Latest News
ప్ర‌ముఖులు

ప్రతాపరుద్రుడిది సహజ మరణం కాదా ?

1st Image

ప్రతాపరుద్రుడు కాకతీయ రాజవంశానికి  చెందిన చివరి రాజు. ప్రతాపరుద్రుడు  రుద్రమదేవి మనవడు (కూతురు కొడుకు).
రుద్రమదేవి కి పురుష సంతానం లేకపోవడం వలన ఆమె కుమార్తె అయిన ముమ్ముడమ్మ కుమారుడు అయిన ప్రతాప రుద్రుడిని వారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకొంది. ప్రతాపరుద్రునికి మొదట వీర రుద్రుడు, కుమార రుద్రుడను పేర్లు ఉండేవి. జినకళ్యాణాభ్యమను రచనను ముగిస్తూ గ్రంథకర్త అప్పయార్యుడు తన గ్రంథమును రుద్రకుమారదేవుని రాజ్యములో శకము 1241లో ముగించితినని చెప్పుకున్నాడు. ప్రతాప రుద్రుడు పరిపాలనా కాలం  క్రీ. శ 1289 -1323  మధ్య కాలంగా భావిస్తున్నారు.  1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణచే  ప్రయత్నములో రుద్రమదేవి మరణించింది. 
ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్ఠించాడు. 
సింహాసనం అధిష్టించిన తర్వాత కూడా చాలా సంవత్సరాల పాటు  ఆయనను  కుమార రుద్ర దేవుడు అని పిలిచే వారు.
ప్రతాపరుద్రుని పరిపాలనా కాలము అంతా యుద్ధములతోనే గడచింది.
రాజ్యాన్ని విస్తరించి రాజ్యపాలనలో అనేక సంస్కరణలు చేశాడు. ఇతని కాలములో వ్రాయబడిన "సరస్వతీ విలాసము" అనే గ్రంథములో హిందూ ధర్మములు, ఆచారములు, ఆస్తి హక్కులు మొదలగు చట్టములు క్రోడీకరించబడినవి. 
అనేక గ్రామాలకు నీటి వసతి కొరకు చెఱువులు తవ్వించాడు. వీటిలోబయ్యారముచెరువు ప్రసిద్ధమైనది.
యుధ్ధములు :
క్రీ. శ. 1289లో రుద్రమ దేవి మరణానంతరము రాజ్యాధికారము చేబట్టిన వెంటనే అంబదేవుని తిరుగుబాటు అణచివేయుటకు ప్రతాపరుద్రుడు పూనుకున్నాడు. అందుకోసం నాయంకార విధానమును కట్టుదిట్టం చేశాడు. 
నాయకుల సైన్యమునంతనూ తీర్చిదిద్ది మంచి శిక్షణ ఇప్పించి సిద్ధపరిచాడు.
తన సైన్యాన్ని మూడుగా విభజించి మూడు మార్గములలో నడిపించాడు.
ఒకటి అంబదేవుని పైకి, రెండవది నెల్లూరుపైకి, మూడవది సేవుణ రాజ్యము పైకి. ఇందులూరి అన్నయ త్రిపురాంతకముపై దాడిచేసి క్రీ. శ. 1291లో అంబదేవుని తరిమివేశాడు. ఆడిదము మల్లు నెల్లూరు పైకి వెళ్ళి అక్కడ మనుమగండభూపాలుని హతమార్చాడు. పశ్చిమరంగములో గోన గన్నయ, విటలుడు యాదవరాజా క్రాంతములైనున్న ఆదవాని, తుంబళము కోటలు పట్టుకొని రాయచూరు దుర్గముపై దాడికి వెళ్లారు.
కన్నడప్రాంతాలైన మాణువ, హాళువలను కూడా సాధించి కృష్ణా తుంగభద్రల మధ్య దేశమంతటినీ జయించారు. దీనితో సేవుణ రాజు దురాక్రమణము కట్టుబడింది. కాకతీయ నాయకులలో తలెత్తిన అనైక్యత, ఈర్ష్యాద్వేషాలు కూడా ఓటమికి కారణాలని చరిత్రకారుల అభిప్రాయం.
కాకతీయుల చరిత్ర కు సంబంధించి తర్వాతి కాలపు , కధాత్మక గ్రంధం ప్రతాప చరిత్ర ప్రకారం ప్రతాప రుద్రుని భార్య విశాలాక్షి . అంతేకాకుండా అతనికి లక్ష్మి దేవి అనే రెండవ భార్య కూడా ఉంది.(karimnagar district Yeligedu inscription ).
మరణం :
ప్రతాపరుద్రుడు, కటకపాలుడు గన్నమ నాయుడు, కొంత మంది సేనానులు బందీలయ్యారు. ప్రతాపరుద్రున్ని బంధించిన ఉలుఘ్‌ఖాన్, వరంగల్ లోనే ఉంచితే ప్రమాదమని విశ్వాసపాత్రులైన ఖాదిర్ ఖాన్, ఖ్వాజాహాజీలకు ఆయన్ను ఢిల్లీకి తరలించే బాధ్యతను అప్పగించాడు. అయితే ప్రతాపరుద్రుడు మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. అయితే ఇవన్నీ గ్రంథస్తం చేసిన షాంసి సిరాజ్ అఫీఫ్ ప్రతాపరుద్రుడు ఎలా మరణించాడో వివరించలేదు. సుల్తాను సైన్యం ప్రతాపరుద్రుని ఢిల్లీ తీసుకు వెళుతుండగా మార్గమధ్యాన సోమోద్భవ (నర్మదా నది) తీరంలో ఆయన కన్నుమూశాడని ముసునూరి ప్రోలయ నాయకుని క్రీ.శ. 1330 విలసదానపత్రం పేర్కొంది.
ప్రతాపరుద్రుడు సహజ మరణం చెందలేదని స్వఛ్ఛందంగానే భగవదైక్యం చెందాడని క్రీ.శ. 1423లో రెడ్డిరాణి వేయించిన అనితల్లి కలువచేరు తామ్రశాసనంలో ఉంది.దీనిని బట్టి ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకోవటమో లేదా అతని కోరిక మేరకు సహచరులెవరైనా చంపటమో జరిగివుంటుందని భావిస్తున్నారు.
ప్రతాప రుద్రుని వీరగాథ తెలుగు సాహిత్యంలోఎన్నో విధాలుగా కీర్తింపబడింది. డిసెంబర్ 31 ఆయన మరణించిన రోజు. 
Source : తెలుగు వికీపీడియా .
వివిధ దినపత్రికల కధనాలు
పరబ్రహ్మ శాస్రి గారి కాకతీయులు గ్రంధం.
దెక్కన్ లాండ్ మాస పత్రిక కధనం.
 
----- Aravind Arya Pakide

Site Logo
  •  ( Rajeshwar Rao Ravichettu )  ........................................... నేతాజీ' సుభాష్ చంద్రబోస్  దేశం  గర్వించదగ్గ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ నాయకత్వం‌ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని పోరాటం సాగిస్తుంటే నేతాజీ సాయుధ పోరాటంద్వారా మాత్రమే ఆంగ్లేయులను దేశం నుంచి పారదోలడం సాధ్యమని ఆచరణలో చూపిన మహనీయుడు. భారత జాతీయ కాంగ్రేసుకు బోసు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ గాంధీతో  గల  సైధ్ధాంతిక విభేదాలతో ఆ పదవికి రాజీనామా చేశాడు. అహింసావాదం స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాటయే పరిష్కారమని బోసు విశ్వసించాడు. ఈ లక్ష్యంతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. జీవితకాలం‌లో 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. శత్రువు శత్రువు మనకు మిత్రుడనే అనే సూత్రంతో రెండవ ప్రపంచ యుద్ధం (1939) ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి సువర్ణవకాశంగా భావించిన నేతాజీ యుద్ధం ప్రారంభం కాగానే ఆంగ్లేయుల కూటమిపై పొరాటానికి రష్యా కూటమిలోని మిత్రదేశాలైన జర్మనీ, జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఇతర  ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం  ను (ఆజాద్ హింద్ ఫౌజ్) ఏర్పాటు చేశాడు. జపాను తోడ్పాటుతో సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచాడు. బ్రిటిష్‌కూటమిపై పోరాటానికి సేకరించిన నిధులతో రూ 50లక్షల మూలధనంతో‌ రంగూన్‌లో ఆజాద్ హింద్ బ్యాంక్‌ను ఏర్పాటుచేశాడు. ప్రామిసరీనోట్ల రూపం‌లొ ఆజాద్ హింద్ కరెన్సీని ముద్రించాడు. నేతాజీ మరణానంతరం ఆడబ్బు ఏమైందీ తెలియరాలేదు. వియన్నాలో డా. మాధుర్ ద్వారా పరిచయమైన కాధలిక్ విశ్వాసి, ఆస్ట్రియాదేశస్తురాలైన ఎమిలీ షెంకీ ని బోసు 1937లో వివాహమాడారు. వారికి 1942లో అనితా బోస్ ఫాఫ్ అనే కుమార్తె జన్మించింది.  మనదేశం‌లో భాగమైన అండమాన్, నికోబార్ దీవులనుండి బ్రిటిష్‌వారిని పారదోలిన జపాన్ నేతాజీతో ఒప్పందం ప్రకారం ఆజాద్ హింద్ ఫౌజ్‌కు స్వాధీనం చేశారు. నేతాజీ ఆ ద్వీపాలకు షాహీద్, ఆజాద్‌లుగా నామకరణంచేసి డిసెంబర్ 30 1943 న భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. నేతాజీ అదృశ్యం (1945) తదుపరి ఆప్రాంతాలు తిరిగి బ్రిటిష్ ఆధీనం‌లోకి వెళ్ళాయి. బోసు రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ,  జపానులతో స్నేహంపై చరిత్రకారులు కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. అతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు 18 ఆగస్టు, 1945న మరణించాడని ప్రకటించినప్పటికీ అందులొంచి బయట పడి అజ్ఞాతం వెళ్ళాడని పలువురు నమ్ముతారు. నేతాజీ మరణానికి  చెందిన పత్రాలను నాటి కాంగ్రేస్ ప్రభుత్వంకానీ, ఈనాటి  యన్ డి ఏ  ప్రభుత్వం కానీ  పూర్తిస్థాయిలో ప్రకటించలేదు. అంతర్జాతీయ  సంబంధాలు వికటిస్తాయనే మిషతో సమాచార హక్కు ద్వారా చేసిన విజ్ఞప్తులనుకానీ, కోర్టు ఆదేశాలనుగానీ అమలుచేయడం‌ లేదు .  నేతాజీ బతికే ఉన్నారా ?  ఇదే విషయమై.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు భారత ప్రభుత్వం మూడు  కమిషన్‌లను వేసింది. కానీ ఏ ఒక్క కమిటీ సుస్ప‌ష్టంగా నివేదిక ఇవ్వ‌లేదు.1945 ఆగస్టులో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ చనిపోయినట్లు  షోనావాజ్ కమిషన్ నిర్థారించింది. 1970లో ఏర్పాటైన జీడీ కోస్లా కమిషన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.నేతాజీ కుటుంబ సభ్యులు మాత్రం ఈ అభిప్రాయాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ రెండు కమిషన్‌లు వాస్తవాలను వెల్లడించడంలేదని నేతాజీ కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. అంతేకాక ఎన్డీయే ప్రభుత్వం నెహ్రూకు సంబంధించి ఇటీవ‌ల బయటపెట్టిన నివేదిక కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.నేతాజీ చనిపోయారని ప్రకటించిన తర్వాత కూడా నెహ్రూ నేతాజీ కుటుంబంపై నిఘా పెట్టారన్నది సంబంధిత నివేదిక సారాంశం. ఏదేమైనా. నేతాజీకి సంబంధించిన నిజాలు వెలుగు చూస్తే జాతికి ఎంతో మేలు. లేకుంటే స్వాతంత్ర్య సంగ్రామంలో కీల‌క పాత్ర పోషించిన నెహ్రూ లాంటి నాయ‌కుల‌పై అనుమానాలు త‌ప్ప‌వు. ఈవేళ  ఆ  మహనీయుని  జన్మదినం   (23 జనవరి 1897- 18 ఆగస్టు 1945 ?) దేశాన్ని త్రికరణ శుధ్దిగా ప్రేమించిన నేతాజీ జయంతిని ‘దేశ్ ప్రేమీ’ దివస్‌గా జరుపుకుంటూ ఆయన త్యాగాలను స్మరించుకుందాం. దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మనంకూడా త్రికరణశుధ్ధిగ కృషిచేద్దాం. 
  • ప్రవచనకర్తగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన చాగంటి కోటేశ్వరరావు  ఇకపై  ప్రవచనాలు చెప్పడం మానివేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.  తనపై  కేసులు పెట్టడంతో చాగంటి వారు మనస్తాపం చెందారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా ప్రవచనాలు  చెప్పే కార్యక్రమాలకు  స్వస్తి పలకాలని చాగంటిపై ఒత్తిడి తెస్తున్నట్టు  సమాచారం.  నాలుగు  రోజుల క్రితం కృష్ణుడి గొప్పతనం వివరించే క్రమంలో చాగంటి చేసిన వ్యాఖ్యల పట్ల యాదవులు  ఆగ్రహం  వ్యక్తం  చేశారు. ఈ క్రమం లోనే  హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ ఇలా తెలుగు రాష్ట్రాల నలుమూలలా తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ అఖిల భారత యాదవ సంఘం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాగంటి పై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.  ఈ పరిణామాలతో చాగంటి  యాదవులకు  క్షమాపణలు  కూడా చెప్పారు. గత ఏడాది కూడా కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని  అసలు ప్రవచనాలే మానేస్తే ఈ బాధ ఉండదని భావిస్తున్నారట.  తనకు తానుగా చాగంటి వారు ఏనిర్ణయం ప్రకటించలేదు.
  • రాందేవ్ బాబా.. పరిచయం అక్కరలేని పేరు.. ఈ యోగా గురు చేసే ఆసనాలు, విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు.. తాజాగా ఆయన తనలోని మరో ప్రతిభను బయటకు తీశారు. అదే కుస్తీ.. బుధవారం ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌ ప్రచార బౌట్లో 2008 ఒలింపిక్‌ రజత పతక విజేత ఉక్రెయిన్ రెజ్ల‌ర్ స్టాద్నిక్‌తో బాబా తలపడ్డారు. ఈ స్నేహపూర్వక పోరులో రామ్‌దేవ్‌ బాబా ఏకంగా 12-0తో గెలిచారు. ప్రచారం కోసం నిర్వహించిన కార్యక్రమం కావడంతో బాబా విజయానికి స్టాద్నిక్‌ సంపూర్ణ సహకారాన్ని అందించాడు. నాలుగు పాయింట్లతో ఖాతా తెరచిన రాందేవ్, వరుస పాయింట్లు సాధిస్తూ 7-0 ఆధిక్యంలోకి వెళ్లి.. బౌట్ ముగిసేసరికి మరో ఐదు పాయింట్లు సాధించారు. ఒలింపిక్ ప్లేయర్‌కు కనీసం ఒక్క పాయింట్‌ను కూడా కోల్పోకపోవడం విశేషం. 2008 ఒలింపిక్స్ లో సుశీల్ కుమార్ స్టాద్నిక్‌ చేతిలో మొదటి రౌండ్ లోనే ఓడిపోయాడు. ఆ తర్వాత స్టాద్నిక్‌ ఫైనల్స్ చేరడంతో సుశీల్ రెప్ ఛేజ్ పద్దతిలో విజయాలు నమోదు చేసి కాంస్య పతకాన్ని సాధించాడు. vedeo  courtesy... nyusu digital media 
  • (సుశ్రీ).....................................   ఒక్కోసారి  జీవితంలో  ఊహించని సంఘటనలు  జరుగుతుంటాయి.  దాంతో  మన ఆశలు కలలు తల్లక్రిందులవుతాయి. అయినా క్రుంగి పోకూడదు.  ధైర్యంగా పరిణామాలను  ఎదుర్కోవాలి.   ఏదీ మనచేతిలో లేదు. పోరాటం మినహా. అలాంటి  స్ఫూర్తి నిచ్చే కథనం ఇది. చదవండి.  ఆర్థర్ ఆష్.... ప్రపంచ చరిత్రలోనే ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ ను గెలుచుకున్న తొలి నల్లజాతీయుడు.... ... 1983 లో గుండెకు శస్త్రచికిత్స చేయించుకుంటూండగా పొరబాటున కలుషిత రక్తం ఎక్కించడంతో ఆయనకు ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. .. ఈ వార్త విని ఆష్ అభిమానులు మిన్ను విరిగి మీద పడ్డట్టు ఖిన్నులయ్యారు. వేలాది మంది కన్నీటి లేఖలు వ్రాశారు. .. అందులో ఒక అభిమాని "మీకే ఎందుకు ఇంత భయంకరమైన వ్యాధి వచ్చింది. " అని చాలా బాధతో వ్రాశాడు. "అసలు దేవుడికి మిమ్మల్నే బాధ పెట్టాలని ఎందుకు అనిపించిందో?" అని అడిగాడు. .. దానికి ఆష్ ఇలా జవాబిచ్చాడు. .. "యాభై మిలియన్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడితే అందులో యాభై లక్షలమందికే ఆట సరిగ్గా అబ్బుతుంది." "అందులో అయిదు లక్షల మందే ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాళ్ల స్థాయికి చేరుకుంటారు..." "అందులో యాభై వేల మంది మాత్రమే టోర్నమెంట్ సర్క్యూట్ ఆటల స్థాయికి వస్తారు...." "వారిలో అయిదు వేల మంది మాత్రమే గ్రాండ్ స్లామ్ స్థాయికి ... అంటే వింబుల్డన్....అమెరికన్ ఓపెన్... ఆస్ట్రేలియన్ ఓపెన్... ఫ్రెంచ్ ఓపెన్ ల స్థాయికి వెళ్తారు. వారిలో యాభై మంది మాత్రమే వింబుల్డన్ లో గట్టిపోటీనిస్తారు." "వారిలో నలుగురే సెమీఫైనల్ కి వెళ్తారు." "అందులో ఇద్దరే ఫైనల్ కి వస్తారు....." "అలా ఫైనల్ లో గెలిచిన వాడే వింబుల్డన్ విజేత అవుతాడు... కప్ ను చేజిక్కించుకుంటాడు...." "కప్పును గెలుచుకున్న నాడు నేను ... "దేవుడా ... నాకే ఎందుకింత ఆనందాన్నిచ్చావు" అని అడగలేదు.   ఈ కష్టం వచ్చిపడినప్పుడు "దేవుడా నాకే ఎందుకీ కష్టాన్నిచ్చావు" అని మాత్రం ఎందుకు అడగాలి? . 
  • (రాజేశ్వర్ రావు రావిచెట్టు)  ............................. అందాలన్నీ రాశిగాపోసి ఆ రాశికి ప్రాణంపోస్తే ! బంగారానికి సువాసన వుంటే !! విజ్ఞానాన్వేషకుడైన ప్రతీ ఒక్కరికీ వేలాదిసంవత్సరాలుగా మానవుడు నమోదుచేసుకున్న సమాచారం ఉచితంగా అందుబాటులోకివస్తే ...... ఈ ప్రపంచం, ఈ ప్రపంచం ఈజీవితం ఎంత సుందరంగా, ఎంత నందనవనంగానూ ఉంటుంది కదా! తొలుత పేర్కొన్న రెండింటి సాధ్యాసాధ్యాల విషయమేమోగానీ మూడవదాన్ని మనకు ఆవిష్కృతం చేస్తున్నది “వికీపీడియా” ఎక్కడ బతికినా పుట్టిన ఊరుతోపాటు నీడనిచ్చిన చెట్టునుసైతం తల్చుకొవాలని పెద్దలు చెబుతారు. ‘మాతృదేవోభవం పితృదేవోభవా, ఆచార్యదేవో భవా’ తలిదండ్రులతోపాటు చదువుచెప్పిన గురువుకు సమాన స్థానమిచ్చాము. అవసరమైన సమాచారాన్ని అడిగిందే తడవుగా మనకు అందజేస్తున్న అంతర్జాల ‘వికీపీడియా’ ను  ఓసారి తలచుకోవడం మన కనీస బాధ్యత.  ఇది అతి సంక్షిప్త పరిచయం.  వికీపీడియా కు 16 సంవత్సరాలు.  వికీపీడియా అంతర్జాలాధారిత బహుభాషాయుతంగానూ ఉచితంగానూ అందుబాటులోనుండే నిఘంటువు. సాండియాగోలోనున్న బోమిస్ జిమ్మీవేల్స్ లారీసాంగర్ అనే ఇద్దరు ఔత్సాహిక సమాచార సాంకేతిక శాస్త్రవేత్తల సమిష్టిగా 15 జనవరి 2001న ప్రారంభించిన ప్రయోగం తొలుత “న్యూపీడియాగానూ తదుపరి వికీపీడియాగానూ రూపాంతరం చెందింది. వీరికి పూర్వం రిక్ గేట్స్ అనే మరో సమాచార శాస్త్రవేత్త 1993లోనే ఆన్‌లైన్ నిఘంటువును రూపొందించడానికి ప్రయత్నించాడు. మరో సమాచార శాస్త్రజ్ఞుడు  రిచర్డ్ స్టాల్‌మన్ మరో ఆన్‌లైన నిఘంటువు ను ప్రవేశపెట్టినప్పటీకీ కాలక్రమం‌లో వికీపీడియా ప్రజాదరణ పొందింది. ' అలెక్సా ఇంటర్నెట్'  అనే అంతర్జాల సందర్శకుల సమాచార విశ్లేషణ  సంస్థ ఆగస్ట్ 2015 నాటికి అంతర్జాలం‌లో  అత్యధికసంఖ్యలో సందర్శకులు  వీక్షించే వెబ్‌సైట్లలో ఆరవదిగా పేర్కొన్నది. సగటున నెలకు 49కోట్ల 50 లక్షలమంది అంతర్జాల వాడకందారులు వికీపీడియాను సందర్శిస్తారని వెల్లడించింది. WMFఅనే మరో విశ్లేషణ  సంస్థ సందర్శకు లు నెలలో 18 బిలియన్ పేజీల సమాచారాన్ని  చదువుతారని వెల్లడించింది. ఇంత ప్రజాదరణగల వికీపీడియా ప్రకటనలను అంగీకరించదు. ఒక్కసారి ప్రకటనలకు తావిస్తే తమ లక్ష్యమే దెబ్బతింటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతీ సంవత్సరం డిసెంబర్ నెలలో పాఠకులనుండి విరాళాలను కొరుతుంది. $30 గానీ వందరూపాయలుగానీ కనీస విరాళం. అవకాశముంటే మీరుకూడా ఈ డిసెంబరులో వికీపీడియాకు ఆసరా ఇవ్వండి.  లాంగ్ లివ్ వికీ పీడియా!
  • (మల్లారెడ్డి దేశిరెడ్డి)    .......................      నరేంద్రనాథ్  ఎంతోమంది  మత నాయకులను కలుసుకున్నాడు. వాస్తవంగా వారెవ్వరూ, "దేవుడు ఉన్నాడా "లేడా ? అన్న అతని ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదు, ఇది అతని ఆధ్యాత్మిక అశాంతిని మరింతగా పెంచి ఇటువంటి చిక్కుపరిస్థితిలో, కలకత్తాకు కొద్ది దూరంలో, దక్షిణేశ్వరంలో ఒక సాధువు ఉన్నాడని తన ఆచార్యుడైన విలియం హేస్టీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ విధంగా 1881 లో ఆధునిక భారతదేశపు దివ్యద్రష్ట అయిన శ్రీరామకృష్ణులకి స్వామికి పరిచయం కలిగింది. తొలిసారి తన గురువు రామకృష్ణ పరమహంసను కలువగానే,రామకృష్ణ గారు మాట్లాడుతూ స్వామితో ఇలా అన్నారు ఏంత కాలమునకు వచ్చితివోయి,ఇంత కాలం నాపై నీకింత నిర్దాక్షిణ్యమేలనయ్యా ,ప్రపంచ ప్రజల తుచ్చమైన ప్రసంగాలతో నా చెవులు చిల్లులు పడుచున్నవి నాయనా, నీవు నరుడనబడే సనాతన ఋషివి,మానవజాతిలో బాధలను రూపుమాపుటకై అవతరించిన నీవు నిజంగా నారాయణుడవు అని అంటూ వివేకానందుని  ఆనందముతో ఆలింగనము చేసుకున్నారు. ఆప్పుడు స్వామి  శ్రీరామకృష్ణుల వారితో ఇలా అడిగినాడు "అయ్యా! మీరు దేవుణ్ణి చూశారా ? "అందుకు "ఔను ! నేను భగవంతుణ్ణి చూశాను!నిన్నిప్పుడు చూస్తున్న దానికన్నా స్పష్టంగా చూశాను!"అని స్వామికి శ్రీరామకృష్ణులు సమాధానమిచ్చారు.స్వామికి నాడు తన సొంత అనుభూతి ద్వారా దేవుణ్ణి దర్శించిన ఒక మనిషి లభించాడు. స్వామికి అనుమానం తొలగిపోయింది,ఇక శిష్యునిగా శిక్షణ ప్రారంభం శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి అనేకరకాలుగా పరీక్షించారు. దానికి ప్రతిగా, శ్రీరామకృష్ణులు తాను అనుభూతి చెందినట్టు వర్ణించిన ఆధ్యాత్మికస్థితులలో నిజం ఎంత వరకు ఉందో తెలుసుకోవడానికి ఆయనను అనేకవిధాలుగా నరేంద్రుడు కూడా పరీక్షించి చూశాడు. క్రమక్రమంగా నరేంద్రుడు తన గురుదేవులకు శరణాగతుడయ్యాడు. తన అంతులేని ఓరిమితో శ్రీరామకృష్ణులు తన యువ శిష్యుని యొక్క సంప్రదాయ వ్యతిరేక ధోరణిని అణగార్చి, సంశయస్థితిలో నుంచి దృఢనిశ్చయానికి, ఆవేదన నుండి ఆధ్యాత్మిక ఆనందానికి అతనిని తీసుకొనిపోయారు. కానీ శ్రీరామకృష్ణులందించిన మార్గదర్శకత్వం కన్నా ఆయన ప్రేమయే ఆ యువ శిష్యుని మనస్సును మరింతగా చూరగొన్నది. అదే ప్రేమను అంతే నిండుదనంతో ఒక శిష్యుడిగా తిరిగి గురువుకు అందించాడు,తన గురువు శ్రీరామకృష్ణులు జబ్బుపడినప్పుడు ఆయనకి చికిత్స కోసం ఆయనని కలకత్తా పొలిమేర్లలో కాశీపూర్ కు తరలించారు. అక్కడనే తన గురువు ఆధ్వర్యంలో నరేంద్రుడి చివరి విడత శిక్షణాకార్యక్రమం మొదలైంది.ఆ సమయంలో నరేంద్రుడు చాలా తపస్సాధనలను చేశాడు.. తన మహాసమాధికి మూడునాలుగురోజుల ముందు శ్రీరామకృష్ణ గురుదేవుల వారు తన ఆధ్యాత్మికశక్తినంతా నరేంద్రుడికి ధారపోసి, "ఇప్పుడు నీకిచ్చిన శక్తితో మహాత్కార్యాలు సాధించబడతాయి", దాని తర్వాతే నువ్వు నీ ధామానికి చేరుకుంటావుని గురువుదేవులు చెప్పారు, గురుదేవులు 1886 వ సంవత్సరం ఆగస్టునెలలో మహాసమాధి చెందిన తర్వాత నరేంద్రుడి నాయకత్వంలో శిష్యులందరూ బారానగర్లో సన్యాస దీక్ష  తీసుకున్నారు. నరేంద్రుడు భారానగర్ లో గడిపిన దినాలన్ని అధ్యయనంలోనూ, ఆధ్యాత్మికసాధనలతో మహదానందంగా గడిచాయి. కానీ స్వామికి పరివ్రాజక జీవితం గడపాలన్న ఒక కోరికతో నరేంద్రుడు కూడా 1888 చివరిభాగం నుంచి అనేకసార్లు మఠం విడిచి యాత్రలు  చేశారు. స్వామీజీ ఎక్కడికి వెళ్ళినా, అక్కడి ప్రముఖ ప్రదేశాలు, వ్యక్తులు ఆయనను ఎక్కువగా ప్రభావితం చెయ్యలేదు. సామాన్య ప్రజానీకపు దుర్భరదారిద్ర్యం, బాధలు ఆయన యొక్క హృదయాన్ని కలచివేశాయి. ఇంచుమించుగా మూడేళ్ళపాటు, తరచుగా కాలినడకన తను ప్రయాణించి, స్వామీజీ భారతదేశాన్ని తనకు తానుగా చూసి తెలుసుకున్నారు.. గొప్ప ఉద్వేగంతో ఆయన కన్యాకుమారిలో కుమారీ దేవి విగ్రహం ముందు సాగిలపడి ఆ తర్వాత సముద్రం ఈది,దక్షిణ తీరంలో కొద్దిదూరంలో నీటిమధ్యవున్న ఒక కొండరాయిని చేరుకుని అక్కడ ఆరాత్రంతా తను తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయారు.  భరతమాత యొక్క భూత,భవిష్యత్,వర్తమాన విషయాల గురించి  అథ:పతనానికిగల కారణాలు గురించి, తిరిగి ఉద్ధరించేందుకు తిరిగి చేయ వలసిన తగిన పద్ధతుల గురించి ఆయన ధ్యానం చేశారు. భారతదేశ పేదప్రజానీకానికి కావలసిన సహాయాన్ని కోరడానికి, తద్వారా తన జీవితపు మహాత్కార్యానికి ఒక రూపు నివ్వడానికి,పాశ్చాత్యదేశాలు ప్రయాణించాలి అనే అతి ముఖ్యమైన నిర్ణయాన్ని ఆయన ఇక్కడే తీసుకున్నారు ఈ క్రమం లోనే ఖేత్రీమహారాజుకు కొడుకు పుట్టిన వేడుకలకు రావలసిందిగా ఆయనకి ఆహ్వానం అందింది. మహారాజు స్వామీజీని సాదరంగా ఆహ్వానించి ఆయన ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లనూ చేయిస్తానని మాటయిచ్చారు. ఇక్కడే,స్వామి మహారాజుగారి విన్నపం మేర "వివేకానంద" అన్న పేరును పెట్టుకున్నారు. తాను మాట ఇచ్చినట్టుగానే మహారాజుగారు తన వ్యక్తిగత కార్యదర్శిని స్వామితో పాటు పంపి,స్వామికి బొంబాయినుండి ప్రయాణానికి కావలసినట్టి అన్ని ఏర్పాట్లను చేయించారు. అమెరికాకు స్వామీజీ 1893 మే 31 వ తేదీన వెళ్లారు. స్వామి వివేకానందులు చైనా,జపాన్,కెనడాల మీదుగా ప్రయాణించి చికాగో నగరానికి జులై మధ్యభాగంలో చేరుకున్నారు. కాంటన్ లో ఆయన కొన్ని బౌద్ధవిహారాలను దర్శించారు. విశ్వమత మహాసభలో తగిన ఆహ్వానపు పరిచయపత్రాలు లేనిదే ఎవ్వరినీ అందులో పాల్గొనడానికి అనుమతించరనీ తెలుసుకుని నిరాశ చెందారు.దారి తప్పిపోయినట్టు తనకు తోచినా దేవుడిమీద భారంవేసి చికాగోకన్నా చౌకగా ఉండే బోస్టన్ నగరానికి వెళ్ళారు. తాను ప్రయాణించే రైలులో ఆయనకు మిస్ కాథరిన్ సాన్ బర్న్ తో పరిచయమయింది. ఆమె తన అతిథిగా ఉండమని స్వామీజీని ఆహ్వానించింది. ఆమె ద్వారా స్వామీజీకి హార్ వార్డ్ విశ్వవిద్యాలయ ఆచార్యుడైన జాన్ హెన్రీ రైట్ మహాశయునితో పరిచయం కలిగింది. సర్వమత మహాసభ అధ్యక్షునికి స్వామీజీని గురించి ఒక పరిచయపత్రాన్ని డా.రైట్ ఇచ్చారు. అందులో ఒక వాక్యంగా, "విద్యాధికులైన మన ఆచార్యులందరినీ ఏకం చేసిన దానికన్నా ఎక్కువ జ్ఞానవంతుడైన మనిషి ఇక్కడ ఉన్నాడు", అని వ్రాశాడు. సర్వమత మహాసభ జరిగేనాటికి ఒకటి లేదా రెండురోజుల ముందు స్వామీజీ చికాగోకు తిరిగి వచ్చారు. కానీ ఆయన దిగులుకుతోడు ప్రాచ్యమత ప్రతినిధులకు ఆతిధ్యాన్ని అంద జేసే కమిటీ చిరునామాను పోగొట్టుకున్నారు. ఆ రాత్రి అక్కడి రైల్వేస్టేషన్లో తల దాచుకుని, మరునాటి ఉదయం తనకి ఎవ్వరైనా చిన్న సహాయం చెయ్యగల మనిషి కొరకు చూశారు కానీ శ్వేతజాతీయులుకాని వారికి సహాయం అంతత్వరగా లభించదు. స్వామి నిష్పలంగా చాలాసేపు అన్వేషించిన మీదట అలసిపోయి అంతా దైవసంకల్పంమీద వదిలి రొడ్డుప్రక్కన చతికిలబడ్డారు.అకస్మాత్తుగా ఆయనకు తన ఎదురుగా ఉన్న ఇంటిలోంచి ఒక స్త్రీ ఆయన వద్దకు నడిచి వచ్చి  ఏ సహాయం కావాలని అడిగారు. ఆమెయే శ్రీమతి జార్జ్ డబ్ల్యూ హేల్. వారింటి చిరునామాయే ఇక అమెరికాలో స్వామీజీ శాశ్వత చిరునామాగా నిలిచిపోయింది. హేల్ కుటుంబీకులందరును స్వామీజీ భక్తులైనారు. సర్వమత మహాసభ 1893 సెప్టెంబరు 11 వ తేదీన ప్రారంభమయింది. కళాసంస్థ (Art Institute) సభాప్రాంగణం సుమారు 7000 మంది జనంతో కిటకిటలాడిపోయింది. వారు ఆదేశపు ఉత్కృష్ట సంస్కృతికి ప్రతినిధులు. వేదికమీద ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన అన్నిమతాల ప్రతినిధులు అందరు ఆశీనులయ్యారు. విశ్వవిఖ్యాతులయిన వారితో నిండిన సభను ఉద్దేశించి అయన ఎన్నడూ ప్రసంగించలేదు. దాంతో  చాలా భయపడ్డారు. ఆయన తరుణం వచ్చినప్పుడు, మనస్సులో సరస్వతీదేవికి నమస్కరించి, "అమెరికాదేశపు సోదర సోదరీమణూలారా!" అని సంబోధించారు, వెను వెంటనే ఆనాటి బ్రహ్మాండమైన సభలో కరతాళధ్వనులు మిన్నుముట్టాయి.పూర్తిగా రెండు నిముషాలు పాటు ఆ కరతాళాలు ఆగలేదు. ప్రజ్వరిల్లే చిత్తశుద్ధితో స్వామి పలికినటువంటి పలుకులు, తేజస్సుతో నిండిన ఆయన ముఖవర్చస్సు, కాషాయవస్త్రాలు వారిని ఎంతగా ఆకట్టుకున్నాయంటే మరుసటిరోజు వార్తాపత్రికలు స్వామీజీని సర్వమత మహా సభలో పాల్గొన్న ప్రతినిధులలో ఒకఅత్యంత అత్యుత్తముడిగా కీర్తించాయి. వివేకానంద గొప్ప ఉపన్యాసకులు, ఆయన ప్రసంగం ఎంతటివారినైన అలరించేది.1893 సెప్టెంబరులో అమెరికాలో చికాగోలో జరిగిన మహాసభల్లో అయన చేసినటువంటి ప్రసంగం నేటికి ప్రపంచ దేశాలలో ప్రతి ధ్వనిస్తుంది ఆయన 1896 డిసెంబరు వరకూ పాశ్చాత్య దేశాలలో ఉన్నారు. ఆ కాలమంతా స్వామికి విపరీతమైన పని వత్తిడితో గడిచింది.ఇంక లెక్కలేనన్ని ఉపన్యాసాలు, తరగతులను నిర్వహించడంతోపాటు అయన ఆనాడు న్యూయార్కులాంటి నగరంలో ఒక వేదాంత సమాజాన్ని స్థాపించారు. సహస్రద్వీపవనంలో ఆయన కొద్దిమంది శిష్యులకి తనే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అక్కడ కొందరిని శిష్యులుగా చేసుకున్నారు. వారిలో ముఖ్యులు కెప్టెన్ సేవియర్ దంపతులు,సోదరి నివేదిత ఇంకా ఇ.టి.స్టర్డీ మొదలైనవారు. అంతకు ముందు జె.జె.గుడ్విన్ అనే సంక్షిప్త లేఖకుడు స్వామికి శిష్యుడయ్యాడు. ఈ పర్యటనలోనే ఆయన మాక్స్ ముల్లర్ కలుసుకున్నారు. ఆయన యూరపుఖండాన్ని పర్యటిస్తున్నప్పుడు నాటి ప్రఖ్యాతజర్మన్ ప్రాచ్యతత్త్వవేత్త అయిన పాల్ డుస్సెన్ ను కలుసుకునారు. వివేకానంద స్వామి సేవియర్ దంపతులతో కలిసి 1896 డిసెంబర్ 16 తేదీన లండన్ నగరాన్ని వదలి బయలుదేరారు. ఇటలీలోని రోమ్ తదితరప్రదేశాలని సందర్శించిన స్వామి తరువాత డిసెంబరు 30తేదీన నేపుల్స్ లో భారతదేశానికి వెళ్ళే ఓడను ఎక్కారు.ఇంక నేపుల్స్ లో జె.జె.గుడ్విన్ వారితో కలిశాడు. స్వామి వారు 1897 జనవరి 15 న కొలంబో చేరుకునారు. స్వామీజీ వస్తున్నారన్న వార్త అప్పుడే భారతదేశమంతా పాకిపోయింది. దేశమంతటా అన్నిచోట్లా ప్రజలు స్వామీజీని ఆహ్వానించాలని ఎంతో ఆతృతతో ఎదురు చూడసాగారు. ఆయన ఇప్పుడు మాములు "అనామక సన్యాసి" ఎంతమాత్రం కాదు. ప్రతి చిన్నాపెద్దా పట్టణంలో ఆయనకి ఆహ్వానం పలకడానికి ఆహ్వానసంఘాలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి.దానిని రోమారోలా ఇలా వర్ణించాడు ఇలా: "అత్యుత్సాహంతో ఎదురు తెన్నులు చూస్తున్న జనబాహుళ్యానికి తన భాతరదేశానికి గొప్ప సందేశంతో రాముడు, కృష్ణుడు, శివుడు పుట్టినట్టి భరతభూమిని పునరుజ్జీవింపజేసే శంఖారావంతో, జనుల ధీరశక్తినీ, అమర ఆత్మశక్తినీ గొంతు ఎలుగెత్తి పిలుస్తూ, యుద్ధరంగానికి కదను త్రొక్కమన్న ఆయన ఒక సేనాధిపతి. తన ’ఉద్యమ ప్రణాలికను’ వివరించి తన దేశప్రజలందరిని ముకుమ్మడిగా లేచిరమ్మని పిలుస్తూ, ’ఓ, నా భారత దేశమా! నీ ప్రాణశక్తి ఎక్కడుందో తెలుసా? మరణ మెరుగని నీ ’ఆత్మ’లోనే!" అని ఉద్భోధించారు. మద్రాసులో ఆయన ఐదు ఉపన్యాసాలను ఇచ్చారు. మానవుల బలహీనతలనూ, పిచ్చినమ్మకాలనూ ఇకనైన పారద్రోలి ఒక కొత్త భారతాన్ని నిర్మించమని బోధించే తూర్యనాదాలు అవి. " ఏ దేశ జాతీయజీవన సంగీతానికంతటికీ మతమే జీవస్వరమని" ఆయన బోధించారు. ఆ మతం, ’ఈ విశ్వమంతా ఆ ఆత్మస్వరూపమే’ అని బోధిస్తున్నదనీ, ఆ మతాన్ని బలోపేతం చేస్తే, మిగిలినవన్నీ వాటికవే చక్కబడునని బోధించారు. అయితే స్వామి తన దేశప్రజల బలహీనతలను ఆయన విమర్శించకుండా ఉండలేదు. దేశప్రజలు గుడ్డిగా పాశ్చాత్య పద్ధతులను అనుకరించడాన్ని, పాతకాలపు పిచ్చిపిచ్చి నమ్మకాలని, కుల విభేదాలను ఆయన తూర్పారబట్టారు. స్వామి వివేకానంద 1897 లో స్వదేశానికి తిరిగి వచ్చినారు. దీనితో భారతదేశంలో ఒక నూతన శకం ప్రారంభమైనది. వెనువెంటనే స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ కూడా స్థాపించారు.వివేకానందుడు ఒక గొప్ప దేశ భక్తుడు.స్వామి భారతదేశ ఘనతను వర్ణిస్తూ ఇక్కడనే ఈ ఒక్క భారతదేశంలోనే మానవ హృదయం అతి విశాలమై అనంత విస్తృతిని పొంది తోటి మానవ జాతినే కాక అనేకమైన పశుపక్ష్యాదులతో సహా సమస్త ప్రాణికోటిచేత సర్వజగత్తు ఉచ్చంనీచం లేకుండా తనతోనే వున్నట్లు భావన చెయగలిగింది అన్నారు. మనలోని లోపాలు వివరిస్తూ "మనంతట మనం పని చేయం, పనిచేసే వారిని పనిని చేయనీయం . వారిని విమర్శించి తప్పులెంచి అవహేళన చేస్తాం. మానవ జాతిపతనానికి ముఖ్యమైనదీ ఇట్టి లక్షణమే" అన్నారు. దైవ విశ్వాసం కంటె మానవ విశ్వాసం ముఖ్యమని బోధిస్తూ "మూడు వందల ముప్పైకోట్ల మంది దేవతలలోనూ నమ్మకమున్నా నీలో నీకే ఎట్టి విశ్వాసం లేకపోతే నీకు ముక్తి లేదు. మనదేశ ప్రజలందరికి ఆత్మవిశ్వాసం మరియు క్రియా శూరత్వము కావాలి. ఈ అవసరము నాకు కనిపిస్తుంది "అని నొక్కి చెప్పారు. అంతేకాక "మనం సోమరులము, ఏ పని చేయలేము ముందు మనమంతా సోమరితనాన్ని వదిలి కష్టించి పనిచెయటం అలవర్చుకోవాలి, ఇక అప్పుడే దేశం బాగుపడుతుంది" అంటూ యువతరాన్ని ప్రేరేపించిన మహాశక్తి, గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. "నా దేశంలో కుక్క పస్తుపడి ఉన్నదానికి ఆహారం పెట్టి రక్షించటమే నా పరమధర్మం. ఇదే నా మతం. తద్భిన్నమంతా ఆదర్శమే, కృత్రిమ ధర్మమే" అని నిరుపేదయైన నా భారత నారాయణుని , నా యిష్టదేవతలను అర్చించటానికై ఎన్ని జన్మలైనా ఎత్తగలను, ఎన్నిబాధలైన ఓరుస్తాను అని ప్రకటించినారు, అన్నదాన, విద్యాదాన, జ్ఞానదానాలచే భారత ప్రజలసేవ చేస్తూ యావద్భారతంలో కాకుండా ప్రపంచమంతటా ప్రఖ్యాతి వహించిన తన గురువు శ్రీరామకృష్ణ పేరమఠసేవా సంస్థలను స్థాపించిన ఘనత ఒక్క స్వామి వివేకానందకే దక్కుతుంది. వివేకానందుల వారి కొన్ని అమృత వాక్కులు నిత్యసత్యములు మనం గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు: ప్రతి జీవి పరాత్పరుడే. ఈ లోకంలో సత్సాంగత్యము కంటే పవిత్రమైనది మరి ఒకటి లేదు. స్వార్ధ చింతన లేనప్పుడే మనం గొప్ప ఘనకార్యములు సాధిస్తాం.మన ప్రభావం ఇతరులపై పడుతుంది.ఇంక మన మతమంతా (ధర్మ) మనలోనే ఉంది. మన గ్రంధాలు గాని, గురువులు గాని, దాన్ని కనుగొనటానికి సహాయపడటం కన్నా ఏమీ చేయలేరు. వారు లేకపోయినా మనలోనే సత్యాన్ని దర్శించగలం. మతం ఒక ధర్మం వంటిది. భక్తిమార్గం చాలా సంతోషదాయకం. ప్రతివ్యక్తి మహోన్నతమైన ఆదర్శం ఎన్నుకుని తన జీవితాన్ని మలుచుకోవాలి. స్వామిజీకి దగ్గరపడుతున్న తన అంత్యకాలం మరింత స్పష్టంగా కనపడసాగింది. ఆయన మిస్ మాక్లౌడ్ కు ఒక లేఖలో ఇలా వ్రాశారు: "ఆ ప్రశాంతతీరానికి నా నావ చేరుతున్నది. అక్కడ నుంచీ మళ్ళీ అది బయలుదేరదు!". బేలూరుకు తిరిగివచ్చి కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. స్వామి తర్వాత బెంగాలు మరియు అస్సాంకు ప్రయాణమయ్యారు. ఆయా చోట్ల ఉన్న తీర్థప్రదేశాలని దర్శించాలని స్వామీజీని తన తల్లి భువనేశ్వరీదేవి కోరారు. ఈ మాట స్వామీజీ మిసెస్ బుల్ కు వ్రాసిన ఉత్తరంలో ఈ విధముగా వ్రాసియున్నారు "ప్రతి హిందూ వితంతువుకూ ఉండే కోరిక ఇది , నా వారికి నేనన్ని విధాలా బాధల్నే తెచ్చిపెట్టాను. ఆమె [అమ్మకు యున్న]ఈ ఒక్క కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తున్నాను." నంగల్ బంధ్, కామాఖ్య, షిల్లాంగ్ లాంటి మొదలైన ముఖ్య ప్రదేశాలను సందర్శించి, ఇక ఢాకాలోనూ, షిల్లాంగ్ లోనూ కొన్ని ఉపన్యాసాలిచ్చిన తర్వాత స్వామీజీ బేలూరు మఠానికి తిరిగి వచ్చారు. స్వామీజీ అంత్యకాలం సమీపించిందని స్వామీజీకి తెలుసు. 1902 లో జులై 4 వ తేదీన ఆయన ఉదయం కొంతసేపు ధ్యానం చేశారు. ఆ రోజు మధ్యాహ్నం ప్రేమానందస్వామితో కలిసి వాహ్యాళిగా నడిచి, సాయంత్రం తన గదిలో ఒక గంటసేపు ధ్యానం చేశారు. కొంతసేపు విశ్రాంతిగా పడుకున్నారు. ఆతర్వాత స్వామి కొంతసేపటికి రెండుసారులు నిండుగా తన శ్వాసతీసుకుని మహాసమాధిలోకి  వెళ్లి పోయారు . స్వామి తన భౌతిక శరీరాన్ని త్యజించి ఉండ వచ్చునుగాక,కానీ ఆయన శ్రీ ఎరిక్ హామ్మండ్ గారితో లండన్ లో చెప్పినట్టి మాటలు చూస్తే స్వామి నేటికి అమరుడనే మాట మాత్రం ఒక సైద్ధాంతిక వాస్తవం, స్వామి చెప్పిన మాటలు " నా శరీరాన్ని ఒక చింకి పాతలాగా విసిరేసి బయటికి పోవడమే మంచిదని నాకు [అంటే స్వామికి] అనిపిస్తూ ఉండవచ్చు గాక ! కానీ నేను పనిచెయ్యడం మానను!తానే దైవాన్నని నేటి ఈ ప్రపంచం తెలుసుకునేంతవరకూ ప్రతి ఒక్కరికీ నేను ప్రేరణను కలిగిస్తూనే ఉంటాను"  (వివేకానందుని జయంతి సందర్భముగా)