Latest News
బిజినెస్

కొనుగోలు చేసిన షేర్లు ట్రేడ్ అవుతున్నాయో ? లేదో ? గమనిస్తున్నారా??

1st Image


స్టాక్ మార్కెట్ లో మదుపు చేసే వారు ఎప్పటి కపుడు తమ వద్ద వున్న షేర్ల స్థితి గతులు గురించి తెలుసుకుంటుండాలి.
విశ్లేషకులు చెప్పారు కదా అని దీర్ఘ కాలిక వ్యూహం తో షేర్లను కొని వాటి సంగతి మర్చిపోకూడదు.
ఇప్పుడు లావాదేవీలు అన్నీ ఎలక్ట్రానిక్  రూపంలో జరుగుతున్నాయి కాబట్టి షేర్లను కొనుగోలు చేయగానే డీ మ్యాట్ ఖాతా కు మార్పించు కోవడం మంచిది. కొంత మంది ఇన్వెస్టర్లు డీమ్యాట్ ఖాతా ఉన్నప్పటికీ బ్రోకర్ దగ్గరే ఎక్కువకాలం షేర్లను ఉంచుతారు.
ఇది మంచి పద్ధతి కాదు.ఫీజు భారం ఉన్నప్పటికీ షేర్లు మన డీమ్యాట్ ఖాతాలో వుంటే షేర్లకు భద్రత వుంటుంది.షేర్ తాలుకు కంపెనీ డివిడెండ్ , బోనస్ ప్రకటిస్తే అవి మనకే అందుతాయి.కాబట్టి ఎక్కువ కాలం షేర్లను హోల్డ్ చేయాలనుకునే ఇన్వెస్టర్లు షేర్లను కొనగానే  డీమ్యాట్ ఖాతాలోకి మారిపించుకోవడం మంచిది. షేర్లు డీ మ్యాట్ లో ఉన్నంత మాత్రాన  ఇక నిర్భయం గా ఉండొచ్చుఅనుకోవడం కూడా పొరపాటే. షేర్లను డీమ్యాట్ లో వుంచి మరచి పోవడం కూడా ప్రమాదమే.
కొనుగోలు చేసిన షేర్లు ట్రేడ్ అవుతున్నాయా ?లేదా ఇన్వెస్టర్లు తరచుగా చెక్ చేసుకోవాలి. 
చాలా కంపెనీలు  మఖలో పుట్టి  పుబ్బలో మాయమవుతుంటాయి. స్టాక్ ఎక్స్చంజ్ నిబంధనలు  పాటించక డీ లిస్టు అయిపోతుంటాయి.ఒక కంపెనీ  డీ లిస్టు అయితే  దాని తాలుకు షేర్లు ట్రేడ్ అవవు.అంటే షేర్ తాలుకు కొటేషన్ కన్పించదు. 
కొటేషన్  కన్పించక పోతే  ఆ షేర్లను అమ్ముకోవడం కష్టమే.
అలాంటి పరిస్తితిలో షేర్లు మన వద్ద ఉండి కూడా ప్రయోజనం లేదు. 
కష్టార్జితం అంతా బూడిదలో పోసినట్టే అవుతుంది. ఇది ఇన్వెస్టర్లు ఊహించని రిస్క్ కాబట్టి జాగ్రత్త గా వుండాలి,ఎప్పటికపుడు కొను గోలు చేసిన షేర్ల తాలుకూ కొటేషన్లు కన్పిస్తున్నాయా ? లేదా ? చెక్ చేసు కోవాలి. 
ఈ సందర్భం గా డీ లిస్టు గురించి తెలుసుకుందాం.
డీ లిస్టు చేయడం అంటే  ఏ స్టాక్ ఎక్స్చేంజి  లో షేర్లు లిస్టు అయ్యాయో అక్కడ  షేర్ల అమ్మకాలు  కొనుగోళ్లను  అనుమతించిన  షేర్ల జాబితా నుంచి  తొలగించడం.  డీలిస్ట్ కీ కారణాలు ఎన్నో వుంటాయి. ముఖ్యం గా లిస్టింగ్ ఒప్పందం లోని నిబంధనలను షేర్ తాలుకు కంపెనీ అమలు చేయక పోవడం.నిర్ధారిత కాల వ్యవధి లో ఆర్ధిక ఫలితాలు ప్రకటించక పోవడం ,ప్రతి ఏటా రుసుములు చెల్లించ లేక పోవడం, ఇన్వెస్టర్ల సమస్యలు పట్టించుకోక పోవడం వంటి నిబంధనలు పాటించక పోతే  ఏ కంపెనీ అయినా డీ లిస్టు అయి పోతుంది. అయితే ముందుగా హెచ్చరిక చేస్తూ   నిబంధనలు అమలు  చేయమని  కంపెనీ లకు  నోటీసులు ఇస్తారు.
ఈ హెచ్చరికలను బేఖాతరు చేస్తే మటుకు డీ లిస్టు అవడం ఖాయం . 
సాధారణం గా పెద్ద  కంపెనీలకు ,మంచి పేరున్న కంపెనీలకు ఇలాంటి సమస్యలు వుండవు. 
ఇన్వెస్టర్ల సొమ్ము దోచుకొని  బోర్డు తిప్పేసే కంపెనీలకు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి.దాదాపు ఇప్పటికి 5 వేల కంపెనీలు పైగా డీ లిస్టు అయ్యాయి.
వేలమంది ఇన్వెస్టర్లు మునిగి పోయారు.  కాబట్టి షేర్లను కొనుగోలు చేసే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎవరు పడితే వారు చెప్పిన టిప్స్  ను  బట్టి షేర్లను కొనుగోలు చేయడం ప్రమాదం అని ఇన్వెస్టర్లు గుర్తెరగాలి.
కొనుగోలు చేసిన షేర్లు ట్రేడ్ అవుతున్నాయో లేదో  ఎప్పటి కప్పుడు చేసు కోవాలి.
డీ లిస్టు అయిన కంపెనీల షేర్లను  ప్రమోటర్లు కొనాలన్నా నిబంధన లేక పోలేదు అయితే అలా ముందు కొచ్చి ఇన్వెస్టర్ల నుంచి షేర్లను కొనుగోలు చేసిన  కంపెనీ ఒక్కటి కూడా వున్నట్టు దాఖలా లేదు.

-----   KNMURTHY  
Site Logo
  • మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల‌లో డ‌బ్బులు వేసుకోమ‌ని ఎవ‌రైనా అడుగుతున్నారా? అయితే జాగ్ర‌త్త‌గా ఉండండి. క‌నీసం రెండుల‌క్ష‌లు లేని ఖాతాల‌పై ప్ర‌స్తుతం ఆదాయ ప‌న్ను శాఖ క‌న్నేసింది. ఇలాంటి ఖాతాల‌లో అధిక‌మొత్తంలో న‌గ‌దు జ‌మ‌యితే ఇబ్బందులే. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఖాతాల‌ను చాలా సునిశితంగా ప‌రిశీలిస్తోంది. ఏ ఖాతాలోనైనా ఒకేసారి ఎక్కువ మొత్తం జ‌మ‌యితే వెంట‌నే ఆ విష‌యాన్ని ఆదాయ‌ప‌న్ను శాఖ దృష్టికి తీసుకెడుతుంది. అనుమానిత లావాదేవీల కింద ప‌రిగ‌ణించి వీటిపై ద‌ర్యాప్తు చేప‌డ‌తారు. న‌ల్ల ధ‌న వ్య‌తిరేక కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వం చేప‌ట్ట‌నున్న త‌దుప‌రి చ‌ర్య ఇదే. అనుమానిత ఖాతాల‌పై స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ‌కు అందించి, బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ దుర్వినియోగం కాకుండా చూడాల‌ని ఆర్బీఐ బ్యాంకుల‌కు సూచించింది. పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం నేప‌థ్యంలో న‌ల్ల ధ‌నానికి బ్యాంకుల‌కు స్థావ‌రం కాకూడ‌ద‌ని అభిప్రాయ‌ప‌డింది. తాజా అడుగు విచార‌ణ మార్గాల‌ను త‌గ్గించింది. రెండున్న‌ర ల‌క్ష‌లు అంత‌కు మించి జ‌మ‌చేసే ఖాతాల స‌మాచారం మాత్ర‌మే ఆర్థిక నిఘా విభాగానికి అందించాల‌నేది ఇంత‌వ‌ర‌కూ ఉన్న ఆదేశాలు. ఉన్న‌ట్టుండి పెద్ద మొత్తంలో ధ‌నం జ‌మ‌యిన ఖాతాల వివ‌రాలు ఇవ్వాల‌ని ప్ర‌త్యేకంగా కొన్ని బ్యాంకు శాఖ‌ల‌కు ఇంటెలిజెన్స్ రెగ్యులేట‌ర్ లేఖ‌లు రాశారు. వినియోగంలో లేని, బినామీ ఖాతాల‌లో పెద్ద మొత్తంలో న‌గ‌దు జ‌మ‌వుతుంద‌నేది కేంద్రం అనుమానం. 15 కోట్ల 40 ల‌క్ష‌ల కోట్ల మేర ఉన్న 500, వెయ్యి రూపాయ‌ల నోట్ల‌కు ఇంత‌వ‌ర‌కూ 80శాతం అంటే 12కోట్ల 44ల‌క్ష‌ల కోట్లు మాత్ర‌మే బ్యాంకుల‌లో జ‌మ‌య్యాయి.  vedeo courtesy.... nyusu digital media 
  • స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా 63 మంది డిఫాల్టర్లకు చెందిన మొండి బకాయిలను రైటాఫ్ చేసినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దాదాపు రూ.7,016 విలువ చేసే నిరర్థక ఆస్తులను ఇలా చేసినట్లు ఎస్‌బీఐ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది . ఈ మేరకు డైలీ న్యూస్ & అనాలిసిస్, మరికొన్ని వెబ్సైట్లు కథనాలు ప్రచురించాయి.  ఇదే నిజమైతే ప్రధాని మోడీ కొంత ఇరుకున పడతారు. కార్పొరేట్ల పట్ల మోడీ మెతకవైఖరి అవలంబిస్తున్నారని విపక్షాలు విమర్శించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మోడీ పై ఆ విమర్శలు లేకపోలేదు. ఇక వాటి జోరు పెరుగుతుంది. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు వ్యవహారం తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ రైటాఫ్ వ్యవహారం పెద్ద సంచలనమే అవుతుంది. పూర్తిగా మొండి బకాయిలను రద్దు చేశారా ? లేక ప్రత్యేకమైన అకౌంట్ కి తరలించారా ? బాకీలు వసూలు చేస్తారా ? చేయరా ? అనేది స్టేట్ బ్యాంక్ అధికారులు చెప్పాలి. ఇలా రైటాఫ్ చేసిన రుణాలలో... విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫియర్ ఎయిర్ లైన్స్ బకాయిలు రూ 1,201 కోట్లు కూడా ఉన్నాయి. మొండి బకాయిల జాబితాలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అగ్రస్థానంలో ఉంది.తర్వాత కేఎస్ ఆయిల్స్ 596 కోట్లు ,సూర్య ఫార్మా 526 కోట్లు , జీ ఈ టీ ఇంజనీరింగ్ 400 కోట్లు ,సాయి ఇన్ఫో 376 కోట్లు , వీఎంసీ సిస్టం 370 కోట్లు ,అగ్నీటే ఎడ్యుకేషన్ 315 కోట్లు శ్రీ గణేష్ జ్యూవెలరీ 313 కోట్లు అపెక్స్ యెంకాన్ 266 కోట్లు యురొ సిరమిక్స్ 266 కోట్లు మేరకు బ్యాంకుకు చెల్లించాల్సిఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి విక్టరీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రూ.93.91 కోట్లు, విక్టరీ ట్రాన్స్ అండ్ స్విచ్ గేర్స్ లిమిటెడ్ రూ. 66.57 కోట్లు, కె ఆర్ ఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు రూ. 86.73 కోట్లు ఘన్ శ్యాం దాస్ జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్ రూ.61.72 కోట్లు మేరకు బకాయిలు చెల్లించాలి. కాగా తెలంగాణా నుంచి తోటమ్ ఇన్ఫ్రా లిమిటెడ్ రూ. 93.68కోట్లు, ఎస్ఎస్‌బీజీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ రూ.65.24 కోట్లు చెల్లించాల్సిఉంది. వీటితో ఇతర రాష్ట్రాలకు చెందిన మరికొన్ని కంపెనీలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.  ఈ మొండి బకాయిలు భారీగా ఉండటంతో వీటిని వేరే ఖాతాలోకి మళ్లించి... తన బ్యాలెన్సు షీటులో మొండి బకాయిల భారం లేకుండా స్టేట్ బ్యాంక్ చూసుకుంది అంటున్నారు. ఇందుకోసం రిజర్వు బ్యాంకు అనుమతించిన 'అడ్వాన్స్‌ అండర్ కలెక్షన్ అకౌంట్స్ (ఆకా)' అనే పద్ధతిని అవలంబించినట్టు చెబుతున్నారు. ఈ పద్ధతి ప్రకారం మొండి బకాయిలు లేదా నిరర్ధక ఆస్తులను ఒక ప్రత్యేకమైన అకౌంటులోకి బదిలీ చేస్తారు. తద్వారా ముందుగా అవి బ్యాంకు బ్యాలెన్సు షీటులో కనిపించవు. దీనివల్ల బ్యాంకు పనితీరు మెరుగుపడినట్లు కనపడుతుంది. కానీ, అంతమాత్రాన వాటిని పూర్తిగా మాఫీ చేసినట్లు కాదు. వన్‌టైమ్ సెటిల్మెంట్లు తప్ప మిగిలిన బకాయిలన్నింటినీ సాంకేతికంగా రైటాఫ్ చేసినట్లు చూపించినా, వాటిని 'ఆకా'లో యథాతథంగా ఉంచుతారు. అంటే, చిట్టచివరి రూపాయి వసూలయ్యే వరకు వాటి రికవరీ విధానం కొనసాగుతూనే ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఎస్ బీ ఐ వివరణ ఇస్తే గానీ ఏమి జరిగిందో తెలియదు.
  • India Shining… ఓ పుష్కర కాలం వెనక్కి వెళ్లి చూస్తే.. ఈ నినాదం మారుమోగిపోయిన రోజులు గుర్తుకొస్తాయి. అవి.. వాజపేయి ప్రధానమంత్రిగా వున్న రోజులు. శ్రీనగర్ లాల్ చౌక్ లో వాజపేయి చరిత్రాత్మక, ఆవేశపూరిత ప్రసంగాన్ని ఇంకా మర్చిపోకుండా ఆయనను దేశప్రజలు అభిమానిస్తున్న రోజులు. ఏ రామమందిర నిర్మాణానికైతే ఎల్.కె.అద్వానీ భారతదేశాన్ని నిప్పుల కొలిమిలోకి నెట్టారో.. ఆ మందిర నిర్మాణ ఫైలును మడతపెట్టి చెత్తబుట్టలో పారేసిన రోజులు. ఇండియా ఒక మార్పుకోసం ఎదురుచూస్తున్న రోజులు. ఇండియన్లు నూతన అవకాశాలకోసం ఆబగా ఎదురుచూస్తున్న రోజులు. మధ్యతరగతి ఆదాయాలు అమాంతం పెరగడంతో.. ఇండియన్లు కసిగా వున్న రోజులు. ప్రభుత్వ రంగ సంస్థలను కసాయి వాళ్లలాగా కారుచౌకగా విక్రయిస్తున్న రోజులు. ఆ కసాయి పనికోసం బుద్ధిజీవిగా పేరుపడ్డ అరుణ్ శౌరీని కేబినెట్ మంత్రిగా చేసిన రోజులవి. హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం సంస్థలను కూడా అయినకాడికి అమ్మడానికి బరితెగించిన రోజులవి. ఆ రోజు.. భారతదేశాన్ని దేశభక్తులు కాపాడుకున్నారు. పార్లమెంటు కాపాడింది. సుప్రీంకోర్టు కాపాడింది. ఎవరికన్నా బాగా గుర్తుందా? ఆ ఇండియా షైనింగ్ రోజుల్లో బ్యాంకుల గడపతొక్కిన ప్రతి మధ్యతరగతి జీవికి తప్పనిసరిగా గుర్తుండే వుంటుంది. హౌసింగ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఫుట్ పాత్ ల మీద క్రెడిట్ కార్డు వితరణలు జోరుగా సాగుతున్న రోజులు. బ్యాంకుల దగ్గర కుప్పలు తెప్పలుగా నిధులు వున్న రోజులు. ఫ్లోటింగ్ రుణాల కాన్సెప్ట్ వచ్చిన రోజులు. అప్పట్లో హౌసింగ్ లోన్ కోసం బ్యాంకుల గడప తొక్కిన వాళ్ల చెవిలో సిబ్బంది జోరీగలాగా ఒకటే చెప్పేవారు. ఫ్లోటింగ్ రేట్ ఎంచుకోండి అని. వద్దులెండి ఫిక్స్డ్ రేట్ వడ్డీ రుణానికే వెళతాను అని కస్టమర్లు అన్నా మేనేజర్లు ఊరుకునేవారు కాదు. పైగా అప్పట్లో ఫ్లోటింగ్ రేట్ వడ్డీకన్నా ఫిక్స్డ్ రేట్ వడ్డీ ఎక్కువ వుండేది. ఉదాహరణకు ఫ్లోటింగ్ రేట్ వడ్డీ 7శాతం వుంటే, ఫిక్స్డ్ రేట్ వడ్డీ 9శాతం వుండేది. బ్యాంకింగ్ సిబ్బందిది ఒకటే రొదగా వుండేది.. ఇండియా షైనింగ్ అండీ.. వడ్డీ రేట్లు ఇంకా దారుణంగా, మరీ దారుణంగా పడిపోబోతున్నాయి. జపాన్ లో లాగా, అమెరికాలో లాగా మూడున్నర, నాలుగు శాతానికి తగ్గిపోయే సుదినం మరెంతో దూరంలో లేదు అని ఊదరగొట్టేవారు. నిజమే కామోసు అని కస్టమర్లు అందరూ ఫ్లోటింగ్ వడ్డీ రేట్లనే ఎంచుకున్నారు. అంతగా పడిపోయే ఆస్కారం వున్న వడ్డీ స్కీమును ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు? ఇచ్చిన అప్పుపై వడ్డీ రేటు పడిపోతే బ్యాంకులకే నష్టం కదా! నాలుగు శాతానికి పడిపోయే ఫ్లోటింగ్ వడ్డీకంటే.. 9శాతం వుండే ఫిక్స్డ్ వడ్డీ రేటువల్లనే బ్యాంకులకు, సిబ్బందికి లాభం కదా? అని పెద్దగా ఎవరూ ఆలోచించలేదు. అదొక మాయా ప్రచారం. అందరూ ఆ ఊబిలోకి బాగానే చిక్కుకుపోయారు. నిజానికి ఆ తర్వాత వడ్డీ రేట్లు తగ్గలేదు సరికదా.. తీసుకున్నప్పటికంటే చాలా ఎక్కువ పెరిగిపోయాయి. దాంతో మిడిల్ క్లాస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఘోరంగా దెబ్బతిన్నది. ముఖ్యంగా 2009 ఆర్థిక సంక్షోభం తర్వాత దీనాతిదీనమైంది. బ్యాంకులకంటే కాబూలీవాలాలు నయం. వీళ్లను ఎప్పటికీ విడిచిపెట్టవు. అనేక చట్టాలు తెచ్చుకున్నాయి.. వీళ్లను జీవిత పర్యంతం వేధించడానికి. అందులో సిబిల్  (credit information bureau of india ltd) ఒకటి  అన్నట్టు.... ప్రస్తుతం నడుస్తున్న తమాషా గురించి ఒక మాట. పెద్ద నోట్ల రద్దు వల్ల కొంత నల్లధనం కూడా బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా చెలామణిలోకి వస్తుంది. నల్లధనం అని పేరు పెట్టలేకపోయినా.. లెక్కల్లో చూపని మరికొంత నగదు కూడా చెలామణిలోకి వస్తుంది. మొత్తం 20లక్షల కోట్లు వుందని, అందులో 15లక్షల కోట్లు చెలామణిలోకి వస్తుందని కొన్ని కాకి లెక్కలు వున్నాయి. కానీ నా అంచనా ప్రకారం 3నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకింగ్ వ్యవస్థలోకి కొత్తగా చెలామణిలోకి వస్తుంది. ఇది నిజంగా బ్యాంకులకు పండగే. అకౌంట్లను క్లీన్ చేసుకుంటాయి. లెక్కలు సరిచూసుకోవడానికి వేల సంఖ్యలో సిబ్బందిని నియామకం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తే. ఐటీ... ఆ ఐటీ కాదండీ.. ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ కీ చాలా సిబ్బంది అవసరం అవుతుంది. ఏమైనా.. కాయ్ రాజా కాయ్... బ్యాంక్ స్టాఫ్ మళ్లీ ఫుట్ పాత్ ల మీద మనను పలకరించి... రావుగారూ.. ఓ లక్ష అప్పు ఇస్తాం తీసుకోకూడదూ అని... మనను దేబిరించి, ఫుట్ పాత్ మీదనే మన సంతకాలు తీసుకుని..... మరీ అంత కాకపోయినా అలాంటి India Shining రోజులకు అవకాశం వుందని నా ఎడమకన్ను అదురుతూ చెబుతోంది.   ----- VASIREDDY  VENUGOPAL 
  • "Sabse sasta din"-Yes,Elephant Can Dance-It Happened In India లోకేష్ చెప్పినట్లు పాలు,కూరగాయలు అమ్మి కొట్లు సంపాదించారో లేదో కాని,పాలు కూరగాయలు అమ్మే Heritage groupను అమ్మి 295 కొట్లు సంపాదించబోతున్నారు. ఇప్పుడు అనేక shopping malls,branded& designer wears దొరుకుతున్నాయి కాని 90ల మొదటి వరకు branded dressల కోసం మొహమెత్తే పరిస్థితి, డబ్బువున్న మార్కెట్లో availability తక్కువ. కుమార్ షర్ట్స్ అని 100 రూపాయలకు 3 ఇచ్చేవారు...వాళ్ళకు outlets వుండేవి కావు,ఊర్లలో groundsలో టెంట్లు వేసి డిసెంబర్ చివరి వారంలో అమ్మేవాళ్ళు. గంటా,రెండు గంటలకే మొత్తం సరుకు అమ్ముడుపోయి లాఠిచార్జి కూడ జరిగిన సంధర్భాలు ఎన్నో! చిరంజీవి గ్యాంగ్ లీడర్ షర్ట్స్ 35 రూపాయల ధరకు వివరీతంగా అమ్ముడుపోయాయి ,ఆ షర్ట్స్ brand ఏమిటో తెలియదు. 1991 ఆర్ధిక సంస్కరణల కన్నా ముందు నుంచే చాలా కుటుంబాలు Wholesale వ్యపారాలు చేశాయి.చెన్నైతో పరిచయం లేనివారికి కూడ "శరవణా స్టోర్స్" గురించి తెలుస్తుంది.శరవణా భవన్ హోటల్ వీరిది కాదు. చెన్నైతో పరిచయం వున్నవారికి ఇసుకవేస్తే రాలనంత జనం ప్రతిరోజు తిరిగే "రంగనాథన్ స్ట్రీట్" గురించి తెలుస్తుంది.  రంగనాథన్ స్ట్రీట్లో IT Jobs కోసం చెన్నైలో దిగే నిరుద్యోగులకు కల్పతరువులాంటి PVT Mansion,కొన్ని వేల కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తున్న "శరవణా స్టోర్స్" వున్నాయి.ఈ Streetలో 24/7 activity వుంటుంది. 1961లో బొంబాయిలో ఒక మధ్యస్థాయి వ్యాపార కుటుంబంలో పుట్టి,ఒక మోస్తరుగా చదువుకున్న "కిషోర్ బియాని" అనే యువకుడు సాంప్రదాయ వ్యాపార పద్దతిలోకాకుండ కొత్తగా వ్యాపారం చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేశాడు.30 years నిండక ముందే సొంతంగా సొంతంగా supply, WBB-(White Brown and Blue) పేరుతో Stonewashed fabric brandను ప్రారంభించారు.1987లో అంటే 26 సంవత్సరాల వయస్సులొ "Manz Wear Private Limited" పేరుతో garment manufacturing companyని ప్రారంభించాడు,ఆ "Manz Wear" తరువాత Pantaloons అయ్యింది. ఇదంత కిషోర్ బియాని తొలిదశ వ్యాపారం ,ఇదేమి బియానికి పెద్ద గుర్తింపును కాని ఆదాయాన్ని కాని అందించలేదు.బియాని అసలు వ్యాపార జీవితం 2001లొ Big Bazaarతో మొదలైంది.Big Bazaar hyper marketకూడ తొలి 3,4 సంవత్సరాలలొ పెద్దగా successకాలేదు. కిషోర్ బియానికి తనదైన సొంత business Philosophy వుంది. బియాని మాటల్లొ "Retailing is not just about selling products, it’s about selling an idea"---ఇలాంటి ఆలోచనా విధానమే 2006 జనవరి 26న కిశొర్ బియాని & భారతదేశ retail రంగం దశ & దిశను మార్చింది. "సబ్సే సస్త దిన్" అన్న ప్రచారంతో 25-Jan-2006 రాత్రి నుంచి పుట్టలు పగిలిన చీమలలాగ customers Big Bazaar outlets ముందు బారులు తీరారు.దించినవి దించినట్లుగానే లారీల కొద్ది సమానులు అమ్ముడుపోయాయి. బెంగుళూరులోని కోరమంగళలో customersను అదుపుచెయ్యటానికి లాఠిచార్జి చేశారు.మొత్తంగా ఒక్క రోజులో 43 Big Bazaar outletsలో 125 కోట్ల అమ్మకాలు జరిగాయి.ఇన్ని అమ్మకాలు అంతకు ముందు చరిత్ర ఎరగదు. అప్పటి నుంచి వరుసగా 6,7 సంవత్సరాలపాటు "Sambse sata 3 din" పేరుతో జనవరి 24,25,26 మూడురోజుల పాటు జరిపిన అమ్మకాలు Big Bazaarను తిరుగులేని సంస్థగా నిలబెట్టాయి. ఎందుకో కాని Indian Media Big Bazaar "Sabse sata din" అమ్మకాలను అమెరికాలో నవంబర్ చివరి శుక్రవారం అమ్మకాలు Black Fridayతో పోల్చలేదు. కిశోర్ బియాని Walmart conceptను copyకొట్టి Big Bazaar పెట్టారని ఆరోపణలున్నాయి.కాని బియాని స్వయంగా శరవణా Stores inspirationతోనే Big Bazaarను ఏర్పాటు చేశానని చెప్పారు. Big Bazaar మాతృ సంస్థ Future Groupలొ ఇప్పుడు పదుల కొద్ది సంస్థలు వున్నాయి.రీటైల్ రంగంలోనే కాకుండ Financial Servicesలొ Capital Holdings,Life & General Insurance, Venturesకూడ big players.మొత్తంగా Future Groupsలొ దాదాపు 40,000 మంది employees వున్నారు. TATA Group తరువాత ఎక్కువ Companies వున్నది బహుశా Future Groupలోనే కావొచ్చు. కిశోర్ బియాని మీదనో మరో corporate group మీదనే నాకు admirationలేదు.  కిశోర్ బియాని అన్నట్లు "Most businessmen make the mistake of creating an environment only where they win,they see life and business as a competitive arena not a cooperative one." ---may be a good cooperative system between rural,small scale industries and corporate companies could have been built a better system. 2006-2008 మధ్య Bangalore WIPROలొ పనిచేసే రోజుల్లో Team Leadగా Team Members birthdayలకు ఒక T-Shirts+ఒక book present చేసేవాళ్ళం.అలా giftగా ఇచ్చిన పుస్తకాలలో కిశోర్ బియాని రాసిన It happened in India,Go Kiss the World,The Go-Giver ముఖ్యమైనవి. నిన్న Future Group Heritageని take over చేస్తుందన్న వార్త చూసి బియాని success story గుర్తొచ్ఛి  ఇది  రాశాను.ఇప్పటికి వున్న వార్తల ప్రకారం Future Retail Groupలో Heritage groupకు 295 కోట్ల విలువైన 3.5% వాట ఇస్తుందంట.గత ఏడు దాదాపు ఇదే సమయంలొ Future Group రాందేవ్ "పతాంజలి" సంస్థతో ఒక ఒప్పందం చేసుకున్నారు.మొత్తంగా Future Groupబాగా విస్తరిస్తుంది... కిశోర్ బియాని రాసిన It Happened In India కన్నా నేను Subroto Bagchi రాసిన "Go Kiss The World" bookను recommend చేస్తాను.Subroto Bagchi WIPROకు పునాది వేసినవారిలో ముఖ్యులు.WIPRO తరుపున USAలొ Office open చేసిన వ్యక్తి.తరువాత WIPROను వదిలి Mind Treeని ఇతరులతో కలిసి ఏర్పాటు చేశారు. The best of Kishore Biyani "An organisation needs a Creator, preserver and destroyer to keep pace with the changing reality."    ----------  SIVA RACHARLA
  • అచ్చం తండ్రి పోలికలో కనిపించే ఈ అమ్మాయే అంబానీ వ్యాపార సామ్రాజ్య వారసురాలు. దేశంలో అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ. ముకేశ్ అంబానీ తన కూతురుకి,,కుమారుడికి వ్యాపార నిర్వహణలో శిక్షణ ఇస్తున్నారు. ఇషా కూడా తండ్రి మాదిరిగానే సూక్ష్మగ్రాహి. అల్లుకు పోయే తత్వం గల పిల్ల.  రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంపై తనదైన ముద్ర వేసేందుకు మెల్ల మెల్లగా ఆమె సిద్ధమవుతున్నారు.  ఇషా వయసు 24  ఏళ్లు. ఇషా అమెరికాలోని యాలె యూనివర్సిటీలో సైకాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్ ప్రధాన సబ్జెక్టులుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అలాగే  అమెరికాలోని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సేలో వ్యాపారంలో మెళకువలు నేర్చుకునే కోర్స్ చేశారు . వినియోగదారులతో ప్రత్య క్ష సంబంధాలుండే వ్యాపారాలన్నింటినీ ఆమెకు అప్పగించాలని ముఖేష్  ఆకాంక్ష. ఇప్పటికే  రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ , రిలయన్స్ వెంచర్స్ లో ఇషా డైరెక్టర్ గా చేస్తున్నారు. ఆసియా లో పవర్ ఫుల్ బిజినెస్ అప్ కమింగ్ వుమన్ గా  ఇషా గుర్తించబడ్డారు.  ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుల కుటుంబ వారసురాలిగా ఫోర్బ్స్ అమెను గుర్తించింది. అన్నట్టు ఇషా, ఆకాశ్‌లు కవల పిల్లలు.ఆకాశ్ కూడా  జియో లో  డైరెక్టర్ గా చేస్తున్నారు . వీరి తమ్ముడు అనంత్ అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. పియానో వాయించడంలో ఇషా నిష్ణాతురాలు. 16 ఏళ్ల వయసులోనే ఇషా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు.  ఇక  మరో విషయం ఏమిటంటే .....  ఇన్ని ప్రత్యేకతలున్న ఇషా అంబానీ వివాహ ముహూర్తం ఖరారైనట్లు  మీడియా లో కొన్ని రోజుల క్రితం వార్తలు వెల్లువెత్తాయి . నవంబర్‌లో ఇషా అంబానీ పెండ్లీ అంగరంగవైభవంగా జరగ బోతున్నట్టు  మీడియా ఊదర గొట్టింది.  ఈ వేడుకలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇవ్వనున్నట్లు కూడా  రాసేసాయి. అయితే అవన్నీ పుకార్లే అని ముఖేష్ దగ్గరి బంధువు ఒకరు ప్రకటించారు.  అయితే ముకేశ్ ఇంట పెళ్లి మాత్రం జరగబోతోంది  అది ఎవరిది అంటే ఆయన మేనకోడలది  అట.