Latest News
ఆరోగ్యం ఆహారం

తెల్లనిదంతా ఉప్పు కాదు !!

1st Image

చాలా చాలా తెల్లగా, జరజరా జారిపోయే అయొడైజ్డ్ ఉప్పు... అసలు ఉప్పే కాదు. సాధారణ ఉప్పు లేత గోధుమరంగులో వుంటుంది. కొంచెం తేమ కూడా కలిగివుంటుంది. అందులో 84 మినరల్స్ వుంటాయి. ఈ మినరల్స్ అన్నీ మన శరీరానికి చాలా అవసరం. మనం వాడుతున్న రిఫైన్డ్ ఉప్పులో రెండే మినరల్స్ వుంటాయి. సోడియం, క్లోరైడ్ లు రెండు మాత్రమే. మిగతావన్నీ మాయం అయిపోతాయి. ఆ కారణంగా అయొడైజ్డ్ ఉప్పు ఎంత తిన్నా శరీరానికి కావాల్సిన ఖనిజాలు అందవు. దాంతో శరీరం మరింత ఉప్పును కోరుకుంటుంది. మనం మరింత ఖనిజరహిత ఉప్పు తింటాం. ఆ విధంగా మనం అవసరమైనదానికంటే అధిక ఉప్పు తీసుకుంటుంటాం. ఫలితంగా కిడ్నీలలో ఫిల్టరింగ్ మెకానిజమ్ దెబ్బతింటుంది. ఉప్పు తగ్గించాలని, మానేయాలని డాక్టర్ చిట్టీ రాస్తాడు. 
అదే మనం అన్ని ఖనిజాలు వున్న ఉప్పు తింటే.. ఇంకా ఇంకా ఉప్పును శరీరం కోరుకోదు. మనం తిన్న సాధారణ ఉప్పునుంచి శరీరం తనకు కావాల్సిన ఖనిజాలను, కావాల్సినంత తీసుకొని, తనకు అక్కర్లేని వాటిని బయటికి పంపిస్తుంది.
సాధారణ ఉప్పులో వుండే మినరల్స్ జాబితా ఇదిగోండి. జాగ్రత్తగా గమనించండి. అందులో (గ్రూప్-3 లో) అయొడిన్ కూడా వుంది. అందులో బంగారం కూడా వుంది.
సహజసిద్ధంగా వుండే అయొడిన్ ను తొలగించి, కృత్రిమంగా కలపడం ఎందుకు?
Group 1
Sodium & chlorine (NaCl = Sodium Chloride)
Group 2
Sulfur, magnesium, calcium & potassium
Group 3
Carbon, bromine, silicon, nitrogen, ammonium, fluorine, phosphorus, iodine, boron, lithium
Group 4
Argon, rubidium, copper, barium, helium, indium, molybdenum, nickel, arsenic, uranium, manganese, vanadium, aluminum, cobalt, antimony, silver, zinc, krypton, chromium, mercury, neon, cadmium, erbium, germanium, xenon, scandium, gallium, zirconium, lead, bismuth, niobium, gold, thulium, thallium, Ianthanum, neodymium, thorium, cerium, cesium, terbium, ytterbium, yttrium, dysprosium, selenium, lutetium, hafnium, gadolinium, praseodymium, tin, beryllium, samarium, holmium, tantalum, europium. 
 
 
-----------  vasireddy venugopal 

  • ఇంతవరకు మనం సోలార్‌ లైట్లు, సోలార్‌ పంపుసెట్లు, సోలార్‌ వాహనాల గురించే విన్నాం. ఇపుడు    కొత్తగా  సోలార్‌ చికెన్‌ వెలుగులోకి వచ్చింది. థాయిలాండ్‌ లో సోలార్ పాపులర్ ఫుడ్ ఐటెం గా మారుతోంది .   ఎవరైనా చికెన్‌ను అగ్గి మీద కాలుస్తారు లేదా స్టవ్‌ మీద రెడీ చేస్తారు కానీ థాయిలాండ్‌లోని సిలా సుతారట్‌ అనే దుకాణాదారుడు మాత్రం  ఓవెన్‌ లేదా చార్‌కోల్‌ బార్బెక్యూ వాడేందుకు బదులుగా 1000 మొబైల్‌ మిర్రర్లను ఉపయోగించి  సూర్యుని నుంచి వచ్చే బలమైన కాంతిని ఆ అద్దాలపై పడేలా చేసి తద్వారా వచ్చే వేడితో చికెన్‌ను తయారు చేస్తున్నాడు. ఒకటిన్నర కేజీ  చికెన్‌ను 10–15 నిమిషాల్లో వండేస్తున్నాడు.  ఆ వేడిని తట్టుకునేందుకు ముఖానికి వెల్డింగ్‌ మాస్క్‌ను ధరిస్తాడు. మెల్లగా మెల్లగా ఇతగాడి బిజినెస్ పుంజుకుంటోంది. 
  • రాగులు తినండి …...వయసు తగ్గించుకోండి..రాగాలు తీయండి రుచులు మార్చుకున్నారు..డాలర్ల రేటు విపరీతంగా పెరిగింది అభిరుచులు మార్చుకున్నారు.అనారోగ్యానికి దగ్గరయ్యారు ఆఫీసులో కావచ్చు…వ్యాపార సంస్థల్లో కావచ్చు….లేదా టీవీ ముందు కావచ్చు. రోజుకు 14 గంటలపాటు కూర్చుని లేదా పడుకుని ఉంటున్నారు చాలామంది. అలాంటివారు గుండె జబ్బులు, ఇతర వ్యాధుల బారిన కూడా పడతారు. రాగులను రోజువారీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషియన్లు అంటున్నారు. మిల్లెట్ అనే  యాంటీ ఆక్సిడెంట్లు  రాగుల్లోపుష్కలంగా ఉంటాయి. అందువల్ల యాంటీ  ఏజింగ్ కు చెక్ పెడుతుంది. వయసు మీద పడినట్లు కనిపించనివ్వదని వారు సూచిస్తున్నారు. రాగుల్లో అమినోయాసిడ్స్ ఆకలిని తగ్గిస్తాయి. ఇంకా బరువును నియంత్రిస్తాయి. రాగిపిండితో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది. అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది. రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రించుకోవచ్చు. ఇంకా రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలకర్ధకమైన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది.  రాగిపిండితో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.  జుట్టు ఎత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి త్రాగించినట్లయితే వారి ఎదుగుదల బాగుంటుంది.నడి వయసు మహిళ్లో ఎముకల పటుత్వం తగ్గుతూ ఉంటుంది. అందుకని మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారుచేసిన రాగిమాల్ట్ ను తాగడం మంచిది. సాధారణంగా రాగులతో తయారుచేసిన ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని నేచురల్ గానే సడలించడంలో సహాయపడుతుంది. ఇది ఆందోళన,వ్యాకులత,నిద్రలేమి పరిస్థితులను దూరంచేస్తుంది. రాగి మైగ్రేన్  సమస్యను నివారించడం కోసం కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. మధుమేహవ్యాధికి రాగులతో చేసిన ఆహారపదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుంది.  రాగుల పానీయం దప్పికను అరికడుతుంది. మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారుచేసిన రాగి మాల్టును తాగడం మంచిది.  పాశం జగన్నాధం 
  • టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి విన్నాం..కానీ టెస్ట్ ట్యూబ్ చికెన్ ఏంటీ అనుకుంటున్నారా ?  మీరు చదివింది నిజమే.త్వరలో టెస్ట్ ట్యూబ్ చికెన్ .. ఫుడ్ మెనూలోకి చేరబోతోంది. పరిశోధకులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. చికెన్ రెసిపీ నుంచి కణాలు తయారుచేసి టెస్ట్ ట్యూబ్ చికెన్ తయారుచేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. టెల్ అవివ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అమిత్ గెఫెన్ ఇప్పటికే లాబొరేటరీలో చికెన్ కణాలతో ఈ ప్రయోగం చేస్తున్నాడు. మోడ్రన్ అగ్రికల్చర్ ద్వారా ఈ చికెన్ సెల్స్‌తో దీన్ని తయారుచేసేందు కూడా ప్లాన్ చేస్తున్నారట. రాబోయే నాలుగు సంవత్సరాలలో ఈ తరహా చికెన్ సూపర్ మార్కెట్లలోకి వస్తుంది. మొత్తం మీద లెక్కకు మించి జనాభా  పెరిగిపోతున్ననేపథ్యంలో  నాన్ వెజ్  రుచుల అవసరాలు తీర్చాలంటే ఇక  టెస్ట్ ట్యూబ్  ఫుడ్డే దిక్కు. టెస్ట్  ట్యూబ్ హాంబర్గర్స్  వరల్డ్ మార్కెట్లో ఆదరణ పొందిన క్రమంలో చికెన్ కు కూడా ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.  ఒకసారి  టెస్ట్ ట్యూబ్ చికెన్ మార్కెట్లోకి  వచ్చిందంటే పౌల్ర్టీల దగ్గర,  చికెన్ షాపుల దగ్గర వెయిట్ చేసే  అవసరం ఉండబోదు. 
  • అసలు కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాల నుండి మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా?  మీ శరీరానికి ఎలాంటి హాని తలబెడుతుందో తెలుసా?  *కూల్ డ్రింక్ తా గిన 10 ని మిషాలకు: * కూల్ డ్రింక్ లో 10 చెంచాలకు సరిపడా షుగర్ ఉంటుంది. సాధారణంగా ఇంత మోతాదులో చెక్కర తింటే వాంతులు అవుతాయి. కాని కూల్ డ్రింక్ లో ఉండేటువంటి ఫాస్ఫోరిక్ యాసిడ్ వాంతులు రాకుండా చేస్తుంది.  *కూల్ డ్రింక్ తాగిన 20 నిమిషాలకు: * కూల్ డ్రింక్ లో ఉన్న షుగర్ ను మన లివర్ రక్తంలోకి పంపిస్తుంది. ఇలా జరగడం వల్ల మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. దీని ద్వారా ఈ షుగర్ కొవ్వు గా మారి బరువు పెరుగుతారు.  *కూల్ డ్రింక్ తాగిన 40 నిమిషాలకు: * రక్తంలోకి షుగర్ ను పంపియడం కొనసాగుతుంది. కూల్డ్రింక్ లో ఉండే కెఫిన్ మెల్లమెల్లగా మీ శరీరంలో నిండుతుంది. దీనితో మీ రక్త పోటు పెరిగి, మీ కంటి పాపలు చిన్నగవుతాయి. కెఫిన్ పెద్దవారికి ఎక్కువ హాని చేయదు, అలా అని ఎక్కువ మోతాదులో దీనిని సేవించినా ప్రమాదమే. అందుకే చిన్న పిల్లలను కూల్ డ్రింకులకు ఎంత దూరం పెడితే అంత మంచిది.  *కూల్ డ్రింక్ తాగిన 45 నిమిషాలకు: * ఇప్పుడు మీ శరీరం డోపమైన్ అనే ఓ కెమికల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చిన్న మోతాదులో డ్రగ్స్ తీసుకున్నట్టే. *కూల్ డ్రింక్ తాగిన 60 నిమిషాలకు: * గంట తరువాత, మీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కూల్ డ్రింక్ లో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్ మీ చిన్న పేగులలో చేరడంతో, అక్కడ ఉండే కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి వాటికి అడ్డు కట్ట వేస్తుంది. దీనితో తరచుగా మూత్రవిసర్జన జరడంతోపాటు, డీహైడ్రేషన్, దాహం లాంటివి పెరుగుతాయి. మన శరీరానికి ఇంతలా హాని తలబెట్టే కూల్ డ్రింక్ తాగడం మనకు మన పిల్లలకు ఏ మాత్రం మంచిది కాదు. వీలైనంత వరకు దీనికి దూరంగా ఉండడమే మంచిది.  whats app message 
  • అధిక రక్తపోటుతో బాధపడే రోగుల సంఖ్య ప్రపంచంలో నానాటికీ పెరుగుతోంది. గడచిన 40 ఏళ్లలో హైబీపీ రోగుల సంఖ్య దాదాపు రెట్టింపైందని తేలింది.  ‘ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్’ శాస్తవేత్తల  నేతృత్వంలో ఓ అధ్యయనం  ఈ విషయం వెల్లడైంది. 1975-2015 మధ్య వివిధ దేశాలలో రక్తపోటు అంశంలో మార్పులపై ఈ అధ్యయనం  జరిగింది. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడి అయ్యాయి.  ప్రపంచ ఆరోగ్య సంస్థ, వివిధ దేశాలకు చెందిన వందలాదిమంది శాస్తవేత్తలు  కలసి దాదాపు 2 కోట్లమంది నుంచి రక్తపోటుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. ఈ పరిశోధనలో కనుగొన్న విషయాలను ప్రఖ్యాత జర్నల్ ‘ద లాన్ సెట్’లో పబ్లిష్ చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హై బీపీ తో బాధపడుతున్న వారి  సంఖ్య 113 కోట్లు. ఇక ఇండియా లో వీరి సంఖ్య 20 కోట్లు అని తేల్చారు.  ఈ స్టడీ  ప్రకారం అత్యధిక ఆదాయం ఉన్న దేశాల్లో రక్తపోటు కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. అతితక్కువ, మధ్యతరహా ఆదాయం ఉన్న దేశాల్లో అధిక రక్తపోటు కేసులు  పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లో వీటి నమోదు ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం తేల్చింది. 2015 సంవత్సరానికి సంబంధించినంతవరకూ యునైటెడ్ కింగ్‌డమ్‌లో అతి తక్కువ హై బీపీ  రోగులున్నట్లు తేలింది.  ప్రపంచంలో అతి తక్కువ స్థాయిలో అధిక రక్తపోటు బాధితులు నమోదైన దేశాల్లో దక్షిణ కొరియా, యుఎస్‌ఎ, కెనడా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. 1975లో సంపన్నులనే అధిక రక్తపోటు ఎక్కువగా వేధించేది.  ఇప్పుడు పూర్తిగా విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన సీనియర్ ప్రొఫెసర్ మజిద్‌ఎజ్జతి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఈ సమస్య పేదవారిలోనే ఎక్కువగా కనిపిస్తోందట.  ఈ పరిణామానికి అసలు కారణం తెలియకపోయినా పండ్లు, కూరగాయల వినియోగం పెరగడం వల్ల, అవి కొనే శక్తి సంపన్నులకు ఉండటం మూలానా అధిక రక్తపోటు ముప్పు వారికి తప్పుతోంది.  పేదలకు పౌష్టికాహారం లోపించడం వల్ల  బీపీ సమస్యగా మారింది.  అధిక రక్తపోటు రావడానికి కారణమైన ఊబకాయం సమస్యను ఎదుర్కొనే విషయంలో సంపన్న దేశాలు ముందున్నాయి.   మహిళల్లో కన్నా పురుషుల్లోనే అధిక రక్తపోటు సమస్య ఎక్కువగా అత్యధిక దేశాల్లో ఉన్నట్లు ఈ పరిశోధనల్లో తేలింది. 2015లో ప్రపంచవ్యాప్తంగా 52.9 కోట్లమంది మంది మహిళలు అధిక రక్తపోటుతో బాధపడితే , హైబీపీ బారిన పడ్డ  పురుషుల సంఖ్య 59.7 కోట్లు. హైబీపీ రోగుల్లోని పెద్దవారిలో సగానికి సగం మంది ఒక్క ఆసియాలోనే ఉన్నారని తేలింది. వీరిలో 22.6 కోట్ల మంది చైనాలోను, 20 కోట్లమంది భారత్‌లోనూ ఉన్నారు. అధిక రక్తపోటువల్ల గుండె, మెదడు, మూత్రపిండాల్లోని రక్తకణాలు, నాళాలపై ఒత్తిడి పెరుగుతుందని, గుండెపోటు, పక్షవాతం రావడానికి ప్రధాన కారణం ఇదేనని పరిశోధన తేల్చింది. ఏటా రక్తపోటు కారణంగా ఇలా చనిపోతున్న వారి సంఖ్య 75 లక్షలు. మగవారిలో అధిక రక్తపోటుతో బాధపడేవారు క్రొయేషియాలో అధికంగా (దేశ జనాభాలో 38 శాతం), మహిళల్లో నైజిరియా (36శాతం) తొలిస్థానాల్లో ఉన్నాయి. 1975 నాటి రక్తపోటు గణనకు సంబంధించిన పరికరాల్లో లోపాలు, సబ్‌సహారా, కరేబియన్ దేశాల్లో సమాచార సేకరణలో ఉన్న అవాంతరాల దృష్ట్యా ఈ అధ్యయనానికి కొన్ని పరిమితులున్నాయని శాస్తవ్రేత్తల బృందం పేర్కొంది. వెల్‌కమ్ ట్రస్ట్ నిధులతో ఈ అధ్యయనం నిర్వహించారు. కాబట్టి హై బీపీ ఉన్న వారు  వెంటనే నివారణ చర్యలు  చేపట్టడం మంచిది.
  • ☘ మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే.  అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది.  అసలు 4, 5వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. ☘ ఆయుర్వేదంలో 300లకుపైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు. అందుకే దీనిని సాంప్రదాయకైన మందుగానూ చెబుతుంటారు మన పెద్దలు. ☘ మునగాకులో ఉన్న అద్భుతమైన అద్భుతమైన ఔషద గుణాలు. ☘ మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ☘ క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ Aని పదిరెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు. ☘ కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకును వాడతారు. ☘ పాల నుంచి లభించే క్యాల్షియం 17రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది. ☘ పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు. ☘ అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు. ☘ మహిళలు రోజుకి 7గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్ గా తీసుకుంటే 13.5శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది. ☘ ఐదు రకాల క్యాన్సర్లకు అద్భుత ఔషదం మునగాకు. లంగ్, లివర్, ఒవేరియన్, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా ఉందని తాజా పరిశోధనల్లో  తేలింది. ☘ యాంటీ ట్యూమర్ గానూ ఆకు వ్యవహరిస్తుంది. ☘ థైరాయిడ్ ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు. ☘ మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ లో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుందట. ☘ అద్భుతమైన ఔషద సంజీవని మన మునగాకు ☘ ☘ మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. ☘ మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు వుండవు. ☘ అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి. ☘ వందగ్రాముల మునగాకులో వుండే పోషక పదార్థాలను ఒక్కసారి పరిశీలిద్దాం ☘ ☘ నీరు – 75.9 శాతం. ☘ పిండి పదార్థాలు – 13.4 గ్రాములు. ☘ ఫ్యాట్స్ – 17 గ్రాములు. ☘ మాంసకృత్తులు – 6.7 గ్రాములు ☘ కాల్షియం – 440 మిల్లీ గ్రాములు. ☘ పాస్పరస్ – 70 మిల్లీ గ్రాములు. ☘ ఐరన్ – 7 మిల్లీ గ్రాములు. ☘ ‘సి’ విటమిన్ – 200 మిల్లీ గ్రాములు. ☘ ఖనిజ లవణాలు – 2.3 శాతం. ☘ పీచు పదార్థం – 0.9 మిల్లీ గ్రాములు. ☘ ఎనర్జీ – 97 కేలరీలు. ☘ ఔషధ విలువలు అద్భుతం ☘ ☘ ప్రారంభ దశలో వున్న కీళ్ళ నొప్పులకు మునగాకు దివ్య ఔషధం. మునగాకును నూరి కట్టుకడితే తగ్గిపోతాయి. ☘ మునగాకును నూరి లేపనంగా రాయడం, కట్టు కట్టడం ద్వారా చర్మరోగాలు, వ్రణాలు నివారణ అవుతాయి. ☘ మునగాకు రసాన్ని సేవించడం ద్వారా దృష్టి మాంద్యము, రేచీకటి తొలగిపోతాయి. ☘ మునగ ఆకులలో అమినో ఆమ్లాలు వుంటాయి. అందువల్ల మాంసకృత్తుల లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. గర్భిణులకు, బాలింతలకు మునగాకు రసం అమృతంతో సమానం. ☘ మునగాకు రసాన్ని దోసకాయ రసంతో కలిసి ప్రతిరోజూ సేవిస్తే గుండె, కాలయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. ☘ మునగ రసం రక్తహీనతను నివారిస్తుంది. ☘ మునగాకుతో మరికొన్ని ఉపయోగాలు ☘ ☘ మునగాకుల రసాన్ని పాలలో కలసి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు. ☘ పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. ☘ గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి. ☘ మునగాకు రసం ఒక చెమ్చా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి. ☘ మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి. ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటివారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ వుంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది. ----- P.V.Lakshmi