Latest News
సినిమా

మరల ఆస్కార్ రేసులో రెహమాన్ !!

1st Image

భారత సంగీత మాంత్రికుడు ఎ.ఆర్.రెహమాన్ మరోసారి ఆస్కార్ అవార్డు ల బరిలో నిలిచారు. ప్రముఖ బ్రెజిల్ ఫుట్ బాల్ ఆటగాడు పీలే జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘పీలే-బర్త్ ఆఫ్ ఎ లెజెండ్’ కు సంగీతం సమకూర్చినందుకు ఆయన పేరు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ అవార్డులను బహూకరిస్తారు.2009లో ‘స్లమ్ డాగ్ మిలి యనీర్’ చిత్రానికి రెహమాన్ ఆస్కార్ అవార్డు పొందిన సంగతి తెలిసిందే. కాగా,' పీలే ' బయోపిక్ సినిమాకు జెఫ్ జింబాలిస్ట్, మైఖేల్ జింబా లిస్ట్‌లు దర్శకత్వం వహించగా ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 91 పాటలు ఆస్కార్‌కు పోటీపడుతుండగా, రెహమాన్ కంపోజ్ చేసిన పాట ‘జింగా’ కూడా ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది. రోగ్ వన్ ఎ స్టార్‌వార్స్ స్టోరీ,లా లా ల్యాండ్, మౌనా, ఫ్లోరెన్స్ ఫాస్టర్ జెన్‌కిన్స్ వంటి చిత్రాలతో రెహమాన్ సంగీతం సమకూర్చిన చిత్రం పోటీపడుతుంది. వచ్చే జనవరి 24న విజేతల వివరాలను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 26న హాలీవుడ్‌లో డాల్బీ థియేటర్‌లో జరిగే ఉత్సవంలో ఆస్కార్ అవార్డులను బహూకరిస్తారు. ఇక పీలే సినిమా సూపర్ హిట్ అయింది.
తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే రెహమాన్ తండ్రి మరణించాడు. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ళు- పేదరికం  నేపథ్యంలో 11 సంవత్సరాల వయసులోనే  కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉంటూ గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా ట్రూప్‌లో జీవితం ప్రారంభించాడు. 1989వ సంవత్సరంలో కుటుంబమంతా హిందూ మతం నుంచి ఇస్లామ్‌లోకి మారిపోయింది.
రెహమాన్  ప్రతిభను గుర్తించి  టైం మ్యాగజైన్  "మొజార్త్ ఆఫ్ మద్రాస్" బిరుదు ఇచ్చింది. ఆయన పాటలు ఆస్కార్ కు నామినేట్ అయ్యాయి. "స్లమ్‌డాగ్ మిలియనీర్" అనే చిత్రంలో 'జై హో' అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్ఠాత్మకమైన "గోల్డెన్ గ్లోబ్ అవార్డు", రెండు ఆస్కార్ అవార్డులను అందుకొన్న తొలి భారతీయుడు. భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన ఘనత రెహ్మాన్‌కే దక్కుతుంది. జాతీయ స్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా హిందీ, తమిళ చిత్రాలకు 19 సార్లు ఫిలిమ్‌ఫేర్‌ అవార్డులను, తమిళ ప్రభుత్వ అవార్డులను అందుకున్నాడు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును స్వీకరించాడు.
ఈ కింద వీడియో చూడండి ... రెహ్మాన్ పాటను ఆస్వాదించండి.