Latest News
సినిమా

ఇంతకూ ఎవరు మీసం తిప్పుతారో ?

1st Image

టాలీవుడ్లో   ప్రస్తుతం అగ్రహీరోలు  నందమూరి బాలకృష్ణ , చిరంజీవి ల మధ్య  రసవత్తరమైన పోటీ నడుస్తోంది. 
చిరు 150  చిత్రం  ‘ఖైదీనెం150’  సంక్రాంతికి  విడుదల కాబోతుండగా  బాల‌కృష్ణ‌  వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి కూడా  జనవరి 12న రిలీజ్ అవనుంది. ఈ నేపథ్యంలో  ట్రైలర్స్ , టీజర్ తో ఇద్దరు హోరెత్తిస్తున్నారు. శాతకర్ణి  తాజా ట్రైలర్ ప్రస్తుతం  హల్ చల్ చేస్తోంది . దానికి పోటీగా ‘ఖైదీనెం150’ చిత్రంలోని ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ పాట విడుదలైంది. నెట్టింట్లో ఈ పాట కూడా బాగానే ఆదరణ పొందుతోంది.   మెగా అభిమానులు  మహా సంబరపడిపోతున్నారు. ఈ పక్కా మాస్ సాంగ్  అభిమానులను  అలరిస్తోంది . ఇదిలా ఉంటే… ఒకే రోజు 3 మిలియన్ వ్యూస్  క్రాస్ చేసిన శాతకర్ణి  థియోట్రికల్ ట్రైలర్ సౌండ్ ని చిరు సాంగ్ భీట్ చేయలేకపోయిందనే అభిప్రాయం కూడా వ్యక్తమౌతోంది. కొంతమంది అభిమానులు చిరు సాంగ్  అంత గొప్పగా లేదని దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదరగొట్టేలా లేదని అంటున్నారు. 
ఇక వంద థియేటర్లలో విడుదలైన  గౌతమి పుత్ర శాతకర్ణి థియోట్రికల్ ట్రైలర్ కి ఊహించని స్పందన వచ్చింది  సినీ సర్కిల్స్  లో శాతకర్ణి  డైలాగుల గురించి కూడా చర్చ జరుగుతోంది. "దేశం మీసం  తిప్పుదాం " అనే డైలాగ్  పాపులర్ అయింది. 
ఖైదీ నెంబర్ 150. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. దాదాపు 9 ఏళ్ళ  తర్వాత చిరంజీవి 150వ చిత్రం  ప్రెస్టీజియస్ గా తీస్తున్నారు . తమిళ సినిమా కత్తి దీనికి మూల కథాంశం.
ఇప్పటికే ఖైదీ నెంబర్ 150వ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజైంది. టీజర్ కూడా రిలీజైంది. అయితే టీజర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో  అభిమానులు కొంత  నిరుత్సాహపడ్డారు. ఈ నేపథ్యంలో స్టెప్పులకు పేరొందిన చిరంజీవి  నటించిన  అమ్మడూ.. లెట్స్ డూ కుమ్ముడు .. అనే పాటను  రిలీజ్ చేశారు. 
టీజర్ లో చిరంజీవి పాట ఎక్కడా కనిపించలేదు. దీంతో మరో పాటను రిలీజ్  చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
ఇక శాతకర్ణి ఆడియో రిలీజ్ డిసెంబర్ 24 న జరగ బోతుంది.  తిరుపతిలో ఈ కార్యక్రమం పెద్ద  ఎత్తున చేయబోతున్నారు .