Latest News
నేటి క‌బుర్లు

అరుదైన సమస్య ఆ పాపకు శాపం !!

1st Image

ఈ ఫొటోలో కనిపించే పాపది ఫ్లోరిడా. వయసు ఎనిమిదేళ్లు ... పేరు  విర్సావియా బోరన్.
ఎంతో హుషారుగా ఉంటుంది. ఆటల్లో ,పాటల్లో ముందుంటుంది.  బొమ్మలు కూడా వేస్తుంది. 
అత్యంత అరుదైన సమస్యతో ఈ పాప బాధపడుతున్నది. విర్సావియా బోరన్ హృదయ స్పందనలు ఛాతి బయట జరుగుతున్నాయి. వైద్య పరిభాషలో ఈ సమస్యను ఫెంటాలొగీ ఆఫ్ కాంట్రెల్ అని పిలుస్తారు ..ప్రతీ 5.5 మిలియన్ల మందిలో ఒకరికి ఇటువంటి సమస్య వచ్చే అవకాశముంటుందని డాక్టర్లు చెబుతున్నారు.  
సాధారణంగా శరీరం లోపల జరగాల్సిన హార్ట్ బీటింగ్..విర్సావియా విషయంలో హృదయ స్పందనలు కొనసాగుతున్నంత సేపు గుండె ఛాతి బయటకు రావడం లోపలికి పోవడం జరుగుతుంది. (వీడియో చూడండి) 
మరోవైపు  తన కూతురుని  ఎలాగైనా బతికించుకోవాలని పాప  తల్లి ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. విర్సావియాను పరీక్షించిన వైద్యులు పాప ఆరోగ్య పరిస్థితి  సున్నితమైందని, ఆమెకు ఆపరేషన్ చేస్తే ప్రాణానికే ప్రమాదముందని అంటున్నారు.  హైబీపీ వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉందట. దీంతో ఆ తల్లి  దేవుడి మీద భారం వేసి  ఎప్పటికైనా మంచి చికిత్స దొరక్కపోదా అని ఆశతో ఎదురుచూస్తోంది. 
  • మోడీ సర్కార్ పై  టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై చర్చ జరిగిన నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. అవిశ్వాసంపై టీడీపీ వాదన బలహీనంగా కనిపించిందని పవన్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని సరైన రీతిలో ప్రస్తావించిలేకపోయారని అన్నారు. ‘పార్టీకోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ రాజీ పడిందన్నారు. ప్రజల నమ్మకాన్ని టీడీపీ నాయకులు కోల్పోయారు. ఏపీ ప్రజల మనసును గెలిచే సువర్ణావకాశాన్ని తెలుగుదేశం పార్టీ చేజార్చుకుంది. గతంలో ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ప్రత్యేక హోదాను టీడీపీనే గతంలో వ్యతిరేకించింది. ఏపీ ప్రజలు టీడీపీ నాయకులకు ఎలా కనిపిస్తున్నారు. వ్యక్తి గత లాభాల కోసం ‘స్పెషల్‌ క్యాటగిరి స్టేటస్‌’కి మూడున్నర సంవత్సరాలుగా తూట్లు పొడిచి ఈ రోజు వ్యర్థమైన ప్రసంగాలు చేసి ప్రయోజనం ఏమిటి?  కేంద్రం చేత మోసగింపపడ్డాం ..అంటే,ప్రజలు నమ్ముతారు .. అని టీడీపీ నాయకులు ఎలా అనుకుంటారు?  సుదీర్ఘమైన రాజకీయ అనుభవం  ఉన్న నాయకులకి కేంద్రం వంచన తెలియటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే మేము నమ్మాలా ?’ అని పవన్ కల్యాణ్‌  ట్వీటర్‌ ద్వారా ప్రశ్నించారు. 
  • పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై.. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం కురిపించారు. అవిశ్వాసం  పై జరిగిన చర్చ సందర్భంగా సుమారు 20 నిమిషాలకు పైగా ప్రసంగించిన రాహుల్ కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ ప్రసంగాన్ని విని మురిసిపోయారు. గతంలో కంటే రాహుల్ రాటు తేలారని సంబరపడుతున్నారు. ఇక సోనియా గాంధీ సంగతి చెప్పనక్కర్లేదు.   మోదీ విదేశీ పర్యటన గురించి రాహుల్ మాట్లాడుతూ.. ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒప్పందంపై మోదీ సర్కార్ అబద్ధాలాడిందన్నారు. ప్రధాని మోదీ మార్కెటింగ్ కోసం కోట్లు ఖర్చుపెడుతున్నదెవరో? చెప్పాలని డిమాండ్ చేశారు. బడా కంపెనీలతో ప్రధాని కుమ్మక్కు అందరికి తెల్సిందే  అని  వ్యాఖ్యానించారు. యూపీఏ హయాంలో రాఫెల్ విమానం ఖరీదు రూ. 520 కోట్లు కాగా  ఇప్పుడు విమానం ఖరీదు రూ. 1600 కోట్లు అయ్యింది. ప్రధాని ఫ్రాన్స్‌కు వెళ్లి ఎవరితో చర్చలు జరిపారు?. రక్షణమంత్రి దేశానికి అబద్ధం చెబుతున్నారు. భారత్-ఫ్రాన్స్ మధ్య ఒప్పందం గురించి మాట్లాడటానికి.. నేనే స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడితో మాట్లాడాను. రహస్యంగా ఉంచాల్సిందేమీ లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు నాకు స్పష్టంగా చెప్పారు. కొన్ని పారిశ్రామిక సంస్థలకు మేలు చేయడం కోసమే రాఫెల్ డీల్..?. దీనికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి" అని రాహుల్ డిమాండ్ చేశారు.  ఫ్రాన్స్‌ దేశంతో ఇండియా రహస్య ఒప్పందం కుదుర్చుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు.  రాఫెల్‌ కొనుగోళ్లలో వంద శాతం అక్రమాలు జరిగాయని ధైర్యంగా చెప్పగలరని, అక్రమాలు జరగలేదని నిరూపించగలరా? అని రాహుల్  మోదీకి సవాల్ విసిరారు.   రాహుల్ ప్రసంగపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.   దేశానికి ప్రధానిని కాదు.. సేవకుడినని నరేంద్రమోదీ చెబుతారని, మరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కొడుకు జైషా అక్రమాలకు పాల్పడితే ఈ సేవకుడు ఏమైపోయారని  రాహుల్ ఎద్దేవా చేశారు. అమిత్ షా పుత్రుడు 11 రెట్లు ఆస్తులు పెంచుకున్నారని ఆయన ఆరోపించారు .  ప్రధాని ఇచ్చిన మాటకు విలువ ఉండాలన్నారు. ప్రతి ఖాతాలో 15 లక్షలు జమచేస్తామని అధికారంలోకి వచ్చారని, ఏం సాధించారని.. దేశం అడుగుతోందని రాహుల్‌ కేంద్రాన్ని నిలదీశారు. ఏడాదికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారని.. ఆ హామీ ఏమైందని రాహుల్‌ ప్రశ్నించారు.  నన్ను పప్పు అన్నా భరిస్తాను దేశం కోసం అని కూడా స్పష్టం చేశారు.    కాగా ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరకు వెళ్లి కోపాన్ని తగ్గిస్తానంటూ రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకున్నారు. ఊహించని ఈ చర్యతో మోదీ తొలుత తత్తరపాటుకు గురైనారు.  ఆ తర్వాత తేరుకుని రాహుల్ భుజం తట్టి నవ్వారు. అనంతరం రాహుల్ తన సీటులోకి వెళ్లి కూర్చున్నారు. అయితే ఆ తర్వాత రాహుల్ కన్ను గీటారు. ఎవరిని చూసి, ఎందుకు కన్నుగీటారో తెలియదు గానీ ‘అధికార పార్టీకి భలే ఝలక్ ఇచ్చాను కదా’! అన్నట్టుగా ఎవరినో చూసి రాహుల్ కన్ను గీటడం సమావేశాలను వీక్షిస్తున్న ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇపుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై కొద్దీ నెలల క్రితం పార్లమెంటులో తన గళాన్ని గట్టిగా వినిపించిన తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కు అలాంటి మరో అవకాశం లభించబోతోంది.  అవిశ్వాసం పై జరిగే చర్చలో ప్రధాన వక్తగా జయదేవ్ బీజేపీ దుమ్ము దులిపేందుకు సిద్ధమౌతున్నారు.  ఎంపీ కేశినేని నాని చర్చ ప్రారంభించి జయదేవ్ కి అప్పగిస్తారు. సమయం తక్కువ ఇస్తారు కాబట్టి మరింత ఎఫెక్టీవ్ గా మాట్లాడాలని జయదేవ్ కి  సీఎం చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు. చట్టప్రకారం ఏపీకి ఇవ్వాల్సినవి ఎప్పుడిచ్చారు..? ఎంతిచ్చారు.. ఏమిచ్చారు..? ఇలా ప్రతి దానిపైనా పక్కాగా లెక్కలతో సహా సభలో ప్రస్తావించాలని బాబు చెప్పారు. అవిశ్వాసంపై చర్చలో తొలి అవకాశం టీడీపీకే వస్తుంది. ప్రధాని జవాబు తరువాత మళ్లీ ‘రైట్ టు రిప్లై’ ఉంటుంది. చర్చలో ముగ్గురు సభ్యులు మాట్లాడే అవకాశం రావచ్చు. దీన్ని సమర్థంగా ఉపయోగించుకోవాలన్నారు చంద్రబాబు. 18అంశాలలో ఏవిధంగా అన్యాయం జరిగిందో అంశాలవారీగా వివరించాలని సూచించారు. విభజన చట్టం అమలుపై ఇంతవరకూ ఒక్క సమావేశం కూడా ఎందుకు పెట్టలేదో నిలదీయాలన్నారు. కేంద్ర హోంశాఖా పరంగా కానీ, పీఎంవో పరంగా కాని సమావేశాలు జరపలేదన్న విషయం అందరికీ తెలిసేలా చేయాలన్నారు. అలాగే ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్‌కు ఎంత ఇచ్చారు? విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు ఎంత ఇచ్చారు..? దేశం మొత్తానికి వచ్చిన జైకా నిధులు ఒక్క రాష్ట్రానికే ఎందుకు ఇచ్చారు లాంటి ప్రశ్నల్ని కూడా సంధించాలని బాబు చెప్పారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో, అమరావతి శంకుస్థాపనలో ప్రధాని చెప్పిన మాటలు గుర్తు చేయాలని సీఎం సూచించారు చంద్రబాబు. వివిధ సంస్థల శంకుస్థాపనల్లో కేంద్రమంత్రుల ప్రసంగాల్ని కూడా లోక్‌సభ వేదికగా ప్రస్తావించబోతున్నారు.  అలాగే.. సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌లను ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా.. ఏపీకి కేంద్రం  ఎలా అన్యాయం చేస్తుందో వివరించాలన్నారు. అవిశ్వాసంపై చర్చలో కేంద్రం అఫిడవిట్ అంశాలను ఎండగట్టాలన్నారు.  2018 ఫిబ్రవరి 7వ తేదీన  ప్రధాని మోడీ లోక్‌సభలో చేసిన ప్రసంగాన్ని కూడా ప్రస్తావించాలని చెప్పారు . తలుపులు మూసి విభజన బిల్లు ఆమోదించి ఏపికి అన్యాయం చేశారని నాడు మోడీయే చెప్పారని..  ఈ నాలుగేళ్లలో కేంద్రం ఏపీకి ఏం చేసిందో చెప్పాలని గట్టిగా అడగాలన్నారు .బాబు సూచనలమేరకు  జయదేవ్ స్పీచ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.  ఇచ్చే సమయాన్ని బట్టి  మరికొంత సమయం అడిగి తీసుకుని తెలుదేశం వాదన ను జయదేవ్ సభ ముందు ఉంచనున్నారు. 
  • ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  తీరే వేరు.  ఎప్పుడు ఏమి మాట్లాడతారో ఆయనకే తెలీదు. సభా మర్యాదలు కూడా పాటించరు. ఎవరిని ఎంత మాటలైనా అంటారు. తిట్టి ... తిట్టించుకోవడంలో  జేసీ కి  మరెవరు సాటి  రారు.  సాగినంత కాలం నా అంత వారు లేరందరు అనే సామెత జేసీ కి బాగా వర్తిస్తుంది.  తాజాగా ఆయన చంద్రబాబును ఇరుకున బెట్టేలా వ్యవహరిస్తున్నారు. టీడీపీ కేంద్రం పై అవిశ్వాసం ప్రవేశపెట్టిన క్రమంలో జేసీ పార్లమెంటుకి హాజరు కానని బీష్మించుక్కూర్చున్నారు.జేసీ వ్యవహార శైలి ఇపుడు బాబుకి తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక తెలుగుదేశం అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది.  మోడీ తో యుద్ధం చేస్తున్నామని అందులో భాగంగా అవిశ్వాస తీర్మానం నొటీస్ ఇచ్చామని చెప్పుకుంటున్న నేపథ్యంలో  జేసీ  అసలు పార్లమెంటుకే రానని ప్రకటించారు. విప్ జారీ చేసినా వెళ్ళేది లేదు అంటున్నారు.  అవిశ్వాసం పెట్టిన పార్టీ కి చెందిన సభ్యులే సభకు హాజరు కాకపోతే సీఎం చంద్రబాబు పరువు పోతుందని మిగతా ఎంపీలు టెన్షన్ పడుతున్నారు. కీలక సమయం లో జేసీ ఇలా చేయడం సబబు కాదని వారు మండి పడుతున్నారు. ప్రతిపక్షం ఈ అంశంపై విమర్శలు చేసే అవకాశాన్ని చేజేతులా కల్పించినట్లు అవుతోందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.   మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో జేసీ కలకలం రేపారు. కాగా  జేసీ అలక వెనుక  వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్టు సమాచారం.  అనంతపురంలోని పాతూరులో రోడ్ల విస్తరణకు సంబంధించిన వివాదంలో జేసీ ఒత్తిడి చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే వెనుక సీఎం ఉన్నారని జేసీ భావిస్తున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డిని జేసీనే టీడీపీలో చేర్పించారు. ఆయన పార్టీలో చేరి  నెలలు గడచినా ఎలాంటి పదవి ఇవ్వలేదు. అలాగే మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ గుప్తా చేరిక వాయిదా అంశాల్లో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో జేసీ ఈ నెల 12న సీఎంను కలిసినప్పటికీ  వీటిపై స్పష్టత రాకపోవడంతో అలక పూనారని  ప్రచారం జరుగుతోంది.  ఈ నెల 25 లోగా తన డిమాండ్లపై అధిష్టానం స్పందించాలని లేని పక్షంలో పార్టీకి రాజీనామా చేస్తానని కూడా జేసీ అల్టిమేటం జారీ చేసినట్టు  చెబుతున్నారు.  ఆయన్ను బుజ్జగించేందుకు టీడీపీ వర్గాలు  గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి . అయితే తనతో ఎవరూ మాట్లాడలేదని ... బాబు మాట్లాడారో లేదో ఆయనకే తెలియాలని జేసీ అంటున్నారు. 
  • ఏపీ సీఎం  చంద్రబాబు   మాజీ ఎంపీ  ఉండవల్లి అరుణకుమార్ డైరెక్షన్లో నడవబోతున్నారు. ఇవాళ బాబుతో ఉండవల్లి వెలగపూడి సచివాలయంలో సమావేశమైనారు. ఈ సందర్భంగా  రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందంటూ గత పార్లమెంట్ సమావేశాల్లో  ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలనే ఆయుధంగా మలచుకొని ఈ వర్షాకాల సమావేశాల్లో పోరాటం చేయాలని సీఎం కు ఉండవల్లి  సూచించారు.  బుదవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది. ఏపీ విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని ప్రధాని చేసిన వ్యాఖ్యలను సీఎం దృష్టికి ఉండవల్లి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందంటూ సుప్రీంకోర్టులో తాను వేసిన వ్యాజ్యం, రాష్ట్రపతి, ప్రధానికి గత ఏడాది తాను రాసిన లేఖల ప్రతులనూ బాబుకు అందజేశారు. రాష్ట్ర విభజన అంశంపైనా, దాని పై మోదీ చేసిన వ్యాఖ్యలపైనా పార్లమెంటు సమావేశాల్లో నిలదీయాలని సీఎంకు సూచించారు. ‘అసలు రాష్ట్ర విభజనే జరగలేదు. నాడు పార్లమెంటు తలుపు లు మూసిన దగ్గరినుంచి జరిగిందంతా చట్టబద్ధం కా దు. అసలు విభజనకు ఎంతమంది అనుకూలం, ఎంతమంది వ్యతిరేకం అన్న ఓట్ల లెక్కింపూ జరగలేదు. నాడు సభలో జరిగిన పరిణామాలపై చర్చ కోసం ఈ పార్లమెంటు సమావేశాల్లో లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు లు ఇవ్వాలి’ అని సీఎంకు సూచించారు. ఒకవేళ ఆ నోటీసును స్పీకర్‌ తీసుకోకుంటే.. మోదీ చేసిన వ్యాఖ్యల ను గుర్తుచేయాలన్నారు. స్పీకర్‌కు నోటీసులు ఇచ్చే విషయాన్ని పార్టీలో చర్చించి నిర్ణయిస్తామని ముఖ్యమంత్రి అన్నట్లు సమాచారం.  ఇదిలా  ఉంటే  స్పీకర్ కి నోటీసు ఇచ్చినా ఆమె స్వీకరిస్తుందా ? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.  అసలు సమావేశాలు సజావుగా సాగుతాయా ? అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. మొత్తానికి ప్రధాని మాట్లా ఆధారంగా టీడీపీ పోరాటం చేసేందుకు రంగంలోకి దిగుతోంది. చూద్దాం ఏమి జరుగుతుందో ???  ఇంకా ఉండవల్లి ఏమి చెప్పారోతెలుసుకునేందుకు  వీడియో చూడండి. 
  • మహాసంప్రోక్షణ సందర్భంగా శ్రీవారి ఆలయం మూసివేత అంశంపై  ఏపీ సర్కారు దిగివచ్చింది.  సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడం తో సర్కార్ ఉక్కిరి బిక్కిరి అయింది . ఈ అంశంపై  సీఎం చంద్రబాబు స్పందించారు. శ్రీవారి ఆలయాన్ని మూసివేయవద్దని, భక్తులకు దర్శనం కల్పించాలని సీఎం  టీటీడీని ఆదేశించారు. మహా సంప్రోక్షణ నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించవద్దని టీటీడీ అధికారులకు సీఎం సూచించారు. ఆగమ శాస్త్రానుసారం పూజా కార్యక్రమాలు నిర్వహించాలని, గతంలో ఏ సంప్రదాయాలు పాటించారో.. ఇప్పుడు కూడా అవే సంప్రదాయాలు పాటించాలని ఆదేశించారు.  శ్రీవారి ఆలయంలో పూజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. పరిమిత సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రోజులు తరబడి దర్శనం భక్తులు ఎదురూచూసేలా చేయరాదని చెప్పారు. దీంతో  టీ టీ డీ అధికారులు వెనక్కి తగ్గారు. కాగా   భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే దర్శనాలు రద్దు చేశామని, దీనిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసారని ఈ వో అన్నారు. దర్శనం రద్దుపై నిర్ణయాలను పున:సమీక్షించాలని సీఎం ఆదేశించారని ఈవో తెలిపారు. మహాసంప్రోక్షణ సమయంలో దర్శనం కల్పించే విషయంపై 24న జరిగే పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆగస్టు 11న 9 గంటలు, 12న 4 గంటలు, 13న 4 గంటలు, 14న 5గంటలు, ఆగస్టు 15న 5గంటలు, 16న 4గంటలు మాత్రమే దర్శనం కల్పించవచ్చని ఈవో సింఘాల్ అన్నారు .  12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఆలయ మహాసంప్రోక్షణ సందర్భంగా ఆగస్టు 9 సాయంత్రం నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయాలని టీటీడీ తొలుత నిర్ణయం  తీసుకుంది.   సుమారు తొమ్మిది రోజుల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే.