Latest News
సాహిత్యం

"ఆముక్తమాల్యద " శృంగార కావ్యమా ?

1st Image

ఎపుడో 500 ఏళ్ళ క్రితం  శ్రీకృష్ణ దేవరాయలు  రచించిన  కావ్యం పై మిత్రులు మల్లారెడ్డి  సమున్నత సమీక్ష ఇది . 
ఆముక్తమాల్యద  లో అసలు ఏముంది ? ఆసాంతం వడపోసి ఈ తరం పాఠకుల కోసం  ప్రత్యేకంగా  అందించిన సమీక్షా  వ్యాసం ఇది. 
ఆముక్తమాల్యద అంటే ఏమిటి?
ఆముక్త = అలంకరించుకోబడిన,ధరించిన..... మాల్య = పూలదండ,పూలమాల...... ద = ఇచ్చునది.
ఒక భక్తురాలు పూలదండను గ్రుచ్చి, మొదట తాను అలంకరించుకొని,నీటిలో తన యొక్క ప్రతిబింబం చూసుకొని ,తరువాత ఆ దండని భగవంతుని మెడలో వేసెడిదట.ఆమెనే మరి రాయల వారి కావ్యంలో కధానాయిక. ముక్త అనగా వదిలిపెట్టబడిన,ఇక ఆ పదం చేర్చుట వలన అలంకరించుకోబడిన అని అర్ధం వచ్చిచేరినది.ఆ అన్నదానిని ఉపసర్గ అందురు.ఇక సంస్కృతంలో ధాతురూపములకి ఉపసర్గలు చేర్చినచో కొన్నిచోట్ల అర్థములు భేదించును.
ఆముక్తమాల్యద కావ్యం శృంగారప్రబంధమా అవునా? కాదా! అనే ప్రశ్నకి ఒక్కో కవికి ఒక్కో రకమైన భావన ఉండవచ్చు, ఒక్కో వ్యక్తికి ఒక్కో అభిప్రాయం ఉండవచ్చు,రాయలవారి ఆముక్తమాల్యద కావ్యంలో మాత్రం వీరభక్తి, వైరాగ్యాలదే ప్రాముఖ్యత అని కనుక మీరు అనుకుంటే అది పెద్ద పొరపాటు,వాస్తవంగా మీరు కనుక ఒక్కసారి చదివినట్లయితే మీరు ఈకావ్యంలోకొన్ని ఆశ్చర్యకరమైనటువంటి వర్ణనలు చూస్తారు,వాటిలోన నగర సౌందర్య వర్ణన, ఆయా ఋతువుల పై వర్ణన, రాజ్య స్త్రీల సౌందర్య వర్ణన,వేశ్యల సౌందర్య వర్ణన, రాజుల యొక్క అంతఃపురాల వర్ణన, వేశ్యల అంతఃపురాల వర్ణన,రాజనీతి బోధన, కుల, మత, వేదాంత పరమైన ఇలా ఎన్నోవర్ణనలు.
రాయల వారు సంభాషణలను రాయటంలో తను ఆనాటి సమకాలీన వ్యావహారికభాషని ఉపయోగించినట్లు అనిపిస్తుంది.
శ్రీ కృష్ణదేవరాయలు క్రీ.శ 1474 ప్రాంతంలో జన్మించినట్లుగా చారిత్రిక ఆధారం .రాయలు క్రీ. శ 1509 ప్రాంతంలో రాజుగా రాజ్యపాలన చేపట్టినట్లు ,తర్వాత రాయల వారు అనేక రాజ్యములను జయించినట్లు చరిత్రకారులు మనకిచ్చిన ఆధారాలు. క్రీ.శ 1515 -1516 ప్రాంతంలో రాయలవారు నేటి విజయవాడకి వెళ్ళినట్లు ,ఆచటికి దగ్గరలోని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని సేవించినట్లు,ఆ రాత్రి వేకువ జామున ఆంధ్ర జలజాక్షుడు రాయల వారికి కలలో ప్రత్యక్షమైనట్లు రాయలు ఈ పద్యంలో తెలుపుకున్నాడు ఇలా,
దమ్మికే లుండఁ బెఱకేల దండ యిచ్చు
లేము లుడిపెడు లేఁజూపులేమతోడఁ
దొలఁకుదయఁ దెల్పు చిఱనవ్వుతోఁ గలఁ ద
దంధ్ర జలజాక్షుఁ డి ట్లని యాన తిచ్చె.
ప్రథమాశ్వాసము - 12 . [ 1వ పద్యం ]
అప్పుడు శ్రీకాకుళాంధ్ర విష్ణువు రాయలను ఇలా అడిగినట్లు క్రింది పద్యంలో చెప్పాడు.
మఱియు రసమంజరీ ముఖ్య మధురకావ్య
రచన మెప్పించికొంటి గీర్వాణ భాష,
నంధ్రభాష యసాధ్యంబె, యందు నొక్క
కృతి వినిర్మింపు మిఁక మాకుఁ బ్రియము గాఁగ
ప్రథమాశ్వాసము - 13 [ 2వ పద్యం ]
అంటూ మాకు ప్రీతిగా ఓ కృతిని నిర్మించు.నా అవతారాల్లో మా వివాహపు కథని చెప్తే అది నాకు పూర్తిగా సంతృప్తినిస్తుందని అని చెప్పి, అలాగే ఆ కృతిని ఆంధ్రభాషలోనే వ్రాసి నీకు ఇష్టదైవమైన శ్రీవెంకటేశ్వరుడికి అంకితం చేస్తే మాకేం భేదం లేదని ఆనతిచ్చాడని,రాయలు ఆంధ్ర మహావిష్ణుడు కోరినట్లుగా తన యొక్క ఆముక్తమాల్యద రచనకు శ్రీకారం చుట్టి,క్రీ. శ 1521 నాటికి కావ్యం పూర్తి చేసినట్లు ఆనాటి చరిత్రకారుల యొక్క అభిప్రాయం.
నాటి ఆముక్తమాల్యదలోని శ్వాసములు ::
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
ప్రథమాశ్వాసము ::
◆◆◆◆◆◆◆◆◆◆
ఇష్టదేవతాస్తవము,స్తోత్రములు,
రాయల స్వప్నం,ఆంధ్ర విష్ణువు ఆనతి,
శ్రీవిలుబుత్తూరు పుర వర్ణనము,
ద్రవిడాంగనల పోఁడుములు,
విష్ణుచిత్తుని భక్తి తత్పరత మొదలగునవి.
ద్వితీయాశ్వాసము ::
◆◆◆◆◆◆◆◆◆◆
మధురాపురీ వర్ణనము,
వేలాయాండ్ర విలాసములు,
పాండ్యరాజు మత్స్యధ్వజుని వైభవం,
పాండ్యరాజు భోగిని వద్ద కేగుచు సుభాషితం
వినుట,పాండ్యరాజు వైరాగ్యం,
విష్ణుచిత్తుని మధుర యాత్ర మొదలగునవి.  ( రేపు పార్ట్ 2 )
 --------  మల్లారెడ్డి దేశిరెడ్డి 
Site Logo
  • ( ఇలపావులూరి మురళీ మోహన రావు )    .......................   శల్యసారధ్యం అంటే చాలామందికి తెలుసు. అసలు శల్యుడు ఎవరు? ఎందుకు ఆ పేరు వచ్చింది? అనే విషయం చాలామందికి తెలియదు. మహాభారతం లోని ఒక పాత్ర శల్యుడు. ఈయన మద్రదేశపు మహారాజు. పాండురాజు భార్య మాద్రి ఇతని సోదరి. నకులుడు, సహదేవులకు  ఇతను మేనమామ. ఇతనికి రుక్మరథుడు అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఇతను తేరును నడపడం లో మంచి నిపుణుడు. కురుక్షేత్ర యుద్ధం నిర్ణయం అయినపుడు ఇతను పాండవులకు సాయం చెయ్యాలని తలపోస్తాడు. కృష్ణుడు కూడా తన రాయబారులను శల్యుడి వద్దకు పంపి యుద్ధం లో మేనల్లుళ్ళకు అండగా ఉండమని కోరుతాడు. అంగీకరించి తన సేనలతో బయలుదేరుతాడు. ఆ సమాచారం తెలిసిన దుర్యోధనుడు శల్యుడు వచ్చే దారిలో బ్రహ్మాండమైన విందు  ఇతడికోసం సిద్ధం చేసి ఎదురువెళ్తాడు. విశ్రాంతి కోసం శల్యుడు ఆగినప్పుడు దుర్యోధనుడు శల్యుడికీ ఇష్టమైన మద్యం, మగువలను సమకూరుస్తాడు. వారిసేవలకు తృప్తి చెందిన శల్యుడు "ఎవరు ఈ ఏర్పాట్లు చేశారు"" అని అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు వచ్చి తన గూర్చి చెప్పుకుని యుద్ధం లో తనకు సాయం చెయ్యమని కోరతాడు. వెంటనే ఒప్పుకుంటాడు శల్యుడు. ఆ విషయం తెలిసిన పాండవులు నిరాశ చెంది "కనీసం యుద్ధం లో వారి పక్షాన పోరాడినా, తమకు ఏదైనా మేలు కలిగేట్లు ప్రవర్తించమని" ధర్మజుడు కోరగా, దానికి కూడా అంగీకరిస్తాడు శల్యుడు. అయితే యుద్ధం లో శల్యుడు నిజాయితీగానే దుర్యోధనుడి వైపు నిలబడి పోరాడుతాడు. కర్ణుడికి సరైన సారధి లేకపోవడం తో కర్ణుడి రధాన్ని నడపమని దుర్యోధనుడు కోరగా "శూద్రునికి నేను సారధిగా ఉండను" అని నిరాకరిస్తాడు. అప్పుడు కౌరవులు శల్యుడిని పొగడ్తలతో ముంచెత్తి, అర్జునుడి సారధి శ్రీకృష్ణుడి కన్నా నువ్వే గొప్పవాడివి అని కీర్తిస్తారు. ఆ పొగడ్తలకు పొంగిపోయి సరే అని అంటాడు శల్యుడు. కర్ణుడి  రధాన్ని నడుపుతున్నప్పటికీ, ధర్మజుని వేడుకోలు గుర్తుకు రాగానే, కర్ణుడిని అడుగడునా అవమానిస్తూ, అతడిని నిందిస్తూ, అతని శక్తిని కించపరుస్తూ ఉంటాడు. అర్జునిడితో నువ్వు పోరాడలేవు అని ఎద్దేవా చేస్తుంటాడు. కర్ణుడు ఈ అవమానాలను దిగమింగుకుని యుద్ధం చేస్తుంటాడు. ఒకచోట రధం కుంగిపోయినపుడు "నువ్వు యుద్ధం చెయ్యలేవు" అని వెళ్ళిపోయాడు శల్యుడు. శల్యుడు వెళ్ళగానే అర్జునుడు కర్ణుని వధిస్తాడు. @@@ ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? మద్యం మదిని పాడుచేస్తుంది. భజనలు ఎంత గొప్ప వ్యక్తినైనా చెడగొడతాయి. తొందరపడి వాగ్దానం చెయ్యరాదు. దుష్టుల పక్కన చేరితే మృత్యువు తప్పదు. ఇక రాజకీయ రంగం లో ఇలాంటి శల్యులు కోకొల్లలు గా కనిపిస్తారు. వారిని ముద్దుగా కోవర్టులు అని పిలుస్తున్నారు. ప్రజారాజ్యం లో చేరి చిరంజీవిని ముంచేసిన పరకాల ప్రభాకర్, తెలుగుదేశం లోనే ఉంటూ ఎమ్మెల్యేలను తెరాసా లోకి పంపేసి చివరన తానుకూడా వెళ్లిపోయిన ఎర్రబెల్లి ఇలాంటి శల్యుల  కోవలోకి వస్తారు. చంద్రబాబు తన జీవితం లో తిన్న అతి పెద్ద షాక్ ఏదైనా ఉంటె అది ఎర్రబెల్లి పార్టీ నుంచి వెళ్లిపోవడమే. మన పార్టీలో ఉన్నవాడు కోవర్టు కాదు అని నమ్మలేము. అంతర్గత శత్రువులను శల్యుడు అని పిలుస్తారు. వీరు మన పక్కనే ఉన్నట్లు నటిస్తూ ఎదిరి పక్షం వారికి మేలు చేస్తుంటారు. ముఖ్యం గా రాజకీయ నాయకులు పొగడ్తలకు దూరంగా ఉండకపోతే, వారు అగడ్త లో పడటం ఖాయం.
  •  పేస్ బుక్ ఇన్బాక్స్ లో చెర్రీ కి  మెసేజ్ పెట్టింది జెన్నీ.  చెర్రీ అంటే  రామచరణం, జెన్నీ అంటే జానకి ...  వీళ్ళిద్దరూ భార్య భర్తలు. ఇండియా నుంచి  వచ్చాక పేర్లు మార్చుకున్నారు.   "ఎక్కడున్నావ్ ?"  రెండు నిమిషాల్లో చెర్రీ స్పందించాడు. "ఆఫీస్ లో ఫుల్ బిజీ. వంద కోట్ల ప్రాజెక్ట్ పై డిస్కషన్ జరుగుతోంది"   "ఒకే... నైట్ కి ఇంటికొస్తున్నారా? " "రాను .ఇక్కడే ఉంటా."    "ఒకే. మీ అమ్మనాన్నల పెళ్లి రోజు అట ఇవ్వాళ. "  "ఓహ్ ..మర్చిపోయా. " "పొద్దుటి నుంచి మీ తమ్ముడు ఒకటే ఫోన్."   "ఏందట?" "మీతో మీ నాన్న మాట్లాడాలని అంటున్నాడట."   "సరే ...నేను ఫోన్ చేస్తాలే."   "ఒకే .మీరు రారు కాబట్టి డిన్నర్ రెడీ చేయను." "ఒకే బై "చెర్రీ డిస్కనెక్ట్ అయ్యాడు. జెన్నీ తన అకౌంట్ క్లోజ్ చేసింది.  ఇంకో పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసింది.    సుబ్బు ఇన్బాక్స్ లోకి వెళ్లి "అర్జెంట్ గా ఫోన్ చేయి " అని మెసేజ్ పెట్టింది. సుబ్బు జెన్నీ బాయ్ ఫ్రెండ్. ఫేసు బుక్లో ఇద్దరికీ పరిచయమైంది.  ఎవరికి వారికి సొంత జీవితాలున్నా .... ఇద్దరు కొత్త లైఫ్ మొదలెట్టారు.   "కష్టాలు.. సుఖాలు" పంచుకుంటున్నారు.  మరు నిమిషంలో ఫోన్ వచ్చింది.  "సుబ్బు వేర్ ఆర్ యూ ?" "క్లబ్ లో ఉన్నా...ఏంటీ ప్లాన్?" "నువ్వొస్తావా?నన్ను రమ్మంటావా ?" "నేనే వస్తా.. అన్నట్టు మీ ఆయన లేడుగా?" "లేడు... రాడు... వచ్చేయి. " "ఒకే ...కమింగ్. "  "వెల్కమ్." .................................................................................................................................... చెర్రీ ఇండియా కి ఫోన్ చేసాడు.  ముందుగా తమ్ముడితో మాట్లాడేడు.  నాన్నకు ఇవ్వమని అడిగేడు.   "ఏం నాన్న ఎలా ఉన్నావ్ ? అమ్మకు మీకు మ్యారేజి డే శుభాకాంక్షలు." కొడుకు గొంతు వినగానే ఆ తండ్రికి సంతోషంతో నోట మాట రాలేదు.  "ఏం నాన్న మాట్లాడవే ?" "ఏం మాట్లాడనురా?ఎన్నాళ్ళు అయిందో నిన్ను చూసి, నీ గొంతు విని.అమ్మతో మాటలాడేవా?" "ఫోన్ అమ్మ కివ్వు . " "అమ్మఇక్కడ లేదురా ...చిన్నోడి  దగ్గరుంది. వచ్చే నెల ఇక్కడి కొస్తుంది ,పైనెల మళ్ళీ వెళ్తుంది."  "ఒకే ..ఒకే ... అక్కడికే చేసి మాట్లడతాలే.. ఉంటా. " ......................................................................................................................................................  "ఒరేయి కాశీ ...మీ అమ్మతో ఒకసారి మాట్లాడతారా ?" అడిగేడు కొడుకును ఆ తండ్రి. "ఇందులో బ్యాలెన్స్ ఎక్కువ లేదు. రెండు మాటలు మాట్లాడి ఇవ్వాలి. "   "అట్టాగేలేరా. " కాశీ వెంటనే ఏదో నెంబర్ కి ఫోన్ కలిపి అడిగేడు.   "నర్శమ్మా... ఓసారి మా అమ్మను పిలుస్తావా? ఏంటీ నీళ్ళు తేవడానికి వెళ్ళిందా ? సరేలే, రాత్రికి చేస్తాం లే." ఫోన్ కట్ చేసాడు. "వాళ్ళు ఏదో పనిలో ఉన్నారట. విన్నావుగా. "  జోగయ్యకు విషయం అర్ధమైంది. చేసేది లేక ఒక నిట్టూర్పు విడిచి పడుకున్నాడు.   పెళ్లి రోజు కూడా పెళ్ళాం తో మాట్లాడుకోలేని దౌర్భాగ్యం ... అనుకుంటూ కంట నీరు పెట్టుకున్నాడు.  అక్కడ జోగయ్య ఉనికిని  పట్టించుకొనేవారే లేరు.  ................................................................................................................................................................. "హాయ్ ఏమిటి ఈ మధ్య ఫేస్బుక్ లోకి రావడం లేదు"  బాయ్ ఫ్రెండ్ క్లిఫ్ ని పలకరించింది నెల్లీ గూగుల్ టాక్ లో.  జెన్నీ కూతురు నెల్లీ ఉరఫ్ నళినీ. నెల్లీ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటోంది. వయసు ఇరవై దాటింది.   "పర్సనల్ ప్రాబ్లమ్స్ నెల్లీ. " "నాతో కూడా చెప్పలేనివా?" "అదేమీ కాదనుకో?" "మరెందుకు నసుగుడు."  "ఆర్ధిక సమస్యలు... మమ్మీకి హెల్త్ బాగాలేదు.  ఆపరేషన్ చేయించాలి." "ఎంతవుతుంది?" "రెండు వేల డాలర్లు  అవ్వొచ్చు."   "నేను అడ్జస్ట్ చేస్తాలే. "  "యువార్ గ్రేట్ నెల్లీ. " "ఇంత చిన్న విషయానికేనా? అయినా ఇష్టపడిన పడిన వాడికోసం ఏదైనా చేయాలిగా."  "ఐ లవ్ యు నెల్లీ."   "ఐ టూ క్లిఫ్."  .................................................. .................................................. .............................  "మమ్మీ ఎక్కడున్నావ్? " నళినీ స్కై ప్ లో జేన్నీని  పలకరించింది.   "ఫ్రెండ్స్ వస్తే మాట్లాడుతున్నాలే.  ఏమిటి విశేషం? చదువు ఎలా సాగుతోంది. " "అది సరే గాని ?" "ఏంటి నసుగు తున్నావ్?ఎనీ థింగ్ రాంగ్?" "నెల తప్పానే. " "ఓసి ఇంతే గదా! ఇంకా ఏదో పెద్ద ఇష్యూ అనుకున్నా. " "తీయించేసాలే. " "ఎవరు అతగాడు?" "మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ " "ఒకే. ఇక నైనా జాగ్రత్తలు తీసుకో." "వేర్ ఇస్ డాడ్? " "మీ డాడ్ కి ఇల్లు పట్టిందా ? ఆఫీస్లోనే  ఆ టక్కులాడి తో మకాం పెట్టేడు. అన్నట్టు చెప్పడం మరిచా...  నీకు ఓ మ్యాచ్ చూసాడు మీ డాడ్" "నాకా ?" "ఏం చేసుకోవా?" "చూద్దాం.. మమ్మీ అర్జెంట్ గా 2000 వేల డాలర్స్  కావాలి." "అంత అమౌంట్ ఎందుకు?" "చిన్న పనుంది మమ్మీ"  "ఒకే  . ఇపుడే  ట్రాన్స్ఫర్ చేస్తాలే. "  "బై...మమ్మీ " .................................................................................................... "చెర్రీ.. ఏంటీ ఈ రోజు కూడా ఇంటికి వెళ్ళరా?" "నాకెందుకో నీతోనే గడపాలనిపిస్తోంది సోనీ. " "48గంటల నుంచి నాతోనే ఉన్నారుగా. " "అఫ్ కోర్సు ... నిన్ను వదలబుద్ధి కావడంలేదు."   "లేటు వయసులో ఘాటు ప్రేమ అంటే ఇదే నా?"నవ్వింది సోనీ.  చెర్రీ కూడా నవ్వాడు. సోనీ డ్రింక్ సర్వ్ చేసింది. ఇద్దరూ తాగేరు.  "పేస్ బుక్ లోమన పరిచయం ఒక థ్రిల్లింగ్ కదా చెర్రీ. "    "నీ ప్రొఫైల్ ఫోటో చూడగానే ఎలాగైనా నిన్ను పొందాలనుకున్నా."  "మొత్తం మీద సాధించారు ఎలాగైనా. " ఇంతలో ఇద్దరి ఫోన్స్ ఒకేసారి మోగేయి. చెరో క్యాబిన్లోకి వెళ్ళారు. విడివిడిగా మాట్లాడుకున్నారు. పదినిమిషాల తర్వాత ఇద్దరూ గదిలో కొచ్చారు.  "ఈ నైట్ కి ఇంటికి రాను" అని చెప్పా హబ్బీకి. "అంటే రాణి గారు ఇక్కడే ఉంటున్నారన్న మాట." సొనీని హాగ్ చేసాడు చెర్రీ.  మరో రౌండ్ లిక్కర్ తీసుకున్నారు ఇద్దరు.  ...................................................................................................................... మర్నాడు  సెల్ కొచ్చిన మెసేజ్ చూసి చెర్రీ షాక్  తిన్నాడు.  ఇరవై వేల డాలర్లు తన అకౌంట్ నుంచి  వేరే అకౌంట్ కి ట్రాన్సఫర్ అయ్యాయి. వెంటనే బ్యాంక్ కి ఫోన్ చేసి విచారించాడు. సోనీ పేరు మీద మనీ జమ అయి, డ్రా అయిందని చెప్పారు బ్యాంకు అధికారులు. అప్పుడు లీలగా గుర్తుకొచ్చింది చెర్రీ కి. రాత్రి తాగిన మైకంలో సోనీ కి చెక్కులు ఇచ్చిన విషయం.  తల గోడ కేసి కొట్టుకున్నాడు .  అదే సమయంలో ఒక ఫంక్షన్ కి వెళదామని జెన్నీ డైమండ్ రింగ్స్,గాజుల సెట్ కోసం వార్డ్ రోబ్ అంతా గాలించింది .  వాటితో ఇంకా ఉండాల్సిన నగలు కూడా కనపడలేదు. ఏమి జరిగిందో అర్ధమైంది.  మోసపోయానని తలపట్టుకుని కూర్చుంది.  సరిగ్గా 48 గంటల తర్వాత  క్లిఫ్ అనే వ్యక్తీ తనను మోసం చేసి  మాయమై పోయాడని  నెల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  .................................................. ..................................................  నెల రోజుల తర్వాత పోలీసులు కూపీ లాగేరు. కానీ నిందితులు మాత్రం దొరకలేదు. కాకపోతే సోనీ సుబ్బు మొగుడు పెళ్ళాలని తేల్చారు. అలాగే క్లిఫ్ సోనీ తమ్ముడే అని కనిపెట్టారు వీళ్ళ ఉచ్చులో పడి చాలామంది మోసపోయారని ప్రజలు  జాగ్రత్తగా ఉండాలని మీడియాకు ఒక సందేశం పంపారు. 
  • పూర్వం  అంగదేశంలో తీవ్రమైన కరువు కాటకాలొచ్చాయి. " ఈ కష్ట కాలంలో కరువుల బాధ నుండి ప్రజలను ఎలా కాపాడడం?" అని ఆ దేశపు రాజు రోమపాదుడు పండితులతో  చర్చించాడు. "ఇంత వరకు స్త్రీని చూడకుండా సంపూర్ణ బ్రహ్మచర్యం అవలంబిస్తూ ఉన్న ఋష్యశృంగుణ్ణి రాజధానికి పిలిపించండి. మహా తపశ్శాలి అయిన ఆ మహానుభావుడు మన నగరంలో కాలు మోపగానే వానలు కురుస్తాయి" అన్నారు పండితులు. విభాండక మహాముని కుమారుడు ఋష్యశృంగుడు.  తలపైన కొమ్ముతో జన్మించాడు.తండ్రి ద్వారా వేదవేదాంగ పారంగతుడైన ఋష్యశృంగుడు లౌకికమైన విషయ సుఖాల గురించి ఏమీ తెలియకుండానే పెరిగాడు.  ఋష్యశృంగుడు చిన్నతనం నుంచీ ఒక్క తన తండ్రిని తప్ప మరొక మనిషిని చూడలేదు. స్త్రీలు, పురుషులు పేరిట సృష్టిలో ఒక విభజన ఉన్నదని కూడా తెలీదు. ఆ విధంగా శుద్ధ బ్రహ్మచారిగా పెరిగాడు. విభాండక మహాముని ఆశ్రమం నుంచి ఋష్యశృంగుడ్ని ఏ విధంగా రప్పించాలనేది రోమపాదుడికి సమస్య అయింది. మంత్రులతో ఆలోచన చేసిన పిమ్మట రాజనగరంలో ఉన్న సుందరాంగుల్ని కొందరిని పిలిపించి, " మీరు విభాండక ముని ఆశ్రమానికి పోయి ఆ వనంలో తపస్సు చేసుకుంటున్న ఋషి కుమారుణ్ణి ఏదో ఒక విధంగా మన రాజధానికి తీసుకురావాలి" అని ఆజ్ఞాపించాడు. సరే అని ఆ కాంతలు ముని ఆశ్రమానికి బయల్దేరి వెళ్ళారు. వారు వెళ్ళిన సమయానికి విభాండక ముని ఆశ్రమంలో లేడు. ఇదే మంచి అవకాశమని వారందరిలోకీ అద్భుత సౌందర్యంతో వెలిగిపోతున్న ఒక విలాసవతి ఆశ్రమంలో వున్న ఋషి కమారుడి దగ్గరకు వెళ్ళింది. " మునివరా! క్షేమమా? మీకు కావలసిన కందమూలాలు లభ్యమవుతున్నాయా? మీ తపస్సు నిరాఘాటంగా కొనసాగుతోందా? వేదాధ్యయనం సక్రమంగా కొనసాగుతోందా? తండ్రిగారు ఎలా ఉన్నారు?" అని ప్రశ్నలు వేసింది. అటువంటి సుందరాకారంలో ఉన్న మనిషిని గాని, అటువంటి మధురస్వరం కాని పాపం ఋష్యశృంగుడు అంతకుమునుపు కనలేదు, వినలేదు. మెరుపులా మెరిసిన ఆ సుందరిని చూడగానే ఋషి కుమారుడి మనస్సులో కలవరం మొదలైంది. అతనికి స్త్రీ పురుష భేదం తెలీదు కనుక ఆ వచ్చింది మునికుమారుడే అనుకున్నాడు. ఆర్ఝ్యపాద్యాదులు ఇచ్చి , " మీ ఆశ్రమం ఎక్కడ? మీ వ్రత నియమాలేమిటి?" అని అడిగాడు. " మా ఆశ్రమం ఇక్కడికి మూడామడల దూరంలో వుంది" అంటూ ఆమె తాను తెచ్చిన భక్ష్యాలూ, పండ్లూ స్వయంగా తినిపించింది. సువాసనలు వెదజల్లే పూలహారాలు మెళ్ళో వేసింది. అలా కొంతసేపు గడిపి , విభాండక మహాముని వచ్చేవేళకు "అగ్నిహోత్రానికి వేళ అయింది" అని సాకు చెప్పి తప్పించుకుంది. విభాండకుడు వచ్చేసరికి ఆశ్రమం అంతా చెల్లాచెదురుగా వుంది. పూలూ, పండ్లతొనలూ చిందర వందరగా పడి ఉన్నాయి. ఇదంతా పరికించి " అబ్బాయీ! నేను లేని సమయంలో నీ దగ్గరకెవరైనా వచ్చారా? ఎందుకలా అన్యమనస్కంగా కనిపిస్తున్నావు?" అని అడిగాడు. " నాన్నగారూ! మీరు లేని సమయంలో అద్భుతరూపంలో వున్న ఒక మహనీయుడు ఇక్కడకు వచ్చాడు. ఆ మాట , ఆ ఆకారం నా మనస్సున నాటుకుపోయాయి. ఆ మూర్తిని చూడకుండా ఉండలేను. అతడితో స్నేహం చేయాలని ఉంది" అని చెప్పడు. విభాండకుడికి విషయం తెలిసిపోయింది. తమ తపస్సును భంగం చెయ్యడానికి ఎవరో రాక్షసులు వచ్చారనుకుని " నేను లేనప్పుడు ఎవరినీ ఆశ్రమానికి రానివ్వకు!" అని గట్టిగా చెప్పాడు. ఒకనాడు మళ్ళీ విభాండకుడు లేని సమయం చూసి ఆ సుందరి మెల్లగా ఋష్యశృంగుడ్ని సమీపించింది. ఆమెను చూడగానే భరింపరాని మోహంతో ఋషికుమారుడు ఆమె దగ్గరకు పరుగెత్తాడు. ఆ జవ్వని మాటలతో ఋష్యశృంగుణ్ణి మైమరపిస్తూ మెల్లగా అడవి దాటించి తన సఖులను కలిసింది. వారంతా కలిసి ఋష్యశృంగుడ్ని అంగదేశానికి తీసుకుపోయారు.ఋష్యశృంగుడు అంగదేశంలో ఆడుగు పెట్టగానే వానలు కురుశాయి. ప్రాణకోటి సేదతీరింది. నేల పచ్చబారింది. రోమపాదుడు సంతోషించి తన కమార్తె శాంతను ఋష్యశృంగుడికిచ్చి పెళ్ళి చేశాడు. అన్నీ అనుకున్న ప్రకారం నెరవేరినప్పటికీ , విభాండక మహాముని ఆగ్రహిస్తాడని భయపడ్డారు రాజుగారు. అందుకని మునిని శాంతపరచటం కోసం రాజధానికి వచ్చే మార్గాలలో చక్కని కర్రి ఆవులనూ, ఎద్దులనూ నిలిపి పరిజనాన్ని కాపు ఉంచాడు." ఈ ఆవులూ, ఎడ్లూ, మేకలూ, భూములూ మీ కుమారుడివి. మేము మీ సేవకులం" అని వినయంగా మాట్లాడమని భటులను హెచ్చరించాడు. అనుకున్నట్టు కొడుకును వెతుక్కుంటూ మహాముని రానేవచ్చాడు. రాజాజ్ఞ ప్రకారం పరిచారకులు మునీంద్రునికి స్వాగతం ఇచ్చి చేయవలసిన సపర్యలన్నీ చేశారు. కోపం చాలా వరకూ చల్లార్చి ఆయనను పట్టణంలో ప్రవేశపెట్టారు. రాజాంతఃపురంలో సకల ఐశ్వర్యాలు అనుభవిస్తూన్న కొడుకుని, పక్కనే వినయంగా తలవంచుకుని నిలబడ్డ కోడల్నీ చూసిన విభాండక మునికి ఆనందం కలిగింది. " నాయనా! ఋష్యశృంగా! ఈ రాజుకు ప్రియమైనదంతా చెయ్యి. ఒక కుమారుడు కలిగిన తరువాత మీరు అరణ్యాలకు రావచ్చు" అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. తండ్రి ఆనతి ప్రకారం ఋష్యశృంగుడు సంతానవంతుడై , ఆ తర్వాత  వానప్రస్థాన్ని స్వీకరించాడు.  రామాయణంలో ఈ ఋష్యశృంగుడి కథ అలా  వివరించబడింది అయితే స్త్రీల గురించి ఏమీ తెలియని అమాయకుడిగా పెరిగిన ఋష్యశృంగ మహర్షిలోని స్వభావాన్ని ఆధారంగా చేసుకుని తెలుగు జాతీయం ఋష్యశృంగుడు అనే పదం వ్యవహరించబడుతోంది. ఋష్యశృంగుడు అంటే స్త్రీవిముఖుడు, అమాయకుడు అనే అర్థంతో తెలుగు జాతీయం ప్రయోగిస్తాం. అలాగే ఒక వ్యక్తిలోని స్త్రీలోలత్వాన్ని గురించి వేళాకోళం చేసే సందర్భంలో కూడా అబ్బో…ఆయన ఋష్యశృంగుడు అనే మాటతో వెటకారం చేయడం కూడా కనిపిస్తుంది. ........ భరద్వాజ   
  • అర్జునుడికి, కర్ణుడికి మధ్య వ్యక్తిగతమైన వైరం ఉండేది.  కర్ణుడి దానగుణాన్ని అందరూ పొగుడుతూ ఉంటే అర్జునుడు భరించలేకపోయేవాడు. ఒక రోజు కృష్ణుడి దగ్గరకు వెళ్లి "బావా! నేను కూడా దానాలు చేశాను. అవసరమైతే కర్ణుడి కన్నా ఎక్కువ చేస్తాను. అయినా నన్ను ఎవరూ గుర్తించటం లేదు. అందరూ కర్ణుడి దాన గుణాన్నే పొగుడుతున్నారు. దీని వెనకున్న కారణమేమిటి? "అని అడిగాడు.  కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.  ఆ సంభాషణ జరిగిన సాయంత్రం కృష్ణుడు, అర్జునుడు వాహ్యాళికి వెళ్లారు. అక్కడ వాళ్లిద్దరికి ఒక బంగారు కొండ కనిపించింది. అర్జునుడు చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడి వైపు చూసి "ఈ బంగారు కొండను దానం చేయి.. అప్పుడైనా నీకు కర్ణుడి కన్నా మంచి పేరు వస్తుందేమో."అన్నాడు.  అర్జునుడు వెంటనే తన సేవకుల చేత చుట్టుపక్కల ఉన్న గ్రామాలవారికి బంగారం దానంగా తీసుకొమ్మని దండోరా వేయించాడు. అన్ని గ్రామాల ప్రజలు రావటం మొదలుపెట్టారు. అర్జునుడు బంగారాన్ని తవ్వించి చిన్న చిన్న ముక్కలు దానం చేయటం మొదలుపెట్టాడు. ఎంత మందికి దానం చేసినా బంగారం తరగటం లేదు. జనం సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక రోజు అయ్యేసరికి అర్జునుడు అలసిపోయాడు. "కృష్ణా.. దానం చేయాలంటే చిరాకుగా ఉంది.". అన్నాడు.  అప్పుడు కృష్ణుడు "  దానం ఎలా చేయాలో  తెలుసుకో " అని కర్ణుడిని పిలిపించాడు. "ఈ బంగారం కొండలు మాకు కనిపించాయి. వాటిని నువ్వు ఎవరికైనా దానం చేస్తే బావుంటుంది."’ అన్నాడు. వెంటనే కర్ణుడు- అక్కడున్న ప్రజలందరి వైపు తిరిగి "ఈ కొండలు మీవి. వీటిని తవ్వి తీసుకువెళ్లండి."’’ అన్నాడు.  అందరూ తమకు కావల్సిన మేరకు బంగారం తీసుకెళ్లారు. అప్పుడు అర్జునుడితో కృష్ణుడు  "నీకు మనసులో బంగారంపై ఆశ ఉంది. అందుకే చిన్న చిన్న ముక్కలు పంచిపెట్టావు. కానీ కర్ణుడికి ఆశ లేదు. అందుకే వారికి కొండ అంతా ఇచ్చేశాడు. దానం చేసేవారి మనసులో ఎటువంటి ఆశ ఉండకూడదు. అప్పుడే ఆ దానం ఫలిస్తుంది’’ అని బోధ చేశాడు.
  • రామన్న కి కబురు వెళ్లింది. వెంకట్రాద్రి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. బంగారు హారం ఒకటి మాయమయ్యింది. ‘ఇంటి దొంగ’ పనే అని ఆయన అనుమానం. ఇంట్లో ఉన్న ముగ్గురు పాలేర్లలో ఎవరో ఒకరై ఉంటాడని ఆయన గట్టి నమ్మకం. అదే విషయం రామన్న గారితో చెప్పాడు వెంకటాద్రి. సాయంత్రం దేవాలయ ప్రాంగణం వద్దకి ఆ ముగ్గురిని పంపమని చెప్పాడాయన.  శివరాత్రి జాగారం చేయటానికి దేవాలయం వద్ద పొగయిన ప్రజలని ఉద్దేశించి కొన్ని నీతి కధలు చెబుతున్నాడాయన.  ముగ్గురు పాలేర్లు రావడం గమనించి వారిని ఒక పక్క కూర్చుని చెప్పే విషయాలు శ్రద్ధగా వినమని రామన్న సైగ చేయటం వారు కూడా శ్రోతలుగా మారటం జరిగి పోయింది. రామన్న కొత్త కధ చెప్పటం మొదలెట్టాడు. పూర్వం ఒక గురుకులం లో ఒక రాజ కుమార్తె విద్య అభ్యసించింది .  కొన్ని సంవత్సరాల శిక్షణ ముగిసింది. బాలికగా వచ్చిన ఆమె యవ్వనవతి అయ్యింది. సౌందర్య రాశి అయింది. విధ్య పూర్తి అయ్యి తండ్రి వద్దకు వెళుతూ గురువు వద్దకి వచ్చింది. గురు దక్షణ చెల్లించడానికి సిద్దమయింది. అందుకాయన “ వచ్చే శివరాత్రి నీవు సకల రాచరికపు అలంకరణతో కాలి నడకన వచ్చి గురుకులం లో జరిగే పూజలో పాల్గొనాలి” అదే నేను నిన్ను అడిగే గురుదక్షణ అన్నాడు. ఆమె అందుకు అంగీకరించి, నమస్కరించి వెళ్ళి పోయింది. కొన్నాళ్ళకు ఆమెకు ఒక చక్కని రాకుమారుని తో వివాహం అయ్యింది.  భర్తతో  ఆమె గురుదక్షణ విషయం చెప్పింది ”తనని శివరాత్రి రోజు కన్యగా, ఒంటరిగా, కాలినడకన రమ్మని గురువు ఆదేశం అని”  ఆ రాకుమారుడు వెంటనే ఆమె ను “గురు దక్షణ తీర్చేంత వరకు నేర్చుకున్న విధ్యకు, వినయానికి విలువ లేదు కనుక, శివరాత్రి వరకు వేచి ఉండి  గురుదక్షణ చెల్లించి రావలసినది" గా బార్యకి  చెప్పాడు. శివరాత్రి రానే వచ్చింది. ఆమె చక్కగా తయారయింది, వజ్ర వైఢూర్యాల నగలు ధరించి ఆశ్రమానికి, ఒంటరిగా కాలి నడకన బయలు దేరింది. మార్గ మధ్యం లో చీకటి పడింది. అయినా ఆమె నడుస్తూనే ఉంది. ఒక గజదొంగ ఆమెని అటకాయించాడు . నగలు మొత్తం వలిచి ఇవ్వమని చెప్పాడు.  ఆ రాజకుమారి తను వెళ్తున్న విషయం చెప్పి ‘పూజానంతరం అదే మార్గం లో తిరిగి వస్తాను అని అప్పుడు అతను కోరిన విధంగా తన నగలు అన్నిటిని ఇచ్చేస్తానని .. తన దారి విడమని అడిగింది. మాట తప్పనని ప్రమాణం చేయిచ్చుకున్నాక అతను  తోడుగా వచ్చి గురుకులం లో దిగబెట్టాడు. ఆశ్రమం లో పూజా కార్యక్రమం పూర్తి అయింది.  తెల్లవారుతుండగా ఆమె తిరుగు ప్రయాణం అయింది. దారిలో దొంగని కలిసింది. నగలు మూట కట్టి అతనికి ఇచ్చింది. దొంగ విచలితుడు అయ్యాడు. “తల్లీ నీ అంతటి ఉత్తమురాలి వద్ద దోచుకున్న ధనం నాకు వలదు. నన్ను మన్నించి నీవే తిరిగి అలంకరించుకొని వెళ్ళమని కోరి, నగలు తిరిగి ఇచ్చి పంపాడు.  ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త తో కలిసి అన్నీ విషయాలు చెప్పి ఆమె సంతోషంగా జీవితం ప్రారంభించినది. రామన్న చెప్పటం ముగించాడు. “మీరంతా .. శ్రద్ధగా విన్నారు కదా? ఇప్పుడు ఈ కధలో ముగ్గురు వ్యక్తులగురించి మాట్లాడుకుందాం.  గురుదక్షణ తీర్చిన ‘రాకుమారి’  ఆమె గురువు కోరికను అనుమానించ కుండా ఒంటరిగా పంపిన ‘రాకుమారి  భర్త ’ అందివచ్చిన నగలను తిరస్కరించిన ‘దొంగ’ వీరిలో ఎవరు గొప్పవారు? అందరితో పాటు ముగ్గురు పాలేర్లను కూడా అడిగి సమాదానం తెలుసుకున్నాడు.  విచిత్రంగా ముగ్గురూ తలా ఒక సమాదానం చెప్పారు.  *** మర్నాటి ఉదయం రామన్న, వెంకటాద్రి గారికి ముగ్గురు పాలేర్లలో దొంగ ఎవరో చెప్పారు. PS:(నేను చిన్నప్పుడు విన్న కధని, ఇష్టం లేని కొంత భాగం మార్చి వ్రాసాను. వీలయితే మీ పిల్లలకి చెప్పండి. శ్రద్ధగా వింటారు. Face is the index of mind అంటూ భావాన్ని వారికి చేరవెయ్యండి.) ....సుశ్రీ   
  • పురాణాల్లో కొన్ని కథలు అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు .  అలాంటి కథల్లో శివుడి సోదరి కథ ఒకటి. శివుడికి కూడా సోదరి ఉందనే  విషయం చాలామందికి తెలియదు.  శివుడి సోదరి పేరు  దేవి అసావరి. శివ పురాణంలో.. శివుడి సోదరి గురించి ప్రస్తావించారు. దేవి అసావరిని శివుడే  సృష్టించాడు .  అది కూడా.. తన భార్య పార్వతీ దేవిని ఒప్పించి.  ఆమె తోడు కోసం ఈమెను సృష్టిస్తాడు. శివపార్వతుల పెళ్లి తర్వాత.. పార్వతి కైలాసానికి వస్తుంది. ఆమె తన కుటుంబానికి , అక్క  చెల్లెళ్లకు దూరమైనందుకు బాధపడుతూ ఉంటుంది .  పార్వతీదేవిని.. శివుడు, శివుడి పరమ భక్తుడు నంది జాగ్రత్తగా చూసుకునేవాళ్లు. అయినా కూడా.. పార్వతీదేవి.. తనకు ఒక తోడు కావాలని అనుకొనేది . శివుడు ధ్యానం లోకి వెళ్ళినపుడు  ఒంటరి తనం అనుభవించేది . పార్వతీదేవి  తన మనసులో మాటను శివుడికి వివరించింది. కైలాసంలో తనకు సోదరిలా ఉండే.. ఒక తోడు కావాలని.  తన ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోవడానికి రోజంతా గడపడానికి ఒక తోడు కావాలని కోరుకుంది. కైలాసంలో ఎక్కువమంది మగవాళ్లు ఉంటారు. పార్వతీదేవి మాత్రమే కైలాసంలో ఉండే మహిళ. శివుడు.. సరస్వతీదేవిని సోదరిగా భావిస్తూ.. సరస్వతిదేవితో రోజంతా గడుపుతావా అని.. పార్వతిని అడిగాడు. ఆమెతో కబుర్లు చెబుతూ, కాలక్షేపం చేయమన్నారు. అందుకు పార్వతి  సరస్వతి తన భర్త బ్రహ్మతో కలిసి ఉంటుంది కదా.. ఇక తనకు నచ్చినట్లు.. సరస్వతి దేవి ఎలా ఉండగలదు అంటుంది.  దీంతో శివుడు ఆలోచనలో పడి పార్వతీ దేవి  కోరిక నెరవేర్చడానికి  తన సోదరిని సృష్టించగలను  అని చెప్పి.. ఆమెను జీవితాంతం.. జాగ్రత్తగా చూసుకోవాలని  చెబుతాడు. అందుకు పార్వతి సరే అంటుంది. శివుడు  తన శక్తి, తెలివిని ఉపయోగించి.. ఒక మహిళను.. తన పోలికలతో సృష్టిస్తాడు. ఆమే  దేవి అసావరి. కాస్త బొద్దుగా, ఆకర్షణీయంగా, పొడవాటి జుట్టు కలిగి, పగిలిన పాదాలు,  జంతువు చర్మం  ధరించిన మహిళ. శివుడు ఆమెను పార్వతి దగ్గరకు తీసుకెళ్లి.. తన సోదరి అని.. దేవి అసావరిని పరిచయం చేస్తాడు. తనకు ఆడపడుచు దొరికిందని.. పార్వతి చాలా సంతోషపడుతుంది. ఆమెకు స్నానం చేయించి.. కొత్త దుస్తులను ఇస్తుంది. ఒక రోజు తనకు భోజనం పెట్టమని పార్వతీదేవిని .. దేవి అసావరి అడుగుతుంది. వెంటనే పార్వతీదేవి అసావరికి రుచికరమైన భోజనం తయారు చేసి పెడుతుంది. అంతా ఒకేసారి తినేసి.. కైలాసంలో ఉన్న ఆహారం మొత్తం అయిపోయేంత వరకు ఇంకా కావాలని అడుగుతూనే ఉంటుంది. అప్పుడు ఏం చేయలేక అయోమయంలో పడిపోతుంది. పార్వతి.  అసావరి ఆకలి తీర్చడానికి శివుడి సహాయం కోసం బయల్దేరింది. అందుకు ఆగ్రహించిన అసావరి  పార్వతిని బంధించి.. తన పగిలిన పాదాల్లో దాచుకుంటుంది. ఇదంతా తెలుసుకున్న శివుడు అక్కడికి వచ్చాడు.  పార్వతి పట్ల కిరాతకంగా వ్యవహరించిని అసావరిని.. పార్వతి ఎక్కడ అని శివుడు అడిగాడు. ఆమె ఎక్కడికి వెళ్తుందో తనకేం తెలుసని అసావరి అబద్ధం  చెబుతుంది. అబద్ధం చెబుతోందని తెలుసుకున్న శివుడు ఆమెను హెచ్చరిస్తాడు. అందుకు భయపడి.. కాలిని కదిలించడంతో. పార్వతి పగిలిన పాదాల్లో నుంచి బయటపడుతుంది. తక్షణమే ఆమెకు శివుడు చికిత్స అందిస్తాడు.  తన పట్ల  కిరాతకంగా వ్యవహరించిన అసావరి ప్రవర్తన గురించి బాధపడిన పార్వతి.. ఆమెను కైలాసం వదిలివెళ్లమని అడుగుతుంది. అసావరిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పినట్టు మాట తీసుకున్నానని.. శివుడు గుర్తు చేస్తాడు. మాట తప్పినందుకు శివుడిని క్షమాపణ కోరిన పార్వతి.. అసావరితోపాటు.. కైలాసంలో ఉండటం కష్టము అన్ని అంటుంది. అసావరికి మంచి బుద్ధి ప్రసాదించాలని.. శివుడు నిర్ణయించుకుంటాడు. అసావరి చాలా వినయ విధేయతలు కలిగి ఉంటే.. తనకు ఎలాంటి సమస్య ఉండదని, కైలాసంలో ఆమెతో పాటు ఉంటానని చెబుతుంది పార్వతి. అయితే పార్వతి అభ్యర్థనను శివుడు తోసిపుచ్చుతారు. ఒకే ఇంట్లో ఇద్దరు మహిళలు.. ఎక్కువ కాలం సంతోషంగా ఉండలేరని.. చెబుతాడు శివుడు. అంటే రక్త సంబంధం కాకుండా.. ఇతర మహిళల‌తో  సంతోషంగా ఉండలేరని వివరిస్తాడు శివుడు . .... Bharadwaja