Latest News
నేటి క‌బుర్లు

గ్యాస్ దొంగ అంబానీని అరెస్ట్ చేయరే ? మాజీ ఎంపీ హర్షకుమార్

1st Image

నోట్ల రద్దు ఒక్కటే కాదు బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాసేలా పని చేస్తోంది. దానికి ఉదాహరణే కేజ్రీవాల్ , మమతా బెనర్జీ లపై వేధింపులు .
శారదా కుంభకోణం పేరుతో అక్కడి ఎంపిలను సిబిఐ తో అరెస్ట్ చేయించారు .అదే ఏడేళ్ల పాటు ఓన్జీసి గ్యాస్ ను ఆయిల్ ను సముద్రం లోపల కన్నం వేసి దొంగిలించిన ముఖేష్ అంబానీ పై ఎందుకు చర్యలు లేవు . రిలయన్స్ చేసిన దొంగతనాన్ని కెనడా కంపెనీ ధ్రువీకరించింది . సుప్రీం కోర్ట్ మాజీ జడ్జ్ షా బయట పెట్టారు . అలాంటిది వారిని ఎందుకు వదిలేసి అంబానీ ఆదానీలతో విదేశీ టూర్లు చేస్తున్నారు .గాలి జనార్ధన రెడ్డి భూమ్మీద చేస్తే ముఖేష్ అంబానీ సముద్రంలో చేసింది ఒకటే మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో అక్కడ ఒకలా ఇక్కడ ఒకలా ఎందుకు పక్షపాతంతో వ్యవహరిస్తోంది .నోట్ల రద్దుపై సామాన్యులు నలిగిపోయారు .సర్కార్ తప్పు కప్పి పుచ్చుకోవడానికి డిజిటల్ మంత్రం జపిస్తుంది . తమ తప్పులపై మోడీ చర్యలు ఉంటాయనే భయంతోనే చంద్రబాబు , కేసీఆర్ భజన చేస్తున్నారు . ఓటుకు నోటు కేసులో చంద్రబాబును , ఆయిల్ గ్యాస్ స్కామ్ లో ముఖేష్ అంబానీ ని అరెస్ట్ చేయాలి .2019 ఎన్నికల్లో ఎవరికి బావుందో ఆరునెలల ముందు చూసుకుని పార్టీలు ఆనాడు వారితో కలిసి ప్రయాణిస్తాయి . ఈస్ట్  న్యూస్  టీవీ ఇంటర్వ్యూ లో  మాజీ ఎంపీ  హర్షకుమార్  వెలిబుచ్చిన  అభిప్రాయాలివి .
ఆయన ఇంకా ఏమన్నారో చూడండి   వీడియో 

  • మహిళల  కోసం మహిళలే నిర్మించుకున్న  గ్రామం అది . అక్కడ మగవాళ్లకు  ఏ మాత్రం  ప్రవేశం లేదు. మగవాళ్లు వూళ్లోకి రావడానికి కూడా వారు ఒప్పుకోరు. గృహహింస, మగాళ్ల వేధింపులు, అత్యాచారాలు, అఘాయిత్యాలకు గురైన  మహిళలు , భర్త వదిలేసిన వారు, వితంతువులకు ఈ గ్రామం రక్షణ కల్పిస్తుంది. అలాంటి బాధితులతోనే ఈ వూరు ఏర్పడిందంటే మహిళలపై అక్కడ జరిగే దారుణాలను అర్థంచేసుకోవచ్చు. మహిళలు, బాలికలకు ఆ గ్రామం స్వర్గం లాంటిది. ఈ గ్రామం కెన్యాలో ఉంది. దాని పేరు  ఉమోజా!! కెన్యా ఉత్తర ప్రాంతంలో రెబెకా అనే మహిళ 25ఏళ్ల క్రితం కేవలం మహిళల కోసమే ఉమోజా అనే  గ్రామాన్ని  ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి మహిళల రక్షణ కోసం ప్రయత్నిస్తున్నారు. ఉమోజా గ్రామ ప్రస్తుత చీఫ్ ఆమె. రెబెకా అక్కడి సంబూరు తెగకు చెందిన మహిళ. గతంలో అక్కడ  బ్రిటిష్ సైనికులు శిక్షణ పొందేవారట , ఆ సమయంలో వారి అకృత్యాలకు హద్దు ఉండేది కాదట . తదనంతరం  అక్కడి పురుషులు కూడా  మహిళలను విపరీతంగా కొట్టేవారు. ఓ రోజు గ్రామంలో వ్యక్తులు ఆమెను విపరీతంగా కొడుతుంటే భర్త అడ్డుకోలేదట. ఇక పురుషులకు దూరంగా కొత్త గ్రామాన్ని నిర్మించుకోవాలని అనుకొని 1990లో ఉమోజా గ్రామం ఏర్పాటు కు మొదలుపెట్టారు.క్రమంగా  ఎందరో బాధితులు ఆమెతో చేరిపోయారు. గ్రామం ఏర్పాటైంది. భర్త వేధింపులు తాళలేక వచ్చేసిన వారు, భర్త చనిపోయిన వారు, అత్యాచారాలకు గురైన వారు, అనాధలు, బలవంతపు పెళ్లిళ్లు వద్దనుకొని పారిపోయి వచ్చినవారు.. ఇలా ఒకరా ఇద్దరా ఎంతో మంది ఎన్నో రకాల మగవాళ్ల వేధింపులు తట్టుకోలేక బయటపడ్డ మహిళలకు ఈ గ్రామం  అండగా నిలిచింది. పురుషులకు ప్రవేశం లేదని  చెప్పి ఇప్పుడు బాధిత మహిళలు ఉమోజా గ్రామంలో సంతోషంగా బతుకుతున్నారు. గ్రామంలో మహిళలు బతుకుతెరువు కోసం రకరకాల ఆభరణాల తయారీ, ఇతర ఎన్నో పనులు చేస్తుంటారు. ఇలా వారు ఇళ్లు కట్టుకున్నారు. పిల్లలు చదువుకోవడానికి పాఠశాల కూడా నిర్మించుకున్నారు. కమ్యునిటీ సెంటర్, ఇంకా ఎన్నో సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఉమోజా గ్రామం పర్యాటక ప్రాంతంగానూ అభివృద్ధి చెందుతోంది. మగవాళ్లకు ఈ గ్రామంలోకి రావడానికి అనుమతి లేదు. కానీ పర్యటకులకు మాత్రం వారు పెట్టిన కొన్ని నిబంధనలకు ఒప్పుకుంటే సందర్శనకు అనుమతి ఇస్తారు.    వీడియో చూడండి.  
  • ఉత్తర కొరియాపై యుధ్దానికి అమెరికా సిద్ధమవుతోంది. ఒకవైపు అమెరికా బాంబర్ విమానాలు, మరోవైపు దక్షిణ కొరియా ఫైటర్ జెట్లు. వీటికి తోడుగా జపాన్ యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. ఉత్తర కొరియా సరిహద్దుల్లో అవి చక్కర్లు కొట్టాయి. ఇదంతా సంయుక్త విన్యాసాల్లో భాగమేనంటూ ప్రకటించాయి. కానీ ఇవి సాధారణ విన్యాసాలు మాత్రం కావు.  యుద్ధానికి సిద్దమనే  సంకేతాలు  అంటున్నారు. అణుదాడి  చేస్తామంటూ  వరుస హెచ్చరికలతో  ఎగిరిపడుతున్న  కిమ్ పని పట్టేందుకు ట్రంప్ వ్యూహాత్మకంగా  ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఏ క్షణమైనా ఉత్తరకొరియాపై అమెరికా బాంబుల వర్షం కురిపించవచ్చు.  ఉత్తర కొరియా  అధ్యక్షుడు కిమ్ లక్ష్యంగా క్షిపణులు విరుచుకుపడొచ్చు. ఆ క్షణం ఎప్పుడెప్పుడా అన్నట్లు ట్రంప్ ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద అమెరికా, ఉత్తరకొరియా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.   ఇదిలా ఉంటే ....   చరిత్రలోనే మొదటిసారిగా ఏ అమెరికా అద్యక్షుడు చేయలేని పనిని ట్రంప్ చేయబోతున్నారు. ఆయన వచ్చే నెలలో ఉత్తరకొరియా, దక్షిణకొరియా సరిహద్దుల్లో కాలుపెట్టనున్నారు. ఈ విషయాన్ని దక్షిణకొరియా అధికారిక మీడియా ప్రకటించింది.  సెప్టెంబర్ చివరి వారంలోనే  ట్రంప్  భద్రతా సిబ్బంది  ఈ  పర్యటన కోసం ఏర్పాట్లు  మొదలు పెట్టాయి.  ట్రంప్ తన తొలి కొరియా దేశాల పర్యటన సందర్భం గా  అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పర్యటనతో ట్రంప్ ఉత్తరకొరియాకు స్ట్రాంగ్ మేసేజ్ ఇచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దక్షిణకొరియాలోని ట్రూస్ విలేజ్‌లో ట్రంప్ బస చేస్తారని ఆ ప్రాంతం డి మిలిటైరేషన్ జోన్ అని అధికారులు తెలిపారు. అయితే ఉత్తరకొరియా ట్రంప్ పర్యటనపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలని దక్షిణకొరియా అధికారులు చెబుతున్నారు.  ఈ లోపే యుద్ధం జరిగే అనివార్య పరిస్థితులు తలెత్తితే  ట్రంప్ పర్యటన వాయిదా పడవచ్చు. 
  • ఈ ఫొటోలో కనిపించే పాపది ఫ్లోరిడా. వయసు ఎనిమిదేళ్లు ... పేరు  విర్సావియా బోరన్. ఎంతో హుషారుగా ఉంటుంది. ఆటల్లో ,పాటల్లో ముందుంటుంది.  బొమ్మలు కూడా వేస్తుంది.  అత్యంత అరుదైన సమస్యతో ఈ పాప బాధపడుతున్నది. విర్సావియా బోరన్ హృదయ స్పందనలు ఛాతి బయట జరుగుతున్నాయి. వైద్య పరిభాషలో ఈ సమస్యను ఫెంటాలొగీ ఆఫ్ కాంట్రెల్ అని పిలుస్తారు ..ప్రతీ 5.5 మిలియన్ల మందిలో ఒకరికి ఇటువంటి సమస్య వచ్చే అవకాశముంటుందని డాక్టర్లు చెబుతున్నారు.   సాధారణంగా శరీరం లోపల జరగాల్సిన హార్ట్ బీటింగ్..విర్సావియా విషయంలో హృదయ స్పందనలు కొనసాగుతున్నంత సేపు గుండె ఛాతి బయటకు రావడం లోపలికి పోవడం జరుగుతుంది. (వీడియో చూడండి)  మరోవైపు  తన కూతురుని  ఎలాగైనా బతికించుకోవాలని పాప  తల్లి ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. విర్సావియాను పరీక్షించిన వైద్యులు పాప ఆరోగ్య పరిస్థితి  సున్నితమైందని, ఆమెకు ఆపరేషన్ చేస్తే ప్రాణానికే ప్రమాదముందని అంటున్నారు.  హైబీపీ వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉందట. దీంతో ఆ తల్లి  దేవుడి మీద భారం వేసి  ఎప్పటికైనా మంచి చికిత్స దొరక్కపోదా అని ఆశతో ఎదురుచూస్తోంది. 
  • ఇండోనేసియాలో రగులుతున్న  ‘మౌంట్‌ అజుంగ్‌ ' అగ్నిపర్వతం  ప్రజలను భయ భ్రాంతులను చేస్తోంది.   ఇది ఏ క్షణంలో  విస్ఫోటనం చెందుతుందో అని ఆందోళనతో  వేలాది మంది ప్రజలు  ప్రాణాలు అరచేత పట్టుకొని ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారు.   ‘మౌంట్‌ అజుంగ్‌’గా పిలుస్తున్న ఈ అగ్నిపర్వతం బాలి ద్వీపంలోని కౌటా పర్యటక ప్రాంతానికి 75 కి.మీ. దూరంలో ఉంది. చివరిసారిగా ఇది 1963లో విస్ఫోటనం చెందింది. అప్పట్లో పది వేల మందికిపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. ఆ తర్వాత ఎలాంటి ప్రమాదాలు జరగక పోయినా ... సుదీర్ఘ కాలం అనంతరం  ఈ ఏడాది ఆగస్టు నుంచి మళ్లీ పర్వతం లో నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి. లోలోపల అగ్నిపర్వతం రగులుకుంటూ పైకి అలా శబ్దాలు వినిపిస్తున్నాయేమో అని సందేహాలతో ప్రజలు హడలి పోతున్నారు.  ముప్పు పొంచివున్న ఈ  ప్రాంతంలో  60 వేల మందివరకూ నివసిస్తున్నారని అంచనా. వీరిలో 48,540 మంది ఇళ్లను వదిలి వెళ్లిపోయారని  ఇండోనేసియా విపత్తు ప్రతిస్పందన సంస్థ చెబుతోంది. ‘కొంతమంది మాత్రం ముప్పు పొంచివున్న ప్రాంతాలను వదిలిపెట్టడంలేదు. వీరిలో కొందరు విస్ఫోటనం మొదలుకాకముందే ఎందుకు వెళ్లిపోవడమని భావిస్తున్నారు. మరికొందరు పశు సంపద గురించి ఆందోళన పడుతున్నారు. ఇదిలా ఉంటే  ఇది  పర్యాటకప్రాంతం కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎక్కువగా రిసార్ట్స్ ఉన్నాయి. పర్యాటకులు కూడా అగ్నిపర్వతం గురించి తెలియగానే వెనక్కి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం కూడా  తీవ్రస్థాయి ముప్పు హెచ్చరికలు జారీ చేసింది.  అగ్నిపర్వతానికి  తొమ్మిది కి.మీ. పరిధి ప్రాంతంలో ఎవరూ ఉండకూడదని హెచ్చరించింది. దీంతో ప్రజలు అక్కడనుంచి తరలి వెళుతున్నారు.  స్థానికుల కోసం తాత్కాలిక శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
  • అమెరికా జెట్‌ విమానాలను క్షిపణితో కూల్చివేసినట్లు ఒక  వీడియో, ‘ట్యాంపర్‌’ చేసిన ఫొటోలు  ఇపుడు నెట్ లో హల్  చల్ చేస్తున్నాయి. వీటిని ఉత్తర కొరియా నే  విడుదల చేసిందని అనుకుంటున్నారు.  ఇలాటి వీడియోలను విడుదల చేయడం ద్వారా అమెరికాతో యుద్ధానికి ఉత్తర కొరియా తహ తహ లాడుతోందా ? అందులో భాగంగానే మరో అడుగు ముందుకు వేసిందా? అన్న సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి.  ఈ అంశంపై అమెరికా స్పందన తెలియాల్సి ఉంది.  మరోవైపు ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్‌ హో మాట్లాడతూ మొదట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యుద్ధం ప్రకటించడం... ఆ దేశ బాంబర్లను కూల్చివేసే హక్కును తమకు ఇచ్చిందని తేల్చి చెప్పారు.  అవి ఉత్తర కొరియా గగనతలంలోకి రాకపోయినా తాము కూల్చివేయొచ్చని ప్రకటించారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. మరో మూడు దేశాలకు నిషేధాన్ని వర్తింపజేస్తూ కొత్త ఉత్తర్వులు జారీచేశారు. గతంలో సిరియా, లిబియా, ఇరాన్‌, యెమెన్‌, సూడాన్‌, సొమాలియా దేశాలపై విధించిన నిషేధం గడువు కొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ జాబితా నుంచి సూడాన్‌ను తొలగించి.. కొత్తగా ఉత్తరకొరియా, చాద్‌, వెనిజువెలాలను చేర్చారు. మొత్తం మీద వాతావరణం వేడెక్కుతోంది. ఇది ఏమలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. 
  • మెక్సికో దేశాన్ని పెను  భూకంపం అతలాకుతలం చేసింది . మంగళవారం రిక్టర్‌ స్కేల్‌పై 7.4 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి 150మందికి పైగా మరణించారు. వేలాది మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు .  వందలాది ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, బహుళ సముదాయాలు  దెబ్బతినగా.. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్యూబ్లాకు తూర్పు వైపున భూకంప కేంద్రం నమోదైనట్లు మెక్సికో భూకంప శాస్త్ర అధ్యయన సంస్థ ప్రకటించింది.సహాయక చర్యలు చేపట్టారు. భయానికి గురైన ప్రజలు రోడ్లపైనే ఉన్నారు.  ప్యూబ్లా, మొర్లస్‌, మెక్సికో సిటీలో భూకంప తీవ్రత ఎక్కువ నమోదు అయింది.శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారని, సహాయక కార్యక్రమాలు పూర్తయితే కానీ పూర్తి వివరాలు అందుబాటులోకి రావని అధికారులు అంటున్నారు.  ఇటీవలే భూకంపం, తుపాను వల్ల మెక్సీకో తీవ్రంగా నష్టపోయింది. 1985 సెప్టెంబర్‌ 19న కూడా మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. నాటి ప్రమాదంలో దాదాపు 10 వేల మంది వరకు మృతి చెందారు. సరిగ్గా 32 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే రోజు  భారీ భూకంపం సంభవించడం యాదృచ్చికం.  వీడియో చూడండి.