Latest News
ఆరోగ్యం ఆహారం

'మీట్ లెస్ మండే' కాన్సెప్ట్ తో వెజ్ డైట్ కి ఆదరణ !

1st Image

వెజిటేరియనిజానికి ఇపుడు అంతర్జాతీయంగా ప్రాముఖ్యత  పెరుగుతోంది. యూరోపియన్‌ యూనియన్‌లో అయితే ప్రత్యేకంగా క్యాంపెయిన్స్‌ కూడా నిర్వహిస్తున్నారు. 'మీట్‌ లెస్‌ మండే'(మాంసాహారం లేని సోమవారం) పేరిట ఇప్పుడు 36 దేశాల్లో క్యాంపెయిన్‌ జరుగుతుండటమే కాదు కోట్లాది మంది  సోమవారాలు మాంసం ముట్టమని ప్రతిజ్ఞ కూడా చేస్తున్నారు. ఈ ప్రచారాల ఫలితమో.. ఆరోగ్యం పట్ల పెరిగినజాగ్రత్తో తెలియదు కానీ ముక్క లేకపోతే ముద్ద దిగని వారూ ఇప్పుడు వెజిటేరియన్‌లుగా మారిపోతున్నారు కూరగాయలు, పళ్లు, పప్పుదినుసులు లాంటివి  తినటం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసికఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు చెప్తుండటం.. కొన్ని రోగాలు వచ్చే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయనే సత్యాలు గ్రహించి ఎక్కువమంది వెజిటేరియన్స్‌గా మారుతున్నారు. అసలు బయలాజికల్‌గా, సైకలాజికల్‌గా, ఫిజికల్‌గా మానవ శరీరాన్ని వెజిటేరియన్‌గానే ప్రకృతి రూ పొందించిందనే సంగతిప్పుడు అందరూ గ్రహిస్తున్నారు. మీట్‌ ఈటింగ్‌ క్యాపిటల్‌  అమెరికాలో సైతం ఇటీవల శాకాహారుల సంఖ్య పెరుగుతోంది. 2012లో యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ నివేదికల ప్రకారం 12శాతం మీట్‌ అండ్‌ పౌల్ట్రీ  వినియోగం తగ్గింది. అదే సమయంలో వెజిటేరియన్‌ రిసోర్స్‌ గ్రూప్‌ అంచనా ప్రకారం 5 శాతం వెజిటేరియన్లు పెరిగారు. ఇక మన నగరాలలోను శాకాహారుల సంఖ్య పెరుగుతోందనే చెప్పాలి. ప్రత్యేకమైన సర్వేలు లేక పోయినా వీగాన్స్‌లాంటి గ్రూప్‌లలో పెరుగుతున్న సభ్యత్వం ఓ సూచికగా భావించవచ్చు. శాస్త్రం చెప్పింది.. నివేదికలు నిరూపిస్తున్నాయి.. అహింసా పరమోధర్మః మన పురాణాల్లో చెప్పిన సత్యమిది. ఈ మార్గంలోనే జాతిపిత గాంధీ వెళ్లారు. శాకాహారాన్ని మాత్రమే గాంధీభుజిస్తే, అంతర్జాతీయ  విఖ్యాత ఫిలాసఫర్‌.. ప్లేటో, రాజకీయవేత్త బెంజిమిన్‌ ఫ్రాంక్లిన్‌ నుంచి పాప్‌ ఐకాన్స్‌.. పౌల్‌ మెక్‌కార్టీనీ, బాబ్‌ మార్లే, బాలీవుడ్‌ తారలు శిల్పాశెట్టి, కరీనాకపూర్‌.. ఇలా అందరూ వెజిటేరియన్‌ డైట్‌నే అనుసరించారు, అనుసరిస్తున్నారు. ఇప్పుడు పరిశోధకులూ వెజిటేరియన్‌ ఫుడ్‌ అన్ని విధాలా మంచిదని ఆధారాలతోసహా చెబుతున్నారు. నాన్‌ వెజిటేరియన్స్‌తో పోలిస్తే వెజిటేరియన్స్‌ 10-15 సంవత్సరాలు ఎక్కువ బతకటమేకాదు.. వీరికి గుండెపోటు, కొలెస్ట్రాల్  సమస్యలు, ఎసిడిటీలు కూడా వచ్చే అవకాశాలు తక్కువని.. వెజిటేరియన్‌ డైట్‌లో ఫైబర్‌ అధికంగా ఉంటుందని, త్వరగా జీర్ణమవుతుందని.. రక్తపోటు నియంత్రణలో ఉంటుందని.. వెగాన్స్‌లో టైప్‌ 2 డయాబెటిస్‌ ప్రమాదం తక్కువని.. చెపుతున్నాయి. మాంసాహారులతో పోలిస్తే శాకాహారులలో కొన్ని క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువంటున్నాయి. దీంతోఆరోగ్యంపై అమిత శ్రద్ధ కనబరిచే వారు సహజంగానే శాకాహారులుగా మారుతున్నారు. అయితే శాకాహారం సంపూర్ణ ఆహారమేనా..? మాంసాహారులలో వచ్చే ప్రథమ సందేహమిది. మాంసం, పాలఉత్పత్తులలో ప్రొటీన్‌,ఫాట్స్‌ లభిస్తాయన్నది వీరిభావన. ఇందులో కొంత మాత్రమే నిజమని చెబుతున్నారు డాక్టర్లు. నిజానికి వెజిటేరియన్‌ ఫుడ్‌లోకూడా ప్రొటీన్స్‌ పెద్దమొత్తంలో ఉంటాయి. ఎనీమల్‌ ప్రొటీన్‌తో పోలిస్తే ప్లాంట్‌ బేస్ట్‌ ప్రొటీన్‌ సోర్స్‌ మరింత ఆరోగ్యకరమైన్నది నిపుణుల భావన. అంతేకాదు.. హెల్తీఫైబర్లు, కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్‌లు వీటిలో అధికంగా ఉంటాయని అంటున్నారు డయాబెటిస్ట్‌ ప్రమతిరెడ్డి.ప్లాంట్స్‌లో డైజెస్టివ్‌ ప్రోటీన్స్‌ ఉంటాయి. ప్రధానంగా పప్పు దినుసులు, లెంటిల్స్‌, గ్రీన్‌గ్రామ్‌స్పౌట్స్‌లో అవసరమైన అమినో ఏసిడ్స్‌ ఉంటాయని డైటీషియన్లు చెబుతున్నారు. నట్స్‌, బీన్స్‌, సీడ్స్‌లో ప్రోటీన్‌ అధికంగా లభిస్తుంది.
ప్రోటీన్‌ రూపకల్పనకు కారణం అయిన 10 అమినో ఏసిడ్స్‌ను మన బాడీ తయారు చేసినప్పటికీ మరో 10 అమినో ఏసిడ్స్‌ వెజిటేరియన్‌ డైట్‌లోనే లభిస్తాయని న్యూట్రిషయనిస్ట్‌ సునీత అంటున్నారు. చేపల్లోఒమెగా ఫాటీ ఏసిడ్స్‌ ఉంటాయంటారు కానీ దీనితో పోలిస్తే వెజిటేరియన్‌ సోర్స్‌లో కాలుష్యకారకాలు అధికంగా ఉండవు. అదీగాక ఫిష్‌ ఆయిల్‌తో పోలిస్తే వెజిటేరియన్‌ ఫుడ్‌ ఎకోఫ్రెండ్లీ. శరీరంలో అన్ని టిష్యూలు సరిగా పనిచేయటానికి అవసరమైన ఒమెగా-3 గ్రౌండ్‌ ఫ్లాక్స్‌సీడ్‌, గ్రీన్‌ లీఫీ వెజిటెబుల్స్‌, బీన్స్‌, పీస్‌, సిట్రస్‌ ఫ్రూట్స్‌, మెలన్స్‌లో ఎక్కువగా లభిస్తుందని చెబుతున్నారామె. శాకాహారం వల్ల లాభాలివి.. గుండెజబ్బులు, క్యాన్సర్‌, ఆర్థరైటిస్‌ లాంటి ఎన్నో రోగాలను నియంత్రిం చుకోవచ్చు. వెజిటేరియన్‌ డైట్‌లో - శాచురేటెడ్‌ ఫాట్స్‌ తక్కువగా ఉంటాయి. ఫైబర్లుఅధికం. కాన్సర్‌రాకుండా నివారిం చే ఫైటోన్యూట్రియంట్స్‌ అధికంగా ఉంటాయి. వెజిటేరియన్‌తో పోలిస్తే నాన్‌వెజ్‌లో ఎండోటాక్సిన్స్‌ అధికం. ఈటాక్సిన్స్‌ వల్లే ఆర్థరైటిస్‌, ఫైబ్రో మయాల్జి యా వంటి రోగాలొస్తాయి. వెజ్‌డైట్‌తోనే ఆర్ధరైటిస్‌ రోగాలను పూర్తిగా నయం చేయవచ్చని కొంతమంది చెబుతున్నారు. మెంతికూర, పాలకూరలలో ఐరన్‌, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పొట్లకాయ లాంటివి తినటం వల్ల బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చు. వెజిటెబుల్స్‌, ఫ్రూట్స్‌లో నేచురల్‌ షుగర్‌, ఉపయో గకరమైన ఎంజైమ్స్‌ ఉంటాయి. బ్లడ్‌కొలెసా్ట్రల్‌ను తగ్గించుకోవచ్చు. ఎన్నో రోగాలు దరి చేరకుండా కాపాడుకోవచ్చు. కాల్షియం పాలలో ఎక్కువ ఉంటుంది అంటారు కానీ ఆకుకూరలైన కొత్తిమీర, మెంతికూర, రాడిష్‌, కర్రీపట్ట తో పాటు ఆవాలు, రాగి, బాదం, రజ్మా, పీస్‌, పెసర పప్పు, సోయా ఉత్పత్తులలో అధికంగాఉంటుంది. సరిగ్గాతింటే శరీరానికి కావాల్సిన ప్రోటీన్‌ లభిస్తుంది. ప్రోటీన్‌ తక్కువగా ఉందంటే వారు సరిగా తినటం లేదనే లెక్క. ప్రోటీన్‌అధికంగా పప్పులు, సోయా ఉత్పత్తులు, నట్స్‌ వంటి వాటిలో లభిస్తుంది .   --------------------పాశం జగన్నాధం 

Site Logo
  • చాలా చాలా తెల్లగా, జరజరా జారిపోయే అయొడైజ్డ్ ఉప్పు... అసలు ఉప్పే కాదు. సాధారణ ఉప్పు లేత గోధుమరంగులో వుంటుంది. కొంచెం తేమ కూడా కలిగివుంటుంది. అందులో 84 మినరల్స్ వుంటాయి. ఈ మినరల్స్ అన్నీ మన శరీరానికి చాలా అవసరం. మనం వాడుతున్న రిఫైన్డ్ ఉప్పులో రెండే మినరల్స్ వుంటాయి. సోడియం, క్లోరైడ్ లు రెండు మాత్రమే. మిగతావన్నీ మాయం అయిపోతాయి. ఆ కారణంగా అయొడైజ్డ్ ఉప్పు ఎంత తిన్నా శరీరానికి కావాల్సిన ఖనిజాలు అందవు. దాంతో శరీరం మరింత ఉప్పును కోరుకుంటుంది. మనం మరింత ఖనిజరహిత ఉప్పు తింటాం. ఆ విధంగా మనం అవసరమైనదానికంటే అధిక ఉప్పు తీసుకుంటుంటాం. ఫలితంగా కిడ్నీలలో ఫిల్టరింగ్ మెకానిజమ్ దెబ్బతింటుంది. ఉప్పు తగ్గించాలని, మానేయాలని డాక్టర్ చిట్టీ రాస్తాడు.  అదే మనం అన్ని ఖనిజాలు వున్న ఉప్పు తింటే.. ఇంకా ఇంకా ఉప్పును శరీరం కోరుకోదు. మనం తిన్న సాధారణ ఉప్పునుంచి శరీరం తనకు కావాల్సిన ఖనిజాలను, కావాల్సినంత తీసుకొని, తనకు అక్కర్లేని వాటిని బయటికి పంపిస్తుంది. సాధారణ ఉప్పులో వుండే మినరల్స్ జాబితా ఇదిగోండి. జాగ్రత్తగా గమనించండి. అందులో (గ్రూప్-3 లో) అయొడిన్ కూడా వుంది. అందులో బంగారం కూడా వుంది. సహజసిద్ధంగా వుండే అయొడిన్ ను తొలగించి, కృత్రిమంగా కలపడం ఎందుకు? Group 1 Sodium & chlorine (NaCl = Sodium Chloride) Group 2 Sulfur, magnesium, calcium & potassium Group 3 Carbon, bromine, silicon, nitrogen, ammonium, fluorine, phosphorus, iodine, boron, lithium Group 4 Argon, rubidium, copper, barium, helium, indium, molybdenum, nickel, arsenic, uranium, manganese, vanadium, aluminum, cobalt, antimony, silver, zinc, krypton, chromium, mercury, neon, cadmium, erbium, germanium, xenon, scandium, gallium, zirconium, lead, bismuth, niobium, gold, thulium, thallium, Ianthanum, neodymium, thorium, cerium, cesium, terbium, ytterbium, yttrium, dysprosium, selenium, lutetium, hafnium, gadolinium, praseodymium, tin, beryllium, samarium, holmium, tantalum, europium.      -----------  vasireddy venugopal 
  • జీడిపప్పు పకోడీ..జీడిపప్పు ఉప్మా..జీడిపప్పు మిఠాయి..జీడిపప్పు పాకము..జీడిపప్పు మసాలా...జీడిపప్పు మిక్చరు.ఇలా రకరకాలుగా చేసుకుని జీడిపప్పు ని తినవచ్చు. చెబుతుంటేనే నోరు ఊరుతుంది కదా...జీడి పప్పు రుచే రుచి. ఈ పప్పును వేయించి కానీ పచ్చిగా కానీ తినవచ్చు. వేరు సెనగ.... బాదం పప్పు తో పోలిస్తే జీడి పప్పు ఖరీదు ఎక్కువ. భారతీయ వంటకాలలో చాలా వాటిలోజీడి పప్పు వాడతారు, పిండి వంటల్లోకూడా వినియోగిస్తారు.థాయి, చైనీస్ వంటకాలలో కూడా జీడిపప్పును ఉపయోగిస్తారు. గోవాలో జీడి పండుని నూరి, ఆ రసాన్ని తీసి 2-3 రోజులు పులియబెడతారు. పులిసిన రసాన్ని రెండు సార్లు బట్టిలో పెడతారు. ఫలితంగా వచ్చిన పానీయాన్ని ఫెని అంటారు. టాంజానియా దక్షిణ ప్రాంతంలో జీడి పండుని ఎండబెట్టి నిల్వచేస్తారు. తరువాత నీటిలో నానబెట్టి, పులియబెట్టి... బట్టిలో కాచి ఘాటైన మద్యాన్ని తయారు చేస్తారు. దీని పేరు గంగో అంటారట. ముఖ్యంగా వెట్ పార్టీలలో జీడిపప్పు ను ఇష్టంగా ఆరగిస్తారు.  ప్రకాశం జిల్లా వేటపాలెం ఫైన్ క్వాలిటీ జీడిపప్పు కి ప్రసిద్ధి.విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. వేటపాలెం జీడిపప్పు కి దేశవిదేశాల్లో చాలా పేరుంది. పిండిపదార్థాలు అధికంగా ఉండే ఈ జీడీ పప్పులో చక్కెర, పీచుపదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్ బి1, విటమిన్ బీ2, విటమిన్ బి3, విటమిన్ బి5, విటమిన్ బి6, విటమిన్ సి, కాల్షియమ్, ఐరన్, మెగ్నీషియమ్, పొటాషియం, జింకు వంటి ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.  ఈ జీడి పప్పుల్లో కొలెస్ట్రాల్ ఏమాత్రం ఉండదు.  ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మెగ్నీషియం నిల్వలు కూడా అధికంగా ఉండటంతో ఎముకల పుష్టికి ఇవి దోహదపడుతాయి. మన శరీరానికి సుమారు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరమవుతుంది కనుక కాజు తీసుకుంటే మేలు. ఇక రక్తపోటు(బీపి) ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన పనిలేదు.  ఇందులో సోడియం శాతం తక్కువగానూ పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. కేన్సర్ సమస్యను అడ్డుకునే యాంటి ఆక్సిడెంట్లను జీడిపప్పు కలిగి ఉంది. సెలీనియమ్, మరియు విటమిన్ ఇ వంటివి ఉండటంతో ఇవి కేన్సర్ ను రాకుండా అడ్డుకుంటాయి. అయితే, ఈ పప్పును ఎడాపెడా తినేయకూడదు. నియంత్రణ ఉండాలి. రోజుకు 5 నుంచి 10 వరకూ మాత్రమే జీడిపప్పులను తీసుకోవచ్చు. ఇదికూడా రెండు దఫాలుగా తింటే మంచిది.
  • చికెన్ ఫ్రై లలో రారాజు "చికెన్ 65" అంటే ఎవరూ కాదనరు.  ఎందుకంటె దాని టేస్ట్ సూపర్ కాబట్టి.  దాని పేరు వింటేనే చాలామందికి నోరూతుంది.  పోతే ఈ చికెన్ 65 పుట్టింది చెన్నైలో అని చాలామందికి తెలియదు.  అవును. ఈ వంటకాన్ని మొదట సారిగా బుహారీ అనే రెస్టారెంట్ లో తయారు చేశారు.  1965లో దీన్ని చేశారు కాబట్టి చికెన్ 65 అనే పేరు ఖరారు అయిపొయింది.  బ్రాయిలర్స్ వస్తున్న తొలి రోజుల్లో సరిగ్గా 65 రోజుల వయసు గల కోళ్ళే ఎంచుకునే వారట కోయటానికి. దానితో చేసిన వంటకమే చికెన్ 65. ఇప్పుడైతే 45 రోజులు కూడా ఆగటం లేదనుకోండి. అది వేరే విషయం.  చెన్నై లో మొదలైన ఈ వంటకం అలా అలా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపొయింది.  అయితే ఈ వంటకం చెన్నై ది కాదనే వాదన కూడా లేకపోలేదు.  ఇక బుహారీ హోటల్ లో చికెన్ 78,చికెన్ 82,చికెన్ 90 వంటకాలు కూడా లభ్యమవుతాయి.  వీటిని కూడా అదే హోటల్ లో తొలి సారిగా తయారు చేశారు. చికెన్ 65 అంత గా అవి పాపులర్ కాలేదు.  ఇపుడు ఆ వంటకాలు ఇతర రాష్ట్రాల్లో కూడా లభ్యమవుతున్నాయి.  సుప్రసిద్ధ నటుడు అమితాబ్ బచ్చన్ నిర్వహించిన కౌన్ బనేగా కరోడ్ పతి లో కూడా చికెన్ 65 గురించి చెబుతూ ఇది బుహారీ వారీ తయారీ అని చెప్పారు.  సిద్దార్ధ బసు క్విజ్ టైం లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.  దేశ వ్యాప్తంగా చాలా హోటళ్లలో ఇది లభ్యమవుతున్నప్పటికీ చెన్నైబుహారీ లో చికెన్ 65 టేస్ట్ వేరేగా ఉంటుంది.  చెన్నై వెళ్ళినపుడు ఒక సారి తిని చూడండి.  సింపుల్ గా "చికెన్ 65" కథ అది. ........  SATYANANDA REDDY BOJJA 
  • తొందరగా సెటిల్ అయిపోవాలి ... నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి అనే కాంక్షతో చాలా మంది ఓవర్‌టైమ్  డ్యూటీలు చేస్తుంటారు. అయితే రోజుకు 8 గంటలకు మించి పని చేస్తే ప్రమాదం అని అధ్యయనాలు చెబుతున్నాయి .  8 గంటలకు మించి పనిచేసే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 80 శాతం దాకా ఉన్నాయని లండన్ లో నిర్వహించిన అధ్యయనంలో తేలింది.  ఇటీవల కాలంలో వేలాది మంది ఉద్యోగులు తరచు గుండె పోట్లు, హృద్రోగాల బారిన పడడానికి ఎక్కువ గంటలు పనిచేయడమే కారణమని శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఫిన్నిష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ సంస్థ ఈ అధ్యయనం నిర్వహించింది.  చాలా మంది తమ ఉద్యోగం ఊడిపోకుండా ఉండడానికి ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని, అది వారి ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తోందని ప్రధాన పరిశోధకుడు డాక్టర్ మరియానా పేర్కొన్నారు.కాబట్టి జాగ్రత్త గా వుండటం మంచిదని చెబుతున్నారు.ఏదైనా పరిమితుల్లో ఉంటేనే బాగుంటుంది.అతిగా చేస్తే అసలుకే మోసం వస్తుంది. అందుకు మన పెద్ద వాళ్లు అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. అయితే పని ఒత్తిడి పెరిగితే ప్రతికూల ఫలితాలు వస్తాయి.ఒక మనిషి వారానికి 55 గంటలు పని చేయడం ఉత్తమం. అంతకంటే ఎక్కువ పని చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా అలసిపోతారు. అదనంగా పని చేయడం వల్ల అదనంగా ఆదాయం వచ్చే మాట వాస్తవమే అయినా.. తద్వారా వచ్చే అనారోగ్యానికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది.అధికంగా పని చేయడం వల్ల వ్యక్తిగత ఆనందం కోసం వెచ్చించే సమయం తగ్గిపోతుంది. ఒక లిమిట్ దాటిన తరువాత పని చేస్తే పనిలో నాణ్యత కూడా పడిపోతుంది. ఇక కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పనిచేసేవారు, అధిక సమయం కూర్చునే గడుపుతారు. వీరికి శారీరక శ్రమ చాలా తక్కువ. రోజులో సుమారుగా 8 నుండి 10 గంటల సమయం పనికే కేటాయిస్తారు. ఇలాంటి వారికి  త్వరగా ఊబకాయం,   డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది.   రోజువారీ శారీరక శ్రమలేని జీవన విధానం కూడా షుగర్ వ్యాధి పెరిగేందుకు కారణమని పరిశోధకులు ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రతిరోజూ ఉదయం లేవగానే అరగంటపాటు వ్యాయామం చేసేవారు ఇకపై తమ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదని అనుకుంటుంటారుగానీ... నిజానికి రోజంతా ఒళ్లు కదల్చకుండా కూర్చోవడం వల్ల కలిగే నష్టాన్ని ఈ అరగంట వ్యాయామాలు ఏమాత్రం భర్తీ చేయలేవని కూడా  చెబుతున్నారు. గంటలతరబడీ అదేపనిగా కూర్చొని పని చేసుకుంటుండేవారు ఎక్కువసేపు కూర్చోకుండా... వీలైనప్పుడల్లా సీట్లోంచి లేచి, అటూ ఇటూ తిరగడం.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ ఆఫీసు కారిడార్లలో పచార్లు చేయడం లాంటివి చేస్తే శారీరక కండరాలకు కదలిక వచ్చి కొంత మేరకు  ప్రయోజనం చేకూరుతుందని  పరిశోధకులు చెబుతున్నారు.కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త .... మీరు బాగుంటేనే మీ  కుటుంబం  బాగుంటుంది.   
  • కొన్ని నెలలక్రితం నన్ను కలుసుకోవడానికి బెంగుళూర్ నుంచి నా ఫేస్బుక్ ఫెండ్ ఒకరు వచ్చారు... మాటలయ్యాక భోజనంవేళ మా ఇంట్లో వాళ్ళు అతనికి గోంగూర పచ్చడి వడ్డిస్తూంటే " అదేంటని ? " అడిగాడు అతను నన్ను. మా ఇంట్లోవాళ్లకీ,, నాకూ ఏక కాలంలో ఆశ్చర్యం వేసింది " అమృతసమానమైన రుచి కలిగినదీ,, "ఆంధ్రశాకం " గా మన కవులచేత కీర్తించబడేదీ అయిన ఈ గోంగూర పచ్చడి గురించి తెలియని మనుష్యులు ఉన్నారా? అనుకున్నాను .  నా ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుని " దీనిని గోంగూర పచ్చడి అని అంటారు ( ఖర్మ ఖర్మ,, ఇలాంటి రోజొకటి వస్తుందనుకోలేదు నేనసలు ) అని దాని యొక్క విశిష్టతనూ, దానిని తయారుచేసే విధానమునూ పూస గుచ్చినట్లు చెప్పానతనికి. అయినా దానినతను ముట్టుకోకుండా సంశయాత్మక మనస్కుడై " తినచ్చో లేదో..?" అన్నట్లు చూస్తూ ఉంటే ఒక ఆంధ్రుడిగా నాకెంతో  బాధేసింది.   అందులోనూ మా ఊరిలో చాలా రుచికరమైన పుల్ల గోంగూర పండుతుంది  కూడానూ...అలాంటి ఆకులతో తయారైన ఆ పచ్చడి తినే అదృష్టం పట్టాలంటే ఆ మనిషికి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేగానీ దక్కదు....అలాంటిది ఇతను దానిని కనీసం  తాకను కూడా లేదు.   ఎలాగైనా ఈ కర్నాటకవాసికి దీనిపై ఉన్న అపనమ్మకాన్ని పోగొట్టి తినేట్లు చెయ్యాలని గట్టిగా నా మనస్సున సంకల్పించుకుని మా ఊరి గోంగూర కాడలను ఓసారి నా మనస్సున ధ్యానించుకుని వాతావరణాన్ని తేలికచెయ్యడానికన్నట్లు,,ఈ పచ్చడి గొప్పతనం తెలిపేట్లు  ఓ కధ చెప్పానిలా అతనికి " పూర్వం దేవతలూ - రాక్షసులూ ముసలితనమూ,,చావూ తప్పించుకోవడానికై అమృతపానం చేస్తే ఫలితం ఉంటుందని తెలుసుకుని ఆ అమృతంకోసమై పాలసముద్రాన్ని మధింప పూనుకున్నారట.ఆది కూర్మాన్ని వేడుకుని కవ్వపుకొండకు అడుగున చుట్టకుదురుగా చేసుకున్నారట.. పాతాళం తాకే మూలభాగంగల మందర గిరిని కవ్వపు కొండగా చేసుకుని నాగరాజ వంశోత్తముడైన వాసుకి ని కవ్వపు త్రాడుగా చేసుకుని ఆవహం,ప్రవాహం మొదలైన వాయుబేధాలను అడ్డత్రాళ్ళుగా అమర్చుకుని బలి నాయకత్వాన రాక్షసులు ఒకవైపూ,,దేవేంద్రుని నాయకత్వాన దేవతలందరూ మరోవైపూ నిలబడి క్షీరసాగర మధనం ప్రారంభించారట.. అప్పుడు సముద్రమధ్య నుంచి భువనగోళాన్నీ,,దిక్కులనూ కబళిస్తూ చెవులు బ్రద్దలు చేసే ఘమఘమ ధ్వని పుట్టిందట..అలా సముద్రమధనం అంతకంతకూ తీవ్రస్థాయి అందుకొంటూ ఉండగా మొదట వానకారు మబ్బు వన్నెతో హాలాహల విషం ఉద్భవించిందట..ఆ విషాగ్ని జ్వాలలకు దేవాసురులు బెంబేలెత్తిపోయి పరమేశ్వరుడిని ప్రార్ధిస్తే ఆయన వీరిని కరుణించి ఆ విషానంతటినీ చాలా అవలీలగా గుట్టుక్కున మ్రింగేశాడట. ఆపద తప్పిందని మళ్ళీ వాళ్లందరూ అమృతంకోసమై పాలకడలిని మధిస్తూంటే వరుసగా చంద్రుడూ,,కల్పవృక్షమూ,,అప్సరసలూ,కౌస్తుభమణీ,ఉచ్చైశ్రవమనే గుర్రమూ,,ఐరావతమూ,,ఇంకా సమస్త కోరికలూ తీర్చే పదార్ధాలూ,,లక్ష్మీ దేవి ఆ తర్వాత అమృతకలశహస్తుడై మహానుభావుడైన ధన్వంతరీ ఉదయించారట.. వెంటనే రాక్షసులు ధన్వంతరి చేతిలోని ఆ అమృతకలశాన్ని లాక్కొని పారిపోతూ ఉండగా నారాయణుడు మోహినీ రూపందాల్చి ఆ రాక్షసులను వంచించి ఆ అమృతకలశాన్ని గ్రహించి దేవతలందరికీ ఆ అమృతాన్ని పంచాడట.. అలా పంచేశాక మిగిలిన ఆ అమృతపు కుండని భూమి మీదకి జారవిడిచేశాడట ఆ విష్ణుమూర్తి.. అది కాస్తా మా పిఠాపురం పరిసర ప్రాంతాలలోని గోంగూర తోటల్లో పండింది... అందుకే అప్పటినుంచీ ఈ గోంగూరకి అమృత  తుల్యమైన ఈ రుచి అబ్బింది  " అని కథ చెప్పడం  ముగించా  అంతే అతగాడు లొట్టలేసుకుంటూ మరికొంచెం వేయించుకుని గోంగూరతోనే భోజనం పూర్తి చేసాడు. ఆ తర్వాత  "నిజంగానే నువ్వు చెప్పినట్లు చాలా బాగుంది కిరణ్ " అని ఇంకాస్త ఓ చిన్న డబ్బాలో వేసుకుని వాళ్ళ ఇంటికి పట్టికెళ్ళాడు కూడా వెళ్తూవెళ్తూ. అదీ గోంగూర పచ్చడి గొప్పదనమంటే !!!             - Kks Kiran