Latest News
ప్ర‌ముఖులు

జ్యోతిష్యం అంటే మహా నమ్మకం !!

1st Image

జయలలిత జ్యోతిష్యం , సంఖ్యాశాస్త్రం , వాస్తు శాస్త్రాలను బాగా నమ్ముతారు.దైవ భక్తి కూడా ఎక్కువే. జ్యోతిష్కులను సంప్రదించనిదే, మంచి ముహూర్తం చూడందే ఏ పని తలబెట్టరు. జయలలిత ఏ పథకాన్ని ప్రారంభించినా ముందు జ్యోతిష్కులను సంప్రదించేవారు. వారి సలహాల ప్రకారం తేదీ, సమయాన్ని నిర్ణయించేవారు. ముహూర్తం సరిగా లేదని చివరి నిమిషంలో ఓ సారి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. దీన్ని బట్టి ఆమెకు జ్యోతిషంపై ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. పోయిస్ గార్డెన్లోని తన ఇంట్లో కూడా అన్ని వాస్తు ప్రకారం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆలయాల్లో అన్నదానాలు చేయించడం ఎంతో ఇష్టం. అందుకే రాష్ట్రంలోని ఆలయాల్లో అన్నదాన పథకం అమల్లో ఉన్నదని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఏనుగులు అంటే అమిత ప్రేమ. తాను ఏదేని ఆలయానికి వెళ్లినా అక్కడ ఓ గున్నఏనుగును బహుకరించేవారు. 
సంఖ్యా శాస్త్రాన్ని సీఎం అయినా తర్వాతనే నమ్మడం మొదలెట్టారు. 
2001లో జయలలిత తన పేరులో అదనంగా ఇంగ్లీష్‌ అక్షరం ‘ఏ’ చేర్చుకున్నారు. ఇంగ్లీషులో 11 అక్షరాలున్న (Jayalalitha) తన పేరును 12 అక్షరాలు వచ్చేలా Jayalalithaaగా మార్చుకున్నారు. న్యూమరాలజిస్టుల సలహా ప్రకారమే జయలలిత అలా పేరులో అదనంగా ఒక అక్షరం చేర్చుకున్నారట. 
ఇక జయ జాతకం ప్రకారం ఆమెకు 5, 7 అంకెలు అనుకూలమైనవి. అష్టమి , నవమిలనాడు ఆమె ఏ పని చేసే వారు కాదు. చివరకు జయలలిత 5వ తేదీన (డిసెంబర్‌) తుది శ్వాస విడిచారు. ఆమె నమ్మకాలకు అనుగుణంగానే అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. తొలుత బుధవారం జయలలితకు అంత్యక్రియలు నిర్వహించాలని సన్నిహితులు భావించారు. అయితే బుధవారం అష్టమి కావడం తో ఆమె నమ్మకం ప్రకారం ఈరోజే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
మెరీనా బీచ్ లోని ఎంజీఆర్ ఘాట్ పక్కనే అంత్యక్రియలు చేపడుతున్నారు.
Site Logo
  • కంప్యూటర్లు రాని కాలంలో .... కమ్యూనికేషన్లు లేని రోజుల్లో .... ఉల్లాల్ అన్నా, చౌతా అన్నా గుర్తొచ్చేది ఒకే ఒక్కరు... ఆమె పేరు అబ్బక్క...... అవును ... ఆ కాలంలో పేర్లకు ఇంకా ఫ్యాషన్ బురద అంటలేదు. అబ్బక్క... మనసు గూగుల్ మ్యాప్ లో కర్నాటక తీరంలోని రేవు పట్టణం ఉల్లాల్ కి జూమ్ అవండి. ఉల్లాల్ వెళ్లాక టెమ్ మెషీన్ లో నాలుగొందల ఎనభై ఎనిమిదేళ్లు వెనక్కి వెళ్లండి. అప్పటి తీరాలను, అప్పటి ఊళ్లను, అప్పటి రాచరికాలను, అప్పటి యుద్ధాలను కళ్లముందు బొమ్మకట్టించుకొండి... అప్పుడు సాక్షాత్కరిస్తుంది అబ్బక్క. .... తుళునాడు కి రారాజ్ఞిగా పోర్చుగీసు దోపిడీదారులను పదేపదే మట్టికరిపించిన పోరాటయోధురాలు అబ్బక్క మహాదేవి..... కత్తియుద్ధం, గుర్రపుస్వారీలతో పాటు రాజకీయ వ్యవహారాలు, దౌత్యనీతిలో దిట్టగా వెలుగొందిన ధీర అబ్బక్క మహాదేవి..... అటు కేరళ జామొరిన్ పాలకుడు, ఇటు మంగుళూరు మహరాజులు, మరోవైపు అహ్మద్ నగర్ నవాబులను కలుపుకుని ఒక స్వదేశ రక్షణ త్రికోణశక్తిని తయారుచేసి, ఆ త్రికోణానికి బిందువుగా నిలిచిన భారత భద్రతా శ్రీచక్రం.... అబ్బక్క మహాదేవి...... 1525 లో మూడబిద్రి లో పుట్టిన అబ్బక్క 'చౌతా' కుటుంబానికి చెందిన జైన మతస్తురాలు. వంశాచారం ప్రకారం మామ తిరుమల రాయని రాజ్యానికి రాణి అయింది ఆమె. జైన మతానుయాయురాలైనా రంగులు మారే రుద్ర శిలతో తీర ప్రాంతాన ఒక అద్భుత శివలింగాన్ని ఏర్పాటు చేసి, గుడి కట్టించింది ఆమె. జనరంజక పరిపాలన, దూరదృష్టి, సమర్థ నేతృత్వాలతో ఆమె రాజ్యం అలరారుతూండేది. ఉల్లాల్ మసాలాదినుసుల ఎగుమతికి పేరెన్నిక కన్న ఊరు. ఆమె భర్త లక్ష్మణప్ప మంగుళూరుకి రాజు. కానీ రుద్రమదేవిలాగానే అబ్బక్కకీ, ఆమె భర్తకీ పడిరాలేదు. ఆమె జైనమతస్తురాలు. భర్త శైవ మతావలంబి. (రుద్రమదేవి విషయంలో ఇది తిరగబడింది. ఆమెది శైవం. భర్తది జైనం) అవి భారత్ పై తెల్లయూరోప్ నల్లమేఘమై ముసురుకుంటున్న రోజులు... పోర్చుగీసు వాళ్లు పడమటి తీరాన భారత సూర్యుడిని దిగముంచేందుకు యత్నిస్తున్నారు. అప్పటికే 1510 నాటికి గోమాంతక్ భూమి వారి వశమైంది. (గోమాంతక్ అన్నది పలకలేక గోవా అన్నారు. పోర్చుగీసులు పోయినా మనం మాత్రం గోవా అనే అంటున్నాం. ). ఇక రత్నాగిరి, కొంకణ తీరాలపై పట్టు దొరికింది. ఆ తరువాత వారి కన్ను కేరళ సాగర తీర రాజు జామొరిన్ పై బడింది. జామొరిన్ ను వశపరచుకునేందుకు వెళ్తూ వెళ్తూ మంగుళూరును మట్టికరిపించారు. అది 1525. ఆ తరువాత ముందుకువెళ్లబోతే అబ్బక్క రాజ్యం తుళునాడు అడ్డం ఉంది. "ఇదెంత పని... ఆడదేం చేస్తుంది" అనుకున్నారు పోర్చుగీసువాళ్లు...ఉల్లాల్ మసాలా దినుసుల ఘాటు నసాళానికంటుతుందన్నది వారికి తెలియలేదు. అబ్బక్క దెబ్బకు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. 1555 లో అడ్మిరల్ డాం వారో డా సిల్వానియా నాయకత్వంలో మళ్లీ దాడి చేశారు. మళ్లీ మట్టికరిచారు. 1568 లో మూడో సారి పో పీక్సోరో అనే సేనాని నాయకత్వంలో మళ్లీ దాడి చేశారు. ఈ దాడిలో ఉల్లాల్ రాజభవనం వారి చేజిక్కింది. అబ్బక్క మహాదేవి ఒక మసీదులో తలదాచుకోవాల్సి వచ్చింది. కానీ అదే రాత్రి రెండు వందల మంది సైనికులతో ఆమె బుడతకీచుల (పోర్చుగీసులకు తెలుగోడు పెట్టుకున్న పేరు) పై విరుచుకుపడింది. ఈ దాడిలో జనరల్ పీక్సోటోను కత్తికో కండగా చేసింది. ఆ తరువాత మంగుళూరు కోటపై దాడి చేసి అడ్మిరల్ మాస్కరెన్హస్ ను పైలోకాలకి పంపించింది. ఏడాది పాటు ఆమె మంగుళూరు కేంద్రంగా పరిపాలించింది. కానీ భర్త లక్ష్మణప్ప పోర్చుగీసులతో కలిసి పోయాడు. పోర్చుగీసులు మళ్లీ ఆమెపై యుద్ధం జరిపారు. వారిని ఎదుర్కొనేందుకు ఆమె జామొరిన్, అహ్మద్ నగర్ రాజులతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి పోరాటం చేసింది. 1570లో చివరికి పోర్చుగీసులదే పైచేయి అయింది. అబ్బక్క రాణి పోర్చుగీసు చెరసాల పాలైంది. జైల్లో ఉంటూ కూడా ఆమె తలవంచలేదు. అలాగే పోరాడుతూ పోరాడుతూ ప్రాణాలు వదిలింది. అబ్బక్క కథ కన్నడిగులకు యక్షగాన గాథ అయింది. పౌరుషపు పాట అయింది. పోరాటపు బాట అయింది. తుళునాడులో గళం గళం ఆమె పాట పాడింది. అబ్బక్క ఉల్లాల్ కోట, కట్టించిన రుద్రశివ మందిరం, పూజించిన జైన బాసాడి, తలదాచుకున్న మసీదు తీర్థస్థలాలయ్యాయి. తరతరాలుగా తీరనగరిని అబ్బక్క ఆవేశించింది. ఉల్లాల్ నగరం వెళ్తే ఫిరంగి పక్కన నిలుచుని సేనలను ప్రోత్సహిస్తూనో, గుర్రం పై కత్తి చేబూని సింహిణీనాదం చేస్తూనో అబ్బక్క రణభూమిలో తిరుగాడుతున్నట్టు అనిపిస్తుంది. ఆమె కాంస్యవిగ్రహం నాలుగు వందల తొంబై మూడు ఏండ్ల కాలం నాటి పోరాటగాథ చెప్పేందుకా అన్నట్టు నగరం నడిబొడ్డున నిలుచుని ఉంటుంది. కేంద్రంలో వాజ్ పేయీ ప్రభుత్వం వచ్చాక 'అబ్బక్క' పేరిట తపాలా స్టాంపు విడుదలైంది. ఈ మధ్యే తీరంలో విదేశీ తిమిరంపై సమరం చేసిన అబ్బక్క పేరిట మన తీరరక్షణ దళం (కోస్టుగార్డు) ఒక నౌకను కూడా జలప్రవేశం చేయించింది. ఈ కథ చదివాక ఉల్లాల్ అంటే స్నేహా ఉల్లాల్, చౌతా అంటే సందీప్ చౌతాలు మాత్రమే కాక, అబ్బక్క రాణి కూడా గుర్తుకు వస్తే ఈ ఆర్టికల్ ఆశయం ఫలించినట్టే. ....  susri 
  • పట్టుదల ..పరిశ్రమ  ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ఈ ఫోటో లో కనిపించే పెద్దాయన పేరు దశరథ్ మాంఝి .  భీహార్ లో గయా వద్ద ఒక చిన్న పల్లెటూరిలో1934 లో పుట్టిన దశరథ్ మాంఝి కి కోపం వచ్చింది ... ఎవరి మీద?  కొండ మీద... ఎందుకు కోపం వచ్చింది? అడ్డంగా ఉన్నందుకు... అడ్డం పడుతున్నందుకు... అవును  కొండకు అటువైపు తన గ్రామం అత్రి ఉంది. కొండకు ఇటువైపు వాజరంగ్ గ్రామంలో తన పొలం ఉంది. పొలానికి వెళ్లాలన్నా, అడవిలో కట్టెలు కొట్టాలన్నా కొండను దాటాల్సిందే... చెమటలు కక్కాల్సిందే.. దశరధ్ భార్య ఫల్గుణి దేవి  రోజూ మధ్యాహ్నం భార్య ఆహారం తేవాలన్నా ఈ కొండ ఎక్కి రావాల్సిందే. ఒక రోజు ఆమె భోజనం తెస్తూండగా ఒక బండరాయి కాలికి తగిలి ఆమె పడిపోయింది.  ఆమెకు దెబ్బలు తగిలాయి. అన్నం ముంత పగిలిపోయింది. అందుకే ... దశరథ్ కి కోపం వచ్చింది. ఎవరి మీద?  కొండ మీద.  ఎందుకు కోపం వచ్చింది? అడ్డంగా ఉన్నందుకు... అడ్డం పడుతున్నందుకు... దశరథ్ ఊళ్లోకి వచ్చి గ్రామస్తులతో ఈ కొండను తొలిచి దారిని నిర్మిద్దాం అన్నాడు. "అసాధ్యం" అన్నారు అంతా.  దశరథ్ కోపం మాత్రం చల్లారలేదు. సుత్తి తీసుకున్నాడు. కొండరాళ్లను బద్దలు గొట్టడం మొదలుపెట్టాడు. పొలం పని, ఇంటి పని పోను మిగతా పగలంతా పగలగొట్టడమే పని. రాళ్ల కింద మంట పెట్టడం.... పగుళ్లు రాగానే వాటిని బద్దలుచేయడం ...ఇదే పని.... ఆ దశరథుడు పుత్రకామేష్టి చేసినంత నిష్ఠగా ఈ బీహారీ దశరథుడు "పత్థర్" కామేష్టి చేశాడు.  బండలు బద్దలయ్యాయి...కొండలు పిండి అయ్యాయి. చివరికి ...కొండ రెండుగా చీలి .... దశరథ్ కి దారి ఇచ్చింది. కిలో మీటర్ల దూరం చెరిగిపోయింది. ఇప్పుడు అత్రి, వాజరంగ్ ల మధ్య 360 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉన్న దారి ఏర్పడింది.  దారి పొడవునా దశరథ్ చెట్టు నాటాడు. ఆ మొక్కలు పెరిగి మహావృక్షాలయ్యాయి. 55 కిలోమీటర్ల దారి 15 కిలోమీటర్లలో సర్ధుకుంది. కొండను తవ్వి దారిని దొరకబట్టడానికి దశరథ్ కి ఒకటి కాదు ... రెండు కాదు ... ఏకంగా 22 (1960-83) ఏళ్లు పట్టింది.  ప్రజలూ, ప్రభుత్వం దశరథ్ కి బ్రహ్మరథం పట్టాయి. అవార్డులు,రివార్డులు వచ్చాయి. మౌంటెన్ మాన్ గా పేరు పొందాడు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను అతని కధ తో కొన్ని సినిమాలు తీశారు.  2007 ఆగస్టు 17 గాల్ బ్లాడర్ కాన్సర్ తో AIMS, న్యూ డిల్లీ లో మరణించేటప్పటికి అతని వయసు 72 ఏళ్ళు. వాల్మీకి శోకం శ్లోకమైంది.... దశరథ్ కోపం కొండదారి అయ్యింది. .... **** అయితే దశరథ్ చనిపోయేనాటికీ కోపం వస్తుండేది.  ఎవరి మీద? అసమర్థుల మీద. ఆత్మవిశ్వాస రహితుల మీద .... ఎందుకు కోపం వస్తుంది? అసాధ్యం, అసంభవం అని చేతులు ముడుచుకున్నందుకు ..... ఆత్మశక్తిపై అపనమ్మకం ఉన్నందుకు . ....   susri 
  • అంగారక గ్రహం పై నీళ్లు,ఇనుము ఉందని 1500 యేళ్ళ క్రితమే  వరాహమిహిరుడు చెప్పాడు. ప్రస్తుతం మనదేశం నుండి ఇస్రో, అమెరికా నుండి నాసా అంతరిక్ష వీక్షణం చేస్తూ మన విశ్వం గురించి ఎన్నో విషయాలను కనుగొంటున్నారు. అయితే భారతదేశానికి చెందిన ఉజ్జయిని దేశస్థుడు ఖగోళ, గణిత శాస్త్రజ్ఞుడు, జ్యోతిష్కుడు అయిన వరాహమిహిర 1500 సంవత్సరాల క్రితమే విశ్వం గురించి, మన గ్రహాల గురించి తన పుస్తకంలో అంచనా వేసి రాసుకున్నాడు. ఆయన రాసిన వాటిని గురించి తెలుసుకున్న మన శాస్త్రవేత్తలు ప్రస్తుతం షాక్ కు గురవు తున్నారు. వరాహమిహిర చేసిన పరిశోధనల గురించి తెలుసుకుందాం. ఎవరీ వరహమిహిరుడు ? 499 సంవత్సరంలో కపిత అనే ప్రాంతానికి దగ్గరలో గల ఉజ్జయినిలో జన్మించాడు వరాహమిహిర. ఇతని తండ్రి ఆదిత్యదాసుడు సూర్యభగవానుడికి గొప్ప భక్తుడు. వరాహమిహిరుడు ఖగోళ మరియు గణిత శాస్త్రంలో నైపున్యుడు మరియు జ్యోతిష్కుడు. వరాహమిహిర సూర్య సిద్ధాంత’ పేరు మీదట 1515 లోతన మొదటి గ్రంథాన్ని రాశాడు. ఈ సూర్య సిద్ధాంత గ్రంధంలో నక్షత్ర మండలాలు, ఇతర సౌర గ్రహణాలు వాటి స్థానాలను గురించి వరాహమిహిర తెలిపాడు. ఇందులో , దేవతలు , రాక్షసులు, దేవుడు బ్రహ్మ సృష్టి నుండి గడచిన కాలానికి చెందిన రోజు ,రాత్రి, గ్రహాలు తూర్పు తరలించడానికి , నక్షత్ర విప్లవం సంవత్సరం పొడవు గురించి పేర్కొన్నారు. . భూమి వ్యాసం, చుట్టుకొలత, చంద్రుడి యొక్క రంగు ,చుట్టుకొలతలను ఈ పుస్తకంలో వరాహమిహిర తెలిపాడు. ఇంకా ఈ పుస్తకంలో అంగారక గ్రహం గురించి ఎంతో వివరంగా తెలిపాడు. ఆయన ఆ పుస్తకంలో అంగారక గ్రహంపై నీరు ...  ఇనుము ఉన్నట్లు అప్పుడే చెప్పారు. ఈ విషయాన్ని నాసా మరియు ఇస్రో బహిర్గతం చేశాయి. ఇంకా ఈ పుస్తకంలో సౌరవ్యవస్థలోని ప్రతి గ్రహం సూర్యునిచే సృష్టించబడింది అని వివరంగా చెప్పాడు. కొన్ని ఏళ్ళ క్రితం వరాహమిహిర రాసిన సూర్యసిద్ధాంత గ్రంధం  దొంగలించబడింది. అయితే ముందుచూపుగా కొందరు మేధావులు రికార్డ్ చేసుకోవడం వలన  పరిశోధనలకు ఉపయోగపడింది. ఇలా రికార్డ్ చేయబడిన ఆ గ్రంధంలోని విషయాలను చాలా భాషలలోకి అనువాదం చేయడం జరిగింది. నాసా అంగారక గ్రహంపై పరిశోధన చేస్తున్నప్పుడు, రిటైర్డ్ ఐపిఎస్ అయిన అరుణ్ ఉపాధ్యాయ్ వరాహమిహిర అంగారక గ్రహం గురించి రాసిన విషయాలను అధ్యయనం చేశాడు. ఆ అధ్యయనం ఆయన అంగారక గ్రహంపై ఒక పుస్తకాన్ని రాశాడు. వరాహమిహిర జ్యోతిష్యంలోనూ తనదైన ప్రతిభను కనబరిచారు. ఆయన మొత్తం జ్యోతిష్యంలోని మూడు ముఖ్యమైన జ్యోతిష్యాలను రాశాడు. బృహత్ జాతక, లఘు జాతక, సమస సంహిత జాతక, బృహత్ యోగయాత్ర, యోగాయాత్ర, బృహత్ వివాహ పతల్,లగ్న వారాహి, కుతూహల మంజరి, దైవాంజ వల్లభ జ్యోతిష్యగ్రంధాలను ఆయన రాశాడు. వరాహమిహిర తనయుడు ప్రితుయాసస్ కూడా హిందూ జ్యోతిష్య గ్రంధాన్ని రాశాడు. ఈయన ‘హోరా సర’జ్యోతిష్యంలో జాతకం గురించి చాలా గొప్పగా రాశాడు. మధ్యయుగ బెంగాలీకి చెందిన ఖానా (లీలావతి) కవయిత్రి, జ్యోతిష్యురాలును వరాహమిహిర కోడలుగా చెబుతారు. courtesy... mana bharathdesam
  • ఈ తరం యువతకు ఈ ఫొటోలో ఉన్న రాజు గారి  గురించి  అంతగా తెలియదు . హైదరాబాద్  అభివృద్ధి లో మహబూబ్ ఆలీఖాన్ పాత్ర  చాలానే ఉంది. హైదరాబాదు ను పరిపాలించిన అసఫ్‌జాహీ వంశపు ఆరవ నవాబు. ఈయన 1869 నుండి 1911 వరకు హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించాడు.మహబూబ్ ఆలీఖాన్ పరమత సహనము కలిగినవాడుగానూ, కళా పోషకుడుగానూ పేరుపొందినవాడు. పేదసాదల నిత్యపోషకుడిగా ప్రసిద్దుడు. అలీఖాన్ తండ్రి అఫ్జల్ ఉద్దౌలా క్రీ.శ. 1869 లో మరణించగా అతని మూడేళ్ళ వయసు గల కుమారుడు మహబూబ్ ఆలీ ఖాన్ ఆరవ అసఫ్ జాగా రాజ్యానికి వచ్చాడు. ఇతనికి సంరక్షకులుగా సాలార్ జంగ్ మరియు అమీర్ ఎ కబీర్ లను బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. పరిపాలనా దక్షుడైన సాలార్ జంగ్ తన పాలనా సంస్కరణలను కొనసాగించి క్రీ.శ. 1883 ఫిబ్రవరి 8వ తేదీన మరణించాడు. రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తమై ముల్కీ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అందువలన బ్రిటిష్ వారు సాలార్ జంగ్ కుమారుడైన మీర్ లాయిక్ ఆలీ ఖాన్ మరియు రాజా నరేంద్ర బహదూర్ లను సంయుక్త పాలకులుగా నియమించింది. మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ మేజర్ కావడం వలన 1884, ఫిబ్రవరి 5 వ తేదీన బ్రిటిష్ వైస్రాయ్ అయిన లార్డు రిప్పన్ స్వయంగా వచ్చి నిజాంకు అధికార లాంఛనాలు అందజేశాడు. అదే రోజు మీర్ లాయిక్ ఆలీ ఖాన్ రెండవ సాలార్ జంగ్ బిరుదుతో దివాన్ గా నియమించబడ్డాడు. రాజభాషగా పర్షియన్ భాష స్థానంలో ఉర్దూ భాషను ప్రవేశపెట్టాడు. ఇతని పాలనలోనే చంద్రపూర్ నుండి విజయవాడ వరకు, బ్రిటిష్ వారితో ఒప్పందం జరిగి, రైలు మార్గం నిర్మించబడింది. నిజాం ల కాలంలో మొదటిసారి ఒక తెలుగు వ్యక్తి దివాన్ గా నియమింప బడింది ఈయన కాలంలోనే . ఆ వ్యక్తి కృష్ణ ప్రసాద్. వరంగల్ లో టౌన్ హాలు , కలెక్టర్ బంగ్లా , డి ఐ జి బంగ్లా , అజాంజాహి మిల్లు , కాజీపేట రైల్వే స్టేషన్ , ఇరిగేషన్ ఆఫీస్ , వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్స్ , మామునురు విమానాశ్రయం వారి కాలంలో నిర్మించబడ్డవి. వారి  పరిపాలనా కాలంలో చాలా సార్లు వరంగల్ జిల్లాలోని , ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలోని పాకాల ఆటవి ప్రాంతానికి వేట కి వచ్చేవారు ... పరిపాలన 1869 – 1911 పట్టాభిషేకము ఫిబ్రవరి 5, 1884 జననం :ఆగష్టు 17, 1866 జన్మస్థలం :పురానీ హవేలీ, హైదరాబాదు మరణం : డిసెంబర్ 12, 1911 మరణస్థలం : ఫలక్‌నుమా ప్యాలెస్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1893 లో లెజిస్లేటివ్ కౌన్సిల్ (మంత్రి మండలి) ఏర్పాటు చేసాడు ఇతని కాలంలో ఈ క్రింది నిర్మాణాలు జరిగాయి 1874 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 1882 చంచలగూడ జైలు 1884 ఫలకనామ ప్యాలస్ (దీనిని వికారుద్దీన్ నిర్మించాడు) 1885 టెలిఫోన్ వ్యవస్థ 1890 నిజామియా అబ్జార్వేటరీ (సైన్స్ పరిశోధన కొరకు) ఇంకా మోండా మార్కెట్, జింఖానా గ్రౌండ్, పరేడ్ గ్రౌండ్, గోల్ఫ్ కోర్సులను నిర్మించి హైదరాబాద్ అభివృద్ధికి కృషిచేశాడు.   సరిగ్గా  ఈయన పట్టాభిషేకం జరిగి 133 ఏళ్లయింది.  .......  Aravind Arya Pakide
  • "ఎన్టీఆర్‌ మాస్‌ లీడర్‌. చంద్రబాబు పక్కా రాజకీయ నాయకుడు. బాబుది హైటెక్‌ పాలన.  భారతదేశంలో లక్షా 20 వేల గ్రామాలున్నాయి. గ్రామ పునాదిగా ఎకానమీని తీసుకుంటే ఏ పాలకుడి పాల నైనా మంచిగా ఉంటుంది. అజ్ఞాతంలో ఉన్నప్పుడు పులివెందులకు వెళ్లి వైఎస్‌ రాజారెడ్డికి వ్యతిరేకంగా పాటలు పాడాను .  వైఎస్‌ పిలిపించుకుని చాయ్‌ ఇచ్చి మరీ బాగున్నావా అన్నారు. నన్నూ, నా పాటనూ చాలా ఇష్టపడ్డారు. తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు కొట్లాడి మరీ నాకు రక్షణ కల్పించారు.  గద్దర్‌ ప్రజల గాయకుడు. పేదల కష్టాల గురించి పాటలు రాస్తాడు. గద్దర్‌ ఒక మాన్యుమెంట్‌ లాంటి వాడు.  ఆయన్ని మనం కాపాడుకోవాలి"  అన్నారు. ఇంకా  తెలంగాణ ఉద్యమం ...  కేసీఆర్ పాలన ఎలా ఉంది ?  ... వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ... గ్రామాల్లో ప్రచారం చేయడం ...  గాయకుడిగా పరిణామ క్రమం ...   తదితర అంశాలపై గద్దర్ మనసు విప్పి మాట్లాడారు  ఈ ఇంటర్వ్యూ లో ... చూడండి  వీడియో.  vedeo courtesy... sakshi 
  • ఈ ఫొటోలో కనిపించే పెద్దాయన పేరు ...జమునా ప్రసాద్‌ బోస్‌. కనీసం సొంత ఇల్లు కూడాలేని  మాజీ ప్రజాప్రతినిధి  ....   ప్రజాసేవకు ప్రతిరూపం అని చెప్పుకోవచ్చు.  92 ఏళ్ల వయస్సులోనూ ప్రతిఫలం ఆశించకుండా తన శక్తిమేర ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో నిన్న గాక మొన్న చేరిన వారు కూడా కోట్లు వెనకేసుకుంటున్న రోజులివి.  నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచి...రెండు సార్లు మంత్రిగా విధులు నిర్వహించిన వ్యక్తి ఆర్థిక స్థితి ఏ స్థాయిలో ఉండాలి!  పెద్ద బంగ్లా..  కార్లు ...మందీమార్బలం  ఉంటాయని భావించటం సహజం. కానీ...ఉత్తరప్రదేశ్‌కు చెందిన జమునా ప్రసాద్‌ బోస్‌ ను  చూస్తే ఆ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు  కాన్పూర్‌కు 125 కి.మీ. దూరంలో ఉన్న బందా పట్టణం లో  ఓ సాధారణ వ్యక్తిగా రెండు గదుల అద్దె ఇంటిలో జీవనం సాగిస్తున్నారు ఆయన.  ఆ ఇంట్లో ఓ గోడకు వేలాడుతూ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, వినోబా భావే చిత్రపటాలు... ఇంటి మధ్యలో పట్టె మంచం ఇవే ఆయన  ఆస్తులు. వయోభారం వల్లనేమో కాస్త వినికిడి శక్తి తగ్గింది. దగ్గరకెళ్లి కాస్త పెద్దగా మాట్లాడితే కాని వినపడదు. ఈ వయస్సులోనూ ఆయన ప్రజలకు సాయం చేస్తూనే ఉంటారు.  బందా సమీపంలోని ఖిన్నినాకా గ్రామానికి చెందిన జమునా ప్రసాద్‌ చిన్నతనంలోనే సోషలిస్టు ఉద్యమంలో చురుకైన పాత్ర  పోషించారు.  సుభాష్‌ చంద్రబోస్‌ ఆయనకు స్ఫూర్తి. పేద ప్రజల హక్కుల సాధన కోసం కృషి చేసిన జమునా ప్రసాద్‌ను ప్రజలు అభిమానంగా బోస్‌ అని పిలుచుకునే వారు. చివరకు బోస్‌ అతని పేరులో భాగమైంది. 1962, 1967 లోక్‌సభ ఎన్నికల్లో, 1969లో అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓటమి చవిచూసిన బోస్‌ ఆ తర్వాత వరుసగా నాలుగు మార్లు  అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977, 1989లలో రాష్ట్ర మంత్రిగా పంచాయితీరాజ్‌-గ్రామీణాభివృద్ధి, పశు సంవర్థక-మత్స్య శాఖల బాధ్యతలను నిర్వహించారు. ఇక వారసత్వంగా వచ్చిన ఇంటిని కూడా జమునా ప్రసాద్‌.. సోదరి వివాహం కోసం విక్రయించారు. జమునా ప్రసాద్‌ భార్య చాలా ఏళ్ల క్రితమే చనిపోయారు. ముగ్గురు కుమారులు బతుకుదెరువు కోసం ఎక్కడికెక్కడికో వెళ్లి జీవిస్తున్నారు. తండ్రి బాగోగులు అంతగా పట్టించుకోరు.  ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు .  పింఛనుగా వచ్చే డబ్బు నుంచే మందులు కొనుగోలు చేయగా మిగిలినవి ఇంటి ఖర్చులకు వినియోగించుకుంటున్నారు.  ప్రస్తుత తన పరిస్థితికి ఆయన ఏమి విచారించడం లేదు. ఆనందంగానే ఉన్నారు. అంతకుముందు కుటుంబ సభ్యులు  ఆర్ధిక పరిస్థితి కోసం  ఏదైనా  చేసి ఉండాల్సింది అన్నపుడు కూడా నవ్వి ఊరుకునేవారట.