Latest News
నేటి క‌బుర్లు

చిరుతో రోజా ఇంటర్వ్యూ వ్యూహాత్మకమేనా ?

1st Image

మెగా స్టార్  చిరంజీవితో రోజా ఇంటర్వ్యూ వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా ? 
ఉంటే ఉండొచ్చు ... కానీ అవేవి ఇంకా మెటీరియలైజ్ కానీ స్థితిలో ఉన్నాయి. 
ఈ నేపథ్యంలో  జగన్ చెందిన సాక్షి టీవీ కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే  రోజా చిరంజీవిని ఇంటర్వ్యూ చేయడం ఓ హాట్ టాపిక్‌గా మారింది.
రోజా ఇంటర్వ్యూలో కొన్ని రాజకీయపరమైన ప్రశ్నలు ఉన్నప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై గానీ, తెలుగుదేశం పార్టీపై గానీ ఏ విధమైన ప్రశ్నలు లేవు.  
ఇది సినిమా వరకే పరిమితమవుతుందా, భవిష్యత్తులో కాంగ్రెసు, వైఎస్సార్ కాంగ్రెసు కలిసి పనిచేయడానికి దారి తీస్తుందా?  లేక మరేదైనా మలుపు తిరుగుతుందా అనే చర్చ సాగుతోంది.
ఏ పరిస్థితుల్లో మళ్ళీ సినిమా రంగంలోకి రావాల్సి వచ్చిందో ... కారణాలేమిటో చిరు వివరించారు. వివిధ అంశాలపై చిరు ఎలా స్పందించారో   వీడియో చూడండి. 
vedeo courtesy... sakshi tv
  • సోషల్ మీడియా వాక్ స్వాతంత్రానికి వేదిక . లోకేష్ సెలబ్రెటీ కావడం వల్లే ఆయనపై పోస్ట్ లు పెడతారు . అవసరం లేని అంశాలు వదిలి బాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ వంటి వాటిమీద దృష్టి పెట్టాలి . లోకేష్ మామ బాలకృష్ణ మీద వున్నన్ని పోస్ట్ లు ఎవరిమీద వుండవు . జగన్ ఆసియా మొత్తం దోచేశాడని పోస్ట్ లు పెట్టినప్పుడు తప్పులు కనపడలేదా . గతంలో రామోజీ వ్యవహారం చూడండి . జస్టిస్ చలమేశ్వర్ నారీమాన్ బృందం ఇచ్చిన తీర్పు ప్రకారం సెక్షన్ 66 ను కోర్ట్ కొట్టేసింది .సోషల్ మీడియా లో ఏదైనా పోస్ట్ చేసే హక్కు ప్రతి వారికి వుంది . రవి కిరణ్ ను అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఎందుకు హడావిడి చేశారు . అతన్ని కౌన్సిల్ కి పిలిపించి ప్రశ్నిస్తే సరిపోయేదానికి పెద్ద హంగామా అవసరమా .. రాహుల్ గాంధీ పై సాక్షాత్తు ప్రధాని చేసిన కామెంట్స్ మొన్నటి ఎన్నికల్లో ఏమిటి ? రాహుల్ ను పప్పు అనే పిలిచేవారు ఇక్కడ లోకేష్ సెలబ్రెటీ కావడం వల్లే అతను ఏ చిన్న తప్పు చేసినా ప్రచారం అయిపోతుంది . అనుభవం అనుభవం అంటూ జగన్ ను దెప్పి పొడిచిన చంద్రబాబు కొడుకును ఏ అనుభవంతో మంత్రిని చేశారు . అన్ని ప్రజలు గమనిస్తున్నారు .అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ .  ఇంకా ఆయన ఏమన్నారో చూడండి. 
  • ప్రధాని నరేంద్ర మోడీని అనకొండ గా  చూపిస్తూ కార్ట్టూన్ వేసి  కథనాన్ని రాసిన ఆంధ్రజ్యోతి పై ఏ చర్యలు తీసుకోవాలని  బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు.  సోషల్ మీడియాలో వ్యంగ చిత్రాలతో పోస్ట్లు పెట్టె నెటిజనులపై చర్యలు తీసుకోవాలన్న మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యలను ఆయన తప్పు బట్టారు.  ఇసుక మాఫియా ఆగడాలు చూస్తుంటే ప్రభుత్వం ఉన్నట్టు అనిపించడం లేదని వీర్రాజు అభిప్రాయ పడ్డారు. ఇంకా  ఆయన ఏమన్నారో వీడియో చూడండి.   vedeo courtesy... telugu global tv
  • ముందస్తు ఎన్నికల సంకేతాల నేపథ్యంలో వైసీపీ ఈ సారి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో టీడీపీ తో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధం అవుతోంది. రెండు రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్ తో ప్రశాంత్ కిషోర్ సమావేశమైనారు. ఏపీ పాలిటిక్స్ పై సుదీర్ఘంగా చర్చించారు. తర్వాత పార్టీ నేతలు ప్రశాంత్ కి పార్టీ బలాబలాలు .. ప్రత్యర్థుల బలహీనతలు .. ఏపీ లో నెలకొన్న పరిస్థితులు ... ముఖ్యంగా 2014 నుంచి అధికార పార్టీ వైఫల్యాల గురించి వివరించారట. ప్రశాంత్ కిషోర్ కొద్దీ రోజులపాటు హైద్రాబాద్, విజయవాడలలోనే ఉండి ఎన్నికల వ్యూహాన్ని దశల వారీగా ఎలా చేపట్టాలో ఖరారు చేస్తారు. అలాగే  ఆయన  కొద్దీ రోజులు ఏపీ లో పర్యటిస్తారు. శిక్షణ పొందిన ప్రశాంత్ టీమ్ సభ్యులు జనంలోకి వెళ్లి వైసీపీకి అనుకూల పరిస్థితులు ఏమిటి ? వ్యతిరేక పరిస్థితులేమిటి ? అన్న సమాచారం రాబడతారు. ఈ సర్వే జరుగుతున్న క్రమంలోనే అధికారపార్టీ వైఫల్యాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేపడతారు. సోషల్ మీడియాను కూడా విస్తృత స్థాయిలో  వినియోగించుకుంటారు. కొత్త రాజకీయ ఎత్తుగడలతో, వ్యూహాత్మకంగా జగన్ జనం లోకి దూసుకు పోయేలా ప్రశాంత్ ప్లానింగ్ ఇస్తారట.  గతంలో గుజరాత్ లో నరేంద్ర మోడీ , బీహార్ లో నితీష్ గెలవడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే కారణం అని అంటారు. ఎన్నికల వ్యూహ రచనల్లో ఎత్తుగడల నిపుణుడుగా పేరున్న ప్రశాంత్ కిషోర్ వచ్చాక పార్టీ వ్యవహార శైలి లో మార్పు రావచ్చు అంటున్నారు. ప్రత్యేకంగా జగన్ హావభావాలు, సమాధానాలు ఇచ్చే తీరు, సభల్లో ఆకర్షణీయ ప్రసంగం ఎలావుండాలి ? అసెంబ్లీలో ఎలా ఉండాలి ?  అధికారపార్టీని దుయ్యబట్టే తీరు ఏవిధంగా ఉండాలి ? తదితర అంశాలపై టిప్స్ కూడా ఇస్తారట. అలాగే ఒకే అంశంపై వివిధ స్థాయిల్లో నాయకులు ఎలా మాట్లాడాలి ? జిల్లా స్థాయిలో నాయకులు ఏ అంశాలపై మాట్లాడాలి ? వంటి విషయాల్లో కూడా సలహాలు సూచనలు  ప్రశాంత్ ఇస్తారని సమాచారం. 2014 సార్వత్రిక ఎన్నికల్లోమోడీ  కోసం చాయ్ పే చర్చ సహా పలు సృజనాత్మక ప్రచార వ్యూహాలను రూపొందించిన  ప్రశాంత్  జగన్ కోసం వినూత్న ప్రచార వ్యూహాలను  రెడీ చేస్తారని అంటున్నారు. గత ఎన్నికలలో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయిన  వైసీపీ ఈ సారి మరింత బలోపేతమై దూసుకు పోవడానికి అవసరమైన సూచనలు .. ప్రణాళికలు రాబోయే కాలంలో సిద్ధమౌతాయి. 
  • వైసీపీ , జనసేన  జతగా రాబోయే ఎన్నికల్లో అడుగులు వేయబోతున్నాయా ?  జగన్ ,పవన్ పొత్తుల  కోసం ఎత్తులువేస్తున్నారా..? తాను మద్దతిచ్చిన టీడీపీని దూరం పెడుతూ... వైసీపీకి దగ్గరవుతున్నారా..?  ఇటీవల పవన్  మాట్లాడుతున్న తీరును బట్టి చూస్తుంటే ఈ సందేహాలు కలుగుతున్నాయి. ఏపీ ప్రత్యేక హోదాకోసం వైసీపీ నేతలు పోరాటం చేయడం స్పూర్తి దాయకం అని  పవన్ కల్యాణ్ ప్రశంసించారు. అలాగే టీడీపీ నేతలను  ఏకి పడేశాడు .  ఈ మాటల్ని బట్టి చూస్తుంటే జగన్ తో కలిసిపనిచేసేందుకు పవన్ ఉత్సుకత చూపుతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతోంది. ఇదివరలో  జనసేన సభల్లో రాష్ట్రాభివృద్ధికోసం పనిచేసే ఏ రాజకీయ పార్టీతోనైనా కలిసి పనిచేసేందుకు తానెప్పుడు సిద్ధమేనని చెప్పిన పవన్ సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో వైసీపీ పనితీరు బాగుందని  పవన్ పొగడడం పొత్తుకు  సుముఖత చూపడమే అని  అంటున్నారు . ఇక ఏపీలో టీడీపీ పరిస్థితి అంత బాగాలేదు .  బాబు ఏదో తన శైలిలో పని చేస్తున్నారు కానీ  అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదు . ఓ వైపు అవినీతి, కుమ్ములాటలు, నిరుద్యోగంతో విసిగెత్తి పోయిన ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీకోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ కి ప్రత్యామ్నాయం గా జగన్ పవన్ కలిస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వినబడుతోంది. వీరితో పాటు వామ పక్షాలు కలిస్తే ఎన్నికల్లో  దూసుకుపోవడం సులభం అంటున్నారు.  అయితే పవన్ టీడీపీ మనిషే అన్న అనుమానం వైసీపీ శ్రేణుల్లో ఉంది. దానికి కారణం పవన్ గట్టిగా చంద్రబాబుపై  విమర్శలు  చేయడం లేదు. ఆమధ్య క్లీన్ పాలిటిక్స్ తమ పార్టీ  లక్ష్యమని చెప్పిన పవన్  చంద్రబాబు వైసీపీ కి చెందిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని వారిలో కొందరికి మంత్రి పదవులు కట్టబెట్టిన తీరుపై స్పందించలేదు. మొన్న టీడీపీ మంత్రి అయ్యన్న పాత్రుడు వచ్చే ఎన్నికల్లో పవన్ బీజేపీ ,టీడీపీ కలసి పని చేస్తాయని ప్రకటించారు. ఆ అంశంపై కూడా జన సేన నుంచి స్పందన లేదు. ఇలా కొన్ని అంశాలపై వైసీపీ నేతల్లో ,శ్రేణుల్లో సందేహాలు ఉన్నాయి. రాజకీయాల్లో  శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి  జగన్ పవన్ కలసి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
  • తమిళనాడు రాజకీయాలు అన్ని ఆయన కనుసన్నుల్లో చక్కగా జరిగి పోతున్నాయి. ఇక పన్నీర్ సెల్వం ను తిరిగి సీఎం చేయడమే మిగిలింది. శశికళ కు ఇచ్చిన షాక్ నుంచైనా గుణపాఠాలు నేర్చుకోకుండా చెలరేగి పోతే ?అధికారం ఉందికదా అని విర్ర వీగితే ? ముగింపు ఇలాగే ఉంటుంది.  ఎక్కడ దొరుకుతారా అని వేయికళ్లతో ఓపిగ్గా ఎదురు చూసిన ఆయన గారికి  ఉపఎన్నికల సమయంలో లడ్డులా దొరికిపోయారు దినకరన్.. దాంతో తీగ లాగారు ... డొంకంతా కదిలింది. దేశం లో ఎక్కడేమి జరిగినా పట్టించుకోని ఇన్కమ్ టాక్స్ అధికారులు ఒక్క సారిగా అలెర్ట్  అయ్యారు .. ఆఘమేఘాల మీద పరుగెత్తారు. ఇదంతా చూసి ఎన్నికల్లో డబ్బు పంచడం అనేది ఒక్క తమిళనాడు కే పరిమితమా అని  దేశ ప్రజలు నివ్వెర పోయారు. ఇన్కమ్ టాక్స్ అధికారుల చురుకుదనం చూసి అచ్చెరువొందారు. మొత్తం మీద భూతద్దమేసి  గాలించి మంత్రి విజయభాస్కర్ ఇంట్లో నగదు నట్రా .. ఇతర కాగితాలు చేజిక్కించుకున్నారు. కేసులు బుక్ చేశారు. మరికొంతమంది మంత్రులను ఇరికించారు. ఎన్నికను రద్దు చేసి పడేసారు. ఈ దినకరన్ పిచ్చోడు కాకపోతే ఇలాంటి  సమయంలోనే మనిషి పంపి ఈ సి అధికారులకే లంచమివ్వమని పురమాయిస్తాడా ? తింగరి తనం కాకపోతే !! ఖర్మ కాలితే అంతే కదా మరి.   మరో ఛాన్స్ తానే ఇచ్చాడు. మళ్ళీ బుక్ పోయాడు. రాత్రికి రాత్రికే కంప్యూటర్ లో చిలికి చిలికి  కొత్త వ్యూహాలు వెలికి తీశారు .  అప్పటి దాకా మౌనంగా ఉన్న పన్నీర్ సెల్వం కు మాటలొచ్చాయి . మాస్ ఎండ్యూరో తగిన వాడిలా బలం పుంజుకున్నాడు. టపీ టపీ మని బల్ల గుద్ది  కొత్త డిమాండ్ తెర పైకి తెచ్చాడు. అత్తా అల్లుడ్ని పార్టీ ని తరిమేస్తే కలసిపోదామని పళనికి హింట్ ఇచ్చాడు.  ఈ లోగానే   పళని స్వామికి హెచ్చరికలు జారీ అయ్యాయి .పన్నీర్ తో రాజీ కుదుర్చు కోవాలని. అంతే అన్ని చక చక జరిగిపోయాయి.  ఆయన చెప్పినట్టు జరగక పోయినట్టు అయితే ఏమి జరిగేది ...సింపుల్ గా  సర్కార్ రద్దు అయ్యేది. ఈ సందేశాలు స్పష్టంగా వెళ్ళబెట్టే పళని స్వామి చేతులెత్తేశాడు. ఈ గొడవంతా మనకెందుకులే.  ప్రభుత్వంలో ఉండమంటే ఉంటా లేకుంటే వెళతా అని పాహిమాం అన్నాడు. తెర వెనుక ఎవరున్నారో ? ఎవరు పావులు కడుపుతున్నారో తెలియకుండానే అటు ఇటు రాయబారాలు జరిగేయి . కొన్ని గంటల్లోనే  వైరి వర్గాలు ఒక్కటైనాయి.  మన్నార్ గుడి మాఫియాను దూరం పెడుతున్నట్టు తీర్మానం పుట్టుకొచ్చింది.  ముందు అడ్డం తిరిగి తర్వాత ఈ పరిణామాలకు బెదిరిపోయిన దినకరన్ కూడా యూ టర్న్ తీసుకున్నాడు.   మొత్తం మీద ఓపీఎస్ ఈపీఎస్ ను ఏకం చేసారు ఆయన.  ఆయన డైరెక్షన్ లో నాటకం రక్తి కట్టేలా సాగిపోయింది. అయితే ఇంకో అంకం మిగిలింది. ఇపుడు ఆయన ఎలా నాటకం నడిపిస్తారో చూడాలి .  ఇంతకీ ఎవరు ఆయన అని అడక్కండి.  నోట్ ... తమిళనాడు లో మాదిరిగా ఐటీ శాఖ మిగతా చోట్ల  ఎందుకు పని చేయదు అని ఆలోచించకండి. ----- KNMURTHY
  • ప్రధాని నరేంద్ర మోడీ కంటే చాలా వేగంగా  పాపులర్ అయిన వ్యక్తుల్లో  యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ ముందంజలో ఉన్నారు .   ఇవాళ ఎక్కడ చూసినా ఆయన పేరే వినబడుతోంది. పాలనా పరంగా ఆయన తీసుకున్న నిర్ణయాలపై చర్చలు జరుగుతున్నాయి. మొదట్లో విమర్శించినవాళ్లు కూడా ఇపుడు యోగి వైపు మొగ్గు చూపుతున్నారు.  కాగా మోడీ చరిష్మా తగ్గిపోయి త్వరలోనే యోగీ ఆదిత్య నాథ్ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రముఖ జ్యోతిష్కులు వేణు స్వామి చెబుతున్నారు.  బీజీపీ లో ఒక అంతర్యుద్ధం కూడా అనివార్యమని వేణు స్వామి అంటున్నారు.  ఇంకా ఆయన ఏమి చెప్పారో ? ఆ విశేషాలు ఏమిటో  వీడియో లో చూడండి