుతుంది. ప్రతి ఏటా లక్షలమంది స్వామివారిని దర్శించుకుని ముక్తిని పొందుతున్నారు. మధ్యయుగ కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూనే వుంది. ఈ ఉత్సవాలను కనులారా వీక్షించేందుకు  లక్షలాది మంది భక్తులు పూరి చేరుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసం శుక్ల పక్ష విదియనాడు మొదలై తొమ్మిదిరోజుల తర్వాత ఆషాడ శుక్ల దశమితో వేడుకలు ముగుస్తాయి. తొమ్మిది రోజుల పాటు వేడుకగా జరిగే ఈ ఉత్సవాల కోసం ఓడిశా ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. పూరి ఆలయం పేరు వినగానే చాలామందికి గుర్తుకొచ్చేది జగన్నాధ రధయాత్రే కాని ఆ ఉత్సవంతో పాటు అక్కడ ఎన్నో ఆసక్తికరమైన వేడుకలు జరుగుతుంటాయి. వాటన్నిటిలో ప్రత్యేకమైనది నవకళేబర. అంటే కొత్త దేహం అని అర్ధం. పూరి ఆలయంలో జగన్నాధ, బలబద్ర, సుబధ్ర విగ్రహాలు రాతి విగ్రహాల్లా శాశ్వతం కావు. కొయ్యతో తయారు చేస్తారు. . అధిక ఆషాడ మాసం వచ్చిన సంవత్సరంలో పూరి క్షేత్రంలో గర్భగుడిలోని దారు విగ్రహాలను తొలగించి వాటి స్థానే కొత్తగా వేప చెక్కతో సరికొత్త విగ్రహాలను ప్రతిష్టి స్తారు. ఈ వేడుకనే నవకళేబర గా వ్యవహరిస్తారు. ఇతర  దేవాలయాలలో మాదిరిగా స్వామి తన దేవేరులతో కొలువై ఉండక, సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రతో కొలువై ఉంటాడు. అందుకే ఈ ఆలయాన్ని సోదర ప్రేమకు ప్రతీకగా కీర్తి పొందింది.  జగన్నాథ ఆలయాన్ని 12వ శతాబ్ధంలో కళింగ పాలకుడైన అనంతవర్మ చోడ గంగాదేవ నిర్మించగా, ఆ తర్వాత కాలంలో అనంగ భీమదేవి పునర్నించాడని తెలుస్తోంది. ఆలయం మొత్తం కళింగ శైలిలో నిర్మితమైనది. పూరీ ఆలయం నాలుగు ల క్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబడింది. సుమారు 120 ఉపాలయాలు ఉన్నాయి. అమోఘమైన శిల్ప సంపదతో భారతదేశలోని అద్భుత కట్టడాలలో ఒకటి.  దేశంలోని ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటిగా భక్తులు విశ్వసించే ఈ ఆలయం వాస్తవ సంప్రదాయానికి ప్రతీక.  జగన్నాధుని రథోత్సవాన్ని తిలకించి తరించడానికి కుల, మత వర్గ విభేధాలను మరచి దేశవిదేశాల నుంచి అశేష జనవాహిని తరలి వస్తుంది. ఇసుక వేస్తే రాలనంత జనసంద్రంతో పూరీ నగరం కిటకిటలాడుతుంది. పూరీలో రథయాత్ర సందర్భంగా అంగరంగ వై భవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమినాడు జరిగే స్నాన పౌర్ణమి లేదా అభిషేకాల పౌర్ణమితో ఉత్సవాలు మొదలవుతాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు నేత్రోత్సవం, విదియనాడు రథయాత్ర జరుగుతాయి.  
  • ఎంతో మందిని తన తీర్పుతో  జైలుకి పంపిన ఆయనే  స్వయంగా  జైలులో అడుగుపెట్టాల్సివచ్చింది. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు . ఆయన ఎవరో కాదు  సుప్రీంకోర్టు తీర్పునే ధిక్కరించి అజ్ఞాతంలోనే రిటైరైన వివాదాస్పద కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి సి.సి.కర్ణన్. అజ్ఞాతంలో ఉన్న కర్ణన్  పోలీసులకు చిక్కి... కలకత్తా లోని ప్రెసిడెన్సీ జైలులో అడుగుపెట్టాల్సి వచ్చింది.  సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే అరెస్టు వారెంట్లు, శిక్షలు వేస్తూ తీర్పులిచ్చి, అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహానికి గురైన ఆయన కోల్‌కతా జైలులోకి అడుగుపెట్టినప్పుడు మాత్రం తీవ్ర  భావోద్వోగానికి లోనయ్యారు.    తమాయించుకోలేక కంట తడి పెట్టారు. ఊహించని ఈ పరిణామానికి అధికారులు కూడా  కరిగిపోయారు . చివరకు వారే ఆయనకు స్వాంతన పలికారు. మెల్లగా నచ్చ చెప్పారు.   ఇదే జైలులో నాటి స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్,  అరబిందో ఉన్నారని వివరిస్తూ  అప్పట్లో వారున్న జైలు గదులు చూపించారు. ఆ మహనీయుల పోరాట స్ఫూర్తిని కథలు కథలుగా కర్ణన్‌కు వినిపించారు. ఇవన్నీ విన్నాక కర్ణన్  మళ్ళీ మామూలు మనిషి అయ్యారు. ఆ తర్వాత అధికారులు  'కర్ణన్‌ను చూడగానే వార్తల్లో తాము చూసిన వ్యక్తిలా కనిపించలేదు. ఆయన కన్నీటిపర్వంతమయ్యారు. అది చూసి మేము ఆశ్చర్యపోయాం. తాను జైలులో ఉన్న విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అనిపించింది' అని వివరించారు.  జైలులోని కొందరు ఖైదీలు కూడా కర్ణన్‌ను చూసేందుకు పోటీపడ్డారు. 'తన తీర్పుల ద్వారా ఎందరో నేరస్థులను జైలుకు పంపించిన కర్ణన్‌ను చూసేందుకు ఖైదీలు పోటీపడ్డారు. బహుశా అదే కర్ణన్‌పై ఒత్తిడి పెంచి ఉద్వేగానికి దారితీసి ఉండొచ్చు' అని జైలు అధికారి ఒకరు అన్నారు . . దీంతో సుభాష్, అరబిందోలు ఇక్కడ గడిపిన విషయాన్ని వివరించడం ద్వారా కర్ణన్‌కు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు.  పాపం కర్ణన్ ... కొంచెం లౌక్యంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి తప్పేది. 
  • మహా శివుడికి   వీరభక్తుడు నందీశ్వరుడు. అందుకనే ఆ లయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు.  అంతే కాదు కైలాస లోక సేనలకు అధిపతిని చేసాడు. అందుకే  ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంటుంది. గురు, శిష్యుల మధ్యకు  ఎవరూ వెళ్లకూడదు. ముందుగా  నంది విగ్రహం పైన కొమ్ముల మధ్యనుంచి శివుడిని దర్శించుకోవాలి .శివుడు త్రినేత్రం తెరిస్తే సకలా చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్లకూడదని పెద్దలు చెబుతారు. దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే గుడిలోకి  వెళ్లాలి. దీన్నే శృంగదర్శనం అంటారు. దాదాపుగా అన్ని శివాలయాల్లో నంది విగ్రహాలు ఉంటాయి ...  అక్కడక్కడ  ఒకటి అరా చోట మాత్రమే  నంది  విగ్రహాలు కనబడవు . మహారాష్ట్రలోని నాశిక్ పట్టణంలోని పంచవటి అనే ప్రాంతంలో కొలువైన ఆలయం కపలేశ్వర్ మహదేవ్ ఆలయం. ఈ ఆలయంలో మాత్రం నందీశ్వరుడు కొలువై  కనిపించడు. కాగా పురాణ  కథల ప్రకారం  పూర్వం శిలాదుడనే ముని యజ్ఞం చేస్తుండగా, యజ్ఞశాలలో శివలింగం వద్ద అతనికొక శిశువు  కనిపించాడు . అతడు ఆ పసివాడికి నంది అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు. నందికి ఏడేళ్లు నిండాయి. కైలాసానికి నడిచివెళ్లి శివుణ్ని చూడాలన్న గట్టి కోరిక వాడికి కలిగింది. సరాసరి హిమాలయాలకు బయలుదేరాడు. ఎక్కడెక్కడో వెతికాడు కానీ, కైలాసం కనిపించలేదు. ఏం చెయ్యాలో తోచక శివుణ్ని గురించి తపస్సు చెయ్యసాగాడు. వాడి భక్తికి మెచ్చి పార్వతీ పరమేశ్వరులు వాడి ముందర ప్రత్యక్షమయ్యారు. 'నాకు చిరాయువుతోబాటు, ఎప్పుడూ కైలాసంలో ఉండేలా వరమివ్వండి' అని కోరాడు నంది. శివుడు తన జటాజూటంలో నుంచి పవిత్ర గంగా జలాన్ని రప్పించి నందిని గణాధిపతిగా అభిషేకించాడు. ఆ అభిషేక జలం నంది శిరస్సునుండి నేలమీదికి జారి, ఐదుపాయలుగా చీలి, త్రిశ్రోతి, జటోదక, స్వర్ణోదక, జంబూ, వృషద్వజ అనే నదులుగా ఏర్పడ్డాయి. నంది పార్వతీ పరమేశ్వరులవెంట కైలాసానికి వెళ్లాడు. అతనికి యుక్త వయస్సు వచ్చాక సుకీర్తి అనే కన్యను పెళ్లాడాడు. నందీశ్వరుడనే పేరుతో ప్రమథగణాలతో కొన్నిటికి నాయకుడుగా పదవిని చేపట్టి కైలాసంలోనే ఉండిపోయాడు. అది నంది కథ. 
  • ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా  విశాఖ ధర్నాకు హాజరు కాకపోవడం పై  పలు కథనాలు ప్రచారంలో కొచ్చాయి.  జగన్  రోజాకు వార్నింగ్ ఇచ్చారని కూడా చెప్పుకుంటున్నారు . అయితే ఆరోగ్యం బాగాలేకనే  రోజా ధర్నాకు రాలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా ఇటీవల రోజా  వివాదాస్పద వ్యాఖ్యల పై పార్టీ నేతలే  జగన్ కు ఫిర్యాదులు  చేశారట. రోజా వల్ల పార్టీ కి డామేజ్ జరుగుతోందని ... ఆమెను కంట్రోల్ లో పెట్టాలని చెప్పారట . ఈ క్రమం లో జగన్ రోజాని పిలిపించి మందలించినట్లు సమాచారం. అప్పటినుంచి రోజా కూడా కొంత దూకుడు తగ్గించింది.  రోజాని జగన్ మందలించడం ఇది మొదటి సారి కాకపోయినా ఈ సారి మాత్రం తీరు మార్చుకోక పోతే వేటు తప్పదని చెప్పినట్లు సమాచారం. మీడియాలో హైలెట్ అవడానికే రోజా అలా ప్రవర్తిస్తుంది అనే ఆరోపణలు కూడా లేకపోలేదు. కాగా కొన్ని సర్వే రిపోర్టులు కూడా రోజాకు వ్యతిరేకంగా రావడంతో  జగన్ గట్టిగా  ప్రశ్నించినట్లు సమాచారం. రోజా స్పీడ్ కి బ్రేకు వేయాలన్న జగన్ ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో  చూడాలి…ఈ నేపథ్యంలో రోజా పార్టీ మారుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. పవన్ పార్టీ లోకి వెళ్ళవచ్చు అని కూడా అంటున్నారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. 
  •  శిరీష ఆత్మహత్య కి సంబంధించి  పలు కథనాలు  వెలువడుతున్నాయి . ఆమెది  హత్య అనే  సందేహాలు కూడా కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు . రోజుకో కొత్త అంశము  వెలుగు చూస్తోంది . ఆమె మృతిచెంది 9 రోజులైనా పోలీసులు, ఆమె బంధువులకు ఇంకా అనుమానాలు మిగిలే ఉన్నాయి. బ్యుటీషియన్‌ శిరీషపై కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి అత్యాచారయత్నం చేశాడని ప్రకటించిన బంజారాహిల్స్‌ పోలీసులు.. ఆమె దుస్తులు, శరీరభాగాల నమూనాలను లైంగిక దాడి నిర్ధరణ పరీక్షలకు పంపించారు. జూన్‌ 12న కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఇంకా ఏదో జరిగిందన్న అనుమానాలు కూడా పోలీసులకు ఉన్నాయి. ఈ విషయమై  మరింత సమాచారం రాబట్టేందుకు  జైల్లో ఉన్న శ్రవణ్‌, రాజీవ్‌లను  కస్టడీకి అప్పగించాలంటూ న్యాయస్థానాన్నికోరారు. శిరీష, రాజీవ్‌ల మధ్య తేజస్విని కారణంగా వచ్చిన గొడవలు, మద్యం మత్తులో చోటుచేసుకున్న పరిణామాలపై కూపీ లాగనున్నారు. అసలు కుక్కనూర్పల్లి వెళ్ళారా ? లేదా అనే సందేహం కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు . రిసార్ట్ లోనే ఆమెను చంపేశారు అని ఆరోపిస్తున్నారు. ఈ కోణం లో కూడా విచారణ జరగవచ్చు.   శిరీషకు స్నేహితుడైన శ్రవణ్‌ ఆమెకు వ్యతిరేకంగా వ్యవహరించాడని బంజారాహిల్స్‌ పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఎస్సై ప్రభాకర్‌రెడ్డితో మాట్లాడిన కాల్స్‌ సంఖ్యను గుర్తించారు. ‘అన్నా.. శిరీష లీడింగ్‌ బ్యుటీషియన్‌. ఆమెకు ఫేవర్‌ చేస్తే మనకు భవిష్యత్‌లో బాగా పనికొస్తుంది. శిరీషను తీసుకొస్తా.. మీరు  చూడండి". అంటూ ఎస్సైతో శ్రవణ్ చెప్పారని అంటున్నారు. మరోవైపు రాజీవ్‌తో ‘శిరీషను వదిలించుకుందాం.. నీకు ఇష్టమేనా? ఇందుకు ఎస్సైకి కొంత ఫేవర్‌ చేయాలి’ అని శ్రవణ్‌ అన్నట్లు కూడా  చెబుతున్నారు.  తేజస్వినిని పెళ్లిచేసుకోవాలనుకున్న రాజీవ్‌.. శ్రవణ్‌ ఆడిన డబుల్‌గేమ్‌కు ఒప్పుకోవడంతో రాత్రివేళ హడావుడిగా వారిద్దరినీ కుకునూరుపల్లికి తీసుకెళ్లాడని అంటున్నారు.  శిరీష మాట్లాడినట్టు  ఆడియో సంభాషణలు బయట కొచ్చాయి. ఇక కుకునూరుపల్లి  స్టేషన్ పరిధిలో సి సి టీవీ ఫుటేజ్ మాయమైందనే కూడా ప్రచారం జరుగుతోంది.  ఇదిలా ఉంటే  శిరీషను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, వాస్తవా లు వెలుగు చూడాలంటే సీబీఐ విచారణ జరి పించాలని ఆమె బాబాయి శ్రీనివాసరావు, పిన్ని దుర్గారాణి డిమాండ్‌ చేశారు.  హంతకులను కాపాడేందుకే పోలీసులు శిరీష మీద అపనిందలు మోపుతున్నారని అంటున్నారు . రాజీవ్‌తో శిరీష నాలు గేళ్లుగా సహజీవనం చేసిందని అపనిందలు వేశారని ఆరోపించారు. శిరీష 2016, జూలై వరకు హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలో సొంతంగా బ్యూటీపార్లర్, కిరాణా దుకాణం నిర్వ హించిందన్నారు. 6 నెలలుగా ఆమె రాజీవ్‌కు చెందిన ఆర్‌జే ఫొటో స్టూడియోలో పనిచేస్తోం దన్నారు. రాజీవ్, శ్రావణ్, ఎస్‌ఐ ప్రభాకర రెడ్డి కలసి తమ బిడ్డను హింసించి, హత్యచేశారని, ఆ తర్వాత  ఎస్‌ఐ రివాల్వర్‌తో కాల్చుకుని మృతిచెందాడని  చెబుతున్నారు.  శిరీష ఆత్మహత్య చేసుకుంటే ఒంటిపై గాయాలు ఎందుకు ఉన్నాయన్నారు. ఆమెను ఎలాగైనాసరే లొంగదీసుకోవాలని ప్రయత్నిం చినా సాధ్యం కాకపోవడంతోనే హత్య చేశారన్నారు. శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె మేనమామ సూర్యారావు అన్నారు. ఈ కేసులో వాస్తవాలు వెలుగు చూడటానికి మరి కొద్దీ రోజులు పట్టవచ్చు.  
  • దానంతట అదే దూసుకుపోతున్న బైక్ ను చూడండి. ఇదేమైనా ఫోటోషాప్ ట్రిక్కా?లేక ఏ దెయ్యమైనా బైక్ ను నడుపుతోందా ? పారిస్ నగ రంలో  ఓ మెయిన్ రోడ్డు మీద ఈ ఘటన జరిగింది . మనిషి లేకుండా ఓ బైకు తానంతట అదే రోడ్డుపై వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజనులంతా  వింతగా చూస్తున్నారు. అసలు ఈ చోద్యానికి కారణం ఏమిటంటే ...................................................... ఆ బైకును నడిపిన వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. వేగంగా బైకును నడపడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో వ్యక్తి కిందపడిపోవడంతో.. గేర్ మారలేదు. యాక్సిలేటర్‌ కూడా చక్కగా పనిచేయడంతో.. బైకు తానంతట అదే రోడ్డుపై దూసుకెళ్లింది. బైక్ నడిపిన వ్యక్తి ని మాత్రం హాస్పిటల్ కు తరలించారు. ఇది అసలు కథ.  వీడియో చూడండి. 
  • మేఘాలయా రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌కు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరపుంజీ లో ప్రకృతి అందాలు  అందరిని ఆకట్టుకుంటాయి.  ఈ ప్రాంతం పర్యాటకులకు స్వర్గధామంగా... ఓ అందమైన అనుభూతిని కలిగిస్తుంది. దాదాపు ప్రతిరోజూ వర్షం కురిసే ఈ ప్రాంతం సముద్ర మట్టానికి  దాదాపు 1300 మీటర్ల ఎత్తులోఉంది.   ఈ ప్రాంతంలోనే దేశంలో అత్యధికంగా వర్షం పడే ప్రాంతంగా పేరు సంపాధించిన మాసిన్రామ్‌ ఉండడం విశేషం.  ఓ చిన్న పట్టణంగా విరాజిల్లుతున్న ఈ ప్రదేశం ప్రకృతి శోభను సొంతం చేసుకుంది.  ప్రకృతి రమణీయ దృశ్యాల అనుభూతులను మాటలతో వర్ణించలేము... ఒక్కసారైనా వెళ్లి అక్కడి సహజ సౌందర్యాన్ని స్వయంగా చూడాల్సిందే.  ఘాట్‌ రోడ్‌లో సాగే ఈ ప్రయాణంలో చుట్టూ ఉన్న  పర్వతాలు , వాటినుంచి జాలువారే జలపాతాలు  అబ్బురపరుస్తాయి.. చిరపుంజీ ప్రాంతం దాదాపుగా లైమ్‌ రాతి గుహలతో నిండి ఉంటుంది. ఇక్కడ ఉన్న విశేషాల్లో పురాతన ప్రెస్బిటేరియన్‌ చర్చి, రామకృష్ణ మిషన్‌ లాంటి వాటిని దర్శించవచ్చు. దగ్గర్లో ఉన్న మాసిన్రామ్‌ ప్రాంతంలో ఏర్పడిన సహజ శివలింగ రూపం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ శివలింగాన్ని స్థానికులు మావ్‌ జింబుయిన్‌గా వ్యవహరిస్తారు. చిరపుంజిని దర్శించాలనుకునే పర్యాటకులు షిల్లాంగ్‌ నుంచి పయనించాల్సి ఉంటుంది. షిల్లాంగ్‌ చుట్టు పక్కల ఉన్న ప్రదేశాల్లో కేవలం చిరపుంజి మాత్రమే పర్యాటక ప్రదేశం కాదు. షిల్లాంగ్‌ చుట్టు పక్కల అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. దాదాపు ప్రతిరోజు టూరిస్టులతో సందడిగా ఉండే షిల్లాంగ్‌లో మ్యాజియం ఆఫ్‌ ఎంటోమాలజీ అనే సీతాకోక చిలకల పార్క్‌ పర్యాటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ మేఘాలయలో కన్పించే అన్ని రకాల సీతాకోక చిలకలతో పాటు అంతరించిపోతున్న కొన్ని జాతుల సీతాకోక చిలకల్ని కూడా పరిరక్షిస్తుంటారు. 
  • అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ  ఎయిర్ ఇండియా పునరుజ్జీవానికి ప్రైవేటీకరణతో పాటు పలు అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై కేబినెట్‌ తుది నిర్ణయం తీసుకోనున్న క్రమంలో ఎయిరిండియాను దాని మాతృసంస్థ  టాటా గ్రూప్‌ సింగపూర్  ఎయిర్‌లైన్స్‌తో కలిసి కొనుగోలు చేసేందుకు ఆసక్తి  చూపుతోంది .  ఎయిరిండియా జాతీయం కాకముందు టాటాగ్రూప్‌లోనే  ఉండేది. దేశంలో పౌర విమానయాన పరిశ్రమకు నాంది పలికింది టాటాలే. వారు నిర్వహించిన సంస్థనే ప్రభుత్వం సొంతం చేసుకుని కొన్ని దశాబ్దాలపాటు నడిపి, తప్పుడు నిర్ణయాలతో నష్టాలపాలు చేసింది. ఇప్పుడు అమ్మకానికి పెట్టింది. కాగా  ఇప్పటికే టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ దీనిపై అనధికారికంగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 2007 నుంచి ఎయిరిండియా నష్టాల బాటలోనే నడుస్తోంది. ఇక గతంలోకి వెళితే  టాటా ఎయిర్‌లైన్స్‌ 1932లో ప్రారంభమైంది. లెజండరీ పారిశ్రామికవేత్త జెఆర్‌డి టాటా తొలి విమానాన్ని తానే స్వయంగా కరాచి, ముంబై మధ్య నడిపారు. 1946లో టాటా ఎయిర్‌లైన్స్‌ను ఎయిర్‌ ఇండియా పేరుతో పబ్లిక్‌ కంపెనీగా మార్చారు. జెఆర్‌డి కలల పుత్రికగా చెప్పే ఎయిర్‌ ఇండియా.. టాటాల నిర్వహణలో ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా పేరుతెచ్చుకుంది. నిర్వహణలో ప్రతి చిన్న అంశంలోనూ, ప్రయాణికులకు అందించే ఆహార పదార్ధాల నుంచి కర్టెన్ల ఎంపిక వరకు జెఆర్‌డి కలుగజేసుకునేవారని చెబుతారు.   1953లో ప్రభుత్వం దీనిని జాతీయం చేయడంతో జెఆర్‌డి కలలు కుప్పకూలాయి. కనీసం తమతో మాట కూడా చెప్పకుండా ప్రభుత్వం ఎయిర్‌ ఇండియాను జాతీయం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జెఆర్‌డి లేఖ కూడా రాశారు. నిర్ణయం కంటే కూడా నిర్ణయం తీసుకున్న పద్ధతి తనను బాధించిందని ఆయన నిరసన వ్యక్తం చేశారు.  సంస్థను జాతీయం చేసినా చైర్మన్‌గా మాత్రం జెఆర్‌డినే కొనసాగాలని నెహ్రూ నిర్ణయించడంతో 1977 వరకు ఆయనే చైర్మన్‌గా ఉన్నారు. 1977లో మొరార్జీ ప్రభుత్వం ఆయన్ను చైర్మన్‌ పదవి నుంచి తప్పించింది. అప్పటి  నుంచి టాటాలు ఆ సంస్థ గురించి పట్టించుకోవడం మానేశారు. ఇన్నేళ్లకి  అవకాశం రావడం తో సొంతం చేసుకునే యత్నాలకు శ్రీకారం చుట్టారు.