Latest News
రాజ‌కీయం

బాబు అలా ఎందుకంటున్నారు ? ఆ రహస్యం ఏమిటి ?

1st Image


పోలవరం తన వలనే వచ్చిందని ... ఆనాడు తాను పోలవరం ఇవ్వనిదే ప్రమాణ స్వీకారం చేయను అని బ్లాక్ మెయిల్ చేసినట్టు ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు చెప్పుకుంటున్నారు ?అసలు ఆమాటల వెనుక రహస్యం ఏమిటో? చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ డిమాండ్  చేశారు. 
రిజర్వాయర్ లేకుండా గొట్టాలు పెడితే నదుల అనుసంధానం కాదు .... పట్టిసీమ నదుల అనుసంధానం కింద లేనట్లే అని  కేంద్రప్రభుత్వం  మాజీ ఎంపీ  హర్షకుమార్ కు  రాసిన  లేఖలో పేర్కొందని  ఉండవల్లి చెప్పారు. పోలవరం ఆయకట్టు కాకుండా పురుషోత్తపట్నం ఆయకట్టు ప్రత్యేకంగా ఏముంది ? పులిచింతల నిర్వాసితుల సమస్య తేల్చి ఉంటే 50 నుంచి 100 టిఎమ్ సి లు దక్కేవి . వైఎస్ కట్టింది జగన్ పార్టీ పెట్టాడని వారికేదో పేరొస్తుందని ప్రజాధనం బాబు దుర్వినియోగం చేస్తున్నారు .కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి  మరీ గోదావరి నీళ్లను  సముద్రంలోకలిపారని ఉండవల్లి విమర్శించారు.  పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.
courtesy.... east tv news 
Site Logo
  • లగడపాటి రాజగోపాల్  పొలిటికల్  రీ ఎంట్రీ  దాదాపుగా ఖరారు  అయింది . అటు టీడీపీ ఇటు బీజేపీలలో చేరడానికి ఇష్ట పడని  లగడపాటి  వైసీపీ వైపు మొగ్గు చూపారని  తెలుస్తోంది.  కొద్దీ రోజుల క్రితం బెంగళూరులో వైసీపీ అధినేత జగన్ ను  కలసి  మాట్లాడినట్టు సమాచారం.  జగన్  కూడా  రాజగోపాల్ పార్టీలో చేరిక పట్ల  సుముఖత  చూపారట .  తెలుగు రాష్ట్రాల్లో లగడపాటి  పేరు తెలియని వారు దాదాపుగా ఉండరు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా లగడపాటి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. రాష్ట్ర పునర్విభజన బిల్లు సందర్భంగా పార్లమెంట్ హాలులోనికి పెప్పర్ స్ర్పేను తీసుకెళ్లి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అలాంటి సంచలనాలు ఆయన ఖాతాలో ఎన్నో ఉన్నాయి. అటు పారిశ్రామికరంగంలోను ఇటు రాజకీయాల్లోనూ రాజగోపాల్ తనదైన ముద్ర వేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచే వైదొలగారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయలేదు. గత కొన్నాళ్ళుగా కుటుంబానికే ఎక్కువ టైం కేటాయించారు.. నాడు పార్ల‌మెంట్ సాక్షిగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని హామీ ఇచ్చిన నేత‌లు దాన్ని విస్మరించడం, తెస్తామ‌ని చెప్పిన వ్యక్తులు మాటలు మార్చడం వంటి పరిణామాల క్రమంలో రాజ‌గోపాల్ ప్రజల తరపున పోరాడాల‌ని యోచనలో పడ్డట్టు చెబుతున్నారు. లగడపాటి తో పాటు ఎంపీలు గా చేసిన వారిలో కావూరి సాంబశివరావు, పురందేశ్వరి బీజేపీ లో చేరగా రాయపాటి, దివాకరరెడ్డి టీడీపీలో చేరారు. మరికొందరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలీదు. కాంగ్రెస్ కి రాజీనామా చేసిన ఉండవల్లి అరుణ కుమార్ ఇటీవలే తెర ముందుకు వచ్చారు. ఉండవల్లి ఏపార్టీ లో చేరేది తేలకపోయినప్పటికీ రోజు మీడియా ముందుకు రావడం పలు అంశాలపై మాట్లాడటం జరుగుతోంది. అదే రీతిలో త్వరలో లగడపాటి కూడా తెర పైకి రావచ్చు అంటున్నారు. లగడపాటి రాజకీయాల్లోకి వస్తే మళ్ళీ సందడి సందడే. 
  • శశికళను పరప్పన అగ్రహార జైలు నుంచి చెన్నై లేదా వేలూరు జైలుకు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారం చేతికి చిక్కడంతో శశికళ వర్గం తొలుత ఆపనిలో పడింది . ఈమేరకు కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయబోతున్నారు. అక్రమాస్తుల కేసులో శిక్ష పడడంతో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధానకార్యదర్శి శశికళ, బంధువులు ఇలవరసి, సుధాకరన్‌ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కర్ణాటక న్యాయవాదులతో చర్చించిన శశి భర్త నటరాజన్ ఆ దిశగా పావులు కదుపుతున్నారు. వయోభారం, మధుమేహం, మోకాలినొప్పి, ప్రత్యేక వసతుల లేమి కారణాలుగా చూపి జైలును మార్చాలని హైకోర్ట్ ను అభ్యర్ధించనున్నారు.  కాగా బల నిరూపణలో విజయం సాధించిన సీఎం పళని స్వామి శశికళ ఆశీస్సులు కోసం మద్దతు దారులతో చెన్నై నుంచి అగ్రహార జైలుకు నేడో రేపో బయలు దేర నున్నారు.  చెన్నై జైలుకి శశికళ వస్తే సొంత ఇంట్లో ఉన్నట్టే లెక్క. జైలు నుంచే ఆమె రిమోట్ పాలన సాగుతుంది. పళని స్వామి అందుబాటులో ఉంటాడు. సొంత ప్రభుత్వం కాబట్టి జైలులో సకల సౌకర్యాలు అనుభవించవచ్చు. ఇదంతా పకడ్బందీగా ప్లాన్ చేసి హైకోర్టు ను ఆశ్రయిస్తున్నారు. అయితే హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.  డీఎంకే వర్గాలు కూడా ఈ విషయాన్నీ పసి గట్టి శశి జైలు మార్పిడిని ఎలా ఆపాలా అని యోచిస్తున్నట్టు సమాచారం.
  • తమిళనాడు రాజకీయ చరిత్రలో 30ఏళ్ల తర్వాత  బలపరీక్ష జరగబోతోంది.  తమిళ రాజకీయాల్లో బలపరీక్షలు, అవిశ్వాస తీర్మానాలూ కొత్తేమీ కాదు.  1952లో రాజాజీపై అవిశ్వాస తీర్మానం పెట్టగా, 200 మంది ఎమ్మెల్యేలు ఆయనకు అనుకూలంగా ఓటేసి తిరిగి సీఎంగా ఎన్నుకున్నారు.  ఆ తరువాత 1972 డిసెంబర్‌ 11న డీఎంకే నేత కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదే పార్టీలో ఉన్న ఎంజీ రామచంద్రన్‌ను పార్టీ నుంచి తొలగించారు. ఆ సమయంలో సీఎం కరుణానిధిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ బలపరీక్షలో కరుణానిధికి అనుకూలంగా 172 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపడంతో ఆయనే సీఎంగా ఎన్నికయ్యారు. 1988లో ఎంజీ రామచంద్రన్‌ మరణించాక అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. అన్నాడీఎంకే (జా) జానకీ రామచంద్రన్, అన్నాడీఎంకే (జే) జయలలిత సీఎం పీఠం కోసం పోటీపడ్డారు. జనవరి 28న బలపరీక్ష నిర్వహించారు. ఆనాటి  బలపరీక్షలో జానకీ రామచంద్రన్‌ సీఎం అభ్యర్థిగా ఎన్నికయ్యారు. జానకీ రామచంద్రన్‌కు అనుకూలంగా 99 మంది, జయలలితకు అనుకూలంగా 33 మంది ఎమ్మెల్యేలు నిలిచారు. జయలలిత మరణంతో  తమిళనాడు అసెంబ్లీ  ఇపుడు మరోసారి బలపరీక్షకు సిద్ధమవుతోంది.  ఈ బలపరీక్ష ఎవరికి  అనుకూలం కానుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత మరణించడంతో ప్రస్తుత సభ్యుల సంఖ్య 233 మాత్రమే. ఇందులో సీఎం పళనిస్వామి వర్గంలో 123మంది ఎమ్మెల్యేలు, పన్నీర్‌సెల్వం వర్గంలో 11మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. డీఎంకేకు 89, కాంగ్రెస్‌కు 8, ఐయూఎంఎల్ 1 సభ్యులు ఉన్నారు. 117 మంది సభ్యులు అనుకూలంగా ఉంటే బలపరీక్షలో పాస్ అయినట్లే. అయితే  రెండు శిబిరాల్లోనూ ఉత్కంఠ రాజ్యమేలుతోంది. పళనిస్వామి వర్గానికి ఎమ్మెల్యేలు మెజార్టీ  ఉన్నప్పటికీ  అది చాలా తక్కువ.. ఏడుగురు ఎమ్మెల్యేలు చేయిజారితే పళనిస్వామి బలపరీక్షలో ఓడిపోతారు.  పళనిస్వామి వర్గంలోని  40 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వారిలో కొందరైనా వ్యతిరేకంగా మారితే పళనీ కి ఇబ్బందే. అందుకే కాంగ్రెస్ సభ్యుల మద్దతు కోసం పళనీ ప్రయత్నిస్తున్నారు.  పన్నీర్ ఆశలు కూడా అసంతృప్త ఎమ్మెల్యేల మీదే . ఇప్పటివరకైతే పళనీ కే  మొగ్గు కనబడుతోంది. చివరిలో ఏదైనా జరిగితే  మ్యాజిక్ ఫిగర్ లో  తేడా రావచ్చు . మొత్తం మీద మరికొద్ది గంటల్లో  ఎవరు విజేతలో తెలుస్తుంది . 
  • పళనిస్వామి అన్నాడీఎంకే లో  సీనియర్  నాయకుడు . 'జయ' విధేయుడుగా తమిళ రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నేత .పన్నీర్‌ సెల్వం కేబినెట్‌లో రహదారులు, ఓడరేవుల శాఖ మంత్రిగా ఉన్న పళనిస్వామి సేలం జిల్లా ఎడప్పడి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వ్యవసాయం కుటుంబంలో పుట్టిన పళనిస్వామి సైన్స్ గ్రాడ్యుయెట్. 1974లో అన్నాడీఎంకే సాధారణ కార్యకర్తగా రాజకీయాల్లో వచ్చారు.  అంచెలంచెలుగా ఎదిగారు. ఎమ్జీఆర్ మరణానంతరం అన్నా డీఎంకే పార్టీ రెండు వర్గాలుగా చీలింది. ఎమ్జీఆర్ సతీమణి జానకి ఒక వర్గం కాగా, జయలలితది మరో వర్గం. అయితే పళనిస్వామి జయలలిత వర్గం పట్లే తన విధేయత  చూపారు .  ఆ తర్వాత అన్నాడీఎంకే అభ్యర్థిగా 1989, 1991, 2011, 2016లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1998లో  లోక్‌సభ  ఎంపీగా గెలుపొందారు. 2016 ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి రావడానికి పళనిస్వామి సామాజిక వర్గమే (గౌండర్‌) ప్రధాన కారణం.జయలలితకు వ్యతిరేకత ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో కూడా పళనిస్వామి ప్రచారం పార్టీకి ఎంతగానో ఉపయోగపడింది. పళనిస్వామి సొంత జిల్లా అయిన సేలంలో మొత్తం 11 నియోజవర్గాలుంటే అందులో 10 నియోజవర్గాల్లో అన్నాడీఎంకేనే 2016 ఎన్నికల్లో విజయం సాధించింది. తమిళనాడులో జనాభా, రాజకీయ ప్రాతినిధ్యం రీత్యా గౌండర్లు, తేవర్లు, వన్నియార్లు బలమైన సామాజిక వర్గాలు .  ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, శశికళ ఇద్దరూ తేవర్లే. 234 మంది సభ్యులున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో తేవర్‌ ఎమ్మెల్యేలే ఎక్కువ. అన్నా డీఎంకేలో మాత్రం గౌండర్లు 28 మంది , తేవర్లు 20 మంది ఎమ్మెల్యేలున్నారు.  జయలలిత తన మంత్రివర్గంలో పన్నీర్ తర్వాత పళని స్వామినే ఎక్కువగా నమ్మేవారు.జయలలిత ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఓ.పన్నీర్‌సెల్వంతో పాటు పళనిస్వామి  పేరు కూడా పరిశీలనకు వచ్చిందని  అంటారు . అప్పుడు పళనిస్వామి పట్ల శశికళ మొగ్గు  చూపినట్టు చెబుతారు. అయితే అమ్మకు అత్యంత విధేయుడు, గతంలోనూ అమ్మ పరోక్షంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అనుభవం పన్నీర్  కలిసొచ్చింది.  ఊహించని విధంగా సుప్రీంకోర్టు శశికళను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా నిర్దారించడంతో పళనిస్వామి పేరు తెర పైకి వచ్చింది . తీర్పువచ్చిన క్షణాల్లోనే సీఎల్‌పీ నేతగా  ఎన్నుకోవడంతో పళని  సీఎం  అవడానికి  రూట్ క్లియర్ అయింది. 
  • అనేక సూట్ కేసు కంపెనీలతో,  బంధువుల సాయంతో రాష్ట్రాన్ని దోచుకున్న శశికళకు... ముప్పైమూడు ఏళ్ళు ఆదరించిన జయలలిత అనుమానాస్పద రీతి లో మరణించినపుడు కళ్ళు కనీసం చెమ్మగిల్ల లేదు. ఇపుడు ముఖ్యమంత్రి పదవి ఎక్కడ దూరం అవుతుందో అని ఆమెకు కళ్ళు కావేరీ జలాలు అవుతున్నాయి. వందలాది మంది రౌడీలను ఎమ్మెల్యేలకు కాపలాగా పెట్టి నాకే మెజారిటీ ఉన్నది అని తోడ కొడుతున్నది. శశికళ ను మన్నారు గుడి మాఫియా గా వర్ణించి ఆమెను జైల్లో తోయిoచిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఆమెను ముఖ్యమంత్రిని చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాడు. లేకపోతే కోర్ట్ లో కేసు వేస్తానని గవర్నర్ ను హెచ్చరిస్తున్నారు. విద్యాసాగర్రావు వ్యక్తిత్వం, నీతి నిజాయతీ ఎంత స్వచ్ఛమైనవో ముప్ఫయ్యేళ్ళ ఆయన రాజకీయ జీవితాన్ని గమనిస్తున్న అందరికి  తెలుసు.  స్వామి తాటాకు చప్పుళ్ళకు బెదిరి పోయే రకం కాదు ఆయన. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి తన రాజీనామా లేఖను గవర్నర్ కు స్వయాన అందజేసి ఆమోదం పొందాలిట. కానీ ఇక్కడ అలా జరగలేదు. రాజీనామాను ఫాక్స్ ద్వారా పంపించారట. పన్నీర్ సెల్వం  సంతకం కూడా ఫోర్జరీ కావచ్చు అనో మరో వివాదం తెర మీదికి  వచ్చింది  ఇప్పుడు. అది పన్నీర్ సహజంగా పెట్టే సంతకం లా లేదు అంటున్నారు. తనని బలవంతాన రాజీనామా చేయించారు అనే పన్నీర్ ఫిర్యాదు కు ఇప్పుడు బలం చేకూరుతున్నది. సుబ్రమణ్య స్వామి కేసు వేస్తే మరీ మంచిది. ఆ కేసు తేలే వరకూ గవర్నర్ ఎదురు చూడవచ్చు. ఈ స్వామి వ్యవహరం చూస్తుంటే దీన్ని మరింత జాప్యం చెయ్యడానికి కేంద్రమే నాటకం ఆడిస్తున్నడెమో అన్న అనుమానం కలుగుతున్నది. ఒకప్పుడు జయ ను శశికళను అభియోగాలు మోపి జైల్లో వేయించిన స్వామి ఇపుడు శశికళ పక్షాన ఎందుకు మాట్లాడుతున్నారు ? మధ్యలో ఆయన ఇంట్రెస్ట్ ఏమిటో మిస్టరీ . ఈ మాఫియా రాణి ని ముఖ్యమంత్రి చేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించడం మంచిది. .....  ఇలపావులూరి మురళీ మోహన రావు
  • తమిళనాట రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. పన్నీర్ సెల్వం రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లాలని యోచిస్తున్నారు . అదే సమయం లో శశికళ నిరసన దీక్ష కు కూర్చోవాలని  ప్లాన్   చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో అర్ధం కాని పరిస్థితులు నెలకొంటున్నాయి. శశికళ అనుకూల వర్గంలోని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పన్నీరు వైపు వెళుతున్నారు . ఫలితంగా సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఆరుగురు ఎంపీలు పన్నీరుకు మద్దతు పలికారు. ఏడుగురు ఎమ్మెల్యేలు పన్నీరు శిబిరంలో చేరారు.మరి కొందరు రావచ్చు అంటున్నారు . దీంతో శశికళ శిబిరం లో కలవరం మొదలైంది. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో శశి వెంట ఉంటే భవిష్యత్ ఉండదనే ఆందోళన వారిలో నెలకొంది. దీంతో రిసార్ట్‌లో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు పన్నీరు వైపు వెళ్లాలని అనుకుంటున్నారట . సరిగ్గా ఈ సమయం లోనే పన్నీరు ఎమ్మెల్యేలుంటున్న రిసార్ట్‌కు వెళ్లాలని భావిస్తున్నారు. స్వయంగా వెళితే మరి కొంతమంది ఎమ్మెల్యేలు తన వర్గం లోకి లాక్కోవచ్చని పన్నీర్ అంచనా వేస్తున్నారు . సెల్వం సాయంత్రం లోపు శశికళ వర్గంలోని ఎమ్మెల్యేలను రిసార్ట్‌లోకలిసే అవకాశాలు ఉన్నాయి. ఇక శశికళ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.  నిన్న సెంగొట్టియన్  పేరు ను  సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించాలని యోచన చేసిన శశి మళ్ళీ మనసు మార్చుకున్నట్టు  సమాచారం. ఇన్నాళ్లు కేంద్రంపై ఆచితూచి మాట్లాడిన శశి  మెల్లగా స్వరం పెంచుతున్నారు .   అన్నాడీఎంకేను చీల్చేందుకే.. ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారాన్ని గవర్నర్‌ వ్యూహాత్మకంగా వాయిదా వేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పటికే గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు హెచ్చరికతో కూడిన లేఖను పంపిన శశికళ దీక్ష చేయవచ్చని అంటున్నారు.  ఇది చేసే ముందు గవర్నర్ ను  మరో మారు కలిసే ప్రయత్నం చేస్తున్నారు . గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగాలని శశికళ యోచిస్తున్నట్టు  చెబుతున్నారు .