Latest News
బిజినెస్

భిన్నంగా ఆలోచిస్తేనే ...బిజినెస్ లో లాభాలు !

1st Image

"Sabse sasta din"-Yes,Elephant Can Dance-It Happened In India
లోకేష్ చెప్పినట్లు పాలు,కూరగాయలు అమ్మి కొట్లు సంపాదించారో లేదో కాని,పాలు కూరగాయలు అమ్మే Heritage groupను అమ్మి 295 కొట్లు సంపాదించబోతున్నారు.
ఇప్పుడు అనేక shopping malls,branded& designer wears దొరుకుతున్నాయి కాని 90ల మొదటి వరకు branded dressల కోసం మొహమెత్తే పరిస్థితి, డబ్బువున్న మార్కెట్లో availability తక్కువ.
కుమార్ షర్ట్స్ అని 100 రూపాయలకు 3 ఇచ్చేవారు...వాళ్ళకు outlets వుండేవి కావు,ఊర్లలో groundsలో టెంట్లు వేసి డిసెంబర్ చివరి వారంలో అమ్మేవాళ్ళు. గంటా,రెండు గంటలకే మొత్తం సరుకు అమ్ముడుపోయి లాఠిచార్జి కూడ జరిగిన సంధర్భాలు ఎన్నో!
చిరంజీవి గ్యాంగ్ లీడర్ షర్ట్స్ 35 రూపాయల ధరకు వివరీతంగా అమ్ముడుపోయాయి ,ఆ షర్ట్స్ brand ఏమిటో తెలియదు.
1991 ఆర్ధిక సంస్కరణల కన్నా ముందు నుంచే చాలా కుటుంబాలు Wholesale వ్యపారాలు చేశాయి.చెన్నైతో పరిచయం లేనివారికి కూడ "శరవణా స్టోర్స్" గురించి తెలుస్తుంది.శరవణా భవన్ హోటల్ వీరిది కాదు.
చెన్నైతో పరిచయం వున్నవారికి ఇసుకవేస్తే రాలనంత జనం ప్రతిరోజు తిరిగే "రంగనాథన్ స్ట్రీట్" గురించి తెలుస్తుంది. 
రంగనాథన్ స్ట్రీట్లో IT Jobs కోసం చెన్నైలో దిగే నిరుద్యోగులకు కల్పతరువులాంటి PVT Mansion,కొన్ని వేల కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తున్న "శరవణా స్టోర్స్" వున్నాయి.ఈ Streetలో 24/7 activity వుంటుంది.
1961లో బొంబాయిలో ఒక మధ్యస్థాయి వ్యాపార కుటుంబంలో పుట్టి,ఒక మోస్తరుగా చదువుకున్న "కిషోర్ బియాని" అనే యువకుడు సాంప్రదాయ వ్యాపార పద్దతిలోకాకుండ కొత్తగా వ్యాపారం చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేశాడు.30 years నిండక ముందే సొంతంగా సొంతంగా supply, WBB-(White Brown and Blue) పేరుతో Stonewashed fabric brandను ప్రారంభించారు.1987లో అంటే 26 సంవత్సరాల వయస్సులొ "Manz Wear Private Limited" పేరుతో garment manufacturing companyని ప్రారంభించాడు,ఆ "Manz Wear" తరువాత Pantaloons అయ్యింది.
ఇదంత కిషోర్ బియాని తొలిదశ వ్యాపారం ,ఇదేమి బియానికి పెద్ద గుర్తింపును కాని ఆదాయాన్ని కాని అందించలేదు.బియాని అసలు వ్యాపార జీవితం 2001లొ Big Bazaarతో మొదలైంది.Big Bazaar hyper marketకూడ తొలి 3,4 సంవత్సరాలలొ పెద్దగా successకాలేదు.
కిషోర్ బియానికి తనదైన సొంత business Philosophy వుంది. బియాని మాటల్లొ "Retailing is not just about selling products, it’s about selling an idea"---ఇలాంటి ఆలోచనా విధానమే 2006 జనవరి 26న కిశొర్ బియాని & భారతదేశ retail రంగం దశ & దిశను మార్చింది.
"సబ్సే సస్త దిన్" అన్న ప్రచారంతో 25-Jan-2006 రాత్రి నుంచి పుట్టలు పగిలిన చీమలలాగ customers Big Bazaar outlets ముందు బారులు తీరారు.దించినవి దించినట్లుగానే లారీల కొద్ది సమానులు అమ్ముడుపోయాయి. బెంగుళూరులోని కోరమంగళలో customersను అదుపుచెయ్యటానికి లాఠిచార్జి చేశారు.మొత్తంగా ఒక్క రోజులో 43 Big Bazaar outletsలో 125 కోట్ల అమ్మకాలు జరిగాయి.ఇన్ని అమ్మకాలు అంతకు ముందు చరిత్ర ఎరగదు. అప్పటి నుంచి వరుసగా 6,7 సంవత్సరాలపాటు "Sambse sata 3 din" పేరుతో జనవరి 24,25,26 మూడురోజుల పాటు జరిపిన అమ్మకాలు Big Bazaarను తిరుగులేని సంస్థగా నిలబెట్టాయి.
ఎందుకో కాని Indian Media Big Bazaar "Sabse sata din" అమ్మకాలను అమెరికాలో నవంబర్ చివరి శుక్రవారం అమ్మకాలు Black Fridayతో పోల్చలేదు.
కిశోర్ బియాని Walmart conceptను copyకొట్టి Big Bazaar పెట్టారని ఆరోపణలున్నాయి.కాని బియాని స్వయంగా శరవణా Stores inspirationతోనే Big Bazaarను ఏర్పాటు చేశానని చెప్పారు.
Big Bazaar మాతృ సంస్థ Future Groupలొ ఇప్పుడు పదుల కొద్ది సంస్థలు వున్నాయి.రీటైల్ రంగంలోనే కాకుండ Financial Servicesలొ Capital Holdings,Life & General Insurance, Venturesకూడ big players.మొత్తంగా Future Groupsలొ దాదాపు 40,000 మంది employees వున్నారు.
TATA Group తరువాత ఎక్కువ Companies వున్నది బహుశా Future Groupలోనే కావొచ్చు.
కిశోర్ బియాని మీదనో మరో corporate group మీదనే నాకు admirationలేదు. 
కిశోర్ బియాని అన్నట్లు "Most businessmen make the mistake of creating an environment only where they win,they see life and business as a competitive arena not a cooperative one." ---may be a good cooperative system between rural,small scale industries and corporate companies could have been built a better system.
2006-2008 మధ్య Bangalore WIPROలొ పనిచేసే రోజుల్లో Team Leadగా Team Members birthdayలకు ఒక T-Shirts+ఒక book present చేసేవాళ్ళం.అలా giftగా ఇచ్చిన పుస్తకాలలో కిశోర్ బియాని రాసిన It happened in India,Go Kiss the World,The Go-Giver ముఖ్యమైనవి.
నిన్న Future Group Heritageని take over చేస్తుందన్న వార్త చూసి బియాని success story గుర్తొచ్ఛి  ఇది  రాశాను.ఇప్పటికి వున్న వార్తల ప్రకారం Future Retail Groupలో Heritage groupకు 295 కోట్ల విలువైన 3.5% వాట ఇస్తుందంట.గత ఏడు దాదాపు ఇదే సమయంలొ Future Group రాందేవ్ "పతాంజలి" సంస్థతో ఒక ఒప్పందం చేసుకున్నారు.మొత్తంగా Future Groupబాగా విస్తరిస్తుంది...
కిశోర్ బియాని రాసిన It Happened In India కన్నా నేను Subroto Bagchi రాసిన "Go Kiss The World" bookను recommend చేస్తాను.Subroto Bagchi WIPROకు పునాది వేసినవారిలో ముఖ్యులు.WIPRO తరుపున USAలొ Office open చేసిన వ్యక్తి.తరువాత WIPROను వదిలి Mind Treeని ఇతరులతో కలిసి ఏర్పాటు చేశారు.
The best of Kishore Biyani "An organisation needs a Creator, preserver and destroyer to keep pace with the changing reality."
 
 ----------  SIVA RACHARLA
Site Logo
  • (Vasireddy Venugopal) ............   బ్యాంకులు కొత్త బ్రాంచీ తెరవాలన్నా, కొత్త ఏటీఎం పెట్టాలన్నా రిజర్వ్ బ్యాంక్ అనుమతి అవసరం. వాటిని ఏ ప్రాంతంలో నెలకొల్పదలుచుకున్నదీ తెలియజేసి అనుమతి పొందవలసి వుంటుంది. అయితే Onsite ATM పెట్టుకోవడానికి ఆర్.బి.ఐ అనుమతి అవసరం లేదు. అంటే.. బ్యాంక్ బ్రాంచ్ ఆవరణలో పెట్టుకునే ఏటీఎంకి ఆర్.బి.ఐ అనుమతి అవసరం లేదు. ఆ ఏటీఎంను బ్రాంచిలో అంతర్భాగంగా పరిగణిస్తారు. ఆ ఏటీఎంను ఆ బ్రాంచి స్వయంగా నిర్వహించుకునే అవకాశం వుంది. ఏటీఎంలో ఎప్పుడు డబ్బులు ఖాళీ అయినా.. బ్రాంచి సిబ్బందే తమ స్ట్రాంగ్ రూమ్ నుంచి నగదు తీసుకువచ్చి ఏటీఎంలో నింపి, ఖాతాదారులకు అసౌకర్యం కలగకుండా చూసే అవకాశం వుంది. అయితే మార్చి 1 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో Offsite ATMలలోనే కాకుండా.. Onsite ATMలలో కూడా నో క్యాష్. ఇరవై రోజులనుంచి ఈ తంతు నడుస్తోంది. కారణాలు తెలియదు. బ్యాంకులకు, నగదు సప్లయిచేసే ప్రెవేటు ఏజెన్సీలకు కమిషన్ విషయంలో పేచీ వచ్చిందని, అందుకనే ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడిందని తెలుస్తున్నట్టు.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ముక్కుచీదే వార్త ఒకటి వచ్చింది. ఇక అంతే. ఇరవై రోజులుగా ఈ సమస్య ఎందుకు కొనసాగుతోంది.. దీనికి ఏమిటి పరిష్కారం అనే తదుపరి అజాపజా వార్తలు లేవు. నాకు అర్ధమైన దాని ప్రకారం.. బ్యాంకులు.. తాము స్వయంగా నిర్వహించుకోవడానికి అవకాశం వున్న Onsite ATMలలో నగదు నింపే బాధ్యతను కూడా ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించి, చేతులు దులుపుకున్నట్టున్నాయి.  ఫలానా పరిమితిలోపు నగదు లావాదేవీలను ఏటీఎం ద్వారా నిర్వహించుకోవాలని బ్రాంచిలో బోర్డులు పెట్టిన బ్యాంకులు.. ఏటీఎంలో స్వయంగా నగదు వుంచగలిగిన బాధ్యతను దులిపేసుకుని కస్టమర్లతో చెలగాటమాడడం Financial Terrorism కిందే లెక్క.
  • ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండే 10 రూపాయల ప్లాస్టిక్ నోట్ల ను  రిజర్వ్ బ్యాంక్ ముద్రించబోతోంది .   వాటిని క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకం గా  పరీక్షించేందుకు రిజర్వు బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.  దేశంలోని  ఐదు ప్రాంతాల్లో ప్లాస్టిక్ నోట్లతో క్షేత్రస్థాయిలో ప్రయోగాలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన ఆ సమాధానంలో చెప్పారు. ప్లాస్టిక్ మిశ్రమాల సేకరణ, వాటిపై రూ. 10 నోట్ల ముద్రణ లాంటి విషయంలో అన్ని అనుమతులను రిజర్వు బ్యాంకుకు ఇచ్చినట్లు వివరించారు. ప్రస్తుతం వాడుతున్న కాగితపు నోట్ల కంటే ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటాయని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు రిజర్వు బ్యాంకులు కాగితపు నోట్లకు ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్, ఇతర పదార్థాలతో చేసిన నోట్ల గురించి చలామణి లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. 2014 నుంచి ప్లాస్టిక్ నోట్లు తెచ్చే ప్రతిపాదన పరిశీలన లో ఉంది. గత డిసెంబర్ లోనే ముద్రణకు వెళ్లాల్సి ఉండగా ఆలస్యమైంది. కొచ్చి , మైసూర్ , సిమ్లా ,భువనేశ్వర్ వంటి నగరాల్లో తొలుత ప్రయోగాత్మకంగా  ప్రవేశ పెడతారు . 
  • (వాసిరెడ్డి వేణుగోపాల్ )..........   ఏంటీ... బ్యాంకుల మెడలు వంచగలమా? మన గూబ పగలకుండా చూసుకోగలిగితే అదే పదివేలు. ... #సీన్ 1: మన ఆశ: బ్యాంకుల ఖాతాదారులందరూ ఈనెల 30న తమ ఖాతాల్లోని డబ్బుని అణాపైసలతో సహా విత్ డ్రా చేసుకోవాలి. అప్పుడు వార్షిక పద్దుల అంచనాలన్నీ గల్లంతవడంతో బ్యాంకులు కుక్కిన పేనుల్లా మన దారికి వస్తాయి. జరిగే వాస్తవం: మధ్యతరగతికి ఇలాంటి మిడిమేలపు తెలివితేటలు వుంటాయని బ్యాంకులకు తెలుసు. కాబట్టి ముందుగా ఏటీయంలలో నగదు లేకుండా చేస్తాయి. అటూ ఇటూ కొన్ని రోజులు పిచ్చివాడిలా తిరిగి, చివరికి ఓ రోజు సెలవు పెట్టి.. బ్రాంచికి చెక్కట్టుకుని వెళతాము. క్యాష్ లేదని సమాధానం వస్తుంది. సప్లయి లేదంటాడు అంతే! మళ్లీ తెల్లవారి సెలవుపెట్టి మళ్లీ వెళతాం. మళ్లీ అదే సమాధానం. ఈ లోగా ఆ ముప్పయ్యో తారీఖు వస్తుంది, వెళిపోతుంది కూడా. మనకు రావాల్సిన వేతనంలో ఐదారురోజుల జీతం కట్ అవుతుంది. ... #సీన్ 2: మన ఆశ: ఖాతాదారులం తెలివిగా రచించిన కుట్ర సక్సెస్ అవుతుంది. మార్చి 30న బ్యాంకుల్లో మన నగదు మొత్తాన్ని విత్ డ్రా చేసుకుంటాం. భలే పని చేశాం అని ఆ రాత్రి నైంటీ వేసుకుంటూ విందు కూడా చేసుకుంటాం. జరిగే వాస్తవం: సోయిలేకుండా మనం నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి ఒక ఆర్డినెన్సు వస్తుంది. చెలామణిలో వున్న కొత్త నోట్లు నెలరోజులపాటు చెల్లబోవని, వాటిని కలిగివుండడం కూడా నేరమని, మూడేళ్లు జైలుశిక్ష పడుతుందని అందులో వుంటుంది. పొద్దున్నే చాయ్ తాగడానికి పోకుండా పాచిమొహంతోనే మళ్లీ బ్యాంకుకి బయలుదేరుతాం. రాత్రంతా నిద్రపోని నాబోటి వాళ్ల బ్యాచ్ తో అప్పటికే మూడున్నర కిలోమీటర్ల క్యూ వుంటుంది. ఆ క్యూలో నెట్టుకుంటూ నెట్టుకుంటూ వెళ్లి కౌంటర్ దగ్గరదాకా చేరేసరికి ఏప్రిల్ నెల వేతనంలో మరో ఐదారురోజుల వేతనం కట్ అవుతుంది. చెలామణిలో లేని, రద్దయిన నోట్లను, పిలకాయలకు కాగితం పడవలను చేసి ఇవ్వడానికి తప్ప ఎందుకూ కొరగాని నోట్లను కలిగి వుండడమే ఘోరమైన నేరం అయినప్పుడు.. చెలామణిలో వున్న నోట్లను బ్యాంకుల్లో కాకుండా బీరువాల్లో దాచుకొని.. జాతి జీవనాన్ని అల్లకల్లోల పరచడం ఘోరాతిఘోరమైన నేరం కాదా అద్దెచ్చా?
  • బ్యాంకు ఖాతాల్లో కనీస నెలవారి నిల్వ ఉండాలన్న నిబంధనల విషయంలో స్టేట్ బ్యాంక్ దిగివచ్చే సూచనలు కనిపించడం లేదు. ప్రజల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ  జరిమానాలు విధిస్తామని ప్రకటించిన ఎస్‌బిఐ తన నిర్ణయం  మార్చుకునేలా లేదు.  పైగా తన చర్యను గట్టిగా సమర్థించుకుంటోంది . ప్రభుత్వ ఆదేశాలపైనే  పేదల కోసం 11 కోట్ల జన్‌ధన్‌ ఖాతాలను తెరవాల్సి వచ్చిందని, వాటి నిర్వహణ  ఖర్చులన్నీ భరించాలంటే, ఇతర ఖాతాదారులు తమ ఖాతాల్లోబ్యాంక్  సూచించిన విధం గా కనీస నిల్వలను ఉంచాల్సిందేనని ఎస్‌బిఐ వాదిస్తోంది.  లేదంటే జరిమానాలు తప్పవని  ఆ బ్యాంక్  చైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య అంటున్నారు.  మామూలు ఖాతాలకు జన్ ధన్ ఖాతాలకు ముడి పెట్టి వాటి భారం ఇతరులపై మోపుతామంటున్నారు.  జన్ ధన్ ఖాతాలు తెరిచారు బాగానే ఉంది.. అవి తెరిచే ముందు వాటి నిర్వహణ భారమని తెలీదా ? కళ్ళు మూసుకుని ప్రభుత్వం చెప్పినట్టు చేస్తారా ? ఆ ఖాతాల భారం ఇతరులపై మోపుతారా ? ఇదెక్కడి న్యాయం ? ఒక అగ్రగామి బ్యాంక్ ఇంత అనాలోచితంగా పని చేస్తున్నాదా ?అంటే అలాగే అనిపిస్తున్నది. ఇలాగే వ్యవహరిస్తే ఉన్న ఖాతాదారులు కూడా ఖాతాలు మూసుకుంటారు. అపుడు గానే తెలిసి రాదు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.  కాగా ఇదే రీతిలోఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సి, యాక్సిస్ బ్యాంకులు  కూడా బాదుడుకు సిద్ధమయ్యాయి. నిర్దేశించిన మొత్తం కంటే నగదు లావాదేవీలు జరిపితే, ఇక ఖాతాదారులు  తప్పసరిగా ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చాయి. నగదు లావాదేవీల తగ్గింపుకు కస్టమర్లకు ఈ వడ్డింపు వేస్తున్నట్టు బ్యాంకులు పేర్కొంటున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలతో ఖాతాదారులపై మోయలేని భారం మోపుతోంది. కొత్త నిబంధనల ప్రకారం ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి ఉపసంహరణ 3సార్లు దాటితే 20 రూపాయలు ఛార్జి చేస్తారు. ఎస్‌బీఐ ఏటీఎంలలో నగదు ఉపసంహరణ ఐదు సార్లు దాటితే 10 రూపాయల చొప్పును ఛార్జి వసూలు చేస్తారు. 3సార్లు నగదు డిపాజిట్లు ఉచితం. నాలుగో డిపాజిట్‌ నుంచి సేవాపన్నుతో పాటు 50 రూపాయల ఛార్జి వేస్తారు. మెట్రోపాలిటన్‌ శాఖల్లో ఉన్న బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వ 5వేల కంటే 75శాతం కన్నా తక్కువ ఉంటే సేవా పన్నుతో పాటు 100 రూపాయల జరిమానా విధించనున్నారు. కనీస నగదు నిల్వ కన్నా ఖాతాలో 50శాతం తక్కువ మొత్తం ఉంటే సర్వీస్‌ ఛార్జీతో కలిపి 50 జరిమానా విధిస్తారు. ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌లపై నెలకు 15 ఛార్జీ వసూలు చేయనున్నారు.  కరెంటు ఖాతాలో కనీసం 20000 ఉండాలనే ఆంక్షలు విధించారు. బ్యాంకు ఖాతాలో 25 వేల కన్నా ఎక్కువ మొత్తం ఉంటే సొంత ఏటీఎంల నుంచి ఎన్ని సార్లైనా న‌గ‌దు ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. ఎలాంటి ఛార్జి వసూలు చేయరు. అదే ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసినప్పుడు ఛార్జి పడకుండా ఉండాలంటే లక్ష ఖాతాలో ఉండాలని ఆంక్షలు విధించింది ఎస్బీఐ. మొత్తం మీద ప్రభుత్వ బ్యాంకు  ప్రతిపాదనలు  పేదలు, మధ్య తరగతి వారికి వ్యతిరేకంగా ఉన్నాయనే  విమర్శలు  వెల్లు వెత్తుతున్నాయి . ఈ నేపథ్యంలో  ఏప్రిల్ 6న "నో ట్రాన్సాక్షన్  డే " గా పాటించి నిరసన తెలపాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం ఊపందుకుంది. చూడాలి ఏమి జరుగుతుందో ?? 
  • (వాసిరెడ్డి వేణుగోపాల్ )...............................   ఏటీయంలలో పరిమిత సంఖ్యలో లావాదేవీలు మించితే రుసుము వసూలు చేస్తున్నారు. ఓకే.  నగదు, నగదు రహిత లావాదేవీలకు పరిమితి, రుసుము విధిస్తున్నారు. నా సందేహం ఏమిటంటే.. 1. డెబిట్ కార్డు ఇన్సర్ట్ చేసి, పిన్నూగిన్నూ అన్నీ అయిపోయాక, సారీ.. అనేబుల్ టు డిస్పెన్స్ క్యాష్ అని.. మెసేజ్ వస్తుంది. దానిని లావాదేవీ కిందకి పరిగణిస్తారా? మిషన్ లో నగదు లేకపోయినా.. లావాదేవీ కిందనే నమోదు అవుతుందా? 2. మిషన్ లో కేవలం ఐదొందలు, రెండు వేల నోట్లు మాత్రమే వుంటాయి. ఆ విషయం మనకు తెలియదు. మనం ఏ రెండొందలకో కార్డు గీకుతాం. డబ్బులు రావు. అంతకు ముందు గీకినాయన చెబుతాడు.. ఐదొందల నోట్లే వున్నాయని. అప్పుడు ఐదొందలకు గీకుతాం. అప్పుడు వస్తాయి. వాటిని ఒక లావాదేవీ కింద పరిగణిస్తారా? రెండు లావాదేవీల కిందనా? 3. ఒక్కోసారి.. క్యాష్ ఇచ్చేసినట్టు మనకు ఏటీయంలో వుండగానే మెసేజ్ వస్తుంది. కానీ రాదు. కొంత సేపటి తర్వాత నగదు వెనక్కి వెళ్లినట్టు మెసేజ్ వస్తుంది. అది ఒక లావాదేవీనా, రెండా? 4. కొన్ని బ్యాంకులు.. ముఖ్యంగా SBI.. మన బ్యాంక్ బ్యాలెన్స్ గురించి మెసేజ్ పంపదు. సహజంగానే బ్యాలెన్స్ చెక్ చేసుకుని, ఎంత వుందో చూసుకుని దాని ప్రకారం విత్ డ్రా చేసుకుంటాం. దానిని రెండు లావాదేవీల కింద పరిగణించడం ఫైనాన్షియల్ టెర్రరిజం కాదా? 5. ఒక్కోసారి తరచూ పిన్ నెంబరు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా పెన్షన్ పొందే సీనియర్ సిటిజన్లకు ఈ అవసరం చాలా వుంటుంది. పిన్ నెంబరు మార్చుకోవడం కూడా ఒక లావాదేవీ కింద లెక్కలోకి వస్తుందా? 6. ఏటీయం గది పరిధిలోనే నగదు డిపాజిట్ మిషన్లు వుంటాయి. అవి ఏటీయంలుగా కూడా పనిచేస్తుంటాయి. ఇంటిగ్రేటెడ్ మిషన్లు. ఒకడంటే నాకు గిట్టదు. వాడికి ఆ మిషన్లో రోజుకు పది రూపాయల చొప్పున, లేకపోతే గంటకు పది రూపాయల చొప్పున ఓ నెల రోజులు డిపాజిట్ చేస్తూ పోయాననుకుందాం. అవన్నీ ఏటీయం లావాదేవీల కిందనే లెక్కించి.. నాకు గిట్టనివాడి గూబ పగిలే అవకాశం వుంటుందా ? 7. ఏది ఏమైనా.. ఈ మధ్య వాట్సప్ లో, పేచుబుక్కులో.. బ్యాంకింగ్ వ్యవస్థ, ఫైనాన్షియల్ టెర్రరిజం మీద వస్తున్న జోకులు బహు బాగున్నాయి. బ్యాంకు ముందు నుంచి రోజుకు రెండుసార్లు వెళితే పెనాల్టీ లాంటివి. అది హాస్యం కాదు.. వాస్తవం. 8. ఒకటి మాత్రం నిజమప్పా.. ఏటీయం మిషన్ల దొంగతనాలు, ఏటీయం గదుల్లో మహిళలపై దౌర్జన్యాలు, హత్యాచారాలకు ఇక ఆస్కారం లేకుండా ప్రభుత్వం చాలా తెలివిగా స్కెచ్ గీసిందనుకుంటా.. అసలు క్యాష్ వుంచకుండా.. రేయింబవళ్లు జనాన్ని వాళ్ల డబ్బులతోనే వాళ్లను కాపలాగా వుంచుతూ..?
  •   (వాసిరెడ్డి వేణుగోపాల్ ) ................    జాత్యాహంకార వ్యాఖ్యలు, కాల్పులు.. అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముందున్న పెద్ద కాన్వాస్ లో అతి చిన్న విషయాలు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక.. అమెరికాలో ఏం జరగబోతున్నది అనేది చిన్న విషయం. ప్రపంచంలో ఏం జరగబోతున్నది అనేది పెద్ద విషయం. జర్మనీతో వాణిజ్యంలో అమెరికాకు 65బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు వుంది. దానిని పూడ్చడం కుదరట్లేదు. అదేమంటే.. ఐరోపా యూనియన్ నిబంధనలు ఒప్పుకోవని జర్మనీ అంటుంది. యూరో విలువ తక్కువగా వుండడం ఈ వాణిజ్య లోటుకి ప్రధాన కారణం. ఛల్.. అసలు జర్మనీతో డైరెక్ట్ అయిపోయి.. నేరుగా మాట్లాడేసుకుంటే పోలా.. అని ట్రంప్ గవర్నమెంట్ అనుకుంటోంది. ట్రంప్ ప్రభుత్వ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవర్రో ఇవాళ అదే ప్రతిపాదించారు. జర్మనీతో ద్వైపాక్షిక చర్చలను ప్రతిపాదించారు. త్వరలోనే జర్మనీ ప్రధానమంత్రి మెర్కెల్ అమెరికా పర్యటించనున్నారు. Brexit లాగానే Germexitకు ఇది దారితీస్తుందేమో తెలియదు. ట్రంప్ తన ఎన్నికల ప్రచార సమయంలోనే.. చైనా తన కరెన్సీ యువాన్ ను మానిప్యులేట్ చేస్తోందని, undervalue కారణంగా అమెరికా నష్టపోతోందని, దీనిని అడ్డుకుంటానని చెప్పారు. చైనా నిజంగా తన కరెన్సీని అండర్ వేల్యూ చేస్తున్నదా లేదా అనేది ఏప్రిల్ లో ట్రెజరీ కరెన్సీ నివేదిక వచ్చాక.. ఫైనల్ డిసిషన్ కి వచ్చి.. ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది. ఇంతకీ రూపాయికి ఏమి కానున్నది? రూపాయి విలువ అండర్ వేల్యూ అనుకుంటున్నారా, ఓవర్ వేల్యూ అనుకుంటున్నారా? మరోసారి డీవేల్యుయేషన్ అవసరం వుందా? అయ్యా.. మోడీగారూ.. దేశాలు పట్టుకు తిరుగుతుంటారని గిట్టనివాళ్లు ఏమన్నా అంటే మనసులో పెట్టుకోకుండా... మీరోపాలి అర్జెంటుగా అమెరికా వెళ్లి.. ట్రంపుగారితో మాట్లాడి, రూపాయి పొజిషన్ ఏమిటో తెలుసుకుని రావాల్సిందిగా విజ్ఞప్తి.