Latest News
నేటి క‌బుర్లు

తెలుగుదేశాన్ని పవన్ కళ్యాణ్ ఏమి అనడం లేదు .... మాజీ ఎంపీ హర్షకుమార్

1st Image

 ఏ రాజకీయ పార్టీ వైపు వెళ్ళేది ఇంకా అమలాపురం మాజీ ఎంపి హర్ష కుమార్ తేల్చలేదు . టిడిపి లో చేరేది లేదని , బిజెపి అంటే ఎప్పుడు ఇష్టం లేదని , వైసిపి విషయం ఇంకా తేల్చుకోలేదని అన్నారు. జనసేన పార్టీ ఏర్పడ్డాకా చూడాలని  చెప్పారు. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమ కు వచ్చాడు .. ఒక కులంలో  ఆయనకు అభిమానులు ఎక్కువ. అయన ఫుల్ టైం రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో చూడాలి. 
కాంగ్రెస్ విభజన విషయంలో మోసం చేసింది ...  ముందు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలని అంటున్న హర్షకుమార్ అంతరంగాన్ని ఆవిష్కరించిన  ఈస్ట్ న్యూస్ టీవీ  వీడియో  చూడండి. 

  • సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజనీ కాంత్ ఫ్రాడ్ మాస్టర్ అని  బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి విమర్శించారు.  రాజకీయాల్లోకి రజనీ ప్రవేశం ఖాయమని వార్తలు వస్తోన్న నేపథ్యంలో  ఆయనపై సుబ్రహ్మణ్య స్వామి మాటల దాడి పెంచారు. ఒక వైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని, రాజకీయాల్లోకి రజనీలాంటి మంచి వ్యక్తులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని  ఇటీవల స్వాగతించిన క్రమంలో  స్వామి  అలాంటి వ్యాఖ్యలు  చేశారు.   అధ్యక్షుడు ఒక రకం గా ...  నేత ఒకరకం మాట్లాడితే కార్యకర్తలు కన్ఫ్యూషన్ లో పడతారు. కానీ స్వామి సంగతి తెలుసు కాబట్టి ఎవరూ ఆయన మాటలకూ విలువ ఇవ్వరు.   రజనీకాంత్ ఓ నిరక్షరాస్యుడని, తమిళులు బాగా చదువుకున్న వారని, అందువల్ల రజనీ రాజకీయాలకు అస్సలు పనికి రారని ఇప్పటికే విమర్శలు చేసిన స్వామి తాజాగా ఆయనపై కొత్త విమర్శలు సంధించారు. రజినీకాంత్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రావద్దని సూచించారు. ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వామి మాట్లాడుతూ, రాజకీయాల్లోకి రావాలన్న రజనీ ఆకాంక్షలకు ఆయన పాల్పడిన ఆర్థిక అవకతవకలు అడ్డుపడతాయన్నారు. ఆ వివరాలు బయటకు వస్తే రజనీ రాజకీయాల్లోకి కొనసాగలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు . వివరాలు బయట పెడితే  ఆయన ఇమేజ్ పూర్తిగా కుప్పకూలిపోతుందని చెప్పారు. 'మీరు రాజకీయాల్లోకి రాకండి' అని రజనీకాంత్‌కు స్వామి హితవు పలికారు. మరి  ఈ హితవును రజనీ కేర్ చేస్తారో లేదో వేచి చూడాలి. ఒకటైతే నిజం .....  చాలామంది ప్రముఖులను కోర్టు కీడ్చిన ఖ్యాతి స్వామిది. 
  • ఎంతో మందిని తన తీర్పుతో  జైలుకి పంపిన ఆయనే  స్వయంగా  జైలులో అడుగుపెట్టాల్సివచ్చింది. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు . ఆయన ఎవరో కాదు  సుప్రీంకోర్టు తీర్పునే ధిక్కరించి అజ్ఞాతంలోనే రిటైరైన వివాదాస్పద కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి సి.సి.కర్ణన్. అజ్ఞాతంలో ఉన్న కర్ణన్  పోలీసులకు చిక్కి... కలకత్తా లోని ప్రెసిడెన్సీ జైలులో అడుగుపెట్టాల్సి వచ్చింది.  సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే అరెస్టు వారెంట్లు, శిక్షలు వేస్తూ తీర్పులిచ్చి, అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహానికి గురైన ఆయన కోల్‌కతా జైలులోకి అడుగుపెట్టినప్పుడు మాత్రం తీవ్ర  భావోద్వోగానికి లోనయ్యారు.    తమాయించుకోలేక కంట తడి పెట్టారు. ఊహించని ఈ పరిణామానికి అధికారులు కూడా  కరిగిపోయారు . చివరకు వారే ఆయనకు స్వాంతన పలికారు. మెల్లగా నచ్చ చెప్పారు.   ఇదే జైలులో నాటి స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్,  అరబిందో ఉన్నారని వివరిస్తూ  అప్పట్లో వారున్న జైలు గదులు చూపించారు. ఆ మహనీయుల పోరాట స్ఫూర్తిని కథలు కథలుగా కర్ణన్‌కు వినిపించారు. ఇవన్నీ విన్నాక కర్ణన్  మళ్ళీ మామూలు మనిషి అయ్యారు. ఆ తర్వాత అధికారులు  'కర్ణన్‌ను చూడగానే వార్తల్లో తాము చూసిన వ్యక్తిలా కనిపించలేదు. ఆయన కన్నీటిపర్వంతమయ్యారు. అది చూసి మేము ఆశ్చర్యపోయాం. తాను జైలులో ఉన్న విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అనిపించింది' అని వివరించారు.  జైలులోని కొందరు ఖైదీలు కూడా కర్ణన్‌ను చూసేందుకు పోటీపడ్డారు. 'తన తీర్పుల ద్వారా ఎందరో నేరస్థులను జైలుకు పంపించిన కర్ణన్‌ను చూసేందుకు ఖైదీలు పోటీపడ్డారు. బహుశా అదే కర్ణన్‌పై ఒత్తిడి పెంచి ఉద్వేగానికి దారితీసి ఉండొచ్చు' అని జైలు అధికారి ఒకరు అన్నారు . . దీంతో సుభాష్, అరబిందోలు ఇక్కడ గడిపిన విషయాన్ని వివరించడం ద్వారా కర్ణన్‌కు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు.  పాపం కర్ణన్ ... కొంచెం లౌక్యంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి తప్పేది. 
  • ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా  విశాఖ ధర్నాకు హాజరు కాకపోవడం పై  పలు కథనాలు ప్రచారంలో కొచ్చాయి.  జగన్  రోజాకు వార్నింగ్ ఇచ్చారని కూడా చెప్పుకుంటున్నారు . అయితే ఆరోగ్యం బాగాలేకనే  రోజా ధర్నాకు రాలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా ఇటీవల రోజా  వివాదాస్పద వ్యాఖ్యల పై పార్టీ నేతలే  జగన్ కు ఫిర్యాదులు  చేశారట. రోజా వల్ల పార్టీ కి డామేజ్ జరుగుతోందని ... ఆమెను కంట్రోల్ లో పెట్టాలని చెప్పారట . ఈ క్రమం లో జగన్ రోజాని పిలిపించి మందలించినట్లు సమాచారం. అప్పటినుంచి రోజా కూడా కొంత దూకుడు తగ్గించింది.  రోజాని జగన్ మందలించడం ఇది మొదటి సారి కాకపోయినా ఈ సారి మాత్రం తీరు మార్చుకోక పోతే వేటు తప్పదని చెప్పినట్లు సమాచారం. మీడియాలో హైలెట్ అవడానికే రోజా అలా ప్రవర్తిస్తుంది అనే ఆరోపణలు కూడా లేకపోలేదు. కాగా కొన్ని సర్వే రిపోర్టులు కూడా రోజాకు వ్యతిరేకంగా రావడంతో  జగన్ గట్టిగా  ప్రశ్నించినట్లు సమాచారం. రోజా స్పీడ్ కి బ్రేకు వేయాలన్న జగన్ ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో  చూడాలి…ఈ నేపథ్యంలో రోజా పార్టీ మారుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. పవన్ పార్టీ లోకి వెళ్ళవచ్చు అని కూడా అంటున్నారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. 
  • రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌  గెలిచే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్డీయే కూటమికి సొంతంగా ఉన్న బలానికి తోడు.. తమ అభ్యర్థిని గెలిపించుకోడానికి ఇక కేవలం 1.7 శాతం ఓట్లు వస్తే చాలు. ఈ వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి అనేక తటస్థ పార్టీలు ముందు  కొస్తున్నాయి. దాంతో కోవింద్‌ గెలుపు దాదాపుగా ఖాయమని చెప్పుకోవచ్చు. . ఇప్పటివరకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమిలో ఉన్న పలు పార్టీలు కూడా ఎన్డీయే అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేడీయూ కీలక నేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఇప్పటికే పరోక్షంగా మద్దతు ఇస్తామన్న సంకేతాలిచ్చారు. బీజేడీ లాంటి పార్టీల నుంచి కూడా మద్దతు లభించే అవకాశం కనిపిస్తోంది. అయితే శివసేన మద్దతు ఖారారు కాలేదు.  తెలుగు రాష్ట్రాల్లో  తెలుగు దేశం , టీ ఆర్ ఎస్ , వైసీపీ  వంటి పార్టీలు కూడా  కోవింద్ కు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఆయన గెలుపు ఖాయమని  విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, మహిళల హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న 71 ఏళ్ల రామ్‌నాథ్‌ కోవింద్‌ యూపీలోని కాన్పూర్‌ దెహత జిల్లా పారౌంఖ్‌ గ్రామంలో 1945 అక్టోబర్‌ 1న జన్మించారు. యూపీలోని దళిత వర్గం, కోలి కులానికి చెందిన ఆయన తండ్రి వ్యవసాయదారుడు. కాన్పూర్‌ విశ్వ విద్యాలయం నుంచి బీకాం, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఆ తరువాత సివిల్స్‌ రాసి విజయం సాధించినా, దాన్ని కాదనుకుని న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు. 1971 నుంచి 1975 వరకు అఖిల భారత కోలి సమాజ్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.1971లో న్యాయవాదిగా జీవితం ప్రారంభించిన ఆయన సుదీర్ఘకాలం పాటు కీలక పదవుల్లో సేవలందించారు. ఢిల్లీ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా 1977 నుంచి రెండేళ్ల పాటు కొనసాగారు. 1978లోనే సుప్రీంకోర్టులో అడ్వొకేట్‌ ఆన్  రికార్డ్స్‌గా ఉన్నారు. 1977 నుంచి రెండేళ్లపాటు ప్రధాన మంత్రి మోరార్జీ దేశాయ్‌ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత బీజేపీలో దళితుల హక్కుల కోసం పోరాడుతూ అంచెలంచెలుగా ఎదిగారు. 1994లో కోవింద్‌ యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1997లో ఆయనకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో స్థానం లభించింది. 1998 నుంచి నాలుగేళ్ల పాటు పార్టీ దళిత మోర్చా అధ్యక్షునిగా పనిచేశారు.ఆగస్టు 8, 2015న బిహార్‌ గవర్నర్‌గా నియమితులు కావడంతో ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇక.. వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే రామ్‌నాథ్‌ కోవింద్‌కు 1974లో సవితతో వివాహమైంది. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
  • తమిళనాడు రైతులను అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చారు  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.   చెన్నైలో ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.అయ్యకన్నుతో పాటు పదహారు మంది రైతులను రజనీ కలుసుకున్నారు.అయ్యకన్ను ఆధ్వర్యంలోనే దిల్లీలో రైతులు ఆందోళన చేపట్టారు.  రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి రజనీకాంత్‌ అడిగి తెలుసుకున్నారు. తమిళ రైతులను ఆదుకుంటానని చెబుతూ వారికి కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పారు.  దాదాపు రెండున్నర నెలలకు పైగా తమిళ రైతులు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేపట్టారు. రైతుల రుణాలను రద్దు చేయాలని, కరవు సాయం అందించాలని డిమాండ్‌ చేస్తూ వినూత్నంగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రైతుల ఆందోళనను ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్తానని సీఎం పళనిస్వామి హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా ఆందోళనను విరమించారు. కానీ సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. మళ్ళీ రైతులు ఉద్యమ బాట పట్టాలని యోచిస్తున్నారు. మహారాష్ట్ర , మధ్యప్రదేశ్, హర్యానా రైతుల  మాదిరిగా పోరాటం చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. 
  • ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరు పోటీ చేసేది ఇంకా ఖరారు కాలేదు. తొలుత రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తిని రాష్ట్రపతిగా  చేయాలని మోడీ  భావిస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ ... ఇపుడు పార్టీ లో వ్యక్తిని బరిలోకి దించే యత్నాలు జరుగుతున్నాయి.  2002లో వాజపేయి చేసిన ప్రయోగాన్ని మోడీ  చేయదల్చుకోలేదని  అంటున్నారు.అప్పట్లోవాజ్ పేయి  అబ్దుల్ కలాం ను తెరపైకి తెచ్చారు. కానీ ఇపుడు మోడీ అలాంటి  ప్రయోగాల పట్ల అంత సుముఖంగా లేరని చెబుతున్నారు.  బీజేపీ నేతల నుంచి ఎంపిక చేసేటట్లయితే సీనియర్‌ నాయకులు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ద్రౌపది ముర్ము, మురళీ మనోహర్‌ జోషి, సుష్మా స్వరాజ్‌ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఆడ్వాణీ, జోషి బాబ్రీమసీదు కూల్చివేతలో అభియోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారిని ఎంపిక చేయకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. సుష్మా తాను రాష్ట్రపతి అభ్యర్థిని కాబోనని తేల్చి చెప్పారు. అంతకు ముందు వెంకయ్య పేరు కూడాప్రచారం లోకొచ్చింది.     ‘పార్లమెంటులో ఉన్న మెత్తం 776 మంది ఎంపీల్లో ఎన్‌డీఏ కూటమికి 400 మందికి పైగా ఎంపీలున్నారు. కొన్ని ఎన్‌డీయేతర పార్టీలు కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాంటప్పుడు బయటి వ్యక్తిని ఎందుకు పోటీలో పెడతాం?’ అని పార్టీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు . స్పష్టమైన మెజారిటీ ఉన్నందున తమకు ఆమోదయోగ్యమైన వ్యక్తిని నిలబెట్టాలని బీజేపీ నాయకులు ఆలోచిస్తున్నారు ?  ప్రతిపక్షాలు ఎలాగూ వారి అభ్యర్థిని పోటీలో దించే అవకాశాలున్నాయని బీజేపీ భావిస్తోంది. కాబట్టి బయటి వ్యక్తులకు  అవకాశం ఇవ్వకుండా సొంత అభ్యర్థినే బరిలోకి దించే వ్యూహంతో పావులు కదుపుతున్నారు.  ఇక ప్రతిపక్షాలు కూడా అభ్యర్థి వేటలో పడ్డాయి. ప్రతిపక్షంది నామమాత్రపు పోటీయే.