Latest News
రాజ‌కీయం

మరో వివాదం లో సిద్ధరామయ్య !!

1st Image

కర్నాటక సీఎం సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు.
సోషలిస్టునని చెప్పుకునే  సిద్ధరామయ్య పబ్లిక్ లోనే పీఏతో షూ లేస్ కట్టించుకుంటూ… వీడియో కెమెరాకు చిక్కారు. 
శనివారం  మైసూరులో ఒక కార్యక్రమానికి హాజరైన సిద్ధరామయ్య… అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.  ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో  ఇప్పుడు వైరల్ అయ్యాయి. 
ఇప్పటికే సిద్ధరామయ్యను పలు వివాదాలు వెంటాడుతున్నాయి.. ఒకదాని తర్వాత మరొకటి ఆయన్ను చుట్టుముడుతున్నారు. ఖరీదైన వాచ్ వ్యవహారం… తర్వాత కాన్వాయ్ పై కాకి వాలిన ఇష్యూతో కాన్వాయ్ లో కొత్త వాహనాల కొనుగోలు…. ఇలా వివాదాలతో ఎప్పుడూ ఆయన దోస్తీ చేస్తుంటారు. ఇప్పుడు పీఏ ఇష్యూ తో మరోసారి హైలైట్ అవుతున్నారు సిద్ధరామయ్య. ఇవన్నీ దగ్గరనుంచి గమనించిన నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు.కాగా ఈ ఏడాది జులై లో బళ్లారిలో పర్యటించిన  సీఎం  మున్సిపల్ అధికారి చెంప చెళ్లుమనిపించి అప్పట్లో వార్తల్లో కెక్కారు.  అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి పర్యటిస్తున్న ఆయన జనం ఎక్కువగా  రావడంతో విసుగు చెందారు.  అదే సమయంలో  ఆయనకు ఎదురొచ్చిన మున్సిపల్ కమిషనర్ రమేశ్ పై చెయ్యి చేసుకున్నారు. అయితే దీన్ని ఖండించాయి అధికారిక వర్గాలు. సెక్యురిటీ సిబ్బందికి దారి చూపుతుండగా…  అనుకోకుండా చెయ్యి మున్సిపల్ కమిషనర్ కు తగిలిందని వివరణ ఇచ్చాయి.
vedeo courtesy... v6 news
Site Logo
  • (Balakrishna Rajanala ) ...................  ఎప్పుడో రెండున్నర సంవత్సరాల క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. అంతకు ముందు మూడు నాలుగు మాసాల క్రితం గత పార్లమెంట్ ఆఖరి సమావేశల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోదం పొంది చట్టమైంది. ఆ చట్టం నిర్దేశించిన ప్రకారం 2014 జూన్ 2 తేదీన 29 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నిజమే. అప్పటి ప్రభుత్వం రాష్ట్ర విభజన అంశాన్ని సాగదీసి , నానబెట్టి చివరాఖరుకు ‘మమ’ అనిపించింది. రాష్ట్ర విభజన అంతటి కీలక అంశాన్ని, రాజకీయ కోణంలోనే చూసింది గానీ, రాజ్యంగ స్పూర్తి లాంటి కోణంలో అంతగా ఆలోచించలేదు. కనీసం రెండు మూడు సంవత్సరాల ముందు చేయవలసిన పనిని చివరి క్షణం వరకు లాగీ, పీకీ అయిందంటే అయ్న్దన్నట్లుగా కానిచ్చేసింది. ఈ ప్రక్రియలో, కొన్ని రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయని అప్పట్లోనే అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. యుద్ద వాతావరణాన్ని తలపించే విధంగా లోక్ సభలో ప్రత్యక్ష ప్రసారాలను ఆపివేసి, తలుపులు మూసి విభజన బిల్లు ఆమోదం పొందిందని ప్రకటించారు. అలాగే, విభజన బిల్లులో అనేక అవకతవకలు జరిగిన మాట కాదనలేనిది. గత రెండున్నర సంవత్సరాలలో ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలే అందుకు నిదర్శనం. ఏది ఏమైనా, ఎవరికీ ఎన్ని అనుమాన సందేహాలున్నా, రాష్ట్రపతి ఆమోదం పొందిన చట్టం విషయంలో మళ్ళీ, అదేదో సామెతలో లాగా కథను వెనక్కి తీసుకుపోవడం అయితే అజ్ఞానం కాదంటే అవివేకం అవుతుందే గానీ, మరొకటి కాదు.  ఇప్పుడు ఈ చర్చ ఎందుకనేది అర్థమయ్యే ఉంటుంది. ఎప్పుడో రాష్ట్ర విభజనకు ముందు వెనకా అప్పటి ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆనాటి ఎంపీలు, రాయపాటి సాంబశివ రావు, ఉండవల్లి అరుణ కుమార్, రాజ మోహన్ రెడ్డి ఇంకొందరు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం చెల్లదంటూ దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం విచారణకు స్వీకరించింది. ఈ తతంగం అంటా చూస్తుంటే, అలా అనొచ్చో లేదో గానీ, ఎదో సామెత గుర్తుకొస్తోంది.  అదలా ఉంటే, ఇప్పడు ఆ తేనే తుట్టెను మళ్ళీ కదల్చడం వలన కొత్త గా జరిగే ప్రయోజనం ఏమున్నా లేకపోయినా, అనర్ధాలు జరిగే ప్రమాదం లేక పోలేదన్న ఆందోళన ఉభయ రాష్ట్రాలలో వినవస్తోంది. ముఖ్యంగా, ఇతరేతర కారణాల చేత తమ ప్రాబల్యాన్ని కోల్పోతున్న రాజకీయ శక్తులు, అధికార గణాలు ప్రజల దృష్టిని పక్క దారి పట్టించేందుకు దీన్నొక అస్త్రంగా వినియోగించుకునే ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన కూడా అక్కడక్కడా వినవస్తోంది. మరో వైపు ఇప్పుడిప్పుడే ఉభయ రాష్ట్రాలలో ఉద్యోగుల విభజన వంటి తకరారులు తొలిగి పరిపాలన, ఎంతో కొంత గాడిలో పడుతోంది. ఇలాంటి పరిస్థితులలో సర్వోన్నత న్యాయస్థానం ఈ  తేనే తుట్టను లేపడం, ఎంత వరకు సమజసం? అలోచించండి.
  • సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఒక  కార్యక్రమం లో టీడీపీ ఎంపీ మాగంటి బాబు స్టెప్పులేసి  వార్తల్లోకి  ఎక్కారు  క్రిష్ణా జిల్లా కైకలూరులోని ఈ కార్యక్రమం  జరిగినట్టు తెలుస్తోంది. వేదికపై లేడీస్ మధ్య కాసేపు జోష్‌గా అటు ఇటు తిరిగిన మాగంటి బాబు.. అదే ఊపులో యాంకర్‌తో చేయి చేయి కలిపి స్టెప్పేసిన తీరు మీడియా కంట పడింది.  తమ నేత జోష్ చూసిన పార్టీ కార్యకర్తలు, అనుచరులు కూడా ఒక్కసారిగా వేదికను  చుట్టిముట్టి  ఈలలు కేకలతో ఆయన్ని  ఉత్సాహపరిచారు. చూడండి వీడియో. courtesy abn andhrajyothi  
  • తెలంగాణ ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్‌ రావు ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమం  నిర్వహించబోతున్నారు .  సంక్రాంతి తర్వాత ఈ ప్రజా దర్బార్‌  కార్యక్రమం మొదలు కావచ్చు .   సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్‌ వేదికగా ప్రజాదర్బార్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. దర్బార్‌ నిర్వహణకు అనుసరించాల్సిన విధానాల  గురించి   సీఎం  అధికారులతో చర్చించినట్టు సమాచారం . అన్ని కులాలు, వర్గాలతో సమావేశమయ్యేలా ప్రణాళిక ప్రకారం ప్రజా దర్బార్‌ నిర్వహించాలని ముఖ్యమంత్రి నిశ్చయించారు. దీంతోపాటు రక రకాల సమస్యలతో ఇబ్బందిపడే ప్రజలు తమ గోడు వెళ్లబోసుకునేందుకు కూడా  వీలు కల్పించాలని సూచించారు. దీంతో రెండు విధాలుగా ప్రజా దర్బార్‌ నిర్వహించే అవకాశాలు  సీఎం పరిశీలనలో ఉన్నట్లు సమఃచారం.  ప్రగతి భవన్‌ సముదాయంలోనే దాదాపు వెయ్యి మందితో సమావేశమయ్యేలా ఒక విశాలమైన  హాల్‌ ఉంది.   సీఎం దీనికి ‘జనహిత భవన్‌’ అని పేరు పెట్టారు. రైతులు, కార్మికు లు, ఉద్యోగులు, కళాకారులు తదితర వర్గాల తో ముఖ్యమంత్రి ఇక్కడ ముఖాముఖి  నిర్వహిస్తారు. ప్రభుత్వ విధానాల రూప కల్పన, కార్యక్రమాల అమలుపై వారితో సమాలోచనలు జరుపుతారు.  ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వృత్తులు, కులాలు, సంఘా లు, యూనియన్లవారీగా ప్రతి వర్గంతో సీఎం నేరుగా మాట్లాడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి సమావేశానికి వచ్చే వారికి రానుపోను రవాణా సదుపాయంతోపాటు భోజన ఏర్పాట్లు చేయా లని సీఎం నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
  • పోలవరం తన వలనే వచ్చిందని ... ఆనాడు తాను పోలవరం ఇవ్వనిదే ప్రమాణ స్వీకారం చేయను అని బ్లాక్ మెయిల్ చేసినట్టు ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు చెప్పుకుంటున్నారు ?అసలు ఆమాటల వెనుక రహస్యం ఏమిటో? చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ డిమాండ్  చేశారు.  రిజర్వాయర్ లేకుండా గొట్టాలు పెడితే నదుల అనుసంధానం కాదు .... పట్టిసీమ నదుల అనుసంధానం కింద లేనట్లే అని  కేంద్రప్రభుత్వం  మాజీ ఎంపీ  హర్షకుమార్ కు  రాసిన  లేఖలో పేర్కొందని  ఉండవల్లి చెప్పారు. పోలవరం ఆయకట్టు కాకుండా పురుషోత్తపట్నం ఆయకట్టు ప్రత్యేకంగా ఏముంది ? పులిచింతల నిర్వాసితుల సమస్య తేల్చి ఉంటే 50 నుంచి 100 టిఎమ్ సి లు దక్కేవి . వైఎస్ కట్టింది జగన్ పార్టీ పెట్టాడని వారికేదో పేరొస్తుందని ప్రజాధనం బాబు దుర్వినియోగం చేస్తున్నారు .కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి  మరీ గోదావరి నీళ్లను  సముద్రంలోకలిపారని ఉండవల్లి విమర్శించారు.  పూర్తి వివరాల కోసం వీడియో చూడండి. courtesy.... east tv news 
  • ఏకగ్రీవంగా పార్టీ జనరల్ సెక్రటరీ గా ఎన్నిక అయ్యానన్న ఆనందోత్సవాల లో  ఉండగానే  శశికళకు  జయ మృతిపై  హైకోర్టు అనుమానం వ్యక్తంచేసిందన్న వార్త శరాఘాతంలా సోకింది. గురువారం ఉదయం శశికళ పార్టీ కార్యదర్శి గా ఎన్నిక కావడం అదే సమయంలో హైకోర్ట్ జయ మరణంపై  సందేహం వ్యక్తం చేయడం  దాదాపుగా ఏక కాలం లో జరిగేయి. కనీసం నామినేషన్ కూడా వేయని జయలలిత నెచ్చెలి శశికళ ను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా గురువారం ఎన్నుకున్నారు. చెన్నై లో ఈ ఉదయం జరిగిన పార్టీ సమావేశం లో శశికి పార్టీ పగ్గాలు అప్పగించారు.  జనవరి 2 వ తేదీన ఆమె పదవీ భాద్యతలు చేపడతారు. అయితే ఆమె అంతటితో ఆగుతారా? లేక ముఖ్యమంత్రి పదవినీ కైవసం చేసుకుంటారా? అన్నదిప్పుడు సస్పెన్స్ గా మారింది. శశికళ కోరిక తీరాలంటే పన్నీర్ సెల్వం పదవి నుంచి తప్పుకోవాలి . ఇందుకు పన్నీర్ కాదంటారా ? అవునంటారా ? అనేది కూడా సస్పెన్స్ గానే ఉంది. ఆ పరిస్థితే ఎదురైతే పన్నీర్ మౌనంగా తప్పుకుంటారా ? లేక పార్టీ చీలికకు ప్రయత్నిస్తారా ? అనేది కూడా సస్పెన్స్ అంటున్నారు. పన్నీర్ కి తెర వెనుక నుంచి మద్దతు ఇస్తోన్న బీజేపీ ఏమి చేస్తుందో కూడా చూడాలి. శశికళ కు ఇప్పటికే పరోక్షంగా సంకేతాలు వెళ్లాయని అంటున్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తగు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరికలు వెళ్లాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే పార్టీ క్యాడర్ లో అసంతృప్తి పెరుగుతోంది. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక ఏకపక్షంగా సాగిందంటూ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శశికళ ఎంపికను చట్టపరంగానే ఎదుర్కొనేందుకు తెర వెనుక పావులు కదుపు  తున్నారు. జయలలిత హయాంలో ప్రధాన కార్యదర్శి ఎన్నికలు జరిగినపుడు ఒక్క నామినేషన్‌ మాత్రమే దాఖలయ్యేది. జయలలిత మెప్పు కోసం పార్టీలోని అధిక సంఖ్యాకులు జయలలిత పేరునే నామినేషన్‌ వేసి తమ సంఘీభావాన్ని చాటుకునేవారు. ప్రధాన కార్యదర్శి పదవికి ఇలా జయలలిత ఏడు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా ఈ సారి అసలు ఎవరూ నామినేషన్ వేయలేదు . (జనరల్‌ సెక్రటరీ పదవికి సంబంధించి ఇప్పటివరకు శశికళ సహా ఏ ఒక్కరూ నామినేషన్‌ దాఖలు చేయలేదని ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి సి.పొన్నయ్యన్‌ బుధవారం మీడియాకు చెప్పారు.) టెక్నికల్ గా మరి ఈ ఎన్నిక చెల్లుబాటు అవుతుందో లేదో కోర్టు చెప్పాలి.   పైగా శశి అనుచరులు  ఇంకో తప్పు కూడా చేసారు . తన భర్త ద్వారా శశి కళ పుష్ప నామినేషన్ పంపితే అతడిపై దాడి కూడా చేశారు. ఇవన్నీ రికార్డు కూడా అయ్యాయి. ఇక పార్టీ నియమ నిబంధనల్లో 305 ప్రకారం ఒక సభ్యునిపై క్రమశిక్షణ చర్య తీసుకుంటే ఐదేళ్లపాటు అతను ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలులేదు. 2011 డిసెంబరులో శశికళ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించ బడ్డారు. క్షమాపణ లేఖ  రాయడం ద్వారా 2012 మార్చిలో తిరిగి జయలలిత తన వద్దకు చేరనిచ్చారు. అయితే శశికళకు ప్రాథమిక సభ్యత్వ కార్డును జారీ చేయలేదు. వీటిని కాదని పార్టీ నిబంధనలను సవరించి శశికళను ఎన్నుకుంటే అది చట్టవ్యతిరేకం అవుతుంది. పాత కార్డును చూపి శశికళ పోటీచేసిన పక్షంలో సభ్యత్వ నంబరును విచారణ జరపాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వ్యతిరేక వర్గం అంటోంది. మరిప్పుడు ఏమి జరుగుతుందో ? వేచి చూడాలి.
  • " నాకు ప్రాణ హాని ఉంది .. అమ్మ నన్ను నియమించారు.. ఇప్పటికీ నేనే చీఫ్ సెక్రటరీని"  అని తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహనరావు అంటున్నారు. నన్ను బదిలీ చేస్తూ ఇంతవరకు ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదు. అమ్మే బతికుంటే ఇలా జరిగేదా.. అసలు చీఫ్ సెక్రటరీ ఇంటిమీద, ఆఫీసులో ప్రవేశించడానికి ఆదాయపన్ను సిబ్బందికి,  సీఆపీఎఫ్ సిబ్బందికి ఎంత ధైర్యం'' అంటూ ఆయన మండిపడ్డారు. ఐటీ దాడుల తర్వాత వారం రోజులకు ఆయన మీడియా ముందుకొచ్చి మాట్లాడారు.శేఖర రెడ్డితో తనకు సంబంధం లేదని, ఆయనతో తాను ఎలాంటి లావాదేవీలు జరపలేదని అన్నారు. తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చీఫ్ సెక్రటరీ కార్యాలయం మీద రాజ్యాంగ దాడి చేయడమేనని, ఈ ప్రభుత్వానికి తనను బదిలీ చేసే దమ్ములేదని అన్నారు.  సెర్చివారంటులో తన పేరు లేదని ..  తన కొడుకు పేరు ఉందని, అతడేమైనా చీఫ్ సెక్రటరీయా అని ప్రశ్నించారు. తన కొడుకు అమెరికా నుంచి వచ్చిన తర్వాత కేవలం వారం రోజులు మాత్రమే తన ఇంట్లో ఉన్నాడని, తర్వాత ఎప్పుడూ అసలు ఇంట్లోనే లేడని చెప్పారు. ఆదాయపన్ను శాఖ అధికారులకు తన ఇంట్లో కేవలం రూ. 1,12,322 నగదు మాత్రమే దొరికిందని అన్నారు. తన కూతురు, భార్యకు సంబంధించిన 42 కాసుల బంగారం ఉందని, దాంతోపాటు వెండితో చేసిన మహాలక్ష్మి, వెంకటేశ్వరుడు బొమ్మల లాంటివి 25 కిలోలు దొరికాయని తెలిపారు. తన ఇంట్లో సీక్రెట్ చాంబర్ ఉందన్నారని, కానీ అది స్టోర్ రూం మాత్రమేనని, అందులో పాత సామాన్లు, పనికిరాని దుస్తులు ఉన్నాయని రామ్మోహనరావు చెప్పారు.  రామ్మోహన రావు చెప్పిన విషయాలను బట్టి చూస్తే  ఆయనను  కావాలనే టార్గెట్ చేశారని అనిపిస్తుంది. ఐటీ దాడుల తర్వాత జరిగిన ప్రచారానికి ... రామ్మోహన్ రావు చెప్పిన విషయాలకు  పొంతన లేదు. పరోక్షంగా కేంద్రం  పైన  సీఎం పన్నీరుసెల్వం పైన రామ్మోహన్ రావు ఎదురు దాడికి దిగారు. ఇవాళో రేపో ఆయన కోర్టును ఆశ్రయించవచ్చని అంటున్నారు.   పన్నీర్ సెల్వం  ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటాడో  చూడాలి.రామ్మోహన్ రావు అంత ధైర్యంగా ఎదురుదాడికి  దిగాడంటే ఎవరో ఆయన వెనుక ఎవరో ఉన్నారని అనుకుంటున్నారు.  vedeo courtesy.. ntv